breaking news
Suman Setty
-
సీక్రెట్ టాస్క్‌లో ఇరగదీసిన దివ్య.. కల్యాణ్‌కు అన్యాయం
బిగ్‌బాస్‌లో నామినేషన్స్‌లో మొదలైన గొడవలు పూర్తి అయ్యాక కొత్త కెప్టెన్ కోసం కంటెండర్‌షిప్ పోటీ మొదలైంది. అయితే, ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కోసం మూడు టీమ్‌లను బిగ్‌బాస్ ఏర్పాటు చేశాడు . రీతూ, భరణి, నిఖిల్, డీమాన్ (బ్లూ),దివ్య, కళ్యాణ్, సాయి, సుమన్ శెట్టి (పింక్),తనూజ, ఇమ్మూ, గౌరవ్, రాము (ఆరెంజ్) అంటూ సభ్యుల ఎంపిక ఛాన్స్ వారికే ఇచ్చాడు. కానీ, హౌస్‌లో ఇద్దరిని ‘రెబల్స్’గా మార్చిన బిగ్‌బాస్.. వారికి సీక్రెట్ టాస్క్‌లను అప్పగించాడు. వారిలో సుమన్ శెట్టి, దివ్య ఉన్నారు. మంగళవారం జరిగిన ఎపిసోడ్లో దివ్య దుమ్మురేపింది. సీక్రెట్ టాస్క్‌ను సుమన్ శెట్టితో కలిసి గేమ్‌లో సత్తా చాటింది. కానీ, అదే సమయంలో పెద్ద పొరపాటే చేసింది.రెబల్స్‌గా సుమన్, దివ్యమంగళవారం ఎపిసోడ్ మొత్తం దివ్య, సుమన్ శెట్టిలదే అని చెప్పాలి. తాజాగా జరిగిన కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసులో రెబల్‌గా మారి సుమన్ శెట్టి సీక్రెట్ టాస్క్‌లతో మెప్పించాడు. ఆపై కామనర్‌గా ఎంట్రీ ఇచ్చిన దివ్య తన పాత్రలో అద్భుతంగా నటించేసింది. అలా ఇద్దరూ సీక్రెట్ టాస్క్‌లో మెప్పించారు. గార్డెన్ ఏరియాలో ఒక టెలిఫోన్ ఉంచిన బిగ్‌బాస్.. సమయానుకూలంగా అందరికీ కాల్ చేస్తాడు. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ల కోసం జరిగే పోటీలో హస్‌మేట్స్ గెలవడానికి టీమ్స్ మద్దతు అవసరమని చెబుతూ.. హౌస్మేట్స్ అందరి మధ్యలోనే రెబల్స్ ఉన్నారని చెబుతాడు. వారు మిమ్మల్ని ఈ పోటీ నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి ఆట జాగ్రత్తగా ఆడాలని సూచిస్తాడు. ఈ క్రమంలోనే రెబల్స్ సుమన్ శెట్టి, దివ్యలకు సీక్రెట్ టాస్క్‌లు ఇస్తాడు. అవి పూర్తి చేస్తే హౌస్మేట్స్లలో ఒక్కరిని ఆట నుంచి తప్పించే ఛాన్స్ వారికి ఉంటుంది.కల్యాణ్‌కు దివ్య అన్యాయంసీక్రెట్ టాస్కు ప్రకారం సుమన్, దివ్య ఏం చేయాలంటే.. హౌస్‌లో ఎవరైనా ముగ్గురినీ వాళ్లు కూర్చున్న ప్లేస్ నుంచి లేచేలా చేసి ఆ ప్లేస్‌లో వీరు కూర్చోవాలి. అయితే, ఆ ముగ్గురిలోనే ఒక్కరిని ఆట నుంచి తప్పించాలి. ఈ టాస్క్‌లో భరణి, కళ్యాణ్, గౌరవ్, రీతూలతో దివ్య పూర్తి చేసింది. అయితే , ఇక్కడ భరణిని సేవ్ చేయాలనే ఉద్దేశంతో తన టీమ్‌లో ఉన్న కల్యాణ్‌ను కెప్టెన్ కంటెండర్‌షిప్ నుంచి తప్పిస్తుంది. ఇదొక్కటే ఆమె చేసిన అతిపెద్ద తప్పు. దీంతో తర్వాత జరిగిన ఒక గేమ్‌లో దివ్య టీమ్ ఘోరంగా ఓడిపోతుంది. అదే కల్యాణ్ ఉండివుంటే తప్పకుండా సత్తా చాటేవాడని చెప్పవచ్చు. భరణి కెప్టెన్ రేసులో ఉండాలని కల్యాణ్‌ను తప్పించి ఆమె చేసిన పొరపాటుతో తన టీమ్ కూడా ఓడిపోయింది.