breaking news
Tenth evaluation
-
మోక్షితకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేదెవరు?
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మండలం పరిధిలోని జెడ్పీహెచ్ఎస్లో గంగిరెడ్డి మోక్షిత తొలుత పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఫెయిల్ అయింది. విచిత్రంగా.. తెలుగులో 96, హిందీలో 82, ఇంగ్లిష్‌లో సోషల్‌లో 84, గణితంలో 93, సైన్స్‌లో 98 మార్కులు వచ్చిన ఈమెకు సోషల్ స్టడీస్‌లో మాత్రం 21 మార్కులే వచ్చాయి. పరీక్ష తప్పినట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించింది. కానీ, తన ప్రతిభపై గట్టి నమ్మకం ఉన్న మోక్షిత తండ్రి సాయంతో రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసింది. ఈసారి 84 మార్కులు వచ్చాయి. అప్పుడు ఎస్ఎస్సీ బోర్డు మొత్తం 537 మార్కులతో మోక్షిత పదో తరగతి ఉత్తీర్ణులైనట్టు ప్రకటించింది. కానీ, నిజం కాని ఫెయిల్‌కు–నిజమైన పాస్‌కు మధ్యలో ట్రిపుల్ ఐటీ, రెసిడెన్షియల్, గురుకులాల్లో ప్రవేశ దరఖాస్తులకు అవకాశం కోల్పోయింది మోక్షిత.ఈ దోషం ఎవరిది..??‘‘అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఓ విద్యార్థినికి పదో తరగతిలో 540 మార్కులు వచ్చాయి. ఫస్ట్ లాంగ్వేజ్ 96, ఇంగ్లిష్‌లో 87, గణితంలో 93, సైన్స్‌లో 95, సోషల్‌లో 96 స్కోర్ చేసింది. కానీ, హిందీలో 73 మార్కులే వచ్చాయి. దీంతో సందేహం వచ్చి రూ.వెయ్యి చెల్లించి రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంది. ఒక్క మార్కు కూడా పెరగలేదు. విద్యార్థికి పీడీఎఫ్ రూపంలో అందించిన జవాబు పత్రాన్ని చూస్తే.. నాలుగు మార్కుల ప్రశ్నల్లో నాలుగింటికి ‘సున్నా’ వేశారు. ‘సాక్షి’.. ఈ మూల్యాంకన పత్రాన్ని ఉపాధ్యాయ వృత్తిలో అనుభవజ్ఞులైనవారికి చూపించగా జవాబుల్లో స్వల్ప అక్షర దోషాలు తప్ప మరే సమస్య లేదని, కచ్చితంగా ఒక్కో ప్రశ్నకు మూడు, నాలుగు మార్కులు వస్తాయని చెప్పారు. అంటే, ఆ విద్యార్థిని 12 నుంచి 16 మార్కులు కోల్పోయినట్లేగా?34 నుంచి ఏకంగా 93కు..శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా బాలిక ఆర్.సాయికుందనకు పదో తరగతి ఫలితాల్లో 489 మార్కులు వచ్చినా ఫెయిల్ అయ్యింది. ఫస్ట్ లాంగ్వేజ్ 94, హిందీ 79, గణితం 96, సైన్స్ 92, సోషల్ 94 మార్కులు రాగా.. ఇంగ్లిష్‌లో మాత్రం 34 వచ్చాయి. ఫీజు కట్టి రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేయంగా ఇంగ్గిష్లో 34 మార్కులు కాస్తా 93కు పెరిగాయి. అంటే, ఏకంగా 59 మార్కులు వ్యత్యాసం కనిపించింది. -
ఈ రిమార్కు ఎవరిది మంత్రివర్యా?
