breaking news
sameekshanam
-
సమీక్షణం :కథావిమర్శ- కొత్త ఒరవడి
కథావిమర్శ- కొత్త ఒరవడి పుస్తకం : సమకాలీనం (కథావిమర్శ) రచన : ఎ.కె.ప్రభాకర్ విషయం : కథ, కథ నేపథ్యం, కథ ప్రయోజనం గురించి విశ్లేషించే ముప్ఫై విమర్శనా వ్యాసాలివి. కథ బాగుందని, లేదని ‘సర్టిఫై’ చెయ్యడానికి కాకుండా, కథకి ప్రాణం పోసిన సామాజిక మూలాల్ని విశ్లేషించడానికి లోతైన పరిశీలన చేశాడు రచయిత. అవసరమైన చోట లోపాల్ని నిర్మొహమాటంగా ఎత్తిచూపాడు. వివిధ కథకుల కథలు, కథాసంపుటుల కథల పరామర్శతో కథా సర్వస్వమనదగిన ఈ సంకలనంలో రచయిత కథాసంపుటులకు రాసిన ముందుమాటలతో పాటు భారతీయ కథల, అనువాద కథల ప్రసక్తి కూడా ఉన్నది. తెలుగు కథ ఒక అనివార్యమైన సామాజిక ఆచరణలో భాగంగా పుట్టిందని భావించే వ్యాసకర్త కథారచయితలు జీవన పోరాటాన్ని చిత్రించడానికి అస్తిత్వ చైతన్యం, అణచివేత, గ్లోబలైజేషన్, హక్కుల కోసం ఉద్యమాలు, వివిధ వాదాల ఆవిర్భావం వంటివి ఏ విధంగా కథలుగా రూపుదిద్దుకున్నాయో వివరిస్తాడు. వర్తమాన తెలుగు కథల స్వరూప స్వభావాల్ని ఇష్టంగా పరిశీలించి కథావిమర్శ స్థాయిని పెంచాడు ప్రభాకర్. - చింతపట్ల సుదర్శన్ పేజీలు: 200; వెల: 150 ప్రతులకు: స్పృహ సాహితీ సంస్థ, 1-8-702/33/20ఎ, పద్మ కాలనీ, నల్లకుంట, హైదరాబాద్-44. ఫోన్: 040-27761510 హరితకలల అలలు... పుస్తకం : పట్టుకుచ్చుల పువ్వు (కవిత్వం) రచన : దాసరాజు రామారావు విషయం : పుస్తకం ముఖచిత్రం చూడగానే పల్లెదనం పరిమళమై ఆహ్వానిస్తుంది. లోనికి వెళితే... తెలంగాణ ఆత్మగౌరవ కవిత్వం ఉంది. కళ తప్పిన మనిషి గురించి కన్నీళ్లు ఉన్నాయి. ఎఫ్.ఎం. తంత్రుల మీద కనిపించే వంకర నడకల యవ్వనం ఉంది. దుఖఃనుభవాలు ఉన్నాయి. ‘పత్రాల్లో హరిత కలలను దాచుకున్న చెట్టుకు’ అని రాశారు కవి. ఊహ జోడించి చూస్తే ఈ పుస్తకం కూడా ఒక పచ్చటి చెట్టు వలె మన ముందు నిలుచుంటుంది. ఇక పత్రాల్లో హరితకలలన్నీ కవిత్వమై హోరెత్తిస్తుంటాయి. ఇది నిజం! - రఘువీర్ పేజీలు: 136; వెల: 50; ప్రతులకు: ముఖ్య పుస్తక కేంద్రాలతో పాటు, డి.