breaking news
Switzerlands government
-
అతిచిన్న బంగారు నాణెం
బెర్లిన్: స్విట్జర్లాండ్ ప్రభుత్వం ప్రపంచంలోనే అతి చిన్న బంగారు నాణేన్ని ముద్రించింది. దీనిపై చిత్రించిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ వెక్కిరిస్తున్నట్లుగా ఉన్న బొమ్మ చూడాలంటే మాత్రం కళ్లద్దాలు ధరించాల్సిందే. వెడల్పు 2.96 మిల్లీమీటర్లు ఉండే ఈ నాణెం బరువు 0.0163 గ్రాములు. ప్రపంచంలోనే ఇది అతి చిన్న నాణెం అని స్విస్‌మింట్ వెల్లడించింది. ఇటువంటి 999 నాణేలను మాత్రమే ముద్రించామనీ, ఒక్కో నాణెం వెల సుమారు రూ.18 కాగా రూ.14,657కు విక్రయిస్తామని తెలిపింది. నాణెంతోపాటు దానిపైని శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ చిత్రం చూసేందుకు కొనుగోలుదారులకు కళ్లద్దాలు కూడా అందజేస్తామని వివరించింది. -
ఆర్థికాంశాల గోప్యత ప్రతిపాదనకు స్విట్జర్లాండ్ నో...
జెనీవా/న్యూఢిల్లీ: ఆర్థికాంశాల్లో ప్రైవసీకి భద్రత కల్పించాలన్న ప్రతిపాదనను స్విట్జర్లాండ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇలాంటి విషయాల్లో గోప్యతకు తావు లేదని స్పష్టం చేసింది. నల్లధనం సమస్యపై పోరాడుతున్న భారత్ సహా ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. -
స్విట్జర్లాండ్‌పై భారత్ మరింత ఒత్తిడి
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆధారాలు లభించిన కొందరు భారతీయుల ఖాతాలకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం నిరాకరించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇరుదేశాల మధ్య ఆర్థిక సహకారం ఉండాలంటే పన్ను సంబంధ సమాచార మార్పిడి అత్యంత ముఖ్యమని హెచ్చరించింది. ద్వంద్వ పన్నుల నివారణ సదస్సులో అంగీకరించిన ప్రకారం స్విట్జర్లాండ్ ప్రభుత్వం తమ హక్కులు, బాధ్యతలను గుర్తించాలని స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఈ మేరకు స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రికి ఘాటైన లేఖ రాశారు. ఆయన ఇలా లేఖ రాయడం నాలుగునెలల్లో ఇది మూడోసారి. సమాచారాన్ని సమర్థంగా మార్పిడి చేసుకోవడానికి తగిన చట్ట, ప్రభుత్వ వ్యవస్థలు స్విట్జర్లాండ్‌కు లేకపోవడాన్ని గ్లోబల్ ఫోరమ్‌లో ప్రశ్నిస్తామని చిదంబరం పునరుద్ఘాటించారు. భారత్ విజ్ఞప్తికి తగినట్లుగా తాము సమాచారాన్ని పంచుకోలేమని స్విట్జర్లాండ్ పేర్కొనడం అంతర్జాతీయ ప్రమాణాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. సమాచార మార్పిడికి తాము వ్యతిరేకమంటూ స్విట్జర్లాండ్ ప్రభుత్వం గత నెల 7న చిదంబరానికి లేఖ రాసింది. దీంతో భారత ప్రభుత్వం స్విట్జర్లాండ్‌పై ఒత్తిడి మరింత పెంచుతోంది. స్విట్జర్లాండ్‌లోని హెచ్ఎస్బీసీ బ్యాంకు శాఖల్లో అకౌంట్లున్న కొందరు భారతీయుల జాబితాను ఫ్రాన్స్ ప్రభుత్వం ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం గతంలో భారత్‌కు అందించింది. వీరి ఖాతాల సమాచారాన్ని ఇండియా కోరగా, స్విస్ నిరాకరించింది. ఇండియన్ బ్యాంక్ ఎఫ్సీఎన్ఆర్ వడ్డీరేట్ల తగ్గింపు చెన్నై: ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (బ్యాంకింగ్)కు సంబంధించి టర్మ్ డిపాజిట్ వడ్డీరేట్లను స్వల్పంగా తగ్గించింది. తక్షణం ఇవి అమల్లోకి వస్తాయని తెలిపింది. అమెరికా డాలర్ డిపాజిట్లకు సంబంధించి యేడాది ఆపైన రెండేళ్ల వరకూ రేటు ప్రస్తుత 2.56 శాతం నుంచి 2.55 శాతానికి, 2-3 యేళ్లకాల వ్యవధి డిపాజిట్ రేటు 2.59 శాతం నుంచి 2.56 శాతానికి, 3-4 యేళ్ల వ్యవధి డిపాజిట్లపై రేటు 4.05 శాతం నుంచి 4.02 శాతానికి, 4-5 సంవత్సరాల మధ్య డిపాజిట్ రేటు 4.48 శాతం నుంచి 4.45 శాతానికి, ఐదేళ్లు పైబడిన డిపాజిట్లపై రేటు 4.85 శాతం నుంచి 4.81 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.