breaking news
Tangutur bus turns
-
ట్రావెల్స్ బస్సు బోల్తా: ఒకరు మృతి
-
ట్రావెల్స్ బస్సు బోల్తా: 10 మందికి గాయాలు
ప్రకాశం: ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. గత రెండు రోజుల క్రితం నాయకన్‌గూడెంలో నాగార్జున సాగర్ కాలువలో ప్రైవేటు బస్సు బోల్తా పడి 10 మంది దుర్మరణం చెందిన ఘటన మరకముందే ప్రకాశం జిల్లాలో గురువారం మరో ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ప్రకాశం జిల్లాలోని టంగుటూరులో లారీ ఓవర్టేక్ చేయబోయిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బ్రిడ్జిపై బోల్తా పడింది. ఈ ఘటనలో 10మందికి స్వల్ప గాయాలయినట్టు తెలిసింది. బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ రోజు ఉదయం ప్రమాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.