breaking news
Villain roles
-
కొత్త విలన్ గురూ
తెలుగు తెరపై కొత్త విలన్లు కనిపించనున్నారు. ఈ విలన్లకు తెలుగు తెలియదు. అయినా ఫైట్ చేయడానికి భాషతో పనేం ఉంది? ఇప్పుడు తెలుగులో సినిమాలు చేస్తున్న ఈ పరభాష విలన్లు తమ నటనతో ప్రేక్షకులకు కొత్త విలనిజమ్ని పరిచయం చేయనున్నారు. ఇక తెలుగులో చేస్తున్న ఈ కొత్త విలన్స్ గురించి తెలుసుకుందాం. ఓజీ వర్సెస్ ఓమి బాలీవుడ్ పాపులర్ యాక్టర్ ఇమ్రాన్ హష్మి తెలుగు ఎంట్రీ ‘ఓజీ’ సినిమాతో ఖరారైంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ ఓజాస్ గంభీర (ఓజీ)గా నటించగా, విలన్ ఓమీ పాత్రలో ఇమ్రాన్ హష్మి నటించారు. డివీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటించగా, అర్జున్ దాస్, ప్రకాశ్‌రాజ్, శ్రియా రెడ్డి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే అడివి శేష్ హీరోగా నటిస్తున్న ‘జీ2’ (గూఢచారి 2) చిత్రంలోనూ ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. ఈ చిత్రంలోనూ ఇమ్రాన్ విలన్‌గా నటిస్తున్నారని తెలిసింది. రామ్ బుజ్జిగా వస్తున్నాడు హిట్ వెబ్ సిరీస్ ‘మిర్జాపూర్’లో మున్నాగా మంచి నటన కనబరిచారు దివ్యేందు శర్మ. ఈ పాపులర్ సిరీస్‌ను తెలుగు ప్రేక్షకులూ వీక్షించారు. ఈ ‘మిర్జాపూర్’ మున్నా ఇప్పుడు టాలీవుడ్‌కు వచ్చారు. రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న మల్టీ స్పోర్ట్స్ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో దివ్యేందు శర్మ ఓ లీడ్ రోల్లో నటిస్తున్నారు. రామ్బుజ్జిగా దివ్యేందు కనిపిస్తారు. రామ్‌చరణ్ క్రికెట్ బ్యాటింగ్ – దివ్యేందు బౌలింగ్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయట.అలాగే దివ్యేందు పాత్రలో కొంత నెగటివ్ షేడ్స్ ఉంటాయని టాక్. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శివ రాజ్‌కుమార్ ఇతర లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ పతాకాల సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 మార్చి 27న విడుదల కానుంది. ఇక ‘మిర్జాపూర్’ సిరీస్‌తో పాటు ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్‌కథ, 2016: ది ఎండ్, అగ్ని’ వంటి చిత్రాల్లో నటించారు దివ్యేందు. ఈ బాలీవుడ్ నటుడికి తెలుగులో ‘పెద్ది’ తొలి చిత్రం. వృషకర్మలో.. సూపర్ హిట్ హిందీ చిత్రం ‘లాపతా లేడీస్’లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు స్పర్ష్ శ్రీవాత్సవ్. ఈ బాలీవుడ్ యువ నటుడిని నాగచైతన్య తెలుగులోకి ఆహ్వానించారు. నాగచైతన్య హీరోగా నటిస్తున్న అడ్వెంచరస్ అండ్ మిథికల్ మూవీ ‘వృషకర్మ’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ఈ చిత్రంలో స్పర్‡్ష శ్రీవాత్సవ్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. అయితే ‘లాపతా లేడీస్’లో పాజిటివ్ రోల్ చేసిన స్పర్‡్ష శ్రీవాత్సవ్ ‘వృషకర్మ’ చిత్రంలో మాత్రం నెగటివ్ రోల్ చేస్తున్నారట. ‘విరూ పాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఈ సినిమాను బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్. బి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే వేసవిలో విడుదల కానుంది. పోటా పోటీ బాలీవుడ్ యాక్షన్ హిట్ ఫిల్మ్ ‘కిల్’ (2023)లో విలన్‌గా నటించి, ఆడియన్స్‌ను మెప్పించారు రాఘవ్ జూయల్. లక్ష్య హీరోగా నటించిన ఈ చిత్రంలో రాఘవ్ విలనిజం యాక్షన్ ప్రియులకు కూడా కొత్తగా అనిపించింది. దీంతో రాఘవ్ జూయల్ పేరు బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలోనూ కాస్త గట్టిగానే వినిపించింది. అలా పాన్ ఇండియన్ మూవీ ‘ది ప్యారడైజ్’లో నటించే అవకాశం రాఘవ్‌కు లభించింది. ‘దసరా’ వంటి హిట్ తర్వాత హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ సినిమా ‘ది ప్యారడైజ్’.