విజయలక్ష్మి, 13-30/79, సాయి భగవాన్ కాలనీ, భెల్-రామచంద్రాపురం. ఫో: 9618224503 విలక్షణ వస్తువు ‘సిక్కెంటిక’ పుస్తకం : సిక్కెంటిక (కథలు) రచన : జిల్లేళ్ల బాలాజీ విషయం : దశాబ్ది కాలంగా వివిధ పత్రికల్లో ప్రచురితమైన 15 కథలను ‘సిక్కెంటిక’ తొలి కథాసంపుటిగా ప్రచురించారు రచయిత. వీటిలో ఎక్కువ బహుమతి పొందిన కథలున్నాయి. శీర్షిక కథ ‘సిక్కెంటిక’లో దేవాని మొగుడు చనిపోగానే అత్త ఆరళ్లు భరించలేక క్షురక వృత్తి నేర్చుకొని, సవరాలు అమ్ముతూ జీవనయానం సాగిస్తుంది. దేవాని వెంట్రుకలు చూసి ఒకామె మోజుపడి అటువంటి వెంట్రుకల సవరం కావాలని అడుగు తుంది. ఆవిడ డబ్బు ఆశతో తాను గుండు చేయించుకొని, సవరం తయారుచేసి అమ్ముకుంటుంది. ఆవిడ ఆర్థిక దుస్థితి పాఠకుల చేత కంటతడి పెట్టిస్తుంది. ఈ కథల్లో ఆత్మాభిమానం గల నాదస్వర కళాకారుల కథలున్నాయి (సజీవం). పాఠకుల గుండెలు పిండే కరుణ రసాత్మక గాథలున్నాయి (బంగారు గాజులు). కథలన్నీ రాయలసీమ మాండలికంలో తీర్చిదిద్దాడు. - డా॥పి.వి.సుబ్బారావు పేజీలు: 152; వెల: 90; ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలూ. మరింత ‘ఆదా’యం కోసం... పుస్తకం : మనీపర్స్-2 రచన : వంగా రాజేంద్రప్రసాద్ విషయం : గొప్ప పెట్టుబడి వ్యూహాలు ఉంటేనే ధనవంతులుగా మారుతారనే అభిప్రాయం నుంచి సామాన్యుడు సైతం ధనవంతుడిగా మారే సూచనల సమూహారమే మనీపర్స్-2. శ్రమలేని ‘ఆదా’యం అని మొదటి పేజీలోనే ఉన్న అంశానికి సార్థకత చేకూర్చేలా కొద్దిపాటి సంపాదనతోనే పొదుపు, మదుపు ఎలా చేయాలో వివరించారు రచయిత. బ్యాంకు ఆర్డీలు, బ్యాంకు ఖాతాతో బీమా సౌకర్యాన్ని ఆర్థిక ప్రణాళికలో ఎలా భాగం చేసుకోవచ్చో వెల్లడించారు. రిటైర్మెంట్ తర్వాత పిల్లల చీత్కారానికి గురికాకుండా జాగ్రత్తపడటం ఎలాగో తెలిపారు. మొదటి పుస్తకంలో చిట్స్, మ్యూచ్వల్ఫండ్ వంటి అంశాలు పరిచయం చేయగా ఇందులో వాటినే లోతుగా విశ్లేషించారు. డబ్బు సంపాదన ఆవశ్యకతను నొక్కిచెప్తూనే, దాన్ని పనిముట్టుగా ఉపయోగిస్తూ సేవ, ప్రేమ, బాధ్యతలను ఎలా నిర్వర్తించాలో ముక్తాయించిన విధానం బాగుంది. - శ్రీధర్ పేజీలు: 280; వెల: 250 ప్రతులకు: విశాలాంధ్రతో పాటు, వంగా పద్మజ, వంగా ముత్యాల బంజర్, ఖమ్మం జిల్లా-507302. ఫోన్: 0870 2446479 కొత్త పుస్తకాలు 1.మమత అరాచక పాలనలో పశ్చిమ బెంగాల్ పయనం ఎటు? ప్రచురణ: బెంగాల్ లెఫ్ట్ ఫ్రంట్ కమిటీ తెలుగు: వేదుల రామకృష్ణ పేజీలు: 166; వెల: 70 2. భారత చంద్రయానం తమిళ మూలం: డా. టి.వి.వెంకటేశ్వరన్ తెలుగు: ఎజి. యతిరాజులు పేజీలు: 162; వెల: 80 3.