breaking news
Security Service of Ukraine
-
విధి ఆడిన వింత నాటకం!
విధి చాలా విచిత్రమైంది. మనుషుల జీవితాలతో అది చిత్రమైన విన్యాసాలాడుతుంది. ఊహించని పరిణామాలతో మనిషిని ఉక్కిరిబక్కిరి చేస్తుంది. సాఫీగా సాగిపోతున్న జీవితాలను ఎప్పుడు ఏ మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. విధిలీలా విన్యాసంలో స్టివార్డు సంజిద్ సింగ్ సంధు ఆయన భార్యకు శాశ్వతంగా దూరమయ్యాడు. ఉక్రెయిన్ లో మలేసియా విమానం కుప్పకూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారిలో భారత సంతతికి సంధు ఉన్నాడు. సెలవు రోజున ఇంటిలో ఉండ్సాలిన అతడిని విధి వెంటాడించింది. గురువారం వారంతపు సెలవుకావడంతో ఇంట్లో ఉన్న సందు... తోటి ఉద్యోగి అభ్యర్థన మేరకు ఎంహెచ్-17 విమానంలో విధులకు వెళ్లి విగతజీవిగా మారిపోయాడు. విధి విచిత్రం ఏంటంటే షిఫ్టు మార్చుకోవడం వల్లే అతడి భార్య నాలుగు నెలల క్రితం మృత్యువు నుంచి తప్పించుకుంది. సంధు భార్య కూడా మలేషియా ఎయిర్‌లైన్స్‌లో స్టివార్డెస్గా పనిచేస్తోంది. ఈ ఏడాది మార్చి 8న అదృశ్యమైన ఎంహెచ్-370 విమానంలో సంధు విధి నిర్వహణకు వెళ్లాల్సివుండగా చివరి నిమిషంలో ఆమె షిప్ట్ మార్చుకుంది. తన బదులు వేరే ఉద్యోగిని సర్దుబాటు చేసి సెలవు తీసుకుంది. ఈ విమానం ఏమైందో ఇప్పటివరకు తెలియలేదు. ఇక రెండు విమాన ప్రమాదాల్లోనూ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌కు చెందిన ఓ కుటుంబం నలుగురు సభ్యులను కోల్పోయింది. మొన్న కొడుకు, కోడలు.. నిన్న మనవరాలు, ఆమె భర్త మృత్యువాత పడ్డారు. విధి ఆడిన వింత నాటకం అంటే ఇదేనేమో! -
విమానం కూల్చివేత వాళ్ల పనేనా?!
-
ఎవరిదీ పాపం.. ఎవరికీ శాపం?
-
ఎంహెచ్ 17 ప్రమాదం జరిగిందిలా..
-
విమానాన్ని కూల్చివేసింది వారే: ఎస్‌బీయూ
కీవ్: మలేసియా ఎయిర్ లైన్స్ విమానాన్ని కూల్చివేసింది తామేనని రష్యా అనుకూల తిరుగుబాటుదారులు ఒప్పుకున్నారని ఎక్రెయిన్ భద్రతా విభాగం(ఎస్‌బీయూ) తెలిపింది. రష్యా సైనిక నిఘా విభాగం అధికారులకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణల ద్వారా తమకీ విషయం తెలిసిందని ఎస్‌బీయూ వెల్లడించింది. విమానం కూలిపోయిన 20 నిమిషాల తర్వాత రష్యా సైనిక నిఘా అధికారి ఇగోర్ బెజ్లర్.. రష్యా భద్రతాధికారి వాసిలి జెరానిన్ కు ఫోన్ చేశారని పేర్కొంది. 'దొనెస్క్ ప్రాంతంలో విమానాన్ని ఇప్పుడే కూల్చివేశాం' అని జెరానిన్ కు బ్లెజర్ ఫోన్ తెలిపాడని వెల్లడించింది. స్వయం ప్రకటిత దొనెస్క్ పీపుల్స్ రిపబ్లిక్ సంస్థకు బ్లెజర్ కమాండర్ గా ఉన్నాడు. మేజర్, గ్రీక్ పేరుతో ఇద్దరు తీవ్రవాదులు జరిపిన సంభాషణను కూడా ఎస్‌బీయూ విడుదల చేసింది.