సాక్షి, అమరావతి: ‘‘వారం రోజుల్లోనే పదో తరగతి ఫలితాలు వెల్లడించేశాం..’’ అని ఘనంగా చెప్పుకొనేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన పెద్ద పొరపాటు విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు గ్రహపాటుగా మారింది. ‘‘మేం రికార్డు సృష్టించాం’’అని గొప్పలు పోయేందుకు చేసిన తప్పు.. పరీక్షలు రాసిన విద్యార్థుల పాలిట శాపమైంది. సర్కారు అనాలోచిత చర్య.. వేలమందికి తీవ్ర మనస్థాపాన్ని మిగిల్చింది. పదో తరగతి అంటే ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపు అంటారు విద్యావేత్తలు. ఇక్కడ ప్రతిభ చూపితే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం వస్తుంది.భవిష్యత్‌లో ఏదైనా సాధించగలమనే నమ్మకం కలుగుతుంది. ఇంతటి కీలకమైన విద్యార్థి దశపై కూటమి సర్కారు దారుణమైన దెబ్బకొట్టింది. పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని గాలికి వదిలేసి ‘దిద్దుకోలేని తప్పు’ చేసింది. రాష్ట్రంలోని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడింది. ఈ ఏడాది పదో తరగతి పరీక్ష పేపర్లు దిద్దడంలో గొప్పలకు పోయి తీవ్ర గందరగోళం సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తప్పులు దొర్లడం యావత్ దేశాన్ని కలవరపరుస్తోంది.జీవితం తారుమారు..!టెన్త్ మార్కుల ఆధారంగా ట్రిపుల్ ఐటీ, గురుకులాల్లో చేరి మెరుగైన విద్య చదివేందుకు అవకాశం దక్కుతుంది. స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద అనేక కార్పొరేట్ సంస్థలు విద్యార్థుల ఉచిత చదువులకు సాయం అందించేందుకు ముందుకొస్తాయి. కానీ, కూటమి ప్రభుత్వం రికార్డుల కోసం పాకులాడి బంగారం లాంటి విద్యార్థుల జీవితాలను తలకిందులు చేసింది. తప్పుల మూల్యాంకనం కారణంగా వారు బంగారం లాంటి అవకాశాన్ని కోల్పోయి ఎంతో వేదనకు గురికావాల్సి వచ్చింది.మూడంచెల్లోనూ పొరపాట్లే..పదో తరగతి పరీక్ష పేపర్లను మూడు అంచెల్లో దిద్దుతారు. తొలుత విద్యార్థుల జవాబు పత్రాలను ఇతర జిల్లాకు పంపిస్తారు. అక్కడ ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 40 పేపర్లు దిద్దాల్సి ఉంటుంది. ప్రతి ముగ్గురు టీచర్లు దిద్దిన పేపర్లను పరిశీలించడానికి ఒక చెకింగ్ ఉపాధ్యాయుడు ఉంటారు. వీరు దిద్దిన పేపర్లను ఆ ఉపాధ్యాయుడు.. క్షుణ్నంగా పరిశీలిస్తారు. మార్కులు లెక్కింపు నుంచి ప్రతి జవాబును దిద్దారా? మార్కులు వేశారా? అని చూస్తారు. తొలుత పేపర్ దిద్దిన ఉపాధ్యాయులు పొరపాటు చేసినా రెండో దశలో సరిచేసే అవకాశం ఉంటుంది. ఇక మూడో దశలో చీఫ్ ఎగ్జామినర్ ప్రతి 20 పేపర్లలో ఏవైనా మూడింటిని తీసుకుని పరిశీలిస్తారు. అప్పుడైనా తప్పులు ఉంటే సరి చేస్తారు. కానీ, 66,363 పేపర్ల మూల్యాంకనంపై సందేహంతో దరఖాస్తు చేసుకోవడం, ఇందులో విద్యార్థుల తల్లిదండ్రుల అనుమానాలకు తగ్గట్టుగానే 11 వేల పేపర్లలో మార్కుల్లో మార్పులు రావడం చూస్తుంటే మూడంచెల వ్యవస్థ పనితీరుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.కొడుకుపై ప్రేమ.. సస్పెండ్ డ్రామా!పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తప్పులతో కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది. ఒకటా? రెండా? కోకొల్లలుగా ప్రభుత్వ తప్పులు బయటకొస్తున్నాయి. జూన్ 1 వరకు రీ వెరిఫికేషన్, రీకౌంటింగ్ కొనసాగుతుంది. ఈ క్రమంలో తమ పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడుతోందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పులపై విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటివరకు స్పందించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సీఎం చంద్రబాబు తనయుడిగానే కాకుండా పార్టీ, ప్రభుత్వంలో లోకేశ్ కీలక వ్యక్తిగా చక్రం తిప్పుతుండడంతో ‘తన శాఖ పనితీరులో ముందున్నట్టు’ గొప్పులు చెప్పుకొనేందుకు విద్యా శాఖపై ఒత్తిడి తెచ్చి వేగంగా మూల్యాంకనం పూర్తి చేయాలని, నిబంధనలను పక్కనపెట్టి ఒక్కో ఉపాధ్యాయుడికి ఎక్కువ పరీక్ష పేపర్లు ఇచ్చి మూల్యాంకనం చేయాలని ఒత్తిడి తేవడం తప్పులు దొర్లడానికి కారణమైంది. కానీ, పదో తరగతి పరీక్ష ఫలితాలపై ప్రజాగ్రహాన్ని దారిమళ్ళించేందుకు, కుమారుడు లోకేశ్‌పై ప్రేమతో సీఎం చంద్రబాబు మహానాడు వేదికగా డ్రామాకు తెరదీశారు. బాధ్యుల సస్పెన్షన్ అంటూ ఎత్తులు వేశారు.