breaking news
rehmath Pasha
-
హైదరాబాద్ వీరుడికి ఆస్ట్రేలియా శాశ్వత పౌరసత్వం
సాక్షి, హైదరాబాద్: ఆ్రస్టేలియాలోని బాండీ బీచ్‌లో గతేడాది డిసెంబర్ 14న యూదులు లక్ష్యంగా ఐసిస్ సానుభూతిపరులైన సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ మారణహోమానికి తెగబడ్డ వేళ 20 మందిని కాపాడిన హైదరాబాదీ వీరుడు రెహ్మత్ పాషాకు ఆ దేశ ప్రభుత్వం అరుదైన గౌరవం అందించింది. క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రెహ్మత్ పాషా ప్రదర్శించిన తెగువను పరిగణనలోకి తీసుకొని అతనికి శాశ్వత పౌరసత్వం కల్పించింది. అలాగే అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించే వారికి అందించే ఓజెడ్ బ్రేవరీ అవార్డుకు సైతం నామినేట్ చేసింది. ప్రజలను కాపాడే సమయంలో పాషా వినియోగించిన టోపీని మ్యూజియంలో పెట్టింది. వీలున్నంత వరకు సహకరించాలని... బాండీ బీచ్‌లో హనుక్కా వేడుకలు జరుపుకుంటున్న స్థానిక యూదులు లక్ష్యంగా ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతుండటంతో అప్రమత్తమైన రెహ్మత్ పాషా క్షతగాత్రులను కాపాడాలని నిర్ణయించుకున్నారు. క్షతగాత్రులను చెట్లు, బెంచీలు, స్టీల్ కిచెన్ నిర్మాణాల వెనుకకు ఈడ్చుకెళ్లారు. బాధితులను అంబులెన్సుల వరకు తరలించడంలోనూ కీలకపాత్ర పోషించారు. కానీ ఆ తర్వాత పాషా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీడీఎస్డీ) బారినపడ్డారు. దీంతో తాత్కాలికంగా క్యాబ్ డ్రైవర్ ఉద్యోగానికి సైతం దూరమయ్యారు.దీనిపై స్పందించిన ఆ్రస్టేలియా ప్రభుత్వం.. పాషాకు ఆర్థిక సాయం, వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించింది. తాజాగా ఆ్రస్టేలియా మంత్రి టోనీ బర్క్ స్వయంగా పాషాకు ఫోన్ చేసి పర్మనెంట్ రెసిడెన్సీ మంజూరు చేస్తున్నట్లు, ‘ఓజెడ్ బ్రేవరీ అవార్డు కోసం సిఫార్సు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ మారణహోమానికి పాల్పడ్డ సాజిద్, నవీద్‌లు సైతం హైదరాబాదీలే కావడం గమనార్హం. పోలీసుల ఎదురుకాల్పుల్లో సాజిద్ మృతిచెందగా నవీద్ జైల్లో ఉన్నాడు. -
టార్గెట్ వీవీఐపీ?
♦ ఢిల్లీలో తుపాకీతో పట్టుబడిన హైదరాబాద్‌వాసి ♦ విచారణలో నగరానికి చెందిన ఇద్దరి పేర్లు వెల్లడి సాక్షి, హైదరాబాద్: స్పెషల్ సెల్ బృందానికి ఢిల్లీలో తుపాకీతో పట్టుబడిన హైదరాబాద్‌వాసి తన టార్గెట్‌లో అత్యంత ప్రముఖుడు ఉన్నట్లు విచారణలో వెల్లడించాడు. తనకు నగరానికి చెందిన మరో ఇద్దరితో సంబంధాలున్నట్లు కూడా బయటపెట్టాడు. దీంతో శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న ప్రత్యేక బృందం మదర్సాల నిర్వాహకులైన ఇరువురినీ అదుపులోకి తీసుకుని విచారించి విడిచిపెట్టింది. హైదరాబాద్‌కు చెందిన రెహ్మత్ పాషా ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి రైల్లో వస్తుండగా స్పెషల్ సెల్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానాస్పదంగా ఉన్న అతడిని సోదా చేయగా తుపాకీ, తూటాలు లభించాయి. దీంతో అతడిని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. తన టార్గెట్‌లో దేశానికి చెందిన అత్యంత ప్రముఖుడు ఉన్నాడని, ఆయన్ని చంపడం కోసమే యూపీ నుంచి తుపాకీ, తూటాలు కొనుగోలు చేసినట్టు బయటపెట్టాడు. పాషా కాల్ డేటాను పరిశీలించిన అధికారులు హైదరాబాద్‌కు చెందిన మరికొందరితో పరిచయాలు ఉన్నట్లు, యూపీ నుంచీ వారితో సంప్రదింపులు జరిపినట్లు గుర్తించారు. ఈ కోణంలో రెహ్మత్‌ను ప్రశ్నించగా.. వారూ తమ ముఠాకు చెందిన వారేనని, ఆపరేషన్‌కు ఆర్థిక సాయం చేయడానికి అంగీకరించారని చెప్పుకొచ్చాడు. దీంతో ఓ ప్రత్యేక బృందాన్ని నగరానికి పంపారు. ఈ బృందం నగర పోలీసుల సహకారంతో నల్లకుంట, చింతల్మెట్లో ఉన్న మదర్సాల్లో సోదాలు చేసి వాటి నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రెహ్మత్ పాషా తమను సంప్రదించిన మాట వాస్తవమేనని, అయితే తుపాకీ కొనుగోలు, టార్గెట్ వీవీఐపీ ఆపరేషన్ వివరాలు తమకు తెలియవని స్పెషల్ సెల్ అధికారులకు వివరణ ఇచ్చారు. గతంలో యూపీ వెళ్ళిన రెహ్మత్.. బర్వేలీకి చెందిన ఓ మతపెద్ద చరిత్రను సేకరించానని చెప్పాడని, ఈ వివరాలను ప్రపంచానికి తెలియజేయడానికి ఓ వెబ్సైట్ పెట్టాలని యోచిస్తున్నానని, దీనికి ఆర్థిక సాయం కావాలని కోరాడని వారు తెలిపారు. దాని కోసమే తమను రెండుసార్లు కలవడంతో పాటు ఇటీవల యూపీ నుంచి ఫోన్లు చేసి రూ.20 వేలు అడిగినట్లు చెప్పారు. పాషా వెల్లడించిన విషయాలకు.. మదర్సా నిర్వాహకులు చెపుతున్న అంశాలకు పొంతన లేకపోవడంతో వీరి గత చరిత్రను స్పెషల్ సెల్ బృందం సేకరించింది. వీరికి ఎలాంటి వివాదాస్పద చరిత్ర లేదని నగర పోలీసులు తేల్చడంతో రెహ్మత్‌ను హైదరాబాద్ తీసుకువచ్చి విచారించాలని స్పెషల్ సెల్ అధికారులు భావిస్తున్నారు.


