breaking news
SOP
-
పాక్ నిఘా'హనీ-ట్రాప్' ముప్పు : పోలీసులకు కేంద్రం హెచ్చరిక
భారతీయ పోలీసులపై పాకిస్తాన్ హనీ ట్రాప్ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తోంది. పాక్ నిఘా వర్గాలు సోషల్ మీడియా వేదికగా భారత పోలీసులను లక్ష్యంగా చేసుకుని 'హనీ-ట్రాప్' (అందమైన యువతుల ఫోటోలతో బురిడీ కొట్టించడం)కు ప్రయత్నిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) పోలీసు సిబ్బందికి తాజాగా కొన్ని హెచ్చరికలను జారీ చేసింది.పాకిస్తాన్ నిఘా సంస్థల "హనీ-ట్రాపింగ్" ప్రయత్నాలు పెరుగుతున్నట్టు గమనించిన, MHA ఈ ముప్పును ఎదుర్కోవడానికి, సోషల్ మీడియా సురక్షిత వినియోగంపై మంత్రిత్వ శాఖ వివరణాత్మక ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని (SOP) విడుదల చేసింది.ఈ మార్గదర్శకాలను గత ఏడాది నవంబరు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ & డెవలప్మెంట్ జారీ చేసింది. పోలీసు అధికారులతో స్నేహం చేసి, సున్నితమైన సమాచారాన్ని రహస్యంగా సేకరించడానికి Facebook, X, Instagram, WhatsApp, Telegram, LinkedIn వంటి ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వాడుకుంటాయి.ముఖ్యమైన మార్గదర్శకాలు (SOP):సోషల్ మీడియా ప్రొఫైల్స్‌లో తాము పోలీసు అధికారులమని బహిర్గతం చేయకూడదు.అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. అనామకుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్టులను అంగీకరించ వద్దు. ముఖ్యంగా యువతుల ఫోటోలతో ఆకర్షించే ప్రొఫైల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.ఆన్లైన్ పోస్ట్‌లు కేవలం మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి మాత్రమే కనిపించేలా ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవాలి.ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో (WhatsApp, Telegram, etc.) అధికారిక పత్రాలను లేదా సున్నితమైన సమాచారాన్ని పంచుకోకూడదు.ఉద్యోగాలు, ఉచిత పర్యటనలు లేదా ప్రభుత్వ ఆఫర్ల పేరుతో వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ధృవీకరించని యాప్‌లను డౌన్లోడ్ చేయడం, తెలియని లింక్స్ క్లిక్ చేయడం, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో పత్రాలను పంచుకోవడం చేయకూడదు.ఇదీ చదవండి: అవును వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు : ఫ్యాన్స్‌కు వాలెంటైన్స్ డే సర్ప్రైజ్ఒకవేళ హనీ-ట్రాప్‌కు గురైతే ఏం చేయాలి?ఒకవేళ హనీ-ట్రాప్‌కు గురైతే ఏం చేయాలనేదానిపై కూడా సూచనలు అందించింది. ఒకవేళ ఎవరైనా అధికారి హనీ ట్రాప్ ఉచ్చులో పడినట్లు అనుమానం వస్తే, తక్షణమే సదరు అధికారికి చెందిన డిజిటల్ పరికరాలను (ఫోన్లు, ల్యాప్టాప్స్) వెంటనే స్వాధీనం చేసుకోవాలి.ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) ఆధ్వర్యంలో విచారణ చేపట్టాలి. స్టేట్ పోలీస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వింగ్ ఈ నిబంధనల అమలును పర్యవేక్షిస్తుంది. దృఢమైన పాస్వర్డ్లు, రెండు-కారకాల ప్రామాణీకరణ, పరిమిత యాప్ అనుమతులు, సాధారణ గోప్యతా తనిఖీల ప్రాముఖ్యతను నొక్కి చెప్పింది. సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లకు ఆయా పోలీసు అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. రహస్య సమాచారాన్ని లీక్ చేస్తే క్రమశిక్షణా చర్యలతో పాటు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: కస్టమర్ల రూ. 4 కోట్ల బంగారం కొట్టేసిన బ్యాంకు మేనేజర్ -
కల్తీ చేస్తే జైలు‘పాలు’.. ఏపీలో కీలక చట్టం.. త్వరలో అమలు
సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల సందర్భంగా కల్తీలు, మోసాలకు పాల్పడితే డెయిరీల నిర్వాహకులు, సంబంధిత వ్యాపారులు ఇకపై కటకటాల ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేనివిధంగా పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలులోకి తీసుకురాబోతోంది. ఇటీవలే అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ చట్టం అమలుకు సంబంధించి ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపకల్పన కోసం పశు సంవర్థక శాఖ కసరత్తు చేస్తోంది. గతంలోనూ చట్టాలున్నా.. గతంలో తూనికలు, కొలతలు శాఖ, మునిసిపాలిటీల ఆధ్వర్యంలోని ప్రజారోగ్య విభాగాలు మాత్రమే పాల విక్రయాల్లో జరిగే లోపాలపై అడపాదడపా దృష్టి