తప్పిదం ప్రభుత్వానిది.. మూల్యం విద్యార్థులదా?పరీక్షలు మంచిగా రాసినా... మార్కులు తక్కువ రావడం, ఫెయిల్ కావడాన్ని నామోషీగా భావించి విద్యార్థులు ఏదైనా తీవ్ర నిర్ణయం తీసుకుంటే? ఏమిటి పరిస్థితి అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం చేసిన భారీ తప్పిదానికి విద్యార్థులు మూల్యం చెల్లించుకోవాలా? అని నిలదీస్తున్నారు. ఆ పాపాన్ని చంద్రబాబు మోస్తారా? అని అడుగుతున్నారు. పరీక్ష పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులను బాధ్యులను చేసి సస్పెండ్ చేసినప్పుడు విద్యాశాఖ మంత్రిగా విఫలమైన లోకేశ్‌ను ప్రథమ బాధ్యుడిగా గుర్తించి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నిస్తున్నారు. సంపద సృష్టి అంటే.. ప్రతిభావంతులైన విద్యార్థులను ఫెయిల్ చేసి వారితో ఫీజులు కట్టించుకుని ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవడమా? అని ఎద్దేవా చేస్తున్నారు.ఒత్తిడిలో మూల్యాంకనంపదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉపాధ్యాయులపై మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ ఒత్తిడి తెచ్చి వేగంగా దిద్దించేందుకు యత్నించడంతోనే మార్కుల గజిబిజి గందరగోళం సృష్టించింది. ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ఫెయిల్ కావడంతో కూటమి ప్రభుత్వ డొల్లతనం బహిర్గతమైంది. ఏకంగా 66,363 పేపర్లలో రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవడం చూస్తుంటే విద్యార్థుల జీవితాలు ఎంత ప్రమాదంలో పడ్డాయో అర్థమవుతోంది. ఇందులో 11వేలకుపైగా పేపర్లలో ఉత్తీర్ణులు/మార్కుల మార్పు చెందినట్టు ఎస్ఎస్సీ బోర్డు ప్రకటించడాన్ని చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. ఇప్పటికీ రీవెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుండడం గమనార్హం. పేపర్లను దిద్దిన తర్వాత నాలుగు విభాగాలుగా మార్కులు వేస్తారు. ఇందులో కొన్నింటిని లెక్కించకపోవడంతో విద్యార్థులకు అన్యాయం జరిగినట్టు తెలుస్తోంది.కొట్టివేతలతో...రాజమహేంద్రవరం విద్యార్థి మణికంఠకు పదో తరగతి ఫలితాల్లో 505 మార్కులు వచ్చాయి. తెలుగులో 97, ఇంగ్లిష్‌లో 81, గణితంలో 86, సైన్స్‌లో 97, సోషల్‌లో 92 రాగా.. హిందీలో మాత్రం 52 వచ్చాయి. విద్యార్థి తండ్రి వీరభద్రరావు రూ.వెయ్యి చెల్లించి రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేశారు. మార్కుల్లో ‘మార్పు లేదు’ అని సమాధానం వచ్చింది. అయితే, జవాబు పత్రాల్లో సరైన సమాధానాలు రాసినప్పటికీ వాటిని కొట్టివేశారని విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కుల తారుమారు» రికార్డుల కోసం ప్రభుత్వం » విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది» వేలాదిమంది భవిష్యత్తు ప్రమాదంలో పడింది» ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి» వైఎస్సార్సీపీ ట్వీట్సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకున్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ‘‘పరీక్ష రాసినవారిలో 60 శాతం మంది విద్యార్థులు రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. వేలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి. పదో తరగతి బోర్డు చేసిన షాకింగ్ తప్పులు.. పాసైనవారిని కూడా ఫెయిల్ చేశాయి. విద్యా మంత్రి నారా లోకేశ్ ఒత్తిడి కారణంగానే మార్కులను తారుమారు చేశారు. 