breaking news
Road Tax
-
రూ.7.5 కోట్ల కారు.. బడా బిజినెస్‌మ్యాన్ కక్కుర్తి..
రోడ్ ట్యాక్స్ చెల్లించకుండా బెంగళూరు వీధుల్లో తిరుగుతున్న ఫెరారీ లగ్జరీ సూపర్ కారును ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారులు పట్టుకున్నారు. ట్యాక్స్ కడతావా.. సీజ్ చేయమంటావా అని అధికారులు పట్టుబట్టడంతో కారు యజమాని రూ.1.42 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.రూ.7.5 కోట్ల విలువైన బ్రైట్ రెడ్ ఫెరారీ ఎస్ఎఫ్ 90 స్ట్రాడేల్ కారు కొన్ని నెలలుగా బెంగళూరు వీధుల్లో షికారు చేస్తోంది. ఈ లగ్జరీ కారు మహారాష్ట్రలో రిజిస్టర్ అయిందని, అలాంటి వాహనాలపై అక్కడ లైఫ్‌టైమ్ ట్యాక్స్ రూ.20 లక్షలు ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. ‘మహారాష్ట్రలో ఇలాంటి కార్లపై పన్ను రూ.20 లక్షలు కాగా, కర్ణాటకలో ఇది దాదాపు రూ.1.5 కోట్లు. ఈ వాహనం రెండేళ్ల క్రితం మహారాష్ట్రలో రిజిస్టర్ అయింది’ అని రవాణా అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది.జయనగర్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) అధికారులు నగరంలో తరచూ కనిపిస్తున్న ఫెరారీ కారుపై నిఘా పెట్టి పట్టుకున్నారు. డాక్యుమెంట్లు ఇంట్లో ఉన్నాయని డ్రైవర్ తొలుత చెప్పాడు. కారు రిజిస్ట్రేషన్‌ను పరిశీలించిన అధికారులు కర్ణాటక పన్ను చెల్లించకుండా 18 నెలలకు పైగా బెంగళూరులో ఈ వాహనం తిరుగుతున్నట్లు గుర్తించారు. ఏం చేయాలని అధికారులు తమ ఉన్నతాధికారులను సంప్రదించగా బకాయిలు చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఫెరారీ కారు యజమాని అదే రోజు పన్నులు, జరిమానాల రూపంలో రూ.1.4 కోట్లు చెల్లించాడు.కాగా ఈ ఖరీదైన ఫెరారీ కారు యజమాని ఓ బడా వ్యాపారవేత్త. దేశంలోని 55 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్త తక్కువ పన్ను రేటు కారణంగా మహారాష్ట్రలో తన ఫెరారీ కారును రిజిస్టర్ చేయించుకుని బెంగళూరులో తిప్పుతున్నన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కర్ణాటక నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రంలో ఏడాదికి పైగా బయటి రాష్ట్రాల వాహనాలను ఉపయోగించే వారు ఇక్కడ లైఫ్‌టైమ్ రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.పన్ను ఎగవేతకు పాల్పడిన లగ్జరీ కార్ల యజమానులపై బెంగళూరు ఆర్టీవో అధికారులు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత మార్చిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో కర్ణాటక వెలుపల రిజిస్టర్ అయిన హై ఎండ్ వాహనాల నుంచి రూ.40 కోట్ల బకాయిలు వసూలు చేశారు. -
ఈవీలపై రోడ్‌ట్యాక్స్ బాదుడు
కాలుష్యాన్ని నివారించేందుకు వీటిని ప్రోత్సహించిన వైఎస్ జగన్ ప్రభుత్వం జూలై 7 నాటికి ఓలా ఎస్1 (3 కేడబ్ల్యూహెచ్) ద్విచక్ర వాహనం విశాఖలో ఆన్‌రోడ్ ధర రూ.97,448 ఉండేది. అయితే, ఆ మర్నాడు జూలై 8 నుంచి దీని ధర అమాంతంగా రూ.1,08,579కు పెరిగింది. ఇందుకు కారణం.. జూలై 7 వరకు గత ప్రభుత్వం ఎలక్ట్రికల్ వాహనాల మీద ఇచ్చిన 12 శాతం రోడ్డు ట్యాక్స్ రాయితీని ఇప్పుడు టీడీపీ సర్కారు కొనసాగించకపోవడమే. ఇక ఎలక్ట్రికల్ కార్ల ధరలపై కూడా అదనంగా 12 శాతం రోడ్డు ట్యాక్స్ బాదనుండటంతో వాటి ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఆం«ధ్రప్రదేశ్లోనూ వీటి వినియోగం గణనీయంగా వృద్ధి చెందుతోంది. భారంగా మారిన పెట్రోల్, డీజిల్ ధరల ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేందుకే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఇంధన సంరక్షణ కోసం ఈవీలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ ట్యాక్స్, ఇతర పన్నుల మినహాయింపులు ఇస్తుండటంతో.. వాహన వినియోగం జోరందుకుంది. కానీ.. ఇప్పుడు ఏపీలో మాత్రం ఈ వాహనాలు పట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. కనిపించని భారాలను ప్రజలపై మోపి ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఈవీలను కూడా పావుగా వాడుకుంటూ రోడ్ ట్యాక్స్ బాదేస్తోంది. ఉన్న మాఫీనీ ఎత్తివేస్తున్న వైనం.. వాస్తవానికి.. పర్యావరణహిత రవాణాని ప్రోత్సహించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై రహదారి పన్నుని పూర్తిగా మాఫీచేస్తూ.. రెండ్రోజుల క్రితం ఉత్తర్వులు జారీచేస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఉన్న మాఫీని వారం రోజుల క్రితమే ఎత్తేసింది. పెట్రోల్, డీజిల్ వాహనాలవల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని తగ్గించడంతో పాటు హరిత వాహనాల కొనుగోలుని ప్రోత్సహించేందుకు దాదాపు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీలపై రోడ్ ట్యాక్స్‌ని మినహాయింపునిస్తున్నాయి. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం రోడ్ ట్యాక్స్ నుంచి ఈవీలకు మినహాయింపుని కొనసాగిస్తూ వచి్చంది. కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం దీన్ని చెప్పాపెట్టకుండా ఎత్తేసి కొనుగోలుదారులపై అదనపు భారాన్ని మోపింది. ఈనెల 7తో ముగిసిన కాలపరిమితి.. ప్రతియేటా.. రోడ్ ట్యాక్స్ మినహాయింపునకు సంబంధించిన ఉత్తర్వుల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. గతేడాది ఇచి్చన జీఓ కాలపరిమితి ఈనెల 7తో ముగిసింది. రాష్ట్రంలో కొనుగోలు చేసిన ప్రతి ఈవీపై ఎలాంటి రోడ్ ట్యాక్స్ ఇప్పటివరకూ విధించలేదు. కానీ, ఆ జీఓ కాలపరిమితి ముగిసిపోవడంతో.. కొత్త ప్రభుత్వం దానికి సంబంధించి ఎలాంటి కొనసాగింపు ఉత్తర్వులు జారీ చెయ్యకుండా కాలయాపన చేస్తోంది. ఫలితంగా.. ఈవీ కొనుగోలుదారులపై అదనపు భారం పడుతోంది. 12 శాతం అదనపు భారం.. ఇక ఏపీలో కొనుగోలు చేసే ప్రతి ఎలక్ట్రిక్ వాహనానికి 12 శాతం రోడ్ ట్యాక్స్ చెల్లించాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రజలపై కనిపించని భారాన్ని మోపుతూ అందినకాడికి దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం కొత్త స్కెచ్ వేసింది. రోడ్ ట్యాక్స్ పేరుతో గుదిబండ మోపి.. ప్రజల డబ్బుతో ఖజానా నింపేసుకోవాలని కుయుక్తితో మినహాయింపు జీఓ జారీచేయలేదు. దీంతో.. రవాణాశాఖ 7వ తేదీ నుంచి కొనుగోలు చేసిన ప్రతి ఎలక్ట్రిక్ వాహనంపై రోడ్ ట్యాక్స్‌ని 12 శాతం విధిస్తోంది. ఫలితంగా ఎలక్ట్రికల్ టూ వీలర్స్‌పై రూ.12 వేల నుంచి కార్ల వినియోగదారులు వేరియంట్‌ను బట్టి లక్ష రూపాయల నుంచి రెండు లక్షల వరకూ అదనంగా చెల్లించాల్సి వస్తోంది. రాయితీ కొనసాగింపుపై ఉత్తర్వుల్లేవు.. ఎలక్ట్రికల్ వాహనాలపై ఉన్న 12 శాతం రోడ్డు రాయితీ విధానం ఈనెల 7తో ముగిసిందని.. దీనిని కొనసాగిస్తూ కొత్త ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీచేయలేదని రవాణాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆదాయార్జన అవసరమున్న నేపథ్యంలో దీనిని కొనసాగిస్తుందన్న నమ్మకం కూడా తమకు లేదని వారు అభిప్రాయపడుతున్నారు.