ఈ చిత్రంలో రాఘవ్ జూయల్ నటిస్తున్నట్లుగా ఆల్రెడీ చిత్రయూనిట్ స్పష్టం చేసింది. ఓ మెయిన్ విలన్ రోల్‌ని రాఘవ్ చేస్తున్నారని, నానీతో రాఘవ్‌కు పోటా పోటీ సన్నివేశాలు ఉంటాయని టాక్. ‘ది ప్యారడైజ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 26న విడుదల కానుంది. ఇక బాలీవుడ్లో ‘కిల్’తో పాటు ప్రభుదేవా ‘ఏబీసీడీ 2, సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’, సిద్ధాంత్ చతుర్వేది ‘యుద్ర’ వంటి చిత్రాల్లో మంచి నటన కనబరిచి, నార్త్ ఆడియన్స్‌ను అలరించారు రాఘవ్. మరి... టాలీవుడ్‌లోనూ రాణిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇన్స్పెక్టర్ స్వామి అడివి శేష్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘డెకాయిట్’. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. కెమెరామేన్ షానియల్ డియో ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కాగా ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, సునీల్‌తో పాటు బాలీవుడ్ దర్శక–నిర్మాత–నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన ఇన్స్పెక్టర్ స్వామి అనే పాత్రలో కనిపిస్తారు. అయితే కథ రీత్యా ఇన్స్పెక్టర్ స్వామి క్యారెక్టరైజేషన్లో కాస్త నెగటివ్ షేడ్స్ ఉంటాయని ఫిల్మ్‌నగర్ సమచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న విడుదల కానుంది. కాగా దొంగతనాన్ని వృత్తిగా స్వీకరించిన ఓ అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకుంటారు. కానీ ఊహించని పరిస్థితుల కారణంగా ఈ ఇద్దరూ కలిసి ఓ క్రైమ్ చేయాల్సి వస్తుంది? అప్పుడు ఏం జరుగుతుంది? అన్నదే క్లుప్తంగా ‘డెకాయిట్’ సినిమా కథాంశం.డ్రాగన్‌తో పోటీ! ‘మిన్నల్ మురళి, 2018, ఏఆర్ఎమ్’ వంటి మలయాళ చిత్రాల్లో హీరోగా నటించి, తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు టొవినో థామస్. కాగా, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘డ్రాగన్’ సినిమాలో టొవినో థామస్ ఓ లీడ్ రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో టొవినో థామస్ చేస్తున్నది విలన్ రోల్ అని, ఆల్రెడీ ‘డ్రాగన్’ షూటింగ్లో ఆయన పాల్గొంటున్నారనే ప్రచారం జరుగుతోంది.త్వరలోనే ఈ సినిమా విదేశీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్‌తో పాటు ఈ చిత్రం కీలక తారాగణం అంతా షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. రుక్మీణీ వసంత్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకాలపై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం 2026 జూన్ 25న విడుదల కానుంది.తెలుగులో విలన్స్‌గా చేస్తున్న నటీమణులూ ఉన్నారు..బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ‘జటాధర’. సుధీర్‌బాబు హీరోగా నటిస్తున్న ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రంలో సోనాక్షీ సిన్హాతో పాటు దివ్య ఖోస్లా, శిల్పా శిరోద్కర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో సోనాక్షీ సిన్హా, శిల్పా శిరోద్కర్ పాత్రల్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. దాదాపు పదిహేనేళ్ల తర్వాత శిల్పా శిరోద్కర్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్న చిత్రం ఇది. జీ స్టూడియోస్, ప్రేరణా అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, నిఖిల్ నందా, అరుణ అగర్వాల్, శిల్ప సింగాల్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ⇒ హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో అంతర్జాతీయ స్థాయిలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్స్ ఉంటారనే ప్రచారం జరుగుతోంది. దీపికా పదుకోన్ ఆల్రెడీ కన్ఫార్మ్ అయ్యారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారని తెలిసింది. అయితే మృణాల్ గురించిన అధికారక ప్రకటన లేదు. అలాగే ఈ చిత్రంలో రష్మికా మందన్నా కూడా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది.అయితే ఈ సినిమాలో రష్మికా మందన్నా పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉంటాయని, ఆమె విలన్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027 ఆగస్టులో విడుదలవుతుందనే ప్రచారం సాగుతోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... అల్లు అర్జున్, రష్మికా మందన్నాలు ‘పుష్ప’ ఫ్రాంచైజీలోని ‘పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్’ చిత్రాల్లో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇటీవల ‘పుష్ప 3’ కూడా ఉంటుందని సుకుమార్ ఓ సందర్భంలో కన్ఫార్మ్ చేశారు. ఈ నేపథ్యంలో అట్లీ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రంలో రష్మికా మందన్నా విలన్‌గా నటిస్తే, ఆమె పాత్ర ఎలా ఉండబోతుందన్న ఆసక్తి సినిమా లవర్స్‌లో ఉండటం సహజం.నెగటివ్ క్యారెక్టర్స్ చేయడానికి సీనియర్ హీరోలు సైతం చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రంలో నాగార్జున విలన్‌గా చేశారు. షారుక్ ఖాన్, ఆయన తనయ సుహానా ఖాన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ‘కింగ్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్ రోల్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి2898 ఏడీ’ చిత్రంలో కమల్‌హాసన్ విలన్ రోల్ చేస్తున్నారు.‘దోశె కింగ్’ అనే కొత్త చిత్రం కోసం మోహన్ లాల్ కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ‘భ్రమయుగం’ చిత్రంలో మమ్ముట్టి విలన్ రోల్ చేశారు. అలాగే జితిన్ కే జోస్ డైరెక్షన్‌లోని మరో సినిమాలో మమ్ముట్టి విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇలా... మరికొందరు సీనియర్ యాక్టర్స్ విలన్ రోల్ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.కెరీర్లో హీరోగా మంచి పీక్ స్టేజ్‌లో ఉన్న యంగ్ యాక్టర్స్ కూడా విభిన్నమైన విలన్ రోల్ వస్తే చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘వార్ 2’లో ఎన్టీఆర్ విలన్‌గా నటించారు. హిందీలో ఎన్టీఆర్‌కు ఇది తొలి చిత్రం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘భైరవం’ చిత్రంలో విలన్‌గా నటించారు మంచు మనోజ్. తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’లోనూ మనోజ్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. మలయాళ దర్శక–నిర్మాత పృథ్వీరాజ్ సుకుమారన్ (బడే మియా చోటే మియా), ఫాహద్ ఫాజిల్ (పుష్ప 3), అర్జున్ కపూర్ (సింగమ్ ఎగైన్) వంటి చిత్రాల్లో విలన్ రోల్ చేశారు. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలోనూ పృధ్వీరాజ్ విలన్‌గా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రంలో తొలిసారిగా పూర్తి స్థాయి విలన్‌గా నటిస్తున్నారు జయం రవి. తెలుగు నటుడు సుహాస్ తమిళ చిత్రం ‘మండాడి’లో విలన్ రోల్ చేస్తున్నారు. ఈ కోవలో మరికొంతమంది ఉన్నారు. – ముసిమి శివాంజనేయులు -
హీరోలో విలన్
