● మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్‌చార్జి నారదాసు లక్ష్మణ్
నార్నూర్(ఆసిఫాబాద్): ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉందని, ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజా క్షేత్రంలో ఉండి ప్రజలకు వివరించాలని బీఆర్‌ఎస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ అన్నారు. సోమవారం గాదిగూడ మండల కేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికే ఈ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆరునెలల్లో ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టాలన్నారు. జెడ్పీచైర్‌పర్సన్లు రాథోడ్ జనార్దన్, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకుడు యునుస్ అక్బానీ, ఎంపీపీ అడ చంద్రకళ రాజు, వైస్ ఎంపీపీ యోగేశ్, మండల అధ్యక్షుడు పూసం బాదిరావు, 25 గ్రామ పంచాయతీల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.