పన్ను రాయితీలు కొనసాగించండి.. మరోవైపు.. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)లపై పన్ను రాయితీని కొనసాగించాలని ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ కోరుతూ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డికి బుధవారం వినతిపత్రాన్ని సమరి్పంచింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ విధానాన్ని అనుసరిస్తూ గత ప్రభుత్వం ఈవీ వాహనాల తయారీ, అమ్మకం, కొనుగోలుపై పన్ను రాయితీలను ఈ ఏడాది జులై 7 వరకు కొనసాగించాలని ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేసింది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఈవీ విధానాన్ని ఖరారు చేయనందున ఆ పన్ను రాయితీలను పొడిగించాలని కోరింది. రిజి్రస్టేషన్ చార్జీలు, రోడ్ ట్యాక్స్, ఇతర పన్ను రాయితీలను కొనసాగించాలని విజ్ఞప్తి చేసింది. -
శుభవార్త.. హైబ్రిడ్ కార్ల కొనుగోలుపై రోడ్ ట్యాక్స్ లేదు
భారతదేశంలో పలు వాహన తయారీ సంస్థలు ఇప్పటికే డీజిల్ కార్ల ఉత్పత్తులను పూర్తిగా నిలిపివేశాయి. ఢిల్లీ వంటి నగరాల్లో డీజిల్ వాహనాల వినియోగాన్ని కూడా అక్కడి ప్రభుత్వం నిషేదించింది. దీనికి ప్రధాన కారణం పర్యావరణ హితమే. దీనిని దృష్టిలో ఉంచుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం ప్రకారం, రాష్ట్రంలో హైబ్రిడ్ కార్లపై రోడ్ ట్యాక్స్ పూర్తిగా రద్దు చేయడం జరుగుతుంది. ఇది హైబ్రిడ్, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కార్లకు వర్తిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, పచ్చదనాన్ని పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.యూపీ ప్రభత్వం తీసుకున్న నిర్ణయంతో మారుతి సుజుకి, టయోటా వంటి సంస్థలు బాగా లాభపడే అవకాశం ఉంది. అయితే పన్నుల తగ్గింపు ఎంత వరకు ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించలేదు, కానీ 100 శాతం రాయితీ ఉంటుందని సమాచారం. ఇప్పటికే మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి కార్లు ఉత్తమ అమాంకాలను పొందుతున్నాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వీటి సేల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.ప్రస్తుతం గ్రాండ్ విటారా, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ హైబ్రిడ్ కార్ల రిజిస్ట్రేషన్ ధర యూపీలో సుమారు రూ. 1.80 లక్షల వరకు ఉంటుంది. ఇది ఎంచుకున్న వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా రూ.3 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఈ మొత్తాన్ని కస్టమర్ లాభంపొందవచ్చు. హైబ్రిడ్ కార్ల మీద రోడ్ ట్యాక్ రద్దుకు సంబంధించిన కీలక ప్రకటన కేవలం యూపీ ప్రభుత్వం మాత్రమే ప్రకటించింది. ఈ నిరయాన్ని మరిన్ని రాష్ట్రాలు ఆహ్వానించే అవకాశం ఉంది. ఇదే జరిగితే రోడ్లమీద హైబ్రిడ్ వాహనాల సంఖ్య పెరుగుతుంది. తద్వారా కాలుష్యం కూడా గణనీయంగా తగ్గుతుంది.