
దగ్ధమవుతున్న ఇల్లు
ఇచ్చోడ: మండల కేంద్రంలోని నవయువ కాలనీలో సోమవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఇల్లు దగ్ధమైంది. కాలనీవాసుల తెలిపిన వివరాలు.. నర్సమ్మ (80) అనే వృద్ధురాలు గత కొంతకాలం నుంచి కాలనీలో ఓ ఇంట్లో నివాసం ఉంటుంది. ఉదయం బహిర్భూమికి వెళ్లింది. షార్ట్‌సర్క్యూట్‌తో ఇంట్లోని వస్తువులకు నిప్పుంటుకుని కాలిపోయింది. చుట్టుపక్కల వారు గమనించి అగ్నిప్రమాద కేంద్రానికి సమాచారం అందించారు. సమయానికి వాహనం రాకపోవడంతో ఇల్లు పూర్తిగా దగ్ధమైందని కాలనీవాసులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ ప్రీతంరెడ్డి వృద్ధురాలిని పరామర్శించి రూ.10 వేల నగదు అందజేశారు. సామాజిక కార్యకర్త నిమ్మల సంతోష్‌రెడ్డి వృద్ధురాలికి నూతన వస్త్రాలు అందజేసి ఉదారతను చాటుకున్నారు.