breaking news
terror plot
-
బయటపడిన భారీ కుతంత్రం
న్యూఢిల్లీ: కశ్మీర్లో ఉగ్రవాదులు అతికించిన పోస్టర్ చివరకు దేశరాజధానిలో వరుస బాంబు పేలుళ్ల ఉగ్రకుట్ర భగ్నానికి దారితీసింది. పదో తేదీన ఎర్రకోట సమీపంలో నడిరోడ్డుపై కారు పేలి పలువురి బ్రతుకుల్ని ఛిద్రం చేసిన ఉదంతం వెనుక భారీ ఉగ్ర కుట్ర దాగి ఉందని తాజా దర్యాప్తులో తేలింది. బాబ్రీ మసీదును కూల్చేసిన అదే డిసెంబర్ ఆరో తేదీన ఢిల్లీలో వరుస బాంబుపేలుళ్లు జరపాలని వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు బుధవారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో వెల్లడైంది. ఫరీదాబాద్‌లో 2,500 కేజీల అమ్మోనియం నైట్రేట్, పొటాíÙయం క్లోరేట్, సల్ఫర్‌ల స్వాధీనం, వాటి నిల్వతో సంబంధం ఉన్న ఉగ్రమాడ్యూల్ సభ్యుల అరెస్ట్ తర్వాత వారిని లోతుగా ప్రశ్నించగా ఈ కుట్ర విషయం బయటపడింది. గణతంత్రదినోత్సవం సందర్భంగా జనవరి 26న ఢిల్లీలో పేలుళ్లు జరగబోతున్నాయని తొలుత వార్తలొచ్చినా అసలు దాడి డిసెంబర్లోనే చేయాలని ఉగ్రవాదులు నిశ్చయించుకున్నారని తెలుస్తోంది. ఇందుకు బలం చేకూర్చే ఆధారాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సంపాదించారు. ఫరీదాబాద్‌లో అరెస్టయిన డాక్టర్ ముజామిల్ ఘనీ ఈ ఏడాది జనవరిలోనే పలు మార్లు ఎర్రకోట, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పలుమార్లు రెక్కీ నిర్వహించాడని అతని మొబైల్ కాల్ డేటా, లొకేషన్ల ద్వారా ఢిల్లీ పోలీసులు గుర్తించారు. జనవరి 26న దాడులకు ప్లాన్చేసినా ఆరోజు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అవకాశం ఉండటంతో దాడుల ప్లాన్‌ను డిసెంబర్ ఆరో తేదీకి మార్చినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. మొబైల్లోని డంప్ డేటాను విశ్లేíÙంచడంతో ఈ విషయం స్పష్టమైంది. కారుతోపాటు పేలిపోయిన డాక్టర్ ఉమర్ నబీతో కలిసి ఘనీ 2021లో తుర్కియేకు వెళ్లొచ్చినట్లు వాళ్ల పాస్‌పోర్ట్‌ల మీది స్టాంపింగ్‌ల ఆధారంగా పోలీసులు కనిపెట్టారు. విదేశీ హ్యాండ్లర్ల నుంచి వీళ్లకు ఏ స్థాయిలో ఆర్థిక, ఆయుధ, పేలుడు పదార్థాల సరఫరా సాయం అందిందనే కోణంలోనూ దర్యాప్తు మొదలెట్టారు. పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ సభ్యులతో ఉమర్, ఘనీ భేటీ అయినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల రెండు టెలిగ్రామ్ గ్రూప్‌లలో ఉమర్, ఘనీలు సభ్యులుగా ఉన్నారు. వీటిలో ఒకదానిని పాకిస్తాన్‌లోని జైషే మొహమ్మద్ ఆపరేటివ్ ఉమర్ బిన్ ఖథాబ్ నిర్వహిస్తున్నాడు. మరో గ్రూప్‌లో కశ్మీర్‌కు చెందిన ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ సభ్యునిగా ఉన్నాడు. 