విలన్‌గా కెరీర్‌ను ఆరంభించి, ఆ తర్వాత హీరోలైన నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అలానే హీరోగా కెరీర్‌ను ఆరంభించి, ఆ తర్వాత విలన్‌గా చేస్తున్న జాబితా కూడా పెద్దదిగానే ఉంది. కానీ ఒకవైపు హీరోగా చేస్తూనే, మరోవైపు విలన్‌గా చేస్తున్నారు కొందరు తెలుగు హీరోలు. విలన్స్‌గానూ తమ సత్తా ఏంటో ప్రేక్షకులకు చూపించాలనుకుంటున్నారు. ఓసారి ఆ హీరోల్లో ఉన్న విలన్‌పై ఓ లుక్ వేద్దాం...రజనీకాంత్‌తో ఢీ: రొమాంటిక్ స్టార్ హీరో నాగార్జున విలన్ రోల్ చేస్తే ఎలా ఉంటుంది? అనేది ‘కూలీ’ సినిమాలో చూడొచ్చు. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ’లో నాగార్జున ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమాలో సైమన్ రోల్లో కనిపిస్తారు నాగార్జున. కాగా ‘కూలీ’ చిత్రీకరణప్రారంభమైనప్పుడు ఓ వ్యక్తిని నాగార్జున కిరాతకంగా చంపుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో లీకైంది.ఆ వీడియో బయటకు వచ్చినప్పుడే ఈ సినిమాలో నాగార్జున విలన్‌గా కనిపిస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అదే నిజమైంది. ఇక ఈ చిత్రంలో ఉపేంద్ర, శ్రుతీహాసన్, సత్యరాజ్, షౌబిన్ షాహిర్ ముఖ్య పాత్రలు చేశారు. అలాగే ఓ స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులేశారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. వెండితెర బ్రహ్మ రాక్షస: యాక్షన్ చిత్రాల్లో విలన్లను చితక్కొడుతుంటారు ప్రభాస్. ఆరడుగుల ప్రభాస్ యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తుంటే, థియేటర్స్‌లో విజిల్స్ పడాల్సిందే. కానీ ఇప్పుడు తనలోని విలన్ యాంగిల్‌ని కూడా చూపించాలనుకుంటున్నారట ప్రభాస్. ఇందులో భాగంగానే ప్రభాస్ ‘బ్రహ్మ రాక్షస’ అనే సినిమా చేయనున్నారని, ‘హను–మాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మించనుందట. కానీ... ప్రభాస్ ప్రస్తుత కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా సెట్స్‌కు వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉంది.ఎన్టీఆర్ వార్: ఏ తరహా పాత్రనైనా అవలీలగా చేసేస్తారు ఎన్టీఆర్. ‘జై లవకుశ, టెంపర్’ చిత్రాల్లో హీరోగా కనిపించడంతో పాటు నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లోనూ ప్రేక్షకులను మెప్పించారు. మరోసారి ఈ తరహా పాత్రను ‘వార్ 2’ చిత్రంలో ఎన్టీఆర్ చేసినట్లుగా తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందిన లేటెస్ట్ స్పై యాక్షన్ మూవీ ‘వార్ 2’.ఈ చిత్రంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ లీడ్ రోల్స్ చేశారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రానిర్మించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పూర్తి స్థాయి విలన్ పాత్రలో కనిపిస్తారని, ఆ పాత్ర పేరు వీరేంద్రనాథ్ అని బాలీవుడ్ టాక్. ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లీడ్ యాక్టర్స్‌గా సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ మూవీ ‘వార్’ (2019)కు సీక్వెల్‌గా ‘వార్ 2’ రానుంది.హీరో... విలన్ ఒక్కరే!: అల్లు అర్జున్ ‘ఆర్య 2’ సినిమా చూశారుగా! ఆ చిత్రంలో హీరోగా నటించిన అల్లు అర్జున్ పాత్రలో కాస్త నెగటివ్ షేడ్స్ కనిపిస్తాయి. కానీ ఈసారి పూర్తి స్థాయిలో ఓ నెగటివ్ రోల్లో అల్లు అర్జున్ కనిపించనున్నారనే వార్త ప్రచారంలో ఉంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.ఈ మూడింటిలో ఒకటి విలన్ రోల్ అని, ఇప్పటివరకు అల్లు అర్జున్ను సిల్వర్ స్క్రీన్‌పై చూడని విధంగా ఆయన ఈ పాత్రలో కనిపిస్తారని టాక్. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ముంబైలోప్రారంభమైందని తెలిసింది. అల్లు అర్జున్ పాల్గొంటుండగా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోందట. ఈ చిత్రంలో దీపికా పదుకోన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. అలాగే జాన్వీ కపూర్, మృణాల్ ఠాగూర్ ఇతర ప్రధాన హీరోయిన్ పాత్రల్లో నటిస్తారనే ప్రచారం సాగుతోంది.