ఎయిర్‌పోర్టులో పుష్కర ప్రత్యేక అలంకరణ
విమానాశ్రయం(గన్నవరం) :
కృష్ణా పుష్కరాల ప్రారంభోత్సవం సందర్భంగా గన్నవరం విమానాశ్రయాన్ని అందంగా ముస్తాబు చేశారు. దేశవిదేశాల నుంచి వచ్చే పుష్కర యాత్రికులను ఆకట్టుకునే విధంగా టెర్మినల్ భవనాన్ని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. టెర్మినల్ ప్రాంగణంలో తెలుగు సంస్కృతి సంప్రదాయలు ఉట్టిపడే విధంగా పూలతో అలంకరించిన రంగవల్లికలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తొలుత పుష్కర మహోత్సవాలను ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జి.మధుసూదనరావు, ఏసీపీ రాజీవ్‌కుమార్, పలువురు ఉద్యోగులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అదే విధంగా పుష్కర యాత్రికులకు తెలుగు సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక స్వాగత ఏర్పాట్లు చేశారు.