2008లో ముంబైలో మారణహోమం తరహాలో దాడులుచేయాలని ఉమర్, ఘనీలకు ఆదేశాలు అందాయి. దీపావళి రోజున దేశవ్యాప్తంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో దాడులుచేయాలని సూచించాడు. రామ్‌లీలా మైదానం సమీపంలో 3 గంటలు అత్యంత పేలుడు పదార్థం(ఐఈడీ)ను వాహనానికి అమర్చి వాహనాధారిత ఐఈడీని తయారుచేయడంలో ఉమర్ నిమగ్నమైనట్లు అరెస్టయిన ఉగ్రవాదులు చెప్పారు. వీబీఐఈడీలో డిటోనేషన్ సర్క్యూట్ ఏర్పాటు, తయారీకి సంబంధించిన సాంకేతిక నైపుణ్యం సాధించేందుకు ఉమర్ పూర్తిగా ఇంటర్నెట్పై ఆధారపడినట్లుతెలుస్తోంది. అయితే తోటి సహచరులు అందరూ పోలీసులకు చిక్కడంతో తాను దొరికిపోతానన్న తొందరలో పూర్తిస్థాయి ఐఈడీ తయారుచేయకుండానే అమ్మోనియం నైట్రేట్‌తో వాహనాన్ని తీసుకుని తన స్థావరం నుంచి పారిపోయాడని దర్యాప్తు సంస్థలు చెప్పాయి. పేలుడుకు ముందు ఉగ్రవాది ఉమర్ ఎక్కడెక్కడ తిరిగాడన్న విషయలు ఒక్కోటిగా బయటికొస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం పదో తేదీన కారు పేలడానికి ముందు ఉమర్ తన కారులో అసఫ్ అలీ రోడ్డులోని మసీదుకు వెళ్లాడు. దీని పక్కనే రామ్‌లీలా మైదానం ఉంది. ఉమర్ అక్కడే మూడు గంటలు ఉన్నాడు. తర్వాత నమాజ్ పూర్తిచేసుకుని ఎర్రకోట వైపు వచ్చాడు. ఉమర్ పేరిట మరో కారు చనిపోయిన ఉమర్ పేరిట ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు(డీఎల్10సీకే0458) ఉందని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో దీని జాడ కనిపెట్టేందుకు ఢిల్లీ, హరియాణా పోలీసులు బృందాలు రంగంలోకి దిగి అన్ని చెక్‌పోస్ట్‌ల వద్ద జల్లెడపట్టాయి. చివరకు దానిని ఫరీదాబాద్ జిల్లాలోని ఖాండావాలీ గ్రామంలో పోలీసులు గుర్తించి స్వా«దీనంచేసుకున్నారు. ఫరీదాబాద్‌లో అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయం సమీపంలోని తన అద్దె ఇంట్లో పేలుడుపదార్థాలను దాచిపెట్టేందుకు ఉగ్రవాదులకు సాయపడిన ఇస్లాం మతబోధకుడు, మౌల్వీ ఇష్తియాఖ్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఇప్పటిదాకా ఈ కేసులో అరెస్ట్‌ల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. మేవాట్‌కు చెందిన మౌల్వీ తరచూ అల్–ఫలాహ్ విశ్వవిద్యాలయంలో మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేవాడు. అలా ఉమర్, ఘనీసహా పలువురు వైద్యులు, విద్యార్థుల మెదళ్లలోకి ఉగ్రభావజాలాన్ని నింపినట్లు తేలింది.శక్తివంతమైన ఐఈడీల తయారీ! అత్యంత శక్తివంతమైన 200 ఐఈడీల తయారీలో ఉగ్రమాడ్యూల్ సభ్యులు గతంలోనే మునిగిపోయారని దర్యాప్తులో తేలింది. ఢిల్లీలోని ఎర్రకోట, ఇండియాగేట్, కాన్సిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం, గురుగ్రామ్, ఫరీదాబాద్‌సహా దేశంలోని కీలక ఎయిర్‌పోర్ట్‌లు, రైల్వేస్టేషన్లు, మాల్స్ వద్ద పేలుళ్లు జరపాలని భారీ ప్రణాళిక వేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలిలో అమ్మోనియం నైట్రేట్‌తోపాటు ఒక కొత్తతరహా రసాయనం అశేషాలను పోలీసులు గుర్తించారు. అది అమ్మోనియం నైట్రేట్ కంటే అత్యంత విస్ఫోటక గుణమున్న ధాతువు కావొచ్చని భావిస్తున్నారు. బుధవారం ఘటనాస్థలి నుంచి 40 శాంపిళ్లను ఢిల్లీ ఫోరెన్సిక్ విభాగం సేకరించింది. వీటితోపాటు ఇతర