breaking news
World Cricketers Association
-
చిన్న జట్లకు ప్రతిబంధకం
దుబాయ్: వన్డే ప్రపంచకప్‌లో కొత్తగా తీసుకొచ్చిన మార్పులపై వరల్డ్ క్రికెటర్స్ అసోసియేషన్ (డబ్ల్యూసీఏ) సందేహాలు వ్యక్తం చేసింది. సూపర్ సిరీస్, సూపర్ 7 వంటి మార్పులు పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పేర్కొంది. వచ్చే ఏడాది అక్టోబర్–నవంబర్లలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. 2019, 2023 వన్డే ప్రపంచకప్‌లలో 10 జట్లు పోటీపడగా... 2027లో మొత్తం 14 జట్లు బరిలోకి దిగనున్నాయి. అయితే గతంలో మాదిరి కాకుండా ఈసారి సూపర్ సిరీస్, సూపర్–7, సెమీఫైనల్, ఫైనల్ తరహాలో టోర్నమెంట్ నిర్వహించనున్నారు. వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించిన 14 జట్లలో చివరి మూడు (12వ, 13వ, 14వ) స్థానాల్లో ఉన్న జట్లతో ముందుగా రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో సూపర్ సిరీస్ నిర్వహిస్తారు. అందులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ముందంజ వేయనుండగా... మిగిలిన రెండు జట్లు వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమిస్తాయి. ఈ నేపథ్యంలో... ఆయా జట్లతో చర్చించకుండానే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. దీనిపై డబ్ల్యూసీఏ స్పందిస్తూ... ‘మెగా టోర్నమెంట్లను ఎలా నిర్వహించాలని నిర్ణయించే అధికారం ఐసీసీకి ఉంది. అయితే ఇలాంటి పెను మార్పులు చేసేటప్పుడు సంప్రదింపులు జరపాల్సిన అవసరముంది. ఎన్నో దేశాల ఆటగాళ్లు వరల్డ్‌కప్‌లో ప్రధాన జట్లతో పోటీపడాలని అనుకుంటూ ఉంటారు. అలాంటిది సూపర్ సిరీస్ కారణంగా కేవలం ఒక్క జట్టు మాత్రమే ముందంజ వేసే అవకాశం ఉంది. మరి ప్లేయర్లు ఏళ్ల తరబడి పడ్డ కష్టానికి తగిన ఫలితం ఎలా దక్కుతుంది. ఒకవైపు క్రికెట్‌ను విశ్వవ్యాప్తం చేయాలని ప్రకటిస్తూనే... మరోవైపు కొత్త జట్ల అవకాశాలను తగ్గించే నిర్ణయం తీసుకోవడం పరస్పర విరుద్ధంగా అనిపిస్తోంది. ఇది పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది’ అని డబ్ల్యూసీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఐసీసీ నిర్ణయంపై నెదర్లాండ్స్ జట్టు కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ కూడా నిరాశ వ్యక్తంచేశాడు. ‘క్రికెట్ ఆడే ఏ దేశానికైనా వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించడం ఒక గొప్ప విజయం. కాబట్టి నాలుగేళ్ల ప్రణాళక తర్వాత ఒక్కసారి వచ్చే అలాంటి అవకాశం చేజారినప్పుడు ప్లేయర్లు నిరాశకు గురవుతారు’ అని ఎడ్వర్డ్స్ అన్నాడు. ఐర్లాండ్ సారథి పాల్ స్టిర్లింగ్ మాట్లాడుతూ...‘ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ను మరింత వృద్ధి చేయాలని ఐసీసీ చాలా మాట్లాడుతుంది. కానీ ఇలాంటి నిర్ణయాలు అసోసియేట్ దేశాల అవకాశాలను దెబ్బతీస్తున్నాయి. అగ్రశ్రేణి జట్లతో ఆడే అవకాశాలను మరింత సంక్లిష్టం చేస్తాయి’ అని అన్నాడు. -
‘క్యాష్ రిచ్’ లీగ్ ఐపీఎల్‌కు ఘోర అవమానం?
