
ఎంపికై న విద్యార్థినులతో వీసీ వెంకటరమణ
భైంసా: ప్రొక్టర్, క్యాంపుల్ ఇండియా ఆధ్వర్యంలో అందిస్తున్న శిక్షా భేటియా స్కాలర్‌షిప్‌నకు బాసర ఆర్జీయూకేటీ విద్యార్థినులు పలువురు ఎంపికయ్యా రు. ఈ మేరకు వారిని ఇన్‌చార్జి వీసీ వెంకటరమణ సోమవారం అభినందించారు. రాష్ట్రంలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థినులను స్కాలర్‌షిప్‌నకు ఎంపికచేసి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. వర్సిటీకి చెందిన 32 మంది విద్యార్థినులు స్కాలర్‌షిప్‌కు ఎంపిక కావడం గర్వకారణమన్నారు. స్కాలర్‌షిప్ సెక్షన్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జి డాక్టర్ విఠల్, సిబ్బంది చిన్నారెడ్డి, శ్వేత, హిమబిందు, సమీనా బేగం, నవకాంత్ పాల్గొన్నారు.