66,363 పేపర్ల రీవాల్యుయేషన్ కోరారు. ఇప్పటికే ఆందోళన చెందిన బోర్డు.. సమీక్ష తర్వాత 11 వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని ప్రకటించింది. వాల్యుయేషన్ ఇంకా కొనసాగుతోంది. అయినప్పటికీ, లోకేశ్ మౌనంగా ఉన్నారు. ఈ తప్పుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రికార్డుల కోసం ప్రయత్నించిన ప్రభుత్వం విద్యార్థుల జీవితాలను ఛిద్రం చేసింది’’ అని వైఎస్సార్సీపీ మండిపడింది. -
టెన్త్ మూల్యాంకనానికి సర్వం సిద్ధం
విశాఖ విద్య: పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి.దేవానంద్ రెడ్డి తెలిపారు. విశాఖలోని జూబ్లీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ ఏడాది రాష్ట్రంలో 6.23 లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్‌గా, 1.02 లక్షల మంది ప్రైవేటుగా పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. మొత్తంగా 50 లక్షల జవాబు పత్రాలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభించి, 8వ తేదీనాటికి పూర్తి చేయాలని జిల్లాల యంత్రాంగానికి లక్ష్యాన్ని నిర్దేశించామన్నారు. ఇందుకోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామన్నారు. గతంలో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, నంద్యాల జిల్లాల్లో మూల్యాంకనం జరిగేది కాదని, ఈసారి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మే మొదటి వారానికి అంతా పూర్తి చేసి, ఎన్నికల కమిషన్ అనుమతితో, ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఫలితాలు ప్రకటించాలనే లక్ష్యంతో ఉన్నామని ఆయన తెలిపారు. స్పాట్ కేంద్రాల్లో సకల సౌకర్యాలు మూల్యాంకనం కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించామని దేవానంద్‌రెడ్డి తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, నంద్యాల జిల్లాల్లో గతంలో నిర్వహించిన చోట సరైన సౌకర్యాలు లేవని గుర్తించి, ఈసారి వాటిని అనువైన భవనాల్లోకి మార్పు చేశామన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్రాల్లో వైద్య ఆరోగ్యశాఖ కో–ఆర్డినేషన్‌తో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. రీ వెరిఫికేషన్‌కు ఆన్లైన్ విధానం మూల్యాంకనంలో ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం ఇవ్వొద్దని డీఈవోలకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోవాలనుకునే విద్యార్థుల కోసం ఈసారి ఆన్లైన్ విధానం తీసుకొచ్చామన్నారు. రీ వ్యాల్యూయేషన్, రీ వెరిఫికేషన్ కోసం రూ.1000 ఫీజు చెల్లించే విద్యార్థులకు ప్రత్యేక వెబ్ లింక్ ద్వారా వారి సెల్‌ఫోన్‌కు మూల్యాంకనం చేసిన జవాబు పత్రాన్ని పంపిస్తామన్నారు. -
15 నుంచి ఏపీలో టెన్త్ మూల్యాంకనం
మే చివరి వారంలో ఫలితాలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శనివారంతో ముగిశాయి. ప్రధాన పరీక్షలు గురువారమే పూర్తయినా సంస్కృతం, వృత్తి విద్యా పరీక్షలు శనివారం వరకు జరిగాయి. పరీక్షల ఆరంభంలోనే అక్రమాలకు ముకుతాడు వేసేలా ఎంఈవో, చీఫ్ సూపరింటెండెంట్ స్థాయి అధికారులపై సస్పెన్షన్ వేటు వేయడంతో ఎక్కడా అక్రమాలకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు వివరించారు. ఈ నెల 15 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం జరగుతుందన్నారు. 13 జిల్లాల్లోని పేపర్లను ఒక్కో దాన్ని వేర్వేరు జిల్లాల్లోని మూల్యాంకన కేంద్రాలకు పంపి ఈ నెల 28 నాటికి మూల్యాంకనం పూర్తి చేస్తామన్నారు. మే చివరి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నట్టు పరీక్షల విభాగం డైరక్టర్ వివరించారు.