breaking news
under - 14
-
అండర్–14 రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఐదుగురు ఎంపిక
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ సంఘం అండర్–14 బాలుర జట్టుకు జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. సౌత్ ఇండియా అండర్–14 టోర్నీలో పాల్గోనే ఆంధ్ర అండర్–14 జట్టులో జిల్లాకు చెందిన దత్తారెడ్డి, అర్జున్ టెండూల్కర్, శ్రీయాస్, ప్రశాంత్‌రెడ్డి, మహమ్మద్ కామిల్లు ఎంపికయ్యారన్నారు. జట్టుకు స్టాండ్‌బైగా ఆనంద్ ఎంపికయ్యాడన్నారు. ఎంపికైన క్రీడాకారులు డిసెంబర్ 4న మంగళగిరి క్రికెట్ అకాడమీలో రిపోర్టు చేసుకోవాలన్నారు. డిసెంబర్ 5 నుంచి 20 వరకు శిక్షణ ఉంటుందన్నారు. -
అండర్–14 క్రికెట్ రన్నరప్ అనంత
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అండర్–14 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో అనంతపురం బాలుర జట్టు రన్నరప్‌గా నిలిచింది. విజయనగరంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అనంత, విశాఖ జిల్లాల మద్య ఫైనల్ పోరు కొనసాగింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన విశాఖ జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 207 పరుగులు చేసింది. అనంతపురం జట్టులో నీరజ్ 5, ప్రశాంత్ 2, ఆనంద్ 1 వికెట్లను పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అనంత జట్టు 205 పరుగులు చేసి ఆలౌటైంది. అనంత జట్టులో కెప్టెన్ దత్తారెడ్డి 87, శ్రీయాస్ 18, ప్రశాంత్ 16 పరుగులు మాత్రమే చేశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన విశాఖ జట్టు 109 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. దీంతో రెండోరోజు ఆట ముగిసే సమయానికి విశాఖ జట్టు ఇన్నింగ్స్ ఆధిక్యతతో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో అనంత జట్టు హ్యాట్రిక్ ఆశలు గల్లంతయ్యాయి. రాష్ట్ర ప్రాబబుల్స్‌కు ‘అనంత’ క్రీడాకారులు టోర్నీ ప్రారంభం నుంచి ‘అనంత’ జట్టు మంచి ఫలితాలను సాధిస్తూ వచ్చింది. ఫైనల్ మ్యాచ్‌లో ఓడినా మన జిల్లా క్రీడాకారులు దత్తారెడ్డి, అర్జున్ టెండూల్కర్, శ్రీయాస్, కామిల్, రూపేష్, ప్రశాంత్‌రెడ్డి, మీరజ్‌కుమార్, ఆనంద్‌లు సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించగలిగారు. వీరు ఈ నెల 18 నుంచి 24 వరకు విజయనగరంలో జరిగే రాష్ట్రస్థాయి ప్రాబబుల్స్ మ్యాచుల్లో పాల్గొంటారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రాబబుల్స్‌కు ఎంపిక కావడం పట్ల జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, ప్రసన్న హర్షం వ్యక్తం చేశారు.