సారించేవి. ఆ రెండు విభాగాలకూ ఇతర పనులు సైతం ఉండటంతో పాల విక్రయాలపై పెద్దగా దృష్టి సారించేవి కాదు. దీనివల్ల యథేచ్ఛగా అక్రమాలు సాగిపోయేవి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్థక శాఖ అధికారులను సైతం రంగంలోకి దించింది. పాల సేకరణ సందర్భంగా మిల్క్ అనలైజర్స్, వేయింగ్ మెషిన్స్ను డెయిరీల నిర్వాహకులు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతుండటంతో తూనికలు, కొలతల చట్టం ప్రకారం వాటిని తనిఖీ చేసే అధికారాలను 2021 నవంబర్ నుంచి ప్రభుత్వం పశు వైద్యులకు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన పశు వైద్య బృందాలు ఏడాదిన్నర కాలంలో 3,704 దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశాయి. 151 ఉల్లంఘనలపై జరిమానాలు విధించడం ద్వారా అక్రమాలకు కొంతమేర అడ్డుకట్ట వేయగలిగారు. అయితే, మోసాలకు కారణమైన అనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్ చేయడం, ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం పశు సంవర్థక శాఖకు లేకుండాపోయింది. అక్రమాలకు చెక్ పెట్టేలా కొత్త చట్టం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహా మోసాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియమ, నిబంధనలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలన్న సంకల్పంతో పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగం చట్టం–2023ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం మిల్క్ అనలైజర్స్తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల (ఏఎంసీయూ)పై పశు సంవర్థక శాఖ పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం మిల్క్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులను పశు సంవర్థక శాఖ నియమిస్తుంది. మిల్క్ అనలైజర్స్ నిర్వహించే వ్యక్తులు కచ్చితంగా పశు సంవర్థక శాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. నాణ్యత ప్రమాణాలు పాటించని మిల్క్ అనలైజర్స్‌ను జప్తు చేస్తారు. పాల నాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు. మోసాలకు పాల్పడితే జరిమానాలు, శిక్షలు ఇలా.. ♦ అనుమతి లేకుండా మిల్క్ అనలైజర్స్ కలిగిన వ్యక్తికి రూ.50 వేల వరకు జరిమానా, 6 నెలల జైలుశిక్ష విధిస్తారు. అనుమతి లేకుండా బీఎంసీయూలు, ఏఎంసీయూలు అనలైజర్స్ వాడితే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి ఏడాదిపాటు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ♦ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, డెయిరీలు మిల్క్ అనలైజర్లను అనధికారికంగా, అనుమతి లేకుండా పొంది ఉంటే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. తదుపరి నేరానికి రెండేళ్ల కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ♦ మిల్క్ అనలైజర్లను దుర్వినియోగపరిచే వారికి రూ.50 వేల వరకు జరిమానా, 6 నెలలకు తగ్గకుండా జైలుశిక్ష విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ♦ లైసెన్స్ లేకుండా పాలను సేకరిస్తే రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి రూ.లక్ష వరకు జరిమానా, 6 నెలల కారాగార శిక్ష లేదా రెండూ విధిస్తారు. ♦ లైసెన్సు లేకుండా మిల్క్ అనలైజర్ల సర్వీసింగ్ సెంటర్లు నిర్వహించే వారికి రూ.25 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.50 వేల వరకు జరిమానా లేదా ఏడాది కారాగార శిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది. ♦ పాడి రైతుకు నిర్దేశిత ధర చెల్లించకపోయినా.. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాలను తక్కువగా చూపించి మోసానికి పాల్పడినా రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి రూ.లక్ష జరిమానా లేదా 6 నెలల కారాగార శిక్ష లేదా రెండూ విధిస్తారు. రైతులు, వినియోగదారుల రక్షణ కోసమే.. పాల సేకరణలో దళారులు, వ్యాపారులు పాల్పడే మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పాలను సరఫరా చేయడమే లక్ష్యంగా దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పాడి రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. – సీదిరి అప్పలరాజు, పశు సంవర్థక శాఖ మంత్రి -