మందుగుండు, బుల్లెట్లను స్వా«దీనంచేసుకున్నారు. పేలుడు తర్వాత పేరు మార్మోగిపోతున్న అల్–ఫలాహ్ వర్సిటీలో పోలీసులు ముమ్మర సోదాలు కొనసాగిస్తున్నారు. ఉమర్, ఘనీలతో సంబంధం ఉన్న వాళ్లను ప్రశి్నస్తున్నారు. కశ్మీర్లో 500 చోట్ల సోదాలు బుధవారం ఒక్కరోజే కశ్మీర్‌లోని శ్రీనగర్, గందేర్బల్, బుద్గామ్, బారాముల్లా, బందీపొరా, కుప్వారా, అనంత్‌నాగ్, కుల్గాం, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లోని 500 చోట్ల పోలీసులు విస్తృతస్థాయిలో సోదాలుచేశారు. జమాతే ఇస్లామీ ఉగ్రసంస్థ మళ్లీ క్రియాశీలకంగా మారిందన్న సమాచారంతో పోలీసలు ఆకస్మిక తనిఖీలు చేశారు. థానె, పుణెలో మహారాష్ట్ర ఏటీసీ బృందం సోదాలుచేసింది. అల్‌ఖైదాతో సంబంధమున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్ట్ నేపథ్యంలో థానెలో ఒక టీచర్, పుణెలో మరో వ్యక్తికి చెందిన చోట్ల సోదాలు జరిగాయి. -
గణతంత్ర వేడుకలకు ఉగ్రవాద ముప్పు?
-
గణతంత్ర వేడుకలపై ఉగ్ర కుట్ర.. ప్రధాని ప్రాణాలకు ప్రమాదం!
న్యూఢిల్లీ: గణతంత్ర వేడుకల్ని భగ్నం చేయడానికి ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర ప్రతినిధులు లక్ష్యంగా దాడులు జరిగే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఉగ్రమూకలతోనే ముప్పు పొంచి ఉందని, రద్దీ ప్రాంతాలు, ప్రముఖ కట్టడాలు, బహిరంగ ప్రదేశాల్లో దాడులు జరపడానికి ఉగ్ర సంస్థలు పన్నాగాలు పన్నుతున్నట్టుగా ఇంటెలిజెన్స్ అధికారులు తొమ్మిది పేజీల నివేదికని కేంద్రానికి పంపారు. డ్రోన్లతో దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని ఆ నివేదిక హెచ్చరించింది. దీంతో ఢిల్లీలో భద్రతని కట్టుదిట్టం చేశారు. జనవరి 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు హాట్ ఎయిర్ బెలూన్లు, పారాగ్లైడ్, యూఏవీలను రాజధాని పరిధిలో నిషేధించినట్టుగా మంగళవారం ఢిల్లీ పోలీసు కమిషనర్ రాకేశ్ ఆస్తానా చెప్పారు. డ్రోన్లను ఎదుర్కొనే సామర్థ్యమున్న వ్యవస్థలను రెండు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. అదనపు భద్రత కోసం అత్యంత ఎల్తైన భవంతులపై పోలీసు సిబ్బందిని మోహరిస్తారు. వేడుకలపై కోవిడ్ ఎఫెక్ట్ దేశవ్యాప్తంగా ప్రతిరోజూ 2 లక్షలకు పైగా కరోనా కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో భారీ ఆంక్షల మధ్య గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. ఈ ఏడాది 5,000–8,000 మందికి మాత్రమే వేడుకలకు అనుమతించాలని భావిస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ప్రత్యేక అతిథులెవరూ లేకుండానే వేడుకలు నిర్వహించాలని యోచిస్తున్నట్టుగా రక్షణ శాఖ వెల్లడించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికే వేడుకలకి హాజరవడానికి అనుమతి ఉంటుంది. చిన్నారుల్ని వేడుకలకి దూరంగా ఉంచనున్నారు. ఈసారి పరేడ్‌ను అరగంట ఆలస్యంగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటలకు బదులుగా 