హేతువు తిరగబడింది (మార్క్సిస్టు తత్వశాస్త్రం-ఆధునిక సైన్స్) ఆంగ్లమూలం: అలెన్ వుడ్, టెడ్ గ్రాంట్ తెలుగు: పొట్లూరి వెంకటేశ్వరరావు ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌస్, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 27608107 క్రీస్తుమార్గం రచన: అలపర్తి పిచ్చయ్య చౌదరి పేజీలు: 90; వెల: 60 ప్రతులకు: రచయిత, 42/169, జయనగర్ కాలనీ, కడప-516002. వైఎస్ఆర్ జిల్లా. ఫోన్: 08562-253734 మిణుగురులు (హైకూలు) రచన: డా. రమణ యశస్వి పేజీలు: 86; వెల: 60 ప్రతులకు: రచయిత, యశస్వి హాస్పిటల్, కాకాని రోడ్, గుంటూరు-522001. ఫోన్: 9848078807 తుంబురు తీర్థం రచన: బి.వి.రమణ ఫొటోలు: బి.బాలు పేజీలు: 24; వెల: 50 ప్రతులకు: ఎన్.సంగీత, 6-3-221, మాంచాల స్ట్రీట్, రాజన్న పార్క్ దగ్గర, తిరుపతి-517501. చలపాక ప్రకాష్ కార్టూన్లు-2 పేజీలు: 56; వెల: 40 ప్రతులకు: సీహెచ్ కృష్ణప్రియ, 1-4/3-36, సంజయ్‌గాంధీ కాలనీ, విద్యాధరపురం, విజయవాడ-12. -
సమీక్షణం :శ్రావ్య కవితాగానం
శ్రావ్య కవితాగానం పుస్తకం : గానగాత్రం (కవిత్వం) రచన : పెద్దిరెడ్డి గణేష్ విషయం : ‘శబ్దాల నుంచి సుస్వరాలను జల్లెడ పట్టే చిత్రవిద్య’ తెలిసిన కవి పెద్దిరెడ్డి గణేష్. సంగీత సాహిత్యాల సమ్మేళనమే ఈ సంపుటిలోని 53 కవితల సారాంశం. ‘గానగాత్రం’ లో తానే ఒక పాటై, తన సర్వస్వం పాటగా మారిపోయి, పల్లవినీ చరణాలనూ కవిత్వంగా మలుస్తారు. ‘పుట్టడమే పాటగా పుట్టాను/ ఇక ఉలకడం పలకడం పాటలాగే కదా’ అంటారు. ‘సజీవ సౌందర్య కళ’లో ‘నిన్న సాయంత్రం విరమించిన యుద్ధాన్నే/ ఈరోజు ఉదయాన్నే మళ్లీ మొదలెట్టాలి’ అంటారు. తాను పుట్టిన ‘సూర్యాపేట’ను కూడా అద్భుతమైన పదబంధాలతో గళచాలనం చేస్తారు. జ్వరం వస్తే బాగుండునని ఎప్పుడో ఒకసారి మనం అనుకుంటాం. కానీ దాన్నే కవిత్వంగా మార్చారు గణేష్. ‘ఆకాశం’ అనే కవితలో ‘ఆలోచనలకూ అమావాస్య వస్తుంది’ అంటూ లోతైన భావాన్ని పలికిస్తారు. తనవాళ్లనూ, తన చుట్టూ ఉన్నవాళ్లనూ, బంధువులనూ, స్నేహితులనూ తన కవిత్వంలో కౌగిలించుకుంటారు. ప్రతి కవిత వెనకా సన్నివేశ రూపకల్పనకు అవసరమైన కవితా సామగ్రిని సాధన చేసి సంపాదించుకున్న అనుభవం కనిపిస్తుంది. - ఎమ్వీ రామిరెడ్డి పేజీలు: 164; వెల: 150 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు; 9848181117 వెలుగు దివ్వెలు పుస్తకం : లుమినరీస్ రచన : పి.వి.