
దెబ్బతిన్న పంటను పరిశీలిస్తున్న అధికారులు
బోథ్: మండలంలో కురిసిన వడగళ్ల వానకు దె బ్బతిన్న పంటలను ఏడీఏ శ్రీధర్, ఏవో విశ్వామిత్ర ఆదివారం పరిశీలించారు. వివిధ గ్రామాల్లో నేలకొరిగిన పంటలను పరిశీలించి నివేదిక ను సిద్ధం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.వారి వెంట ఏఈఓ వాజీద్, శ్యాంసుందర్ ఉన్నారు.
నేరడిగొండ: మండలంలోని కుప్టి, కుమారి గ్రా మాల్లో వడగళ్లతో దెబ్బతిన్న పంటలను వ్యవసాయ సహాయ సంచాలకులు జి.శ్రీధర్‌స్వామి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడారు. ఆలస్యంగా విత్తిన మొక్కజొన్నకు నష్టం వాటిల్లిందన్నారు. పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలి పారు. ఆయన వెంట ఏవో భాస్కర్ ఉన్నారు.