రెండో టాస్క్‌లో భాగంగా ఫ్రిడ్జ్‌లో ఉన్న పాలు దాచమని రెబల్స్‌కు బిగ్‌బాస్ ఆదేశించాడు. ఆపై అందులోని ఒక లీటర్ పాలు తాగాల్సి ఉంటుందని కూడా సూచిస్తాడు. అయితే, సుమన్, దివ్య చాలా స్మార్ట్‌గా ప్లాన్ చేసి టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక సందర్భంలో కల్యాణ్‌కు అనుమానం వచ్చినా చాలా తెలివిగా దివ్య డైవర్ట్ చేస్తుంది. టాస్క్ పరంగా దివ్య అదరగొట్టింది. కానీ, కల్యాణ్‌ను ఆట నుంచి తప్పించి కాస్త మైనస్ అయింది. నాగార్జున పనిష్మెంట్.. లెక్కచేయని పవన్, రీతూడీమాన్ పవన్, రీతూ ఇద్దరూ ఈ వారం మాట్లాడుకోవద్దనే పనిష్మెంట్ నాగార్జున ఇచ్చారు. అయితే, డీమాన్ భోజనం తింటున్న సమయంలో రీతూ వచ్చి అతని పక్కనే కూర్చుంది. దీంతో రీతూకు కూడా ఒక ముద్ద తినిపించాడు. నాగార్జున గారు ఇచ్చిన పనిష్మెంట్ మరిచిపోయారా అంటూ దివ్య ప్రశ్నిస్తుంది. రేపు ఒక వీడియో వేసి మళ్లీ నన్నే అంటారు. కెప్టెన్‌గా ఏం చేశావ్ అని అడుగుతారు అంటూ వారిద్దరిపై దివ్య ఫైర్ అవుతుంది. దీంతో రీతూ, పవన్ ఇద్దరూ కూడా దివ్యపై మండిపడుతారు. మీకు ఉన్న శిక్ష ప్రకారం మాట్లడుకోవద్దు అంటే ఇవన్నీ కూడా చేయొద్దనే వస్తుంది. కుకింగ్ సమయంలో మాత్రమే మీరు మాట్లాడుకోవచ్చు. ఇది సింపుల్ లాజిక్.. ఇందులో కూడా లూప్ హోల్స్ వెత్తుకుంటానంటే నేనేం చేయలేను.. అంటూ దివ్య ఫైర్ అయింది. ఇందులో పూర్తిగా రీతూదే తప్పు. ఆపై పవన్‌ది కూడా.. ఈవారం హౌస్ట్ నాగార్జున ఈ విషయంపై మాట్లాడే ఛాన్స్ ఉంది. -
ముక్కోణపు ప్రేమకథ
‘చంటిగాడు’ సుహాసిని, సుమన్‌శెట్టి ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ చిత్రం ‘ఉన్నే ఎనక్కు పుడిచ్చిరుక్కు’ ఈ చిత్రాన్ని ‘అమ్మాయి ప్రేమలో పడితే’ పేరుతో సనప జగన్నాథం తెలుగులోకి విడుదల చేస్తున్నారు. ఇటీవలే అనువాద కార్యక్రమాలు మొదలయ్యాయి, ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఓ వైద్య విద్యార్థిని, ఇద్దరు యువకుల చుట్టూ తిరిగే కథ ఇది, ముక్కోణపు ప్రేమకథా చిత్రం. ఆకర్షణే ప్రేమగా భావించే యువత ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటున్నారు? ప్రేమలో విఫలమైనవారు దురలవాట్లకు బానిసలుగా మారి జీవితాలను ఎలా నాశనం చేసుకుంటున్నారు? అనేది ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం. తమిళంలో ఘనవిజయం సాధించినట్లే తెలుగు ప్రేక్షకుల ఆదరణ కూడా పొందుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: అచ్యుత్, సంగీతం: శిర్పి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: అన్బు శరవణన్.