బ్రహ్మం విషయం : ఈ ఇంగ్లిష్ పుస్తకంలో చరిత్ర నుంచి సమకాలీన ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగం వరకు రచయిత పి.వి.బ్రహ్మం 142 మంది ప్రముఖుల్ని ఎంపిక చేసుకుని, వారి జీవిత విశేషాల్ని ఆసక్తికరంగా ఇచ్చారు. ‘సహకార సారథి’ పత్రిక సంపాదకునిగా గడించిన విశేష అనుభవంతో ఈ తరం యువజనులకు మహామహుల్ని పరిచయం చేయాలన్న సంకల్పంతో శ్రద్ధగా సులభ శైలి ఇంగ్లిషులో దీన్ని తెచ్చారు. ఇందులో మనం చూసే ప్రముఖుల జీవిత విశేషాలు తెలిసినట్టే ఉంటాయి గాని, దీన్ని చదివితే మరిన్ని గుర్తుంచుకోదగిన కొత్త సంగతులు తెలుస్తాయి. - రమణరావు పేజీలు: 384; వెల: 300; ప్రతులకు: రచయిత, హుడా కాంప్లెక్స్, ప్లాట్ నం.43, ఫ్లాట్ నం.308, సరూర్ నగర్, హైదరాబాద్-500 035; ఫోన్: 040-24048906 కొత్త కథాసంకలనం పుస్తకం : మా కథలు 2012 సంకలన కన్వీనర్ : సీహెచ్ శివరామ ప్రసాద్ విషయం : 2012లో వివిధ పత్రికల్లో ప్రచురితమైన తమ కథల్లోంచి, తమకు నచ్చిన కథను కథకులే ఎంపిక చేసుకుని, ‘తెలుగు కథ’ అన్న వేదికనొకటి ఏర్పాటు చేసుకుని, ఈ సంకలనాన్ని వెలువరించారు. ఇందులో ముప్ఫై కథలున్నాయి. ప్రచురించబడిన కొన్ని కథలు ఆయా పత్రికలు నిర్వహించిన పోటీల్లో ప్రథమ, ద్వితీయ పురస్కారాలు అందుకున్నాయి. ఈ కథల్ని గమనిస్తే, ఒక ట్రెండ్ స్పష్టమవుతుంది. పల్లెటూళ్లు, బీదరికం, ఆకలి చావులు లాంటి వాటి స్థానంలో ఎన్నారైలు వాళ్ల జీవితాలు, వైద్య శాస్త్రంలోని మార్పులు, పరిశ్రమలు, కాలనీ జీవితాలు, అవయవ దానాలు, కృత్రిమ గర్భధారణ వంటి విషయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇది ఆరోగ్యకరమైన పరిణామం. - కూర చిదంబరం పేజీలు: 258; వెల: 99; ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు గ్రామీణ స్మృతులు పుస్తకం : తియ్యని వేప - రావికంటి కథలు రచన : వేముల ప్రభాకర్ విషయం : ఆర్.కె.నారాయణ్ ‘మాల్గుడి డేస్’ స్ఫూర్తితో, మిత్రులు, కుటుంబ సభ్యుల ప్రేరణతో యాభై ఏళ్ల నాటి జ్ఞాపకాల దొంతరల నుండి తవ్విపోసిన ఇరవై స్మృతుల గాథలు తియ్యని వేప కథలు. రాయికల్ గ్రామం మధ్యలో బొడ్రాయి లాంటి పెద్ద వేపచెట్టు. అది వ్యాపార కూడలిగా, చల్లటి నీడనిచ్చే విశ్రాంతి కేంద్రంగా ఉండేది. గ్రామ కుటిల రాజకీయాల మూలంగా వేపచెట్టును తగలబెట్టి కొట్టేశారు. పర్యావరణ స్పృహ ఉన్న రచయిత, ఆయన మిత్రులంతా విలపించారు. ఈ సంపుటిలో బాల్యంలో చేసే ఆసక్తికరమైన