breaking news
Vidhu
-
ధనుష్ రిజెక్ట్ చేసిన మూవీ.. హీరోగా రెట్రో నటుడు
ధనుష్ నటించాల్సిన చిత్రం వర్దమాన నటుడు విదూను వరించింది. ఎస్.కార్తికేయన్‌కు చెందిన స్టోన్ బెంచ్ స్టూడియోస్, దర్శకుడు లోకేశ్ కనకరాజ్‌కు చెందిన స్క్వాడ్ స్టూడియో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి 29 అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రానికి రత్నకుమార్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు పేట, జిగర్తాండ డబుల్ ఎక్స్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో మెరిసిన విదూ ఈ చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనకు జంటగా ప్రీతీ అస్రాణి నటిస్తున్నారు. ఏడేళ్ల తర్వాతశ్యాన్ రోల్డణ్ సంగీతాన్ని, మహేశ్ మాణిక్యం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్‌ల్యాబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత కార్తికేయన్ మాట్లాడారు. తమ చిత్ర నిర్మాణ సంస్థను 2017 ప్రారంభించి తొలి ప్రయత్నంగా మేయాదమాన్ చిత్రాన్ని నిర్మించామన్నారు. ఆ తరువాత 17 చిత్రాలు చేశామని చెప్పారు. దర్శకుడు రత్నకుమార్‌తో సుమారు 7 ఏళ్ల తరువాత ఇప్పుడు 29 చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. 30లోకి అడుగుపెడితే..కొంత కాలం క్రితం ఆయన ఈ కథ చెప్పగా దయచేసి ఈ చిత్రాన్ని తమ సంస్థలోనే చేయాలని కోరానన్నారు. చిత్ర షూటింగ్ 85 శాతం పూర్తి అయ్యిందనీ, మరో నాలుగు రోజులు షూటింగ్ నిర్వహిస్తే పూర్తి అవుతుందన్నారు. చిత్ర దర్శకుడు రత్నకుమర్ మాట్లాడుతూ.. మనిషి వయసు 29 పూర్తి అయ్యి 30లోకి అడుగు పెడితే జాతకం మారిపోతుందన్నారు. అలాంటి ఒక యువకుడి ఇతివృత్తంతో తెరెకెక్కిస్తున్న చిత్రం 29 అని చెప్పారు. ధనుష్ రిజెక్ట్దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మాట్లాడుతూ.. ఈ కథను మేయాదమాన్ చిత్రం పూర్తి అయిన తరువాత దర్శకుడు రత్నకుమార్ తనకు చెప్పారన్నారు. దీన్ని నటుడు ధనుష్‌కు చెప్పగా ఆయని చాలా బాగుందన్నారు, కాకపోతే తాను ఇప్పుడు యాక్షన్ కథా చిత్రాల్లో నటించడం వల్ల ఇందులో నటించలేనన్నారు. యువ నటుడు నటిస్తే బాగుంటుందని ఆయన సలహా ఇచ్చారన్నారు. హీరోగాఅలా ఈ చిత్రంలో నటించడానికి దర్శకుడు రత్నకుమార్.. విదూతో ఆడిషన్ నిర్వహించారన్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రానికి ముందయితే ఈ మూవీలో విదూని హీరోగా తాను అంగీకరించేవాడిని కాదన్నారు. జిగర్తాండ డబుల్ ఎక్స్, రెట్రో చిత్రంలో నటించి అతను తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారని చెప్పారు. -
మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ 2025 కిరీటం గెల్చుకున్న ఇండియన్ విధు ఇషిక (ఫొటోలు)
-
కశ్మీర్ కథాంశంగా విధు వినోద్ చోప్రా సినిమా
ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ హిట్‌ను సాధించి.. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన 'త్రీ ఇడియట్స్', 'పీకే' వంటి ప్రముఖ సినిమాల నిర్మాత.. విధు వినోద్ చోప్రా మరో ప్రత్యేక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తన కొత్త చిత్రానికి కశ్మీర్‌ను కథాంశంగా ఎంచుకున్నఆయన... నూతన తన ప్రాజెక్టుపై కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో చర్చించారు. నిజానికి తన జీవితంలో ఎక్కువ భాగాన్ని జమ్మూ కశ్మీర్‌లోనే గడిపానని, పాఠశాల, కళాశాల విద్యను శ్రీనగర్‌లోనే పూర్తి చేశానని చోప్రా తెలిపారు. అందుకే ముఖ్యంగా కశ్మీరీ పండిట్ కమ్యూనిటీ దురవస్థ నేపథ్యాన్ని వర్ణిస్తూ చోప్రా చలనచిత్ర నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంలో చోప్రా, అతని సభ్యులు చెప్పిన విషయాలను ఎంతో ఓపిగ్గా విన్న మంత్రి జితేంద్ర సింగ్.. ప్రాజెక్టులోని ప్రధానాంశాలను క్లుప్తంగా ఓ నోట్ రూపంలో అందజేయాలని కోరారు. అంతేకాక ప్రభుత్వం నుంచి వారు కచ్చితంగా ఏం కావాలని కోరుకుంటున్నారో కూడా వివరంగా తెలపాలని సూచించారు.


