breaking news
studio apartments
-
ఆదాయ మార్గం.. స్టూడియో అపార్ట్మెంట్
స్థిరాస్తి రంగానికి తుది వినియోగదారులతో పాటు పెట్టుబడిదారులు కూడా ముఖ్యమే. అంతిమ కొనుగోలుదారులతో పోలిస్తే ఆదాయ మార్గంగా ఇన్వెస్టర్లు రియల్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుండటంతో ధరలు వేగంగా పెరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇల్లు, ఆఫీసు, రిటైల్, వేర్‌హౌస్‌ల మాదిరిగానే పెట్టుబడిదారులకు స్టూడియో అపార్ట్మెంట్లు కూడా ఆదాయ మార్గంగా మారాయి. ప్రధానంగా మెట్రో నగరాల్లో స్టూడియో అపార్ట్మెంట్లు హాట్ ఫేవరెట్స్‌గా మారాయి. –సాక్షి, సిటీబ్యూరోఎవరు కొంటారంటే? సాధారణంగా బెడ్ కమ్ లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. వీటిని అధికంగా విద్యార్థులు, బ్యాచిలర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు కొనుగోలు చేస్తుంటారు. ఈ తరహా అపార్ట్మెంట్లకు విస్తీర్ణం పరంగా కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. ఉపాధి, వ్యాపార కేంద్రాల పరిసర ప్రాంతాలలో, పర్యాటక కేంద్రాలకు చేరువలో, ఖరీదైన ప్రదేశాలలో ఉండే స్టూడియో అపార్ట్మెంట్లకు గిరాకీ అధికంగా ఉంటుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.మన దగ్గర తక్కువే.. కరోనా తర్వాత విశాలమైన ఇళ్లకు ఆదరణ పెరగడంతో స్టూడి యో అపార్ట్మెంట్ల కస్టమర్లు పునరాలోచనలో ఉన్నారు. సాధారణంగా ఈ తరహా అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణె నగరాలలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ కొనసాగుతోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణెలదే.. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కేవలం 34 స్టూడియో అపార్ట్మెంట్ల ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. -
స్టూడియో అపార్ట్మెంట్లకు తగ్గుతున్న గిరాకీ
సాక్షి, సిటీబ్యూరో: కరోనా కంటే ముందు ఇల్లు అంటే నాలుగు గోడల భవనం. సంపాదన బిజీలో పడిన సగటు జీవికి కాసేపు సేద తీరాలనుకునే గూడు. కానీ, కోవిడ్ తర్వాత నుంచి ఇల్లే ప్రపంచమైపోయింది. తినడం, పడుకోవడం మాత్రమే కాదు.. ఆఫీసు, స్కూల్, వ్యాయామం, వినోదం అన్నీ.. ఇంటి నుంచే! ఫలితంగా కోవిడ్ కంటే ముందు హాట్ కేకుల్లాంటి స్టూడియో అపార్ట్మెంట్లకు.. క్రమంగా డిమాండ్ పడిపోయింది. వీటి స్థానంలో విస్తీర్ణమైన గృహాలకు గిరాకీ పెరిగింది.బెడ్ కం లివింగ్ రూమ్, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్ ఉండే వాటిని స్టూడియో అపార్ట్మెంట్ అంటారు. కరోనా మొదలైన ఏడాది(2020) నుంచి దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో ఈ తరహా అపార్ట్మెంట్ల సరఫరా క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. ఈ ఏడాది తొలి అర్ధ వార్షికం(జనవరి–జూన్)లో 1,063 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ కాగా.. ఇందులో కేవలం 9 శాతం(91 ప్రాజెక్ట్‌లు) మాత్రమే స్టూడియో అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌లు ఉన్నాయని అనరాక్ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. గతేడాది 1,207 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ కాగా.. ఇందులో 145 ప్రాజెక్ట్‌లు స్టూడియో పార్ట్మెంట్లున్నాయి. 2020లో 884 ప్రాజెక్ట్‌లు ప్రారంభం కాగా.. ఇందులో 15 శాతం వాటాతో 130 ప్రాజెక్ట్‌లు ఈ తరహా అపార్ట్మెంట్లున్నాయి. అలాగే 2019లో 1,921 ప్రాజెక్ట్‌లు లాంచింగ్ అయ్యాయి. 368 ప్రాజెక్ట్‌లు(19 శాతం) ఈ స్టూడియో ఇళ్లే..లొకేషన్ ముఖ్యం.. స్టూడియో అపార్ట్మెంట్లను బ్యాచిలర్స్, పర్యాటకులు, వ్యాపార ప్రయాణికులు, యువ దంపతులు ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. విస్తీర్ణంతో కాకుండా లొకేషన్ ఆధారంగా డిమాండ్ ఉంటుంది. తరచూ ఇవి ఉపాధి, వ్యాపార కేంద్రాలు చుట్టూ, ఖరీదైన ప్రదేశాలలో ఎక్కువగా ఉంటాయని అనరాక్ గ్రూప్ సంస్థ తెలిపింది. కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి మొదలైంది. దీంతో 2020 నుంచి పెద్ద సైజు ఇళ్లకు డిమాండ్ పెరిగినట్లు చెప్పింది. మన దగ్గర తక్కువే.. స్టూడియో అపార్ట్మెంట్లకు ఉత్తరాది నగరాలలో ఉన్నంత డిమాండ్ దక్షిణాదిలో ఉండదు. ముంబై, పుణే నగరాలో ఈ తరహా ఇళ్ల ట్రెండ్ నడుస్తోంది. 2013–20 మధ్య కాలంలో దేశంలోని 7 ప్రధాన నగరాలలో లాంచింగ్ అయిన స్టూడియో అపార్ట్మెంట్లలో 96 శాతం వాటా ముంబై, పుణేలదే.. ఇదే కాలంలో దక్షిణాది నగరాలైన బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లలో కేవలం 34 స్టూడియో ప్రాజెక్ట్‌లు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది హెచ్–1లో 7 నగరాలలో ప్రారంభమైన 91 స్టూడియో ప్రాజెక్ట్‌లలో.. 71 ప్రాజెక్ట్‌లు ముంబైలోనే ఉన్నాయి. ఆ తర్వాత పుణేలో 18, బెంగళూరులో రెండు ప్రాజెక్ట్‌లు లాంచింగ్ అయ్యాయి.