10.30కి వేడుకలు మొదలవుతాయి. రాజ్‌పథ్‌లో 10 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తారు. చదవండి: జంతువులపై ప్రేమ.. ప్రధాని వరకు తీసుకెళ్లింది శకటాల ఎంపిక నిపుణుల కమిటీదే : రాజ్‌నాథ్ తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ శకటాల ప్రదర్శనకు ఈ ఏడాది అనుమతి లభించకపోవడంపై వివాదం నెలకొంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీలు ఉద్దేశపూర్వకంగానే తమ రాష్ట్రాల శకటాలను తిరస్కరించారన్న ఆరోపణలపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. శకటాల ఎంపికను నిపుణుల కమిటీ చేస్తుందని, ఇందులో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాలిన్, మమతలకు లేఖ రాశారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 29 ప్రతిపాదనలు వస్తే 12 మాత్రమే ఆమోదం పొందాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ థీమ్‌పై శకటాన్ని రూపొందిస్తే తిరస్కరించారంటూ ఘాటుగా విమర్శించిన మమతకు బదులిస్తూ నేతాజీకి నివాళిగా ఆయన జయంతి జనవరి 23 నుంచి ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. చదవండి: ఈడీ దాడుల కలకలం.. పంజాబ్ సీఎం మేనల్లుడి ఇళ్లల్లో సోదాలు -
భారీ ఉగ్ర కుట్ర భగ్నం
శ్రీనగర్ : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముందు భారీ ఉగ్ర కుట్రను శ్రీనగర్ పోలీసులు భగ్నం చేశారు. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా దాడితో 40 మంది జవాన్లను బలితీసుకున్న జైషే మహ్మద్ భారత్‌లో పలు ఉగ్రదాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఇక జైషే ఉగ్రవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో భారీ పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను అజీజ్ అహ్మద్ షేక్, ఉమర్ హమీద్ షేక్, ఇంతియాజ్ అహ్మద్ చిక్లా, సహిల్ ఫరూక్ గోజ్రి, నజీర్ అహ్మద్ మిర్గా గుర్తించారు. జైషే శిబిరాన్ని భగ్నం చేయడం ద్వారా శ్రీనగర్ పోలీసులు భారీ ఉగ్రదాడి ప్రమాదం నుంచి తప్పించారని జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదుల నుంచి రిమోట్ కంట్రోల్ ఐఈడీతో పాటు 140 గిలెటిన్ స్టిక్స్, 40 డిటోనేటర్లను పోలీసులు సీజ్ చేశారు. -
కోవర్ట్ ఆపరేషన్...! ఆత్మాహుతి దాడి నిరోధానికి..
హాలివుడ్ సినిమా యాక్షన్ సీన్లు తలదన్నేలా పద్దెనిమిది నెలల పాటు అత్యంత రహస్యంగా ఊహకందని రీతిలో సాగిన భద్రతాదళాల ఆపరేషన్ విజయవంతమైంది. దేశ రాజధానిపై ఉగ్రమూక పంజా విసరకుండా ఈ సాహసోపేతమైన ఆపరేషన్ దోహదపడింది. దీని కారణంగా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఐసీస్ (ఇస్లామిక్ స్టేట్) దాడులకు సిద్ధమైన ఉగ్రవాదుల ప్రణాళికలు కూడా బట్టబయలయ్యాయి. భారత భద్రతా సంస్థల కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో భాగంగా ఐసీస్‌లోకి మన ఏజెంట్‌ను ప్రవేశపెట్టారు. ఈ వ్యక్తి ద్వారా ఐఎస్ ఉగ్రవాదికి