breaking news
Punjab Assembly election
-
రాఖీ పండుగను ఇలా వాడుకుంటున్న రాజకీయ పార్టీలు
‘‘ఆలస్యం అమృతం విషం’’ అని అంటారు. ఆలస్యం చేస్తే అమృతమైనా విషంలా మారుతుందని, అందుకే మంచి ఫలితం రావాలంటే ఆ పనినైనా సరే ఆలస్యం చేయకూడదని అంటుంటారు. దీన్ని రాజకీయ నేతలు బాగా ఒంట బట్టించుకున్నారు. పంజాబ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పార్టీల్లో ఎన్నికల సన్నాహాలు ఇప్పటికే వేగం పుంజుకున్నాయి. ప్రజలకు దగ్గర కావడానికి పండుగలను బాగా వాడేసుకుంటున్నాయి. ఈ కార్యక్రమాల ద్వారా పార్టీలు తమ ఐక్యత, సంస్థాగత బలం, ప్రజల్లో ఉన్న పట్టును ప్రదర్శించుకోవాలని చూస్తున్నాయి.రక్షాబంధన్‌ను కేవలం పండుగగా కాకుండా రాజకీయంగా కూడా పార్టీలు ఉపయోగించుకుంటున్నాయి. అమృత్‌సర్‌లో బీజేపీ ‘రాఖ్రీ మహా సమ్మేళన్’ నిర్వహించి పార్టీ కార్యకర్తలు, ప్రజలతో అనుబంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేసింది. రక్షాబంధన్ సందర్భంగా జరిగే కార్యక్రమాలు పార్టీలు తమపై ఉన్న ప్రతికూల భావనలను తగ్గించుకుని, ప్రజల్లో తమ ఇమేజ్ను మెరుగుపరుచుకునే వేదికలుగా మారుతున్నాయి. అదే సమయంలో ఆగస్టు 28న బాబా బకాలా సమీపంలోని రైయాలో జరిగే రాఖర్ పున్నియా కార్యక్రమంపైనా రాజకీయ పార్టీల దృష్టి ఉంది. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని జరిగే సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పంజాబ్ రాజకీయ పార్టీలు ముందుగా తమ కార్యకర్తలను ఏకం చేసి, తమ ఇమేజ్ను సరిచేసుకుని, 2027 ఎన్నికలకు ఇంటి నుంచే సిద్ధమవుతున్నాయి.రాఖర్ పున్నియాకు రాజకీయ ప్రాధాన్యంరక్షాబంధన్ సందర్భంగా పంజాబ్‌లోని రాజకీయ పార్టీలు తమ రాజకీయ బలాన్ని, కార్యకర్తల ఐక్యతను చాటుకునేందుకు ఈ పండుగను వేదికగా ఉపయోగించుకుంటున్నాయి. ఆగస్టు 28న బాబా బకాలా సమీపంలోని రైయాలో జరిగే రాఖర్ పున్నియా కార్యక్రమానికి రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రభుత్వం ఈ సందర్భంగా భారీ రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీ దళ్, వారిస్ పంజాబ్ దే వంటి పార్టీలు ఒకే ప్రాంతంలో తమ ఉనికిని చాటుకునేందుకు సిద్ధమవుతున్నాయి. బీజేపీ పంజాబ్‌లో తన సంస్థాగత విస్తరణను చూపించాలనుకుంటుండగా, ఆప్ ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. అకాలీ దళ్ తన కార్యకర్తల బలాన్ని తిరిగి ప్రదర్శించాలని భావిస్తుండగా, వారిస్ పంజాబ్ దే పంథిక్ రాజకీయాల్లో తన స్థానాన్ని బలపర్చుకునే ప్రయత్నం చేస్తోంది.అయితే ఈ దశలో పార్టీలు నేరుగా ఓటర్లను ఆకట్టుకోవడం కంటే ముందుగా తమ కార్యకర్తలను చైతన్యపరచడం, క్రమశిక్షణలోకి తీసుకురావడం, విభేదాలను పరిష్కరించడం, సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టి పెడుతున్నాయి. బూత్ స్థాయి సమావేశాలు, ర్యాలీలు, సంస్థాగత భేటీలు పెరుగుతున్నాయి. బీజేపీ పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు చెబుతోంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పలు జిల్లాల్లో పర్యటించి బూత్ స్థాయి నిర్మాణాన్ని బలోపేతం చేస్తున్నారు. గతంలో శిరోమణి అకాలీదళ్‌తో పొత్తుపై ఆధారపడిన బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో తన సొంత సంస్థాగత బలం పెంచుకోవడం కీలకంగా మారింది. అయితే బీజేపీ-అకాలీదళ్ మధ్య భవిష్యత్ పొత్తుపై ఊహాగానాలు కొనసాగుతుండటం పార్టీకి అంతర్గత పరీక్షగా మారింది.