సాహస గాథలున్నాయి (చెప్పరాని భయం, వంపున చెరువు - మిట్టన గుళ్లు). కుక్కను పెంచుకోవాలన్న కుతూహల చిత్రీకరణ ఉంది (కుక్క బతుకు). పెళ్లిలో తాగి చియ్యకూర కోసం గొడవపడి పెళ్లి పెటాకులు చేసేందుకు సిద్ధపడ్డ పిల్లతండ్రి, పిల్లాడి తండ్రికి బుద్ధి చెప్పిన పెళ్లికూతురి కథ ఉంది (చియ్యకూర కయ్యం). ‘తెర వెనుక’ కథలో నాటక ప్రదర్శన పట్ల గ్రామస్థుల ఉత్సుకత, ఉపాధ్యాయుల బలాలు, బలహీనతల చిత్రీకరణ ఉంది. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ఆర్థిక, సామాజిక, చారిత్రక స్థితిగతులను ఈ కథల్లో సహజసిద్ధంగా రచయిత వర్ణించారు. - డా॥పి.వి.సుబ్బారావు వెల: 100; ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ పుస్తక కేంద్రాలు కొత్త పుస్తకాలు బి.టి.విత్తనాలు: పదేళ్ల ప్రహసనం రచన: ప్రొ.ఎన్.వేణుగోపాలరావు, ప్రొ.కె.సత్యప్రసాద్ పేజీలు: 182; వెల: 70 ప్రతులకు: ప్రజాశక్తి బుక్ హౌస్, 1-1-187/1/2, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 27608107 1.సాఫ్ట్ స్కిల్స్; పేజీలు: 152; వెల: 60 2.కాలేజీ క్యాంపస్; పే: 136; వెల: 60 రచన: డా. బి.వి.పట్టాభిరామ్ ప్రతులకు: సాహితీ ప్రచురణలు, 29-13-53, కాళేశ్వరరావు రోడ్డు, సూర్యారావుపేట, విజయవాడ-2. ఫోన్: 0866-2436643 రిజర్వేషన్లు సామాజిక న్యాయం రచన: ఎం.శ్రీనివాస్ పేజీలు: 96; వెల: 50 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతోపాటుగా స్పృహ సాహితీ సంస్థ, 1-8-702/33/20ఎ, పద్మకాలనీ, నల్లకుంట, హైదరాబాద్-44 1969 తెలంగాణ ఉద్యమం- ప్రజాకవి కాళోజీ కవిత్వం రచన: డా. బన్న అయిలయ్య పేజీలు: 70; వెల: 100 ప్రతులకు: కె.విజయ, 2-7-1261/1, రాజగృహ, విజయపాల్ కాలనీ, హన్మకొండ-506370. ఫోన్: 0870-2456001 విద్య-ప్రపంచీకరణ-అసమానతలు పేజీలు: 280; వెల: 175 రచన: ఎం.శ్రీనివాస్ ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలతో పాటుగా అడుగుజాడలు పబ్లికేషన్స్, 302, వైష్ణవి నెస్ట్, మూసారంబాగ్, దిల్సుఖ్నగర్, హైదరాబాద్-36 వృక్ష విలాపము రచన: దగ్గుపాటి పార్థసారథి నాయుడు పేజీలు: 256; వెల: 150 ప్రతులకు: రచయిత, 4-1997/4ఎ, శ్రీబాలమురుగన్ వీధి, దుర్గానగర్ కాలనీ, చిత్తూరు-517002. ఫోన్: 9440995046 -
సమీక్షణం: ఆధునిక జీవితం మీద అపూర్వ ముద్ర