ఢిల్లీలో ఆశ్రయం కల్పించడంతో పాటు దాడులకు అవసరమైన పేలుడుపదార్థాలు (ట్రిగ్గర్స్ లేకుండా) కూడా సరఫరా చేశారు. ఆఫ్గనిస్తాన్, దుబాయ్, ఢిల్లీల్లో సుదీర్ఘకాలం పాటు ఈ సూక్ష్మ పర్యవేక్షణ సాగింది. ఛెస్ ఆటలో మాదిరిగా భద్రతా దళాల అధికారులు ఓ వైపు పకడ్బందీ నిఘా కొనసాగిస్తూనే, అనువైన సమయం కోసం ఓపికగా ఎదురుచూశారు. ఇందులో ఉత్కంఠను రేకెత్తించే అంశాలెన్నో ఉన్నాయి... పాకిస్తాన్లో ఉగ్రశిక్షణ పొందిన 12 మంది ఐఎస్ తీవ్రవాదుల బందం భారత్, తదితర ప్రాంతాల్లో బాంబుదాడులకు తెగపడనున్నట్టు నిఘావర్గాలకు (రిసెర్చీ అనాలిసిస్ వింగ్–రా) సమాచారం అందింది. దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు 50 వేల డాలర్ల మొత్తాన్ని ఐసీస్ కార్యకలాపాల కోసం అఫ్గనిస్తాన్‌కు పంపించడాన్ని అమెరికన్ నిఘా వర్గాల సహకారంతో అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అనేక టెలిఫోన్‌కాల్స్ టాప్ చేశాక అఫ్గనిస్తాన్ సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి న్యూఢిల్లీలో ఆత్మాహుతి దాడికి పాల్పడేందుకు వస్తున్నట్టు వెల్లడైంది. ఇంజనీరింగ్ విద్యార్ధిగా భారత్‌కు వచ్చిన తీవ్రవాదితో స్నేహసంబంధాలు పెంపొందించుకునేందుకు ఓ ఐఎస్ ఏజెంట్ అవతారంలో కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఓ వ్యక్తిని పంపింది. ఈ వ్యక్తి ద్వారానే తీవ్రవాదికి లజ్‌పత్‌నగర్‌లో బసతోపాటు, పేలుడుపదార్థాలు సమకూర్చేలా చేశారు. ఢిల్లీలో ఐఎస్ ఉగ్రవాదిపై నెలరోజుల పాటు నిరంతర నిఘా కోసం 80 మంది సిబ్బంది పనిచేశారు. ఆత్మాహుతి దాడుల కోసం ఢిల్లీ విమానాశ్రయం, అన్సల్ ప్లాజా మాల్, వసంత్‌కుంజ్ మాల్, సౌత్ ఎక్స్టెన్షన్ మార్కెట్లలో ఐఎస్ ఉగ్రవాది రెక్కీ కూడా నిర్వహించాడు. వీటన్నింటిని కనిపెట్టిన భద్రతా అధికారులు అతన్ని అరెస్ట్ చేసి అఫ్గనిస్తాన్‌లోని అమెరికా దళాలకు అప్పగించారు. పట్టుబడిన ఉగ్రవాది ద్వారా 11 మంది సహచరుల కదలికలు కనుక్కోవడంతో పాటు, అతడిచ్చిన సమాచారంతో అనేక ఐఎస్ స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేయగలిగాయి. ఇటీవల అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లపై అమెరికా దళాలు పై చేయి సాధించేందుకు అవసరమైన సమాచారం ఇతడి వద్దే సేకరించారు. ప్రస్తుతం మరింత సమాచారం కోసం అతడిని విచారిస్తున్నారు. 2017 మే 22న యూకేలోని మాంఛేస్టర్ (23 మంది ప్రాణాలు కోల్పోయారు) లో జరిగిన బాంబుదాడి ఇతడి 11 మంది సహచరుల్లోని ఒకడి పనేనని తేలింది. అక్కడ దాడికి పాల్పడిన వ్యక్తి ఏవైతే పేలుడు పదార్థాలు వినియోగించాడో అలాంటి వాటినే ఢిల్లీకి వచ్చిన ఉగ్రవాది కూడా డిమాండ్ చేయడాన్ని బట్టి ఇక్కడ కూడా అలాంటి ఆత్మాహుతిదాడికి తెగబడాలని భావించాడనేది స్పష్టమవుతోంది. గత సెప్టెంబర్‌లోనే ఈ అరెస్ట్ చోటుచేసుకున్నా ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పుడు బయటపెట్టారు. -
ప్రధానమంత్రిని చంపాలని చూశారు!
