
అర్జీలు స్వీకరిస్తున్న అధికారులు
ఉట్నూర్: గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ఏపీవో కనక భీంరావు, డీడీ దిలీప్‌కుమార్ అన్నారు. ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల ప్రజలు అర్జీలు అందజేశారు. రైతుబంధు, డబుల్ బెడ్రూం, స్వయం ఉపాధి పథకాల మంజూరు, వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలంటూ దరఖాస్తులు సమర్పించారు. శాఖల అధికారులు అర్జీలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొమురం బాలు, ఓఎస్డీ కిష్టయ్య, ఏపీవో పీవీటీజీ ఆత్రం భాస్కర్, ఏవో రాంబాబు, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ మనోహర్, డీపీవో ప్రవీణ్, ఐటీడీఏ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఐటీడీఏ ఏపీవో కనక భీంరావు