బ్లాక్ స్వార్డ్: నటుడిగా కొంత గ్యాప్ తీసుకుని, ఇటీవల ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు మంచు మనోజ్. ఈ చిత్రంలో మనోజ్ పాత్రలో నెగటివ్ షేడ్స్ ఉన్నాయి. మరోసారి మంచు మనోజ్ విలన్‌గా కనిపించనున్నారు. తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ‘మిరాయ్’ చిత్రంలో బ్లాక్ స్వార్డ్ పేరుతో విలన్ పాత్ర చేస్తున్నారు మంచు మనోజ్. ఇటీవల విడుదలైన ‘మిరాయ్’ టీజర్ మనోజ్‌ది విలన్ పాత్ర అని స్పష్టం చేసింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న రిలీజ్ కానుంది. మండాడిలో విలన్: తమిళ నటుడు సూరి, తెలుగు నటుడు సుహాస్ ప్రధాన పాత్రధారులుగా నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మండాడి’. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో ఎల్రెడ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరోయిన్గా మహిమా నంబియార్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూర్తి స్థాయి విలన్ పాత్రను సుహాస్ చేస్తున్నారు. ఇక అడివి శేష్ హీరోగా నటించిన ‘హిట్ 2’ చిత్రంలోనూ సుహాస్ విలన్‌గా నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. వీరే కాదు... రానా, సందీప్ కిషన్, నవీన్ చంద్ర, ఆది పినిశెట్టి, కార్తికేయ, వరుణ్ సందేశ్ వంటి వారు ఒకవైపు హీరో పాత్రలు చేస్తూనే, కథ కుదిరినప్పుడు విలన్ పాత్రలూ చేస్తున్నారు. – ముసిమి శివాంజనేయులు -
విలన్ పాత్రలకు ట్రేడ్ మార్క్ యాక్టర్.. కోటా శ్రీనివాసరావు బర్త్‌డే స్పెషల్ (ఫొటోలు)
-
రజనీ కొత్త మూవీలో లారెన్స్ విలన్ గా..!
-
టాలీవుడ్ విలన్లుగా మారుతున్న బాలీవుడ్ హీరోలు
-
నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్ ఇచ్చాడు: నటుడు
తమిళ నటుడు పొన్నంబలం ఇండస్ట్రీలో స్టంట్ మ్యాన్‌గా, విలన్‌గా గుర్తింపు పొందాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో ఎన్నో చిత్రాల్లో విలన్‌గా నటించిన ఆయన సౌత్ ఇండస్ట్రీల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో చిరంజీవి ఘరానా మొగుడు చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించాడు. 80,90లో ప్రతికథానాయకుడిగా ఓ వెలుగు వెలిగిన ఆయన అనంతరం సినిమాలకు దూరమయ్యాడు. చదవండి: చిరంజీవి వల్లే బతికాను, ఏదో చిన్న సాయం చేస్తారనుకుంటే..: నటుడు ప్రస్తుతం ఆడపదడపా సినిమాలు చేస్తూ జీవనం సాగిస్తున్న ఆయన గతేడాది తీవ్ర అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరాడు. సర్జరీ అనంతరం కోలుకున్న పొన్నంబలం ఇటీవల ఓ తమిళ మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సొంతవాళ్లే తనని చంపాలని చూశారంటూ షాకింగ్ విషయం బయటపెట్టారు. ‘నేను అతిగా తాగడం వల్లే నా కిడ్నీలు పాడయ్యాయని అందరు అనుకుంటున్నారు. కానీ అందులో నిజం లేదు. నా తమ్ముడే నాకు స్లో పాయిజన్ ఇచ్చి నన్ను చంపాలని చూశాడు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. చదవండి: హైదరాబాద్ చేరుకున్న తారక్.. ఎయిర్‌పోర్టులో ఫ్యాన్స్ హంగామా చూశారా? ‘మా నాన్నకు నలుగురు భార్యలు. మూడో భార్య కొడుకు నా మేనేజర్‌గా పని చేసేవాడు. నా ఎదుగుదలను తట్టుకోలేక నా ఆహారంలో, డ్రింక్స్‌లో స్లో పాయిజన్ కలిపాడు. ఆ విషయాన్ని వైద్యులు గుర్తించారు. అది తెలియక నేను వాడిని చాలా నమ్మాను. నేను వాడి బాగు కోరుకుని ఉద్యోగం ఇస్తే. నా ఎదుగుదల చూసి ఓర్వలేక నన్ను చంపాలని చూశాడు. అంతేకాదు నా మీద చేతబడి కూడా చేయించాడు. ఆ విషయం నాకు ఇటీవలే తెలిసింది’ అంటూ అని చెప్పుకొచ్చాడు. -
మూడు సినిమాల్లో విలన్‌గా చేస్తున్న హీరో!
