breaking news
Royal Bhutan Airlines
-
విమానం టేకాఫ్.. దట్టమైన పొగలు
సాక్షి, కోల్‌కతా : నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో విమానం నుంచి పొగలు రావడంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించారు. ఆ వివరాలిలా.. కోల్‌కతాలోని ఎయిర్పోర్ట్ నుంచి రాయల్ భూటాన్ ఎయిర్‌లైన్స్ బ్యాంకాక్‌కు బయలుదేరింది. టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో విమానం నుంచి దట్టమైన పొగలు రావడంతో రన్‌వేపైనే పైలట్ విమానాన్ని నిలిపివేశాడు. వెంటనే ప్రయాణికులను విమానం నుంచి క్షేమంగా కిందకి దించేశారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఎయిర్‌లైన్స్ వద్దకు చేరుకుని మంటలు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో కొందరు ప్రయాణికులు, విమాన సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. దీనిపై ఎయిర్పోర్ట్ డైరెక్టర్ అటల్ దీక్షిత్ మాట్లాడుతూ.. విమానంలో మొత్తం 80 మంది ఉన్నారు. టేకాఫ్ అవుతుంటే దట్టమైన పొగలు రావడంతో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించాడు. గాయాలైన కొందరికి చికిత్స అందించాం. ఇతర విమానాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని' వివరించారు. -
ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు, విమానసిబ్బంది!
కోల్ కతా: గాల్లో ప్రయాణిస్తుండగానే విండ్ షీల్డ్ పగిలిపోవడంతో రాయల్ భూటాన్ ఎయిర్ లైన్ విమానాన్ని అత్యవసరంగా కోల్ కతాలోని ఎన్ఎస్సీ బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దించివేశారు. పారో నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికపరమైన సమస్యలు తలెత్తడంతో అత్యవరస ల్యాండింగ్ కు కెప్టెన్ ఏటీసీ అనుమతిని కోరాడు. ఏటీసీ అనుమతి లభించడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన ఉదయం 9.30 గంటలకు జరిగింది. ఈ ఘటనలో విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.