లండన్: బ్రిటన్‌లో భారీ ఉగ్రవాద కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మేను చంపేందుకు ఇద్దరు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ప్రధాని నివాసమైన డౌనింగ్ స్ట్రీట్ గేట్లు పేల్చేసి.. ఆ సందర్భంగా తలెత్తిన గందరగోళం నడుమ ప్రధాని మేను హతమార్చాలని భావించారు. ఈ మేరకు కుట్రపన్నిన ఇద్దరు ఉగ్రవాదులు భద్రతా దళాలు అరెస్టుచేసినట్టు స్కై న్యూస్ తెలిపింది. ఉత్తర లండన్‌కు చెందిన నాయిముర్ జకారియా రహ్మన్ (20)ను, వాయవ్య బర్మింగ్‌హామ్‌కు చెందిన మహమ్మద్ అకిబ్ ఇమ్రాన్ (21)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద కుట్ర అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని బుధవారం వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. ‘డౌనింగ్ స్ట్రీట్ వద్ద ఇంప్రూవ్డ్ పేలుడు పదార్థాలు (ఐఈడీ) పేల్చి.. గందరగోళం రేపి.. ఆ క్రమంలో థెరిసా మేను చంపాలని వీరు కుట్రపన్నారు’ అని స్కై న్యూస్ ఒక కథనంలో తెలిపింది. -
భారత్‌పై ఉగ్రదాడికి కుట్ర.. అమెరికాలో ఎన్నారైకి 15 ఏళ్ల జైలు
భారతదేశం మీద ఉగ్రదాడి చేసేందుకు కుట్ర పన్నిన నేరం రుజువు కావడంతో అమెరికాలో ఉంటున్న ఓ ఎన్నారైకి అక్కడి కోర్టు 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఖలిస్థాన్ ఉద్యమంలో భాగంగా ఓ భారత ప్రభుత్వాధికారిని చంపేందుకు కూడా అతడు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. దాంతో బల్వీందర్ సింగ్ (42) అనే ఎన్నారైకి అమెరికా జిల్లా జడ్జి లారీ హిక్స్ 180 నెలల జైలు శిక్ష విధించారు. ఉగ్రవాదులకు కేవలం మద్దతు ఇవ్వడం, కుట్ర పన్నడమే కాక.. వాళ్లకు కావల్సిన వనరులను కూడా ఇతడు సమకూర్చినట్లు తేలింది. రెనో ప్రాంతానికి చెందిన బల్వీందర్ సింగ్ రెండు ఉగ్రవాద గ్రూపులలో సభ్యుడని, భారత ప్రభుత్వాన్ని వణికించేందుకు, అక్కడి అమాయక ప్రజలను హతమార్చేందుకు కావల్సిన సామగ్రిని ఇతడు వాళ్లకు అందించాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఇతడికి బల్జీత్ సింగ్, ఝాజీ అనే మారుపేర్లు కూడా ఉన్నాయి. అమెరికాలో శాశ్వత నివాస హోదా ఉంది. 2013 సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెలల మధ్య ఇతడు ఖలిస్థాన్ ఉగ్రవాదులకు ఉగ్రవాద దాడులు చేయడానికి కావల్సిన సామగ్రి అందించాడని చెబుతున్నారు. కాలిఫోర్నియా జైల్లో ఉన్న మరో కుట్రదారుడిని కలిసేందుకు ఇతడు తరచు రెనో నుంచి కాలిఫోర్నియా వెళ్లేవాడన్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు భారతదేశానికి వెళ్లి, అక్కడ ఒక భారత ప్రభుత్వాధికారిని చంపడంతో పాటు ఉగ్రవాద దాడులు కూడా చేయాలని 2013 అక్టోబర్‌లో వీళ్లిద్దరూ నిర్ణయించుకున్నారు. 2013 నవంబర్ నెలలో బల్వీందర్ సింగ్ రెండు నైట్ విజన్ గాగుల్స్, ఒక ల్యాప్‌టాప్ కొని తన సహచరుడికి ఇచ్చాడు. అతడు శాన్ఫ్రాన్సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్ వెళ్లేందుకు డిసెంబర్లో ప్రయత్నించాడు గానీ.. అమెరికా అధికారులు విమానాశ్రయంలోనే పట్టుకున్నారు. అతడిని విచారించగా బల్వీందర్ విషయం తెలిసింది. -
కిడ్నీల్లో పొడవాలని ప్లాన్ చేశారు
