breaking news
Women lecturer
-
మహిళా లెక్చరర్‌ను వెంబడించి..
ముంబై : మహారాష్ట్రలోని వార్ధాలో కాలేజ్ లెక్చరర్‌గా పనిచేస్తున్న మహిళకు ఓ పోకిరి నిప్పు పెట్టిన ఘటన వెలుగుచూసింది. సోమవారం ఉదయం మహిళ కాలేజ్‌కు వెళుతుండగా రెండేళ్లుగా ఆమె వెంటపడుతున్న నిందితుడు విక్కీ నగ్రారే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 40 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మహిళా లెక్చరర్‌కు నిప్పంటించిన నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కాగా బాధితురాలికి నిప్పంటించి నిందితుడు పరారవడంతో గమనించిన స్ధానికులు నీటితో మంటలను ఆర్పి సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు నాగపూర్‌లోని ఆరంజ్ సిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీస్ అధికారులు వెల్లడించారు.నిందితుడు వివాహితుడని అతడికి ఏడునెలల కుమారుడు ఉన్నాడని, రెండేళ్లుగా బాధితురాలిని వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. చదవండి : పెళ్లికి నిరాకరణ, రెచ్చిపోయిన ప్రేమోన్మాది -
మహిళా లెక్చరర్‌కు వేధింపులు!
-
మహిళా లెక్చరర్‌ను వేధిస్తున్న కాలేజీ డైరెక్టర్
సిద్ధిపేట: మెదక్ జిల్లా సిద్ధిపేటలో మాస్టర్ మైండ్ కాలేజీని విద్యార్థి సంఘాల నేతలు విధ్వంసం చేశారు. మహిళా లెక్చరర్‌ను ఆ కాలేజీ డైరెక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి వేధిస్తున్నట్లు వారు ఆరోపిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తనను కొద్ది రోజులుగా వేధిస్తున్నట్లు మహిళా లెక్చరర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలిసిన విద్యార్థి సంఘాల నేతలు కాలేజీపై దాడి చేశారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. **