కాంగ్రెస్‌కు సంస్థాగత బలం ఉన్నప్పటికీ నేతల మధ్య విభేదాలు ప్రధాన సమస్యగా ఉన్నాయి. భూపేష్ బఘేల్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తుండగా, రాహుల్ గాంధీ నేతృత్వంలో రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో పలువురు కీలక నేతలు ఒకే వేదికపైకి రానున్నారు. కాంగ్రెస్ ముందుగా తనలో తాను ఐక్యతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉందని విశ్లేషణ పేర్కొంటోంది.ఆమ్ ఆద్మీ పార్టీకి మరో సవాలు అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి మరో సవాలు ఉంది. 2022లో 117 స్థానాల్లో 92 గెలిచిన ఆ పార్టీ ఇప్పుడు మార్పు కోసం హామీలు ఇచ్చే పార్టీగా కాకుండా, తన పాలనను సమర్థించుకోవాల్సిన అధికార పార్టీగా ఎన్నికలను ఎదుర్కోనుంది. ప్రభుత్వ పథకాలు, సాధించిన విజయాలను ఇంటింటికీ తీసుకెళ్లేందుకు బూత్ స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. మరోవైపు శిరోమణి అకాలీదళ్ గత ఎన్నికల పరాజయాల తర్వాత తన రాజకీయ ప్రాభవాన్ని తిరిగి సాధించేందుకు ‘పంజాబ్ బచావో’ ర్యాలీలను నిర్వహిస్తోంది.ఆగస్టు 28న బాబా బకాలా సమీపంలోని రయ్యాలో జరగనున్న రఖర్ పున్నియా కార్యక్రమం కూడా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బీజేపీ తన విస్తరణను చూపించేందుకు, ఆప్ తన ప్రభుత్వాన్ని ప్రదర్శించేందుకు, అకాలీదళ్ తన కార్యకర్తల బలాన్ని చాటేందుకు, వారిస్ పంజాబ్ దే పంథిక్ రాజకీయాల్లో తన స్థానం కోసం ఈ వేదికను ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. అయితే భారీ ర్యాలీలు ఓట్లుగా మారవు. చివరకు కార్యకర్తల చురుకుదనం, స్థానిక సంస్థాగత బలం, ప్రజలతో నిరంతర సంబంధమే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తుంది. -
బీజేపీ పొలిటికల్ గేమ్.. బెంగాల్ తర్వాత ఆ రాష్ట్రమే!
కేంద్రంలోని అధికార బీజేపీ పక్కా ప్లాన్ ప్రకారం పొలిటికల్ గేమ్‌తో ముందుకు సాగుతోంది. ఇప్పటికే బీహార్ రాజకీయాల్లో బీజేపీకి తొలిసారిగా ముఖ్యమంత్రి పీఠం దక్కింది. అటు బెంగాల్లో కూడా విజయం బీజేపీదేనని కాషాయ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, తదుపరి బీజేపీ టార్గెట్ పంజాబ్ అనే వార్తలు జాతీయ స్థాయిలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే బీజేపీలోకి రాఘవ్ చద్దా సహా పలువురు నేతల చేరికలు అనే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్లాన్ ప్రకారమే బీజేపీ అడుగులు వేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. మరి పంజాబ్‌లో బీజేపీకి అధికారం అంత సులువు కాదనే విషయాన్ని కూడా కొందరు ప్రస్తావిస్తున్నారు. బీహార్‌లో సంబరాలు జరుగుతుండగా గంగానది బీహార్ నుండి బెంగాల్‌కు ప్రవహిస్తుందని ప్రధాని మోదీ ప్రకటించి.. తదుపరి ఎన్నికల పోరుకు సంకేతం ఇచ్చారు. ఇప్పుడు, బెంగాల్ దంగల్ ముగియక ముందే పంజాబ్ యుద్ధం మొదలైంది. బీజేపీ ఎన్నికల రథం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందన్న సంకేతాలిస్తూ.. పంజాబ్‌లో 2027 ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికలపై కాషాయ దళం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ పొలిటికల్ గేమ్‌లో భాగంగా పంజాబ్ రాజకీయాల్లోకి వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ఎంపీలు రాఘవ్ చద్దా, పంజాబ్‌కు చెందిన మరో ఐదుగురు ఎంపీలు బీజేపీలో చేరడం ఈ విషయాన్నే సూచిస్తుంది.