
పూజల్లో పాల్గొన్న జెడ్పీచైర్మన్ జనార్దన్
ఇంద్రవెల్లి(ఖానాపూర్): ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని, భక్తిమార్గంతోనే ప్రశాంతత దొరుకుతుందని జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. సోమవారం మండలంలోని హర్కపూర్‌తండాలో నూతనంగా నిర్మించిన హనుమాన్ ఆలయంలో మండల కేంద్రానికి చెందిన రాందాస్ మహారాజ్ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పీచైర్మన్, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, పెంబి జెడ్పీటీసీ జానుబాయి హాజరై ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చౌహాన్ ఉమాజీ నాయక్, దూదిరాం, తదితరులు పాల్గొన్నారు.
ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు
కైలాస్‌నగర్: రాములవారి కల్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే వచ్చి అందిస్తామని ఆర్టీసీ కా ర్గో ఉద్యోగులు సాయన్న, ప్రసాద్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రచా రం నిర్వహించారు. రూ. 116తో తలంబ్రాలు బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే డెలివరీ చేస్తామన్నారు. దీంతో పలువురు ఉద్యోగులు, సిబ్బంది తలంబ్రాలను బుక్ చేసుకున్నారు.

రశీదు తీసుకుంటున్న ఉద్యోగులు