breaking news
welfare of poor
-
పట్టణ పేదల సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ టాప్
సాక్షి, అమరావతి: పట్టణ పేదల సంక్షేమం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ వన్‌గా నిలిచింది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ 2019–20కు గాను రూపొందించిన ‘సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైం (స్పార్క్) ర్యాంకుల్లో ఏపీ మొదటి స్థానంలో నిలిచి అవార్డు దక్కించుకుంది. రాష్ట్రంలోని పట్టణాల్లో 24 లక్షల మంది పేద మహిళలను సంఘటితం చేసిన రాష్ట్ర పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 2.4 లక్షల పొదుపు సంఘాలను ఏర్పాటు చేసింది. ఉపాధి కల్పన పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రశంసించింది. మొదటి స్థానంలో నిలిచినందుకు మెప్మాకు రూ.12 కోట్లు ప్రోత్సాహకాన్ని కూడా ప్రకటించిందని మెప్మా ఇన్చార్జి ఎండీ సంపత్‌కుమార్ వివరించారు. చదవండి: (4 లేన్లుగా కరకట్ట రోడ్డు.. రూ.150 కోట్లతో విస్తరణ) -
జగన్‌తోనే పేదల సంక్షేమం
ఆదోని రూరల్, న్యూస్‌లైన్: పేదల సంక్షేమం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బుట్టారేణుక అన్నారు. బుధవారం వైఎస్సార్సీపీ ఆదోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితో పాటు విరుపాపురం, గోనబావి, సాదాపురం గ్రామాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల తరుఫున ప్రచారం నిర్వహించారు. విరుపాపురంలో నిర్వహించిన సభలో బుట్టారేణుక మాట్లాడుతూ మహానేత వైఎస్సార్‌లా ప్రజల కోసమే పరితపించే వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని గెలిపించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పే బూటకపు మాటలను నమ్మవద్దని సూచించారు. సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు సాధ్యంకాని హామీలిస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఈ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైఎస్సార్సీపీ నాయకులు డాక్టర్ మధుసూదన్, చంద్రకాంత్‌రెడ్డి, గురునాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ అభ్యర్థి ఆనంద్, ఎంపీటీసీ అభ్యర్థి సుశీలమ్మ పాల్గొన్నారు.