Aditya Om Turn As Villain: హీరో, విలన్, కమెడియన్ ఇలా రకరకాల వేరియన్స్ చూపించే అతి కొద్దిమంది నటుల్లో ఆదిత్య ఓం ఒకరు. తెలుగు, తమిళ సినిమాలతో పాటు పలు హిందీ సినిమాల్లో వైవిద్యభరితమైన పాత్రలు పోషించి శభాష్ అనిపించుకున్న ఆదిత్య బాలీవుడ్లో దర్శకుడిగా కూడా సూపర్ సక్సెస్ సాధించారు. ఇప్పుడు విలన్‌గా కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు ఆదిత్య ఓం. తెలుగు హిట్ సినిమా 'లాహిరి.. లాహిరి.. లాహిరిలో' మూవీలో లీడ్ రోల్ పోషించిన నటుల్లో ఒకరైన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించి బాలీవుడ్ గడప తొక్కారు. అలా బీ టౌన్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేస్తూనే తెలుగు, తమిళ భాషా చిత్రాల్లోనూ రాణిస్తున్నారు. నటుడిగా అన్నిరకాల పాత్రలకు న్యాయం చేస్తూ ప్రేక్షకులను అలరించాలని ఫిక్సయిన ఆదిత్య ఓం.. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్‌లో కనిపించబోతున్నారు. కొత్తగా ఇండస్ట్రీకి వస్తున్న నాగ వర్మతో కలిసి 'విక్రమ్' అనే సినిమాలో మాఫియా బాస్‌గా నటిస్తున్నారు ఆదిత్య ఓం. దీంతో పాటు మరో రెండు సినిమాలు ''అమరం (నగరంలో), పవిత్ర'' మూవీల్లో విభిన్నమైన విలన్ క్యారెక్టర్ చేస్తున్నారు. అమరం సినిమాలో ఆది సాయి కుమార్‌తో కలిసి నటిస్తున్న ఆదిత్య.. ఈ చిత్రంలో ఎంతో కీలకమైన హ్యాకర్ రోల్లో కనిపించనున్నారు. అలాగే జ్యోతి, గాయత్రి గుప్తాతో కలిసి పవిత్ర అనే వెబ్ ఫిల్మ్‌లో సైకోటిక్ డాక్టర్ వేషం వేస్తున్నారు. ఈ సినిమాలన్నీ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ మూడు సినిమాల్లో తన నెగెటివ్ క్యారెక్టర్ డిఫరెంట్ షేడ్స్‌లో చూపించానని చెప్పిన ఆదిత్య ఓం.. నేటితరం ప్రేక్షకులు సైతం నటులు తమ పరిమితులను అధిగమించాలని కోరుకుంటున్నారని, ప్రస్తుతం తాను అదే బాటలో ఉన్నానని చెప్పుకొచ్చారు. -
ఇక్కడ విలన్ అక్కడ హీరో
‘‘నేను సెటిలైంది ముంబైలో అయినప్ప టికీ హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. మా పూర్వీకులు ఇక్కడే ఉండేవాళ్లు. నాకు తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది’’ అని అనూప్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం విడుదలైన ‘రోగ్’లో ఆయన విలన్‌గా నటించారు. అంతకుముందు ‘విన్నర్’, ‘సింగమ్–3’ చిత్రాల్లో నటించిన అనూప్ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చారు. కెరీర్ గురించి అనూప్ సింగ్ పత్రికలవారితో మాట్లాడుతూ – ‘‘బుల్లితెర నటుడిగా ‘మహాభారతం’ గుర్తింపు తెచ్చింది. ‘టెంపర్’ షూటింగ్ చూసినప్పుడు పూరీగారంటే అభిమానం ఏర్పడింది. ఆయన సినిమాల్లో చేయాలనుకున్నా. ‘రోగ్’కి ఛాన్స్ వచ్చినప్పుడు మిస్టర్ వరల్డ్ గెల్చుకున్నప్పుడు కన్నా రెట్టింపు ఆనందం కలిగింది. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్నాను. మరాఠీలో రెండు సినిమాల్లో హీరోగా యాక్ట్ చేస్తున్నా. హిందీ సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
ఈ సర్కారును ఆపగలిగేవాడు ఎవడూ లేడు...