ప్రచురణ: ఎమెస్కో బుక్స్, దోమలగూడ, హైదరాబాద్-29. ఫోన్: 040 23264028 వెల: 90 పుస్తకం : ఎజికె కథలు రచన : ఎ జి కృష్ణమూర్తి విషయం : ఆదర్శాల ముసుగులోనో, అంధ విశ్వాసాల్లోనో, నవనాగరికతా వ్యామోహంతోనో అతలాకుతలమవుతున్న నేటి వ్యవస్థలో దర్శనమిస్తున్న సజీవ పాత్రలకు తన జీవితానుభవాలను జోడించి కొంత కాల్పనిక మేకప్‌తో కథలు రాశారు ఎ.జి.కృష్ణమూర్తి. సమకాలీన ఆధునిక జీవిత కోణాల్ని తనదైన శైలిలో అవగాహనించుకుని పాత్రలకు ప్రాణం పోశారు. ఆంగ్లంలో ఏడు, తెలుగులో ఇప్పటికి పదమూడు పుస్తకాలను ప్రచురించి రచనారంగంలో కూడా తనదైన ‘ముద్ర’ వేసిన ప్రతిభాశాలి కృష్ణమూర్తి. వీరు ప్రచురించిన ‘ఎ.జి.కె. కథలు’ సంపుటిలో మొత్తం పదకొండు కథలున్నాయి. వీటిల్లో చదివించే శక్తి ఉంది. పాఠకుణ్ని వెంటాడి ఆలోచింపజేసే నైపుణ్యం గల కథావస్తువు కనిపిస్తుంది. కథలు కాలక్షేపం కోసం కాదు, ఆలోచనా చైతన్యాన్ని పెంచేందుకనే దృక్పథం గలవారు రచయిత. కథల్లో వస్తు వైవిధ్యం ఉంది. ఎత్తి పొడుపులు, చమత్కారాలు కలగలిపిన సునిశితమైన సూచనలు సమాజానికి అందించడంలో కథకుడు సఫలీకృతుడయ్యాడనే చెప్పొచ్చును. ‘అమ్మ కథ’లో రెండు తరాల మూఢ విశ్వాసాల్ని కళ్లకు కట్టించాడు రచయిత. సుగంధ్, అనఘ భార్యాభర్తలు. సుగంధ్ తల్లి అనసూయ. అనఘ తండ్రి కృష్ణకాంత్, తల్లి సరస్వతి. సుగంధ్, అనఘలకు 40 సంవత్సరాల వయసు వచ్చినా పిల్లలు కలగలేదు. అనఘ తల్లిదండ్రులు ఆందోళన చెంది కారణం అడుగుతారు. అనఘ తన అత్తయ్య ‘అనసూయ’ మూఢ విశ్వాసాలను నమ్మి, ఆత్మహత్య చేసుకున్న విషయం తల్లిదండ్రులకు చెప్తుంది. ఎవరో సాధువు అనసూయ హస్తరేఖలు చూసి త్వరలో మీ కుటుంబంలో ఒక చావు ఉంటుందని చెప్పాడు. అది కుమారుడైన సుగంధ్ కాకూడదని అనసూయ ఉరిపోసుకొని చనిపోతుంది. తల్లిది షరతులు లేని ప్రేమనీ, అవధులు లేని ఆప్యాయతనీ, ఏ త్యాగానికైనా సిద్ధం చేస్తుందనీ నమ్మిన సుగంధ్, తన భార్య ‘అనఘ’ తల్లి కావడానికి ఇష్టపడడు. అందుకే కుటుంబ నియంత్రణ పాటిస్తూ పిల్లలు లేకుండా ఉంటారు. ఒక తరంలో ‘అనసూయ’ జాతకాల మూఢ విశ్వాసంతో ప్రాణత్యాగం చేస్తే, కుమారుడు ‘సుగంధ్’ తల్లి అయితే భార్య కూడా ఏదైనా ప్రాణత్యాగానికి సిద్ధపడుతుందని ఆమె తల్లి కావడానికి ఇష్టపడడు. మూఢ విశ్వాసాలు ఏ విధంగా జీవితపు విలువల్ని కాలరాస్తాయో ‘అమ్మ కథ’ తెలుపుతుంది. కథలన్నీ ఆలోచనలను రేకెత్తించేవే! - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి