breaking news
rao gopal varma
-
హాట్ ఐస్‌క్రీమ్
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్‌బాబు ముద్దుపెట్టేస్తా అంటే భయపడి పారిపోయిన పాత్రతో వెలుగులోకి వచ్చిందా సిటీబ్యూటీ. ఇప్పుడు సిల్వర్‌స్క్రీన్‌పై ‘హాట్’ టాపిక్. రామ్‌గోపాల్‌వర్మ ఐస్‌క్రీమ్ చిత్రంలో న్యూడ్‌గా నటించానంటూ పబ్లిగ్గా అంగీకరించి సంచలనం రేపింది. నగరంలోని బేగంపేటలో సెయింట్‌ఫ్రాన్సిస్ కాలేజీలో చదివిన తేజస్వి... డ్యాన్స్ టీచర్‌గా కూడా సిటీలో చాలా మందికి తెలుసు. ఏదో సినిమాలో అడపాదడపా కనిపిస్తుందిలే అనుకుంటుంటే ఏకంగా రామ్‌గోపాల్‌వర్మ చిత్రంలో.. అదీ న్యూడ్‌గా నటించిందంటూ తెలియడంతో ఇది షాకింగ్ న్యూస్ అయింది. ఈ సందర్భంగా తనను కలిసిన ‘సిటీప్లస్’తో ముచ్చటిస్తూ... వర్మతో పనిచేయడం ద్వారా ఎన్నో నేర్చుకున్నానని, ఆయన ఒక మాస్ట్రో అని కితాబిస్తోంది తేజస్వి. ఐస్‌క్రీమ్ అంటే మహా ఇష్టమంటున్న ఈ బ్యూటీ స్పెయిన్‌లో ఐస్‌క్రీమ్స్ భలే రుచిగా ఉంటాయంది. సినీ పరిశ్రమ తనకు ఎంతో నచ్చిందంటోంది. ఫైనల్‌గా తనకు సంబంధించి వచ్చే రూమర్లపై ఎలా స్పందిస్తావంటే... ‘‘బాగా కష్టపడడం, మన అంతరంగం చెప్పినదాన్ని గుడ్డిగా అనుసరిస్తూ వెళ్లిపోవడం అంతే’’ అని తేల్చేసింది. - సిద్ధాంతి -
రామ్‌గోపాల్‌వర్మకు సేవా పన్ను సెగ
ముంబై: దర్శక, నిర్మాత రామ్‌గోపాల్ వర్మ కార్యాలయాలపై సేవా పన్ను విభాగం అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. సేవా పన్ను చెల్లింపునకు సంబంధించి ఆయన తన పేరును నమోదు చేసుకోకపోవడం ఇందుకు కారణం. సాధారణంగా సినిమా డెరైక్టర్లు సర్వీస్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రామ్‌గోపాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో అధికారులు సోదాలు నిర్వహించారని, ఆయన స్టేట్మెంట్ని తీసుకునే ప్రయత్నంలో ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.