
మాట్లాడుతున్న డీఈవో ప్రణీత
ఆదిలాబాద్‌టౌన్: విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించేలా ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు. రూమ్ టూ రీడ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో కాంప్లెక్స్ హెచ్‌ఎం, ఎంఈవో, ఎఫ్‌ఎన్‌ఎల్ నోడల్ అధికారులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ సంస్థ జిల్లా వ్యాప్తంగా 152 ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి 260 పుస్తకాలను అందించిందన్నారు. పాఠశాలకు 45 మంది విద్యార్థుల చొప్పున ఎంపిక చేసి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి రాంబాబు, సెక్టోరల్ అధికారి కంటే నర్సయ్య, డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ స్వర్ణకుమారి, తదితరులు పాల్గొన్నారు.