
అల్లె రాజన్న మృతదేహం
● బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు
జైనథ్: మండలంలోని మేడిగూడలో ఈనెల 24న కొనుగోలు చేసిన 200 క్వింటాళ్ల సోయాలు, లారీతో దుండగులు ఉడాయించారు. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. ఆదిలాబాద్‌లోని మహాలక్ష్మివాడకు చెందిన చంద్రకాంత్ ఈనెల 24న మేడిగూడలో 200 క్వింటాళ్ల సోయలు కొనుగోలు చేశాడు. అనంతరం కేఆర్కే కాలనీకు చెందిన చౌహన్ రవి అనే డ్రైవర్‌ను నియమించుకుని లారీలో సోయాలోడ్ నింపు కొన్నాడు. ఈనెల 24 సాయంత్రం డ్రైవర్ రవి, క్లీనర్ ఆత్మరాంతో కలిసి మేడిగూడ నుంచి మహారాష్ట్రకు బయల్దేరాడు. అయితే మహారాష్ట్రకు వెళ్లిన తర్వాత నుంచి డ్రైవర్ ఫోన్ స్విచాఫ్ రావడంతోపాటు లారీ ఆచూకీ తెలియలేదు. రెండు రోజుల పాటు గాలించినప్పటికి ఫలితం లేకపోయింది. సోమవారం బాధితుడు చంద్రకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాథోడ్ ఆత్మారాం తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కడెం: మండలంలోని ధర్మాజీపేట్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లె రాజన్న (48) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామానికి చెందిన అల్లె రాజన్న ఆదివారం రాత్రి ఖానాపూర్ వైపు నుంచి స్వగ్రామానికి ఆటోలో వెళ్తున్నాడు. ధర్మాజీపేట్ గ్రామ సమీపంలోని మూలమలుపు వద్ద అటో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో రాజన్నకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కొసన రాజు తెలిపారు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు.