breaking news
temporarily ban
-
టెలిగ్రామ్ బ్యాన్ ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు కేంద్రం విధించిన టెలిగ్రామ్‌పై టెంపరరీ బ్యాన్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా టెలిగ్రామ్ నేరుగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించగా.. కోర్టు అందుకు అంగీకరించింది. దీంతో న్యాయస్థానంలో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.నీట్ యూజీ 2026 రీ-టెస్ట్ నేపథ్యంలో టెలిగ్రామ్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని సవాలు చేస్తూ, టెలిగ్రామ్ కంపెనీ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్ తేజస్ కారియా విచారించేందుకు అంగీకరించారు. ఇవాళే ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.#BREAKING Telegram moves Delhi High Court against Centre's ban on the platform https://t.co/9ncovLLlaY— Live Law (@LiveLawIndia) June 17, 2026కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. NEET రీ-ఎగ్జామ్ (జూన్ 21) దాకా కొన్ని రోజులు పాటు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధించబడింది. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న పేపర్ లీక్ రాకెట్లు, ఫేక్ మెసేజ్‌లు, మోసపూరిత ఛానల్స్‌ను అడ్డుకోవడమే ఈ చర్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమాచార సాంకేతిక చట్టం(IT Act) సెక్షన్ 69A కింద ఈ ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఎన్టీఏ సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. అయితే ఇది లక్షలాది సాధారణ వినియోగదారులను ప్రభావితం చేస్తోందని టెలిగ్రామ్ తన పిటిషన్లో పేర్కొంది.టెలిగ్రామ్‌ను అడ్డుకున్నంత మాత్రాన మిగతా యాప్‌లతో పేపర్ లీక్‌లు జరగడం లేదా? అని పిటిషన్లో కేంద్రానికి టెలిగ్రామ్ సూటి ప్రశ్న వేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వివాదానికి కారణమైన ప్రధాన అంశం నీట్ పరీక్షల చుట్టూ పెరిగిన ఫేక్ పేపర్ లీక్ నెట్వర్క్. “PAPER LEAKED NEET”, “Re-NEET 2026” వంటి పేర్లతో ఉన్న టెలిగ్రామ్ ఛానల్స్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నాయని ఎన్టీఏ గుర్తించింది. కొందరు ఛానల్స్ కొన్ని వేల నుండి లక్షల రూపాయల వరకు డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిట్ ఫీచర్‌ను కూడా ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. పరీక్ష తర్వాత ఫేక్ పేపర్ లీక్ సాక్ష్యాలు సృష్టించడానికి ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఎన్టీఏ ఆరోపించింది. అయితే భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ తీవ్రంగా స్పందించారు. భారత్‌లో 15 కోట్లకు పైగా వినియోగదారులను ప్రభావితం చేసే ఈ చర్య తప్పుడు నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. ఇటు డిజిటల్ హక్కుల సంస్థలు కూడా దీనిని “ఓవర్ బ్రాడ్ రెస్పాన్స్”గా అభివర్ణించాయి. అయితే ప్రభుత్వం మాత్రం ఈ చర్యను తాత్కాలిక భద్రతా చర్యగా పేర్కొంటోంది. పరీక్ష సజావుగా, మోసాలు లేకుండా నిర్వహించడమే లక్ష్యమని ఇటు ఎన్టీఏ స్పష్టం చేసింది. ఈ తరుణంలో ఈ వ్యవహారం కోర్టు మెట్లెక్కడం గమనార్హం. -
టెలిగ్రామ్ బ్యాన్‌తో లీకులు ఆగుతాయా?
నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై భారత ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నిర్ణయాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తీవ్రంగా తప్పుబట్టారు. "లీకులు ఆగలేదు.. కేవలం వేరే యాప్‌లకు మారిపోయాయి" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాయి. అసలు పేపర్ లీక్‌లకు టెలిగ్రామ్ కారణమా? అంటే.. లీకుల బెడద ఇంకా మిగిలే ఉందా?? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.భారత్‌లో 15 కోట్లకుపైగా టెలిగ్రామ్ వినియోగదారులు ఉన్నారని, కొందరు దుర్వినియోగం చేశారనే కారణంతో మొత్తం ప్లాట్‌ఫామ్‌ను బ్లాక్ చేయడం సామాన్య వినియోగదారులకు శిక్ష విధించినట్టేనని దురోవ్ వ్యాఖ్యానించారు. పరీక్షా పత్రాల లీక్‌లు, మోసాలు టెలిగ్రామ్‌తో ఆగిపోవని, అవి ఇతర యాప్‌లకు మారిపోతాయని పేర్కొన్నారు. గత కొన్ని వారాల్లో లీక్‌లు, స్కామ్‌లకు సంబంధించిన వందలాది ఛానెళ్లను తొలగించామని కూడా చెప్పారు.నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు "PAPER LEAKED NEET", "RE-NEET 2026", "PRIVATE MAFIA" వంటి పేర్లతో నడుస్తున్న టెలిగ్రామ్ ఛానెళ్లు విద్యార్థులను మోసం చేస్తున్నాయని ఎన్టీఏ గుర్తించింది. ప్రశ్నాపత్రాలు ఉన్నాయని చెప్పి వేల నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న ముఠాలు టెలిగ్రామ్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నాయని ఆరోపించింది.అలాగే టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ కూడా అధికారుల ఆందోళనకు కారణమైంది. పరీక్షకు ముందు సాధారణ పోస్టులు పెట్టి, పరీక్ష తర్వాత వాటిని ఎడిట్ చేసి అసలు ప్రశ్నాపత్రాలను జతచేసి "ముందే లీక్ చేశాం" అంటూ స్క్రీన్షాట్లు వైరల్ చేస్తున్నారని ఎన్టీఏ పేర్కొంది. అందుకే జూన్ 30 వరకు ఆ ఫీచర్‌పై కూడా పరిమితులు విధించినట్లు సమాచారం.వేరే యాప్‌లకు మారతాయా?సాంకేతికంగా చూస్తే అవును అనే నిపుణులు అంటున్నారు. ఒకసారి ప్రశ్నాపత్రం లేదా సున్నిత సమాచారం బయటకు వస్తే అది టెలిగ్రామ్, వాట్సాప్, సిగ్నల్, డిస్కార్డ్, ఇ-మెయిల్, క్లౌడ్ డ్రైవ్‌లు లేదంటే ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా క్షణాల్లో వ్యాపించవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దురోవ్(pavel durov) కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు.అయితే టెలిగ్రామ్‌లో లక్షల మంది సభ్యులతో పబ్లిక్ గ్రూపులు, భారీ ఫైల్ షేరింగ్, సెర్చ్ ద్వారా ఎవరైనా సులభంగా ఛానెళ్లను కనుగొనే సౌకర్యం ఉండటంతో మోసగాళ్లకు అది మరింత అనుకూలంగా మారిందని అధికారులు చెబుతున్నారు.టెలిగ్రామ్‌ను ఆపడం సాధ్యమేనా?సైబర్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. టెలిగ్రామ్‌ను పూర్తిగా అడ్డుకోవడం అంత సులభం కాదు. వీపీఎన్‌లు, ప్రాక్సీ సర్వర్లు, ప్రత్యేక ఎన్క్రిప్షన్ టెక్నాలజీల కారణంగా వినియోగదారులు పలు మార్గాల్లో యాప్‌ను ఉపయోగించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ చర్య ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సిందేనని నిపుణులు అంటున్నారు.ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన తర్వాత అది ఏ యాప్‌లో షేర్ అయ్యిందన్నది తర్వాతి విషయం. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. ప్రశ్నాపత్రం పరీక్షా వ్యవస్థ నుంచి బయటకు ఎలా వచ్చింది? అనేది. ప్రింటింగ్, రవాణా, భద్రతా వ్యవస్థలు, అంతర్గత ఉద్యోగుల పాత్ర, పరీక్ష నిర్వహణలో లోపాలు వంటి అంశాలపై దృష్టి పెట్టకుండా కేవలం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై చర్యలు తీసుకోవడం పూర్తి పరిష్కారం కాదని వారు చెబుతున్నారు.జూన్ 22 తర్వాత..ప్రభుత్వం ఈ చర్యను శాశ్వత నిషేధంగా కాకుండా తాత్కాలిక అత్యవసర చర్యగా పేర్కొంది. జూన్ 21న రీ-ఎగ్జామ్ పూర్తయ్యాక, జూన్ 22 నుంచి టెలిగ్రామ్ సేవలను పునరుద్ధరించే అవకాశముందని సమాచారం. అయితే మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌పై ఉన్న పరిమితులు మరికొన్ని రోజులు కొనసాగవచ్చని చెబుతున్నారు. అయితే.. అయితే.. ఇదే అంశంపై డిజిటల్ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు పరీక్షల సమయంలో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ నిలిపివేతలు కనిపించేవి. కానీ దేశవ్యాప్తంగా ఒక నిర్దిష్ట ప్లాట్‌ఫామ్‌పై నిషేధం విధించడం కొత్త పరిణామమని చెబుతున్నారు. భవిష్యత్‌లో ఇతర సందర్భాల్లోనూ ఇలాంటి చర్యలకు ఇది నిదర్శనంగా మారుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.మరోవైపు, టెలిగ్రామ్‌పై వేటు వేయడం వల్ల కొంతకాలం మోసపూరిత ప్రచారానికి బ్రేక్ పడొచ్చు. కానీ దాంతో పేపర్ లీక్‌ల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికిందని చెప్పలేమని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే అసలు ప్రశ్న టెలిగ్రామ్‌లో ఏమి షేర్ అయ్యిందన్నది కాదు... ప్రశ్నాపత్రం మొదట పరీక్షా వ్యవస్థ నుంచి బయటకు ఎలా వచ్చింది? అన్నదే. ఆ లీకేజీ మూలాలను గుర్తించి మూసేయకపోతే, వేదికలు మారినా సమస్య మాత్రం అలాగే కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నీట్ వివాదంలోనూ ఇదే కేంద్ర ప్రశ్నగా మారింది. -
కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్.. ఏటా ఇదే పరిస్థితి.. ఎందుకిలా..?
ఉత్తరాఖండ్ : చార్ధామ్ యాత్రికులకు వాతావరణం పరీక్ష పెడుతోంది. ఏటా కేవలం ఎండాకాలంలో మాత్రమే అందుబాటులో ఉండే గంగోత్రీ, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ యాత్ర.. అత్యంత క్లిష్టమైన ఆధ్యాత్మిక యాత్ర. ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ జిల్లాలో 3584 మీటర్ల ఎత్తులో ఉన్న కేదార్నాథ్ ఆలయానికి చేరుకోవడం మామూలు విషయం కాదు. గత మూడు రోజుల నుంచి రుద్రప్రయాగ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొండలు, కోనలు, ఆ పక్కనే లోయలు, నదులు.. ఇలాంటి భౌగోళిక పరిస్థితుల్లో ఆకస్మిక వర్షాలు రావడం, ఆ వెంటనే వరదలు పోటెత్తడం ఇక్కడ సాధారణం. తాజా వర్షాలు, వరదల కారణంగా కేదార్నాథ్ యాత్రకు తాత్కాలిక బ్రేక్ ప్రకటించింది ఉత్తరాఖండ్ ప్రభుత్వం. హరిద్వార్, రుషికేష్ల నుంచి యాత్రికులు ముందుకు రావొద్దని కోరారు ముఖ్యమంత్రి పుష్కర్ ధామి. Char Dham Yatra halted due to bad weather, CM Dhami instructs officials to be vigilant Read @ANI Story | https://t.co/NkileHv4Xw#chardham #chardhamyatra #Kedarnath #Badrinath #PushkarSinghDhami pic.twitter.com/nM38Si9jDm — ANI Digital (@ani_digital) June 26, 2023 20 గంటలపైనే.. హిందువుల ముఖ్య పుణ్యక్షేత్రాలలో కేదార్నాథ్ శివాలయం ఒకటి. హిమాలయాల్లో నిర్మించిన ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. దీన్నిఆదిశంకరాచార్యులు నిర్మించారు. హరిద్వార్ లేదా రిషికేశ్ నుంచి పూర్తి కొండచరియల మార్గంలో కనీసం 20 గంటల పాటు ప్రయాణం చేస్తేనే బేస్ పాయింట్ గౌరీకుండ్ చేరుకుంటాం. అయితే ఏకబిగిన 20 గంటలు ప్రయాణం అనేది ఏ మాత్రం సాధ్యం కాని పని. ఇదీ చదవండి: కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. రాత్రంతా రోడ్డుమీదే.. పర్యటకుల అవస్థలు.. ప్రతికూల వాతావరణం.. కేదార్నాథ్ మంచుకొండల మధ్య ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ కనిష్టంగా ఉంటాయి. హఠాత్తుగా కూలిపడే కొండచరియలు, దెబ్బతినే రోడ్ల నడుమ అసలు ముందుకు సాగుతుందా లేదా అన్నట్టుగా ప్రయాణం ఉంటుంది. పైగా ఆ కొండలపై ట్రాఫిక్ తరచుగా నిలిచిపోతుంది. కేదార్‌నాథ్‌కు వాహనాలు వెళ్లవు. దాని బేస్ పాయింట్ గౌరీకుండ్ వరకే వాహనాలుంటాయి. అక్కడి నుంచి నడక మార్గం లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవచ్చు. హెలీకాప్టర్ ఉన్నా వాతావరణం అనుకూలిస్తేనే ప్రయాణం సాగుతుంది. కేదార్‌నాథ్‌ను జీవితంలో ఒక్కసారైనా చూడాలని చాలా మంది తహతహలాడుతారు. ఈ సారి బోలెడు మంది ఇప్పటికే హరిద్వార్, రిషికేశ్ చేరుకున్నారు. తాజా వరదలతో నిరాశపడిపోయారు. दयानिधान बाबा केदारनाथ की संध्या आरती दर्शन🙏खराब मौसम और बारिश की वजह से रोकी गई केदारनाथ यात्रा।यात्रियो को सुरक्षित स्थानों पर रुकने की सलाहजय केदार🕉#Kedarnath 🚩 pic.twitter.com/ljJpeEhLaM— श्री केदारनाथ (@ShriKedarnath) June 25, 2023 ఇదీ చదవండి: Himachal Pradesh Floods: హిమాచల్‌లో భారీ వరదలు.. మహిళకు తప్పిన ప్రమాదం -
మా దేశం విడిచి మీ దేశానికి వెళ్లొద్దు
-
మా దేశం విడిచి మీ దేశానికి వెళ్లొద్దు
-
మా దేశం విడిచి మీ దేశానికి వెళ్లొద్దు
మలేసియన్లపై ఉత్తరకొరియా తాత్కాలిక నిషేధం ప్యాంగ్యాంగ్: అమెరికా సహా ఏ దేశాన్నైయినా ధిక్కరించే ఉత్తరకొరియా.. మలేసియాతో తగువు పెట్టుకుంటోంది. ఇరు దేశాల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. తమ దేశం నుంచి మలేసియన్లు వెళ్లకుండా ఉత్తరకొరియా తాత్కాలిక నిషేధం విధించింది. మలేసియాలోని తమ దేశ పౌరులు, దౌత్యవేత్తల రక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం ప్రకటించింది. ప్యాంగ్యాంగ్లోని మలేసియా దౌత్య కార్యాలయానికి ఉత్తరకొరియా విదేశీ వ్యవహారాల శాఖ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ విషయం సానుకూలంగా పరిష్కారమవుతుందని, మలేసియాతో దౌత్యసంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నామని పేర్కొంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరుడు (సవతి తల్లి కొడుకు) కిమ్ జోంగ్ నామ్ మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో దారుణహత్యకు గురైన సంగతి తెలిసిందే. ఉన్ ఈ హత్య చేయించినట్టు ఆరోపణలు వచ్చాయి. నామ్ మృతదేహాన్ని అప్పగించే విషయంలో ఇరు దేశాల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. మలేసియా ఉద్దేశ్యపూర్తకంగానే కాలయాపన చేస్తోందని ఆరోపిస్తూ, నామ్ మృతదేహానికి శవపరీక్షలు చేయడంపై ఉత్తరకొరియా అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య వివాదం ఏర్పడిన నేపథ్యంలో మలేసియన్లు దేశం విడిచి వెళ్లకుండా ఉత్తరకొరియా నిషేధం విధించింది.