సిడ్నీ: ఉగ్రవాద చర్యకు ప్లాన్ చేసిన ఇద్దరు యువకులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. ఒమర్ అల్ కుతోబి(25), మహమ్మద్ కియాద్(27)లు సిడ్నీలోని షియా ప్రార్థనా మందిరంపై ఉగ్రదాడికి ప్లాన్ చేసి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో శుక్రవారం తుదితీర్పు వెలువడింది. 2015 ఫిబ్రవరిలో ఉగ్ర దాడికి ప్లాన్ చేసిన రోజే.. అప్రమత్తమైన పోలీసులు కుతోబి, కియాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నివాసాల్లో సోదాలు జరిపిన సందర్భంగా.. దాడులు చేయడానికి సిద్ధం చేసుకున్న కత్తులు, ఇస్లామిక్ స్టేట్ జెండాతో పాటు వీడియోలు వెలుగు చూశాయని విచారణ అధికారులు వెల్లడించారు. ఈ వీడియోల్లో మనుషుల కిడ్నీలు, మెడపై దాడి చేసి చంపడానికి సంబంధించిన దృశ్యాలు ఉన్నట్లు తెలిపారు. ఉగ్రకుట్రలో కుతోబి, కియాద్‌లు సమానంగా పాలుపంచుకున్నారని తీర్పు సందర్భంగా జస్టీస్ పీటర్ గార్లిండ్ పేర్కొన్నారు. -
ఉగ్రవాద కుట్ర: యువకుడి అరెస్టు
ఆస్ట్రేలియాలో ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నాడన్న ఆరోపణలతో ఓ యువకుడిని అరెస్టు చేశారు. పశ్చిమ సిడ్నీ ప్రాంతానికి చెందిన ఈ 16 ఏళ్ల యువకుడిని ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేసినట్లు ఆస్ట్రేలియా కౌంటర్ టెర్రరిజం అధికారులు తెలిపారు. మొదటి ప్రపంచయుద్ధంలో మరణించిన ఆస్ట్రేలియన్ యోధుల సంస్మరణార్థం ప్రజలంతా ఒకచోట చేరి నివాళులు అర్పిస్తారు. దానికి కొద్ది గంటల ముందుగానే ఈ యువకుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతానికి ఈ యువకుడు ఒక్కడే ఈ కుట్రలో భాగస్తుడని తాము భావిస్తున్నట్లు న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్ర పోలీసు కమిషనర్ ఆండ్రూ సిపియోన్ తెలిపారు. దాంతో ఇప్పటికి ముప్పు తప్పినట్లే భావిస్తున్నామన్నారు. గత సంవత్సరం కూడా సరిగ్గా ఇలాంటి కార్యక్రమం సమయంలోనే ఉగ్ర దాడులకు కుట్ర పన్నిన నేరంలో 14 ఏళ్ల యువకుడు సహా ఐదుగురు టీనేజర్లను మెల్బోర్న్లో అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా టీనేజర్లు ఇలా ఉగ్రవాద ప్రభావానికి లోనవుతున్నారని, ప్రధానంగా ఉగ్రవాద సంస్థలు ఆన్లైన్ ద్వారా సోషల్ మీడియాలో మహిళలను ఎరగా వేసి వీళ్లను ఆకర్షిస్తున్నాయని ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్ స్టేట్ కమాండర్ క్రిస్ షీహన్ చెప్పారు. -
టార్గెట్ గుజరాత్.. అక్కడే విధ్వంసానికి కుట్ర!
పాక్ ఉగ్రవాదులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌నే ఎందుకు లక్ష్యంగా ఎంచుకున్నారు? అక్కడే దాడులు చేయాలని ఎందుకు ప్రయత్నించారు? ఇటీవల అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ కుట్రలను ప్రధాని సమర్థంగా తిప్పికొట్టడం, అంతర్జాతీయ స్థాయిలో దౌత్య విజయాలు సాధించడంతో ఆయనను నైతికంగా దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతోనే లష్కరే తాయిబా ఉగ్రవాదులు తీరమార్గం గుండా గుజరాత్‌లోకి ప్రవేశించి.. విధ్వంసం సృష్టించాలని భావించారు. ఈ విషయం ఇంటెలిజెన్స్ నివేదికలతో నిర్ధారణ అయ్యింది. గతంలో కూడా లష్కరే తాయిబా ఉగ్రవాదులు ముంబై సముద్ర జలాల ద్వారానే దేశంలోకి ప్రవేశించి, దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబై మీద దాడికి పాల్పడ్డారు. ఇప్పుడు కూడా ఇలాగే వచ్చి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఉగ్రవాద దాడి చేయడానికి భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ నివేదిక ద్వారా తెలుస్తోంది. దీనిపై కేంద్ర హోంశాఖ అత్యంత అప్రమత్తంగా ఉండటంతో భారీ కుట్రను కోస్ట్ గార్డ్ సిబ్బంది భగ్నం చేయగలిగారు.


