breaking news
temporary employees
-
కొలువులకు లైవ్ ఈవెంట్ల దన్ను
ముంబై: లైవ్ ఈవెంట్లు, కాన్సర్ట్ల వ్యవస్థ దేశీయంగా గణనీయంగా ఉద్యోగాల కల్పనకు తోడ్పడనుంది. దేశవ్యాప్తంగా ఏటా 100 పైగా భారీ కాన్సర్టులు (కచేరీలు) జరగనున్న నేపథ్యంలో 2030–32 నాటికి 1.2 కోట్ల పైచిలుకు తాత్కాలిక కొలువులు రానున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సంస్థ ఎన్ఎల్బీ సర్వీసెస్ ఈ విషయాలు వెల్లడించింది. లైవ్ ఈవెంట్లు, కాన్సర్టులు ఉపాధితోపాటు ఆర్థిక వ్యవస్థకు కూడా చోదకాలుగా ఉంటున్నాయని సంస్థ సీఈవో సచిన్ అలగ్ తెలిపారు. కొత్త పరిణామాలతో ప్రొడక్షన్, లాజిస్టిక్స్, సెక్యూరిటీ, హాస్పిటాలిటీ, డిజిటల్ మీడియావ్యాప్తంగా నిపుణులకు డిమాండ్ పెరుగుతోందని పేర్కొన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి కార్యక్రమాలు ఎక్కువగా హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, బెంగళూరులాంటి మెట్రోల్లోనే జరుగుతున్నప్పటికీ, క్రమంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కూడా తెరపైకి వస్తున్నాయని అలగ్ చెప్పారు. ‘షిల్లాంగ్, గౌహతి, పుణే, జైపూర్, కొచ్చి, లక్నో, ఇండోర్, చండీగఢ్ లాంటి నగరాలు లైవ్ ఈవెంట్లకు హాట్ స్పాట్లుగా మారుతున్నాయి’ అని పేర్కొన్నారు.వివిధ విభాగాల్లో వేల కొద్దీ అవకాశాలు.. ఒక్కో కాన్సర్టుతో వివిధ విభాగాల్లో 15,000 నుంచి 20,000 స్వల్పకాలిక ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఎన్ఎల్బీ సరీ్వసెస్ తెలిపింది. వేదిక నిర్వహణ, జన సమూహాల నియంత్రణ, ఫుడ్..బెవరేజ్ సరీ్వసులు, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్, ఆర్టిస్టులకు సర్వీసుల్లాంటి విభాగాలు వీటిలో ఉన్నాయి. కాన్సర్ట్ ఎకానమీ అనేది అటు ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ, ఫుడ్ అండ్ బెవరేజెస్ రంగాలకు కూడా ప్రయోజనం చేకూర్చనుంది. ఉదాహరణకు 2024లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కోల్డ్‌ప్లే కచేరీతో స్థానిక ఎకానమీకి రూ. 72 కోట్ల జీఎస్టీ సహా రూ. 641 కోట్ల ఆదాయాన్ని సమకూర్చింది. ఫ్లయిట్లకు డిమాండ్ 300–350 శాతం ఎగిసింది. రైళ్ల బుకింగ్స్ 8 శాతం పెరిగాయి. హోటల్ టారిఫ్‌లు రికార్డు స్థాయికి (కొన్ని గదుల టారిఫ్‌లు రోజుకు రూ. 90,000) ఎగిశాయి.ఫుల్‌టైమ్ కొలువుల్లోకి రూపాంతరం.. ఈ కాన్సర్టుల బూమ్ అనేదిక ఏదో స్వల్పకాలిక వ్యవహారం కాదని, 10–15 శాతం తాత్కాలిక కొలువులు పూర్తి స్థాయి ఉద్యోగాలుగా కూడా మారుతున్నాయని అలగ్ చెప్పారు. ముఖ్యంగా ఆడియో ఇంజనీరింగ్, డిజిటల్ వ్యూహం, ఈవెంట్ టెక్నాలజీ, ప్రొడక్షన్ నిర్వహణ వంటి విభాగాల్లో ఈ ధోరణి కనిపిస్తోందని పేర్కొన్నారు. తాత్కాలిక ప్రాజెక్టులు పునరావృతం అవుతుండటం, కొత్త నైపుణ్యాల్లో శిక్షణ లాంటి అంశాలు దీర్ఘకాలికంగా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో గిగ్ లేదా ఫ్రీలాన్స్ వర్కర్లకు ఉపయోగకరంగా ఉంటోందని అలగ్ చెప్పారు. ఏటా 100 పైగా కాన్సర్టులు ఉంటాయనే అంచనాల కారణంగా రాబోయే కొన్నేళ్లలో వీటిపంగా రూ. 15,000 కోట్లకు పైగా ఆదాయం రావచ్చని అంచనాలు ఉన్నట్లు వివరించారు. టికెటింగ్, హాస్పిటాలిటీ, రవాణా ద్వారా ప్రత్యక్ష ఆదాయాలు, పర్యాటకం, స్థానికంగా ఉపాధి కల్పన, వంటి అంశాలు ఇందుకు తోడ్పడతాయని అలగ్ చెప్పారు. -
ఐటీలో తాత్కాలిక ఉద్యోగులు ఐదేళ్లలో డబుల్!
ముంబై: ఐటీ, ఐటీఈఎస్ రంగంలో తాత్కాలిక ఉద్యోగులకు (ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్) డిమాండ్ క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో 3,90,000 మంది ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్ ఉండగా.. వీరి సంఖ్య 2030 నాటికి 9 లక్షలకు చేరుకుంటుందని కెరీర్‌నెట్ నివేదిక వెల్లడించింది. ఏటా వీరి సంఖ్య 15 శాతం చొప్పున పెరగనుందని అంచనా వేసింది. ప్రస్తుతం ఐటీ రంగం 58 లక్షల మంది నిపుణులకు ఉపాధి కల్పిస్తుంటే.. వీరిలో 7 శాతం మేర తాత్కాలిక ఉద్యోగులే ఉన్నట్టు తెలుస్తోంది. ఐటీ రంగంలో పెరుగుతున్న ఫ్లెక్సీ స్టాఫింగ్ పేరుతో కెరీర్‌నెట్ ఒక నివేదిక విడుదల చేసింది. నియామకాల డేటా, మార్కెట్ పరిశోధన, పరిశ్రమలో ధోరణులను విశ్లేíÙంచి ఈ వివరాలు ప్రకటించింది. ‘భారత్ ప్రపంచ ఆఫ్‌షోర్ హబ్‌గా మారుతోంది. కనుక ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఫ్లెక్సీ వర్కర్లకు డిమాండ్ పెరగనుంది. డిజిటల్ టెక్నాలజీలకు మళ్లడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పుల నేపథ్యంలో వేగం, ప్రత్యేకత, విస్తరణ అవసరాలకు మద్దతుగా ఫ్లెక్సీ స్టాఫింగ్ నమూనాను కంపెనీలు అనుసరిస్తున్నాయి’ అని కెరీర్‌నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలబ్ శుక్లా తెలిపారు.కెరీర్లో పురోగతికి దారి.. నిపుణులకు వృత్తిలో ఎదుగుదల, నైపుణ్యాల అభివృద్ధి, పని–వ్యక్తిగత జీవితం మధ్య మెరుగైన సమతుల్యాన్ని ఫ్లెక్సీ ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నాయని చెబుతూ.. మిలీనియల్స్, జెనరేషన్ జెడ్ నిపుణులకు ఇవి కీలక ప్రాధాన్యతలుగా ఉన్నట్టు ఈ నివేదిక పేర్కొంది. ఐటీ/ఐటీఈఎస్ రంగంలో ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌కు బెంగళూరు ప్రముఖ కేంద్రంగా ఉంది. ఈ రంగంలోని మొత్తం తాత్కాలిక సిబ్బందిలో 25 శాతం మంది ఈ నగరంలోనే ఉపాధి పొందుతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ 15 శాతం మంది ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌కు ఉపాధి కలి్పస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణే, చెన్నై ఒక్కోటీ 10 శాతం మేర తాత్కాలిక ఉద్యోగులకు ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ తాత్కాలిక ఉద్యోగుల సిబ్బందిలో వృద్ధి నమోదవుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఐటీ/ఐటీఈఎస్ రంగంలోని ఫ్లెక్సీ వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం మేర ఈ నగరాల నుంచే ఉన్నట్టు వెల్లడించింది. నిపుణుల లభ్యతకు, తక్కువ వ్యయాలతో కూడిన వ్యాపార నమూనాలు ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిపింది. -
ఎలాపడితే అలా క్రమబద్ధీకరణ కుదరదు
-
ఎలాపడితే అలా క్రమబద్ధీకరణ కుదరదు
కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు షాక్ సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉమ్మడి హైకోర్టు షాకిచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను ఎలా పడితే అలా క్రమబద్ధీకరించడానికి వీల్లేదని, ఈ విషయంలో కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. 1996, అంతకు ముందు నియమితులై, పదేళ్ల సర్వీసును పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను మాత్రమే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌తో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌కు వాయిదా వేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 16ను సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లాకు చెందిన జె.శంకర్, నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్.గోవిందరెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ.. పదిహేనేళ్లుగా వివిధ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి సేవలను క్రమబద్ధీకరించే ముందు వారి అర్హతలను పరిగణనలోకి తీసుకుంటున్నామని చెప్పారు. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు క్రమబద్ధీకరణ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, కమిటీ నిర్ణయం మేరకు క్రమబద్ధీకరణ చేస్తున్నామని వివరించారు. కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకం ఏకపక్షంగా జరగడం లేదని, పత్రికల్లో ప్రకటనలు జారీ చేసి, అర్హతల ఆధారంగానే ఆయా శాఖలు నియామకాలు చేస్తున్నాయని తెలిపారు. ఇదే అంశంపై గతంలో వ్యాజ్యం దాఖలైందని, అందులో ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని, కాబట్టి ఆ వ్యాజ్యంతో ఈ వ్యాజ్యాన్ని జత చేసి, కౌంటర్ దాఖలుకు గడువునివ్వాలని కోరారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టాన్ని అన్వయించుకున్న ప్రభుత్వం, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిమిత్తం ఈ చట్టంలోని సెక్షన్ 10ఏను చేర్చిందన్నారు. క్రమబద్ధీకరణ విషయంలోనే కర్ణాటక వర్సెస్ ఉమాదేవి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు ఈ సెక్షన్ విరుద్ధమన్నారు. గతంలో దాఖలైన వ్యాజ్యంలో ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించబోమంటూ హామీ ఇచ్చిన ప్రభుత్వం, దానిని ఉల్లంఘించి తాజాగా జీవో 16ను జారీ చేసిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నిర్దిష్ట విధానం ద్వారా కాకుండా ఇతర పద్ధతుల్లో నియామకాలు పొందిన వారి సర్వీసులను ఇలా క్రమబద్ధీకరించుకుంటూ పోతుంటే, ఇక నిరుద్యోగులు ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ చర్యల వల్ల వారు ఎప్పటికీ నిరుద్యోగులుగానే ఉండిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమాదేవి కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడానికి వీల్లేదన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని, దాని ప్రకారం 1996, అంతకు ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా నియమితులై, పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారి సేవలను మాత్రమే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది. -
క్రమబద్ధీకరణ సరికాదు
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ మానుకోవాలని హైకోర్టు సూచన సాక్షి, హైదరాబాద్: నిర్దేశిత విధానం ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్ధీకరణ సరికాదని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. ఇక ఇప్పటి నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీ సులను క్రమబద్ధీకరించడం మానుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు గడువు కావాలని అడ్వకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి కోరడంతో, అందుకు అంగీకరిస్తూ విచా రణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనా థన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మా సనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఫిబ్ర వరిలో జారీ చేసిన జీవో 16ను సవాల్ చేస్తూ జగిత్యాల జిల్లాకు చెందిన జె.శంకర్, నల్లగొండ జిల్లాకు చెందిన ఎన్.గోవిందరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై మంగళవారం ఏసీజే నేతృత్వం లోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇలా క్రమబద్ధీ కరించడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధ మని పిటిషనర్ల తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదించారు. -
తరలిపోయిన ఈఎస్ఐ ఆసుపత్రి
అమీర్‌పేట, న్యూస్‌లైన్: సనత్‌నగర్ కార్మిక బీమా వైద్యశాల (ఈఎస్ఐ) నాచారం ప్రాంతానికి తరలిపోయింది.ప్రస్తుతం ఇక్కడి ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మంగళవారం నుంచి నాచారంలో విధులు నిర్వహించాలని అధికారికంగా సోమవారం ఆదేశాలు జారీచేశారు. కార్మికశాఖ నుంచి శనివారం అధికారికంగా ఉత్తర్వులు వచ్చినప్పటికీ ఆసుపత్రిని తరలించిన పక్షంలో అందరు ఉద్యోగులను ఒకేచోటికి మార్చాలని యూనియన్ నాయకులు, వైద్యులు, ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నేపధ్యంలో ఆసుపత్రి అధికారులు విషయాన్ని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డెరైక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగుల డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని అందరినీ ఒకేచోటకు పంపుతున్నట్లు తెలిపి.. ఆగస్టు 29లోపు సిబ్బంది నాచారం ఆసుపత్రిలో విధులు నిర్వహించాలని ఆదేశించారు. సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో కొనసాగుతున్న దాదాపు 10 విభాగాల్లోని ఉద్యోగులు విభాగానికి ఇద్దరు చొప్పున 27 తేదీ నుంచి నాచారం వెళ్లి విధులు నిర్వర్తించాలని పేర్కొంటూ ఓ జాబితాను తయారుచేసి ఉద్యోగులకు అందచేశారు. కాగా ఉద్యోగుల ఒత్తిడి మేరకు ఉన్నతాధికారులు మిగిలిన సిబ్బంది తరలింపునకు నెలరోజులు గడువు ఇచ్చారు. డిస్పెన్సరీ స్థాయి నుంచి 500 పడకల ఆసుపత్రిగా.. సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రికి సు మారు 50 సంవత్సరాల చరిత్ర ఉంది. కేంద్ర కార్మికశాఖ రాష్ట్రంలోనే మొట్టమొదట 1965లో సనత్‌నగర్ ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేసింది. అప్ప ట్లో ఇక్కడ కేవలం పదిమంది ఉద్యోగులు మాత్రమే పనిచేసేవారు. పరిశ్రమలు పెరగడంతో 30 పడకల ఆసుపత్రిగా మార్చారు. ప్రస్తుతం 500 పడకల ఆసుపత్రిగా ఎదిగింది. ఇక్కడ శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులతో కలి సి సుమారు 900 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ చారిత్రక ఆసుపత్రి మం గళవారం నుంచి ఈఎస్ఐ కార్పొరేషన్ టీచింగ్ ఆసుపత్రిగా కొనసాగనుంది.