టీ20 క్రికెట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్న క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో కొత్త లీగ్‌లు పుట్టుకొస్తున్నాయి. ఇటీవలే యూరోప్‌లో సైతం EUT20 Belgium పేరిట టోర్నీని ప్రవేశపెట్టారు. ఇక క్రికెట్‌ను మతంలా భావించే భారత్‌లో పొట్టి క్రికెట్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగాదేశంలో 2008లో ప్రవేశపెట్టిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఇప్పటికీ పద్దెనిమిదేళ్లుగా విజయవంతంగా కొనసాగుతూ ఉండటం ఇందుకు నిదర్శనం. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లీగ్‌గా పేరొందిన ఐపీఎల్లో ఒక్కసారైనా ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ ఆశపడతాడనటంలో సందేహం లేదు.ప్రతిభ ఉన్న యువ, అన్క్యాప్డ్ క్రికెటర్లపై కూడా కోట్ల వర్షం కురవడం ఇందుకు కారణం. ఐపీఎల్లో ఆడిన తర్వాత జాతీయ జట్లకు ఎంపికైన ఆటగాళ్లు కూడా కోకొల్లలు. అయితే, ప్రపంచ క్రికెటర్ల సమాఖ్య (WCA) మాత్రం ఐపీఎల్‌కు టాప్-10 ర్యాంకులలో మూడో స్థానం ఇవ్వడం గమనార్హం.ఫ్రాంఛైజీ క్రికెట్ లీగ్‌లకు సంబంధించి WCA గురువారం ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇంగ్లండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్‌కు ప్రథమ స్థానం కట్టబెట్టిన సమాఖ్య.. సౌతాఫ్రికా టీ20 లీగ్‌కు రెండో ర్యాంకు ఇచ్చింది. క్యాష్ రిచ్.. కానీ బెస్ట్ కాదు!క్యాష్ రిచ్ లీగ్‌గా పేరొందిన ఐపీఎల్‌ను మూడో స్థానానికి పరిమితం చేసిన WCA.. బిగ్‌బాష్ లీగ్ (ఆస్ట్రేలియా), పాకిస్తాన్ సూపర్ లీగ్‌లకు టాప్-5లో చోటు ఇచ్చింది.ఆటగాళ్లకు చెల్లించే కనీస మొత్తం, సగటు, భద్రతా ప్రమాణాలు, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, వాణిజ్యపరమైన హక్కులు, ఆదాయంలో వాటా, ప్లేయర్/ఏజెంట్ అప్రూవల్ తదితర పదమూడు అంశాలను ప్రామాణికంగా తీసుకుని WCA ఈ ర్యాంకులు ఇచ్చింది.ఈ అంశాలలో మెరుగుపడాలి!ఇందులో భాగంగా ది హండ్రెడ్‌కు వందకు 75.2 మార్కులు రాగా.. సౌతాఫ్రికా లీగ్‌కు 68.0 మార్కులు వేశారు. ఇక ఐపీఎల్‌కు వందకు 62.6 మార్కులే పడ్డాయి. ఆటగాళ్లకు చెల్లింపు విషయంలో ప్రపంచంలోనే అత్యుత్తమ లీగ్‌గా ఐపీఎల్‌ను పేర్కొన్న WCA.. సెక్యూరిటీ రివ్యూ, వివాదాల పరిష్కారం, ఏకపక్ష నిబంధనలు, ఆదాయంలో వాటా తదితర అంశాల్లో మాత్రం మెరుగుపడాలని సూచించింది. పాక్ పరిస్థితి ఇదీఇక బిగ్‌బాష్ లీగ్‌కు 62.5 మార్కులు రాగా.. పాకిస్తాన్ సూపర్ లీగ్‌కు 48 మార్కులు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026 సీజన్ మార్చి 28న మొదలుకానుంది. పశ్చిమాసియాలో యుద్ధం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ తొలుత 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేయడం గమనార్హం.అంతటా మనోళ్లదే పైచేయికాగా WCA ప్రకటించిన టాప్-2 ర్యాంకులలో ఉన్న.. ‘ది హండ్రెడ్’, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లలో అత్యధిక జట్లు ఐపీఎల్‌కు చెందిన ఫ్రాంఛైజీల యాజమాన్యంలోనే ఉండటం గమనార్హం. ముఖ్యంగా సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఉన్న ఆరు జట్లు ఐపీఎల్‌లోని ఫ్రాంఛైజీల ఓనర్లవే కావడం విశేషం. అంతేకాదు కరేబియన్ ప్రీమియర్ లీగ్, ILT20లోనూ వీరి పెట్టుబడులే ఎక్కువ.చదవండి: వాటిని తక్షణమే తొలగించాలి.. రూ. 2.5 కోట్లు ఇప్పించండి: గంభీర్