గవర్నర్ ఎట్ హోంకు సీఎం గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: దేశ గణతంత్ర దినోత్సవం నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) పాటించలేదని కేంద్ర ప్రభుత్వా నికి నివేదిక పంపించినట్టు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వెల్లడించారు. గణతంత్ర దినోత్స వం సందర్భంగా గురువారం సాయంత్రం ఆమె రాజ్‌భవన్ ప్రాంగణంలో ఎట్ హోం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ఎస్ఓపీ పాటించలేదన్న అంశంపై కేంద్రానికి నివేదిక పంపించారా? అని విలేకరులు ప్రశ్నించగా, పంపించినట్టు ఆమె ధ్రువీకరించారు. తేనేటి విందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలేవరూ హాజ రు కాలేదు. గతేడాది రాజ్‌భవన్ తేనేటి విందుకు హాజరైన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఈసారి పూర్తిగా దూరంగా ఉన్నారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, మాజీ గవర్నర్ సీ.హెచ్.విద్యాసాగర్ రావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఆ పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎన్.రామచంద్రరావు, వివేక్, కపిలవాయి దిలీప్‌కు మార్, బాబు మోహన్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, యెండల లక్ష్మీనారాయణతో పాటు వివిధ రంగాల ప్రముఖులు, తెలంగాణ సాయుధ పోరాట యోధు లు పాల్గొన్నారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అతిథులందరి వద్దకు వెళ్లి పేరు పేరునా పలకరించారు. కాగా, ఎట్ హోమ్ కార్యక్రమంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ట్విట్టర్లో వ్యంగాస్త్రాలు సంధించారు. ‘ఎట్ హోం కార్యక్రమం బీజేపీ కా ర్యాలయంలా అయింది. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలు తమిళిసైతోపాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నాయకులు హాజరయ్యారు’ అని ఎద్దేవా చేశారు. -
విద్యార్థుల శ్రేయస్సుకోసమే
న్యూఢిల్లీ: విద్యార్థులు భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతోనే ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)లో నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ)ను రద్దు చేశామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖమంత్రి స్మృతి ఇరానీ బుధవారం రాజ్యసభకు తెలియజేశారు. ‘1986 నాటి జాతీయ విద్యావిధానానికి లోబడి ఉండాలనే ఉద్దేశం కూడా ఈ రద్దు నిర్ణయంలో ఓ భాగం. ఉపాధి అవకాశాల విషయంలోగానీ లేదా మరేఇతర విషయాల్లోగానీ వారు ఇబ్బందులపాలవకూడదనేదే ప్రభుత్వ ఆలోచన’ అని అన్నా రు. కాగా డీయూ గణాంకాల ప్రకారం ప్రతి ఏడాది ఈ విశ్వవిద్యాలయం నుంచి దాదాపు 40 వేలమంది విద్యార్థులు డిగ్రీ పట్టా పుచ్చుకోనున్నారు. మరోవైపు స్కూల్ ఆఫ్ లెర్నింగ్ (ఎస్ఓపీ)లో అనేకమంది డిగ్రీ కోర్సు పూర్తిచేస్తున్నారు. కాగా నాలుగేళ్ల అండర్గ్రాడ్యుయేట్ కోర్సు (ఎఫ్‌వైయూపీ) రద్దు అంశం అటు యూజీసీ, ఇటు డీయూల మధ్య వివాదాస్పదంగా మారింది. అయితే ఎట్టకేలకు ఈ కోర్సు రద్దుకే అంతా మొగ్గుచూపిన సంగతి విదితమే. ఇందు కోసం ఏడాదికాలంగా అనేక విద్యార్థి సంఘాలు ఆందోళలను నిర్వహించాయి. వాఘా సరిహద్దుకు సైకిల్ యాత్ర స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)కు చెందిన 50 మంది విద్యార్థులు వాఘా సరిహద్దు వరకూ సైకిల్ యాత్ర నిర్వహించనున్నారు. వచ్చే నెల ఒకటో తేదీన ఈ యాత్ర ప్రారంభం కానుంది. దీనికి ఇండో పాక్ పీస్ ర్యాలీ అని నామకనణం చేశారు. ఈ ర్యాలీని ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఢిల్లీ విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ ఫర్ పీస్ (డీయూఎఫ్ఎస్పీ) సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ సింగ్ బుధవారం వెల్లడించారు. డీయూ ఉత్తర ప్రాంగణంలో ఒకటో తేదీ సాయంత్రం ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఈ యాత్ర మొత్తం 13 రోజులపాటు కొనసాగనుంది. ఈ యాత్రలో భాగంగా పంజాబ్, హర్యానాలలో శాంతి శిబిరాలను నిర్వహిస్తారు. వచ్చే నెల 13వ తేదీన ఈ ర్యాలీ అమృత్సర్ చేరుకుంటుంది. వాఘా సరిహద్దులో వచ్చే నెల 14,15వ తేదీల్లో జరిగే స్వాతం త్య్ర సంబరాల్లో ఈ యాత్ర బృందం పాలుపంచుకుంటుంది. కాగా గత ఏడాది కూడా డీయూఎఫ్ఎస్పీ ఇటువంటి ర్యాలీని తొలిసారి నిర్వహించింది. కన్యాకుమారి నుంచి మొదలై వాఘా సరిహద్దు చేరుకోవడంతో ఈ ర్యాలీ ముగిసిన సంగతి విదితమే. ఈ ర్యాలీ విజయవంతమైన నేపథ్యంలో ఈ ఏడాది కూడా మరో ర్యాలీకి శ్రీకారం చుట్టింది.


