breaking news
Tulsidas ramcharitmanas Audio CD
-
శవం సాయంతో నది దాటి.. తులసీదాస్ జీవితాన్ని మార్చిన ఘటన!
ఈ రోజుల్లో కొందరు యువత ‘నువ్వే నా ప్రాణం’ అంటూ అర్ధరాత్రి, అపరాత్రి లేకుండా తన ప్రియుడు లేదా ప్రియురాలితో ఆన్లైన్లో చాటింగ్‌లు చేయడం, భవిష్యత్‌ను ఆలోచించకుండా దేశాలు పట్టి తిరగడం అనేది కామన్‌గా మారిపోవడాన్ని చూస్తున్నాం. అయితే ఇలాంటి మోహం మనిషిని ఎంతటి ప్రమాదంలోకి నెడుతుందనేది తులసీదాస్ జీవితంలోని ఒక ఘటన మనకు తెలియజేస్తుంది. శ్రీరాముని కథను సామాన్యుడి గుండెల్లో నిలిపిన గోస్వామి తులసీదాస్ జీవితంలో జరిగిన ఈ ఘటన నేటి యువతకు ఒక కనువిప్పు. ప్రతి ఏడాది శ్రావణ శుక్ల సప్తమి నాడు తులసీదాస్ జయంతిని నిర్వహిస్తుంటారు. అది నేడు (ఆగస్టు 19)న వచ్చింది.ఒక సాధారణ గృహస్థుడిగా ఉన్న తులసీదాస్‌కు తన భార్య రత్నావళి అంటే ప్రాణం. ఆమె పుట్టింటికి వెళ్లగా, ఆ విరహాన్ని భరించలేకపోయిన ఆయన భయంకరమైన వాతావరణాన్ని, ఉప్పొంగుతున్న వరదలను కూడా లెక్కచేయకుండా అర్ధరాత్రి బయలుదేరారు. మార్గమధ్యంలో నది దాటేందుకు నీటిలో తేలియాడుతున్న ఒక శవాన్ని చెక్క మొద్దుగా భావించి, దాని సహాయంతో ఒడ్డునకు చేరారు. అత్తగారి ఇంటికి చేరాక.. ఈ సమయంలో వస్తే ఎవరైనా ఏమైనా అంటారనే భయంతో, అక్కడి గోడ ఎక్కేందుకు దానిపై వేలాడుతున్న విషసర్పం తోకను పట్టుకుని భార్య ఉంటున్న గది కిటికీ దగ్గరకు చేరుకున్నారు.తన కోసం ప్రాణాలను పణంగా పెట్టి వచ్చిన తులసీదాస్‌ను చూసి రత్నావళి సంతోషించలేదు. పైగా తీవ్రంగా అసహ్యించుకుంది. ‘సిగ్గు లేకుండా నా వెంటే పరిగెత్తుకుంటూ వచ్చారు! ఎముకలు, మాంసంతో కూడిన ఈ నశ్వరమైన దేహంపై ఉన్న ప్రేమలో కొంతైనా శ్రీరామునిపై ఉంటే మీకు భవబంధాల నుంచి విముక్తి లభించేది’ అని కఠినంగా మందలించింది. ఆ మాటలు ఆయన గుండెను బలంగా తాకాయి. ఆ నాడే తులసీదాస్ గ్రహించారు.. మనుషుల మీద పెట్టుకునే గుడ్డి మోహం ప్రమాదాల పాలు చేస్తుందని! ఆ క్షణమే ప్రాపంచిక మోహాలను వీడి, సన్యాస మార్గాన్ని స్వీకరించి, రామనామ అన్వేషణలో తరించారు. ఆ నాడే తులసీదాస్ చెప్పకనే చెప్పారు.. గుడ్డి వ్యామోహాన్ని వదిలి, మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి, జీవితం అప్పుడే సార్థకమవుతుందని.ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో ఒక్క మెసేజ్ .. నిమిషాల్లో వెబ్సైట్ సిద్ధం! -
‘ఓం’ ఉచ్చరించినా వివాదమే!
ప్రధాని మోదీ వ్యాఖ్య న్యూఢిల్లీ: దేశంలో ‘ఓం’ ఉచ్చారణతో వివాదాలు తలెత్తగలవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఆలిండియా రేడియో రూపొందించిన తులసీదాస్ రామచరితమానస్ ఆడియో సీడీలను ఆయన సోమవారం ఢిల్లీలో ఆవిష్కరిస్తూ.. ఈ పురాణంపైనా వివాదం వస్తుందేమోనన్నారు. ‘మన దేశంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. సైద్ధాంతిక ప్రాతిపదికపైనా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా ‘ఓం’ అంటే.. ‘ఓం’ ఎలా అంటారని వారం రోజుల పాటు వివాదం రేగుతుంది’ అని అన్నారు. ‘ఇటువంటి దేశంలో రామచరితమానస్‌ను ఎవరూ ప్రశ్నించలేదు. అది ఇప్పుడూ నడుస్తోంది. ఈ రోజు తర్వాత దీనిపై ఎవరో ఒకరి దృష్టిపడి.. తుపాను సృష్టిస్తారేమో.. నాకు తెలియదు’ అని పేర్కొన్నారు. భారత దేశ సారాంశాన్ని అద్భుతంగా తెలిపే ‘రామచరితమానస్’ గొప్ప ఇతిహాసమని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో హిందూ మతానికి సంబంధించిన ‘ఓం’ ఉచ్చరించాల్సి వస్తుంది కాబట్టి తాము పాల్గొనలేమని ముస్లిం సంస్థలు పేర్కొనటం, దానిపై వివాదం తలెత్తటం తెలిసిందే. కాగా, రామచరితమానస్ ఆడియో సీడీలను తీసుకొచ్చిన ఆలిండియా రేడియో కృషి ని మెదీ కొనియాడారు. దీన్ని సంగీత సాధనతోకాకుండా సంస్కృతి, సంస్కార విలువలతో గొప్పగా తీసుకొచ్చారన్నారు. 20-22 ఏళ్లపాటు రికార్డింగ్ చేశారంటే దీని కోసం ఎంతగా శ్రమించారో అర్థమవుతుందని అన్నారు. ఆకాశవాణి రికార్డు చేసిన రామచరితమానస్‌ను 1980 నుంచి చాలా ఏళ్లపాటు భోపాల్‌కు చెందిన ప్రముఖ గాయకులు ఆలపించారు. ‘మండలి’లో సంస్కరణలు తక్షణావసరం ఈ నెల 25న జరిగే ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ (యూఎన్జీఏ) 70వ సమావేశంలో.. పెండింగ్‌లో ఉన్న భద్రతామండలి సంస్కరణలు సహా పలు అపరిష్కృత అంశాలపై నిర్ణయాత్మక ఫలితాలు రావాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. యూఎన్జీఏ 70వ సమావేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైన మెజెన్ లికెటాఫ్ట్తో మోదీ సోమవారం భేటీ అయ్యారు. భద్రతామండలిలో సంస్కరణలు తక్షణావసరమని మోజెన్తో చెప్పారు.


