breaking news
Than
-
ఈ 'గాడ్జెట్'.. రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా..
క్విక్ అండ్ ఈజీ టెక్నాలజీతో ఈ గాడ్జెట్.. వేసవిలో చల్లటి డ్రింక్స్‌తో కూల్‌గా ఉంచుతుంది. వింటర్లో వేడి వేడి కాఫీ, టీలతో వెచ్చబరుస్తుంది. పార్టీలను చిల్ చేస్తుంది. ఇది రిఫ్రిజిరేటర్ కంటే వేగంగా పనిచేస్తుంది. డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్‌ని ఈ మగ్‌లో ఉంచి.. స్విచ్ ఆన్ చేస్తే.. అవి క్షణాల్లో కూల్ అవుతాయి. అలాగే ఓపెన్ చేసి.. వాటిని మగ్లోనే వేసుకుని మూత పెట్టుకోవచ్చు. అంతేకాదు వేడివేడిగా సూప్స్, టీ, కాఫీలనూ పెట్టుకోవచ్చు. చల్లగా కావడానికి వేరుగా.. వేడిగా కావడానికి వేరుగా ఆప్షన్స్ ఉంటాయి. ఏది కావాలనుకుంటే దాన్ని సెట్ చేసుకోవాలంతే. ఈ డివైస్ చిన్నగా.. తేలిగ్గా ఉండటంతో.. దీన్ని పార్టీలు.. బీచ్‌లకు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. బాగుంది కదూ!. ఈ కూల్ అండ్ హాట్ కప్ ధర 34 డాలర్లు (రూ.2,818). ఇవి చదవండి: అంతరించిన పక్షికి మళ్లీ ప్రాణం..! -
వసతులు కనుమరుగు
బాలికోన్నత పాఠశాలల్లో దీనస్థితి నిబంధనల మేరకు ఒక్కటీ లేదు! వారంతా కౌమార దశలో ఉన్న విద్యార్థినులు. తెరచాటు తప్పనిసరి. శుభ్రతకు పెద్దపీటవేయాలి. నిరంతర నీటి సరఫరా(రన్నింగ్ వాటర్) ఉండాల్సిందే. నిబంధనల మేరకు బాలికోన్నత పాఠశాలల్లో సగటున ప్రతి 20 మంది విద్యార్థినులకు ఒక యూనిట్(మూత్రశాల, మరుగుదొడ్డు) చొప్పున మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. జిల్లాలోని బాలికోన్నత పాఠశాలల్లో ఎక్కడా ఈ స్థాయిలో వసతులున్న దాఖలాల్లేవన్నది నిర్వివాదాంశం. దీంతో గంటల తరబడి ఉగ్గపట్టి ఉండడంతో యూరినల్, గైనిక్ సమస్యలను ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 24 వేల మంది విద్యార్థినుల దీన పరిస్థితిదీ. ల్లాలో అన్ని యాజమాన్యాల్లో కలిపి 63 బాలికోన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 13 జిల్లా పరిషత్ అధీనంలో ఉన్నాయి. గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, రెసిడెన్షియల్ కేటగిరీల్లో నిబంధనల మేరకు కాకపోయినా.. కొన్ని చోట్ల విద్యార్థినుల సంఖ్య పెద్దగా లేకపోవడంతో.. ఉన్న కాస సౌకర్యాలు కొద్దోగొప్పోసరిపోతున్నాయి. అనకాపల్లిలోని రెండు మున్సిపల్ స్కూళ్లతోపాటు, 13 జిల్లా పరిషత్ హైస్కూళ్లలో మాత్రం పరిస్థి దయనీయంగా ఉంది. 13 జెడ్పీ బాలికోన్నత పాఠశాలల్లో 5956 మంది విద్యార్థినులున్నారు. వీరికి నిబంధనల మేరకు 290 మరుగుదొడ్లు కావాలి. విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి(40:1) ప్రకారం చూసుకున్నా.. 150 మరుగుదొడ్లు తప్పనిసరి. అయితే వీటిలో 50కి మించి లేవు. చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట హైస్కూళ్లలో కొత్తగా మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం, నిరంతర నీటి సరఫరా సౌకర్యం ఉండటంతో కాస్త ఇబ్బందులు తొలిగాయి. నక్కపల్లి, కోటవురట్ల, క్వీన్‌మేరీస్, వి.మాడుగుల తదితర హైస్కూల్లోనైతే ఉన్న కొద్దిపాటి మరుగుదొడ్లలోనే టీచర్లు, విద్యార్థినులు సర్దుకుపోవాల్సిన దుస్థితి. కొన్ని చోట్ల టీచర్లు తమ మరుగుదొడ్లకు తా ళాలు వేసుకోవడంతో.. విద్యార్థులు ఆరుబ యటికి వెళ్లాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నిబంధనల మేరకు పాఠశాల నిర్వహణ ని దుల నుంచి మరుగుదొడ్లు శుభ్రపరిచేందుకు పనివాళ్లను నియమించాలి. అయితే జిల్లాలో ఏ పాఠశాలలోనూ ఈ పరిస్థితి కానరావట్లేదు.