breaking news
Severance Package
-
దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. ఉద్యోగులకు 39 వారాల వేతనం!
ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ఇటీవల సుమారు 4,800 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 2.1 శాతం. ప్రస్తుతం కంపెనీ ఏఐ రంగంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించడంతో పాటు, ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ చర్యలను చేపట్టింది.మైక్రోసాఫ్ట్ ఉద్యోగాల కోతలో 'ఎక్స్‌బాక్స్' గేమింగ్ విభాగం ఎక్కువ ప్రభావితమైంది. ఇందులో మొదటి విడతలోనే 1,600 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. అంతేకాకుండా.. ఎక్స్‌బాక్స్ తనకు చెందిన నాలుగు గేమింగ్ స్టూడియోలను విక్రయించాలని, మరో స్టూడియోతో కూడా విడిపోవాలని నిర్ణయించింది.ఇదిలా ఉండగా.. జాబ్ కోల్పోయిన ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సెవరెన్స్ ప్యాకేజీ ప్రకటించింది. ఉద్యోగి కంపెనీలో ఎంతకాలం పనిచేశాడు?, ఏ స్థాయిలో ఉన్నాడు? అనే విషయాల ఆధారంగా వారికి 60 రోజుల నుంచి 39 వారాల వరకు వేతనం చెల్లించనుంది. దీంతోపాటు.. కొంతకాలం వరకు ఆరోగ్య బీమా, కంపెనీ షేర్లకు సంబంధించిన ప్రయోజనాలను కూడా కొనసాగించనుంది. ఈ నిర్ణయం ఉద్యోగులు కొత్త అవకాశాలు వెతుక్కోవడానికి కొంత సహాయపడుతుంది.ఎక్స్‌బాక్స్ అధిపతి ఆశా శర్మ ఉద్యోగులకు పంపిన సందేశంలో ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితి ఆశించినంత బాగా లేదని తెలిపారు. ఇతర గేమింగ్ సంస్థలతో పోలిస్తే తమ లాభాలు చాలా తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. అయితే.. ఉద్యోగులను తొలగించడం అనేది వారి పనితీరును బట్టి తీసుకున్న నిర్ణయం కాదని, సంస్థ భవిష్యత్తు.. అభివృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినదని ఆమె స్పష్టం చేశారు.ఇదీ చదవండి: మస్క్ ప్రసంశలు.. AI రంగంలో వారే టాప్!మైక్రోసాఫ్ట్ తీసుకున్న లేఆఫ్స్ నిర్ణయం ప్రపంచ ఐటీ రంగంలో జరుగుతున్న మార్పులకు ఒక స్పష్టమైన ఉదాహరణ. ఏఐ వంటి కొత్త సాంకేతిక రంగాల్లో ముందంజలో ఉండేందుకు కంపెనీలు తమ వ్యాపార విధానాలను మార్చుకుంటున్నాయి. ఉద్యోగుల తొలగింపులు బాధాకరమైనవే అయినప్పటికీ, సంస్థ భవిష్యత్తు అభివృద్ధి, పోటీ సామర్థ్యాన్ని పెంచుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
తొలగించిన ఆ 8 వేల మందికి మెటా ఇచ్చేది ఇదే..
టెక్ దిగ్గజం 'మెటా' (Meta) పెద్ద ఎత్తున పునర్నిర్మాణ ప్రక్రియను చేపడుతూ, దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. ఇది కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో 10 శాతానికి సమానం. ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి మెటాలో సుమారు 78,000 మంది ఉద్యోగులు ఉన్నారు. టెక్ పరిశ్రమలో ఈ లేఆఫ్‌లు తీవ్ర సంచలనం సృష్టించినప్పటికీ, తొలగించిన ఉద్యోగుల కోసం మెటా ప్రకటించిన తొలగింపు ప్యాకేజీ (Severance Package) అందరి దృష్టిని ఆకర్షించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం అమెరికా ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..బేస్ పే: 16 వారాల ప్రాథమిక వేతనంతో పాటు, సంస్థలో పనిచేసిన ప్రతి సంవత్సరానికి అదనంగా రెండు వారాల వేతనాన్ని సీవెరన్స్ ప్యాకేజీగా అందిస్తారు.ఆరోగ్య సంరక్షణ: ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఉచిత ఆరోగ్య సంరక్షణ కవరేజీని కొనసాగిస్తారు.అంతర్జాతీయ ఉద్యోగులు: యూఎస్ వెలుపల ఉన్న ఉద్యోగులకు వారి దేశాల నిబంధనలను బట్టి ఇలాంటి ప్రయోజనాలే అందుతాయి.ఏఐ బృందాల్లోకి పునర్వ్యవస్థీకరణఉద్యోగాల కోతతో పాటు కంపెనీ అంతర్గతంగా మరో పెద్ద మార్పు చేపట్టింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ-కేంద్రీకృత బృందాల్లోకి 7,000 మందికి పైగా ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ ప్రకటించారు. ఈ తొలగింపులు, అంతర్గత బదిలీల వల్ల మెటాలోని మొత్తం శ్రామిక శక్తిలో 20% మంది ప్రభావితం కానున్నారు."మేము ఇప్పుడు వేగంగా, ఎక్కువ యాజమాన్య బాధ్యతలతో దూసుకుపోగల చిన్న బృందాలతో కూడిన నిర్మాణంతో పనిచేసే దశకు చేరుకున్నాము" అని రాయిటర్స్ పరిశీలించిన ఒక మెమోలో జానెల్ గేల్ పేర్కొన్నారు.వ్యూహాత్మక మార్పులు - భారీ ఖర్చులుఅంతర్గత పని విధానం, ఉత్పత్తులు రెండింటిలోనూ 'ఏఐ ఏజెంట్లను' కేంద్ర బిందువుగా మార్చే ప్రయత్నంలో భాగంగానే మెటా ఈ వ్యూహాత్మక మార్పులు చేస్తోంది. ఇందుకోసం ఏఐ(AI)లో పెట్టుబడులను భారీగా పెంచుతోంది. కొత్త ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం, అధిక మెమరీ ధరల కారణంగా ఈ ఏడాది మెటా మూలధన వ్యయాలు ఏకంగా 145 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని కంపెనీ తెలిపింది.మరోవైపు, 2026 ద్వితీయార్థంలో మెటా మరిన్ని ఉద్యోగ కోతలను ప్రకటించే అవకాశం ఉందని అంచనా. అయితే దీని సమయం, పరిధిపై ఇంకా స్పష్టత లేదు. కాగా, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ గత కొన్ని ఏళ్లుగా మేనేజ్మెంట్ స్థాయిలను తగ్గించే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే 2022, 2023 లలో ఇప్పటికే 20,000 ఉద్యోగాలను తగ్గించారు.