పరుచుకుంటున్న ‘తోవలు’ పుస్తకం : తెలంగాణ తోవలు సంపాదకుడు : కాసుల ప్రతాపరెడ్డి విషయం : అస్తిత్వం, ఉనికి వంటి అంశాలకు పదును పెట్టే పని కొత్త దృష్టితో మొదలవుతుంది. ఒక ప్రాంత సాహిత్య, సాంస్కృతిక అంశాల మీద అప్పటిదాకా ఉన్న ‘అజమాయిషీ’ని గుర్తించేటట్టు చేసేది ఈ దృష్టే. ఆపై ప్రయాణం సంఘర్షణాత్మకమే. అప్పుడు ఈ దృష్టి మరింత విశాలం కావాలి. ఇందుకు జరిగిన ఒక పెద్ద ప్రయత్నమే ‘తెలంగాణ తోవలు’ వ్యాస సంక లనం. కాసుల ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ఈ సంకలనంలో తెలంగాణ సాంస్కృతిక, సాహిత్య ధోరణులకు సంబంధించి పద్దెనిమిది వ్యాసాలు ఉన్నాయి. ఈ సంకలనం ఎంత ఆదరణకు నోచుకున్నదో రెండో ముద్రణతోనే తెలుస్తుంది. పి. వేణుగోపాల్, కె. శ్రీనివాస్, గూడ అంజయ్య, కాలువ మల్లయ్య, లోకేశ్వర్ వంటి లబ్ధ ప్రతిష్టులు రాసిన ఈ వ్యాసాలు ‘తోవలు’ చూపిస్తాయనడంలో సందేహం అక్కరలేదు. సంకలనం ఉద్దేశం మేరకు ప్రయాణం ఎక్కడ మొదలయిందో పాఠకుడు సులభంగానే గ్రహిస్తాడు. కానీ ఎటు, ఎలా వెళ్లాలి అన్న అంశం దగ్గర ఇంకొంచె నిర్దేశం, స్పష్టత కోరుకుంటాడని అనిపిస్తుంది. - కల్హణ కొత్త పుస్తకాలు జ్ఞానయజ్ఞం సేకరణ: రామిరెడ్డి శ్రీమాలతి పేజీలు: 462; వెల: 750 ముద్రణ: క్రియేటివ్ లైన్స్, చిక్కడపల్లి, హైదరాబాద్-20. ఫోన్: 040-27616699 నీరాజనం (కథలు) రచన: సి ఎన్ చంద్రశేఖర్ పేజీలు: 100; వెల: 80 ప్రతులకు: ఎస్ వి కృష్ణజయంతి, 19-90, పి అండ్ టి కాలనీ, దిల్సుఖ్నగర్, హైదరాబాద్-60. ఫోన్: 9247302882 ఊహలు గుసగుసలాడే (కవిత్వం) రచన: ములుగు లక్ష్మీమైథిలి పేజీలు: 80; వెల: 100 ప్రతులకు: రచయిత్రి, 26-3-2050, చంద్రమౌళి నగర్, పోస్టాఫీస్ ఎదురుగా, వేదాయపాలెం, నెల్లూరు-4. ఫోన్: 9441685293 అలజడి (కవిత్వం) రచన: గొట్టిపర్తి యాదగిరిరావు పేజీలు: 58; వెల: 50 ప్రతులకు: రచయిత, 203, తిరుమల అపార్ట్మెంట్స్, 16-11-771, ఆండాల్ ప్లాజా, మూసారాంబాగ్, మలక్‌పేట, హైదరాబాద్-36. ఫోన్: 08297277795 గడ్డిపరక (కవిత్వం) రచన: పి.లక్ష్మణ్‌రావ్ పేజీలు: 120; వెల: 25 ప్రతులకు:కవి, 304, రామకృప టవర్స్, ఫేజ్-3, ఉడా కోలనీ, కంటోన్మెంట్, విజయనగరం-535003. ఫోన్: 9441215989 పేజీలు: 112; వెల: 60; ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్. ఫోన్: 040 27678430