నాకు అడ్డొచ్చిన కొరియన్స్, మలేషియన్స్, ఇండోనేషియన్స్ ఎంతో మందిని చంపి ఈ ఎంపైర్ క్రియేట్ చేశాను. ఈ సర్కార్‌ను టచ్ చేయడం అంత ఈజీ కాదు ‘విలన్ అంటే ఇలా ఉండాలి’ ‘ఇలాగే ఉండాలి’ అనుకుంటే.... కచ్చితంగా అలానే ఉంటాడు. ‘అలా’ ఉండడం బానే ఉంటుంది గానీ అన్నిసార్లూ బాగుండదు. మొహం మొత్తుతుంది. అందుకే ‘రొడ్డకొట్టుడు విలన్’ పాత్రలు చేయడం అంటే కెల్లీ డోర్జీకి ఇష్టం ఉండదు. విలనిజంలో వైవిధ్యాన్ని కోరుకుంటాడు. అవసరమైతే దర్శకులతో చర్చలు చేస్తాడు. ‘ఇలా చేస్తే బాగుంటుందేమో’ అని వారిని ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. ‘హీరోగా నటించడానికి ఒకే ఒక మార్గం ఉంటుంది. విలన్‌గా నటించడానికి మాత్రం అనేక మార్గాలు ఉంటాయి’ అని నమ్ముతాడు కెల్లీ డోర్జీ. నలుగురిని కొడితేనే హీరో, నాలుగు డ్యూయెట్లు ఉంటేనే హీరో, హోరుగాలిలోనూ క్రాఫ్ చెదరకుంటేనే హీరో... అనే అభిప్రాయం బలపడినప్పుడు... హీరోగా నటించడానికి ఒకే మార్గం ఉంటుంది! కానీ విలన్‌కు చాలా మార్గాలు ఉంటాయి. కత్తులతో.. కంటి సైగతో... మీసాలతో... తెల్లటి టాటా సుమోలతో... విలనిజాన్ని పండించవచ్చు. అయితే ఇంత శ్రమ కూడా అక్కర్లేదు అంటాడు కెల్లీ. ‘బొద్దు మీసాలతో గట్టిగా అరిస్తేనే విలనా?’ అని అడుగుతాడు. ‘విలన్ కార్నర్’ అనేది ఖాళీగానే ఉందని... అక్కడ పూరించవలసింది ‘చాలా ఉంది’ అని నమ్ముతాడు. ‘బెస్ట్ విలన్ ఎలా ఉండాలంటే హిందీలో ‘ఓంకార’ సినిమాలో నటించిన సైఫ్ అలీఖాన్ పాత్రలాగా!’ అంటాడు. కొన్ని అభిప్రాయాలు ఉన్నప్పుడు... రావలసిన పాత్రలు వరస కట్టకపోవచ్చు. అలాంటి పరిస్థితి కెల్లీకి కూడా ఎదురైంది. ఒక సంవత్సరం అయితే అవకాశాలు లేక ఖాళీగా కూర్చోవలసి వచ్చింది. అయితే... పాత్రలే నా దగ్గరకు నడిచి రావాలి అని అతను ఎప్పుడూ బెట్టు చేయలేదు. ‘నాకో చాన్స్ ఇవ్వండి’ అంటూ కొత్త నటులలాగే దర్శకులు, నిర్మాతల తలుపు తట్టాడు. ‘ప్రతిభ మాత్రమే అన్ని వేళలా పని చేయదు... ప్రయత్నం కూడా ముఖ్యం’ అని నమ్ముతాడు డోర్జీ. సినిమా భాషలో చెప్పాలంటే ‘ఎవడి డప్పు వాడే కొట్టుకోవాలి’ అంటాడు. ‘నిన్ను నువ్వే మార్కెట్ చేసుకోవాలి’ అని చెబుతాడు... ఇవి అనుభవం నేర్పిన గుణపాఠాలు కావచ్చు. కాకపోవచ్చు. అయితే ‘విలనిజం’ అనే పుస్తకంలో ఒక్క పాఠం కాదు... రకరకాల పాఠాలు నేర్చుకోవడానికే మొగ్గు చూపుతాడు కెల్లీ డోర్జీ. అందుకే... మన తెలుగు చిత్రసీమకు కూడా ‘సుపరిచిత విలన్’ అయ్యాడు. ‘బద్రీనాథ్’ సినిమాలో సర్కార్‌గా నటించాడు కెల్లీ డోర్జి. ఈ సర్కార్ పచ్చి నెత్తురు తాగే వాడే కావచ్చు. ఒకరిని చంపడానికి రౌడీలను పంపించి... ‘చచ్చాడా లేదా అనేది మూడుసార్లు కన్ఫామ్ చేసుకోండి. శరీరాన్ని చూసి కాదు... శ్వాసను చూసి’ అని క్రూరంగా జాగ్రత్తలు చెప్పేవాడే కావచ్చు. ‘నీ కంఠంలో ప్రాణముండగా పెళ్లి జరిపించనన్నావు కదా... అందుకే... కంఠం కోసేశాను’ అని తన పైశాచికత్వాన్ని చాటుకునేవాడే కావచ్చు...అయితే ఈ సర్కార్‌కు కూడా ఒక లవ్‌స్టోరీ ఉంటుంది. లవ్ సెంటిమెంట్ ఉంటుంది. అందుకే ఇలా అంటాడు... ‘సారీ మినిస్టర్... ల్యాండ్ సెటిల్మెంట్లు చేయాలన్నావు... చేశా. తోటి కాంట్రాక్టర్లను చంపమన్నావు... చంపా. నీ పవర్ మార్చమన్నావు... మార్చా. కానీ... నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా... ప్రేమ విషయంలో ఎంటరవ్వను’తన భార్యపై మామ చేయి చేసుకున్నప్పుడు కళ్లతో సర్కార్ పలికించిన భావాలు ఎంత బలంగా ఉంటాయి! ‘డిఫరెంట్ లుక్స్’తో తనదైన విలనిజాన్ని సృష్టించుకున్న కెల్లీ డోర్జీ ‘డాన్’ ‘ద్రోణ’ ‘బిల్లా’ ‘కేడీ’ ‘గోలీమార్’ ‘బద్రీనాథ్’ ‘దడ’ ‘బాద్షా’... మొదలైన చిత్రాల్లో నటించారు. భూటాన్‌లోని థింపులో జన్మించిన కెల్లీ డోర్జి, డార్జిలింగ్‌లోని సెయింట్ పాల్ హైస్కూల్, ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చదువుకున్నాడు. ‘గ్లాడ్రాగ్స్ మ్యాన్‌హంట్ కాంటెస్ట్’తో వెలుగులోకి వచ్చాడు. ‘మోడల్’గా రాణించాడు. బాలీవుడ్ సినిమా ‘టాంగో ఛార్లీ’లో బోడో మిలిటెంట్ లీడర్‌గా వెండితెరకు పరిచయమయ్యాడు. తెలుగులో ‘డాన్’ సినిమాతో ‘బెస్ట్ విలన్’గా ‘మా టీవి వ్యూయర్స్ చాయిస్’ అవార్డ్ అందుకున్న కెల్లీ డోర్జి ‘ఉత్తమ విలన్’గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.