బీజేపీ సమస్య.. అయితే, పంజాబ్‌లో బీజేపీ ఎన్నడూ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. పంజాబ్‌లో బీజేపీకి స్థానిక నాయకుల కొరత ఉంది. పంజాబ్‌లో బీజేపీకి ప్రధాన సవాళ్లు స్థానిక నాయకత్వం లోపం, సిక్కు రైతు వర్గం నమ్మకం పొందడం. అలాగే, దశాబ్దాలుగా శిరోమణి అకాలీ దళ్ (SAD)కు జూనియర్ భాగస్వామిగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం. వ్యవసాయ బిల్లుల విషయంలో 2020లో విడిపోవడానికి ముందు శిరోమణి.. బీజేపీకి మిత్రపక్షంగా ఉంది. ఈ నేపథ్యంలో కాషాయ పార్టీకి అధికారం కావాలంటే దానికి రాష్ట్రంతో సంబంధం ఉన్న నాయకులు అవసరం. ప్రస్తుతం పంజాబ్‌లో బీజేపీకి ఉన్న ఏకైక ప్రముఖ నాయకుడు రవ్నీత్ సింగ్ బిట్టు. ఆయన కాంగ్రెస్ నుండి పార్టీలోకి మారారు. దీంతో, పాత నాయకులు, కొత్తగా చేరిన వారి మధ్య విభేదాలు, వ్యూహాత్మక గందరగోళం నెలకొంది.అవకాశాలు.. మరోవైపు.. ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే మరి కొందరు కీలక నేతలు కావాల్సిందే. ఈ విషయంలోనే ఆప్ నుండి బీజేపీలోకి వలసలు ప్రారంభమయ్యాయి. రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, ఇతర ఎంపీల పాత్ర పంజాబ్‌లో బీజేపీకి ఎంతో కీలకం కానుంది. ఎంపీలు రాఘవ్ చద్దా, హర్భజన్ సింగ్, విక్రమ్ సాహ్నే వంటి ప్రముఖులు బీజేపీలో చేరడం ఆమ్ ఆద్మీ పార్టీలో విభజనను చూపిస్తోంది. దీంతో, బీజేపీకి కొత్త ఓటర్లను ఆకర్షించే అవకాశం ఏర్పడింది. రాఘవ్ చద్దా వంటి యువ నాయకులు బీజేపీకి పట్టణ, చదువుకున్న, మధ్యతరగతి ఓటర్లలో ప్రభావం చూపే అవకాశం ఉంది. అకాళీదళ్ బలహీనతతో సిక్కు మతపరమైన ఓటు బ్యాంక్ బీజేపీ వైపు మళ్లే చాన్స్ కూడా ఉంది. ఇదిలా ఉండగా.. పట్టణ హిందూ ఓటర్లలో కాంగ్రెస్ ప్రభావం తగ్గడం బీజేపీకి ప్రధానంగా లాభం కావచ్చు.బీజేపీ వ్యూహాలు.. రైతు వర్గం నమ్మకం పొందడం బీజేపీకి అత్యవసరం. వ్యవసాయ చట్టాలపై నిరసనల తర్వాత బీజేపీపై రైతు వర్గంలో వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతు ఇచ్చే విధానాలు, ఎంఎస్పీ హామీలు, వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై బీజేపీ హామీ ఇస్తే అది పార్టీకి మైలేజ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఎంపీల చేరిక కూడా బీజేపీకి ప్లస్ కాగా.. అధికార ఆప్, కాంగ్రెస్ పార్టీలకు భారీ ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి.గత ఫలితాలు.. పంజాబ్‌లో 2022లో జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. రాష్ట్రంలో 117 అసెంబ్లీలో 92 స్థానాలు గెలిచి, పంజాబ్‌లో తొలిసారి పూర్తి మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ కేవలం 18 స్థానాలకు పరిమితమైంది. ఇదే సమయంలో శిరోమణి అకాళీదల్ 15 నుంచి 3 స్థానాలకు పడిపోయింది. బీజేపీ స్వతంత్రంగా పోటీ చేసినప్పటికీ, పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. -
దౌబాలో నువ్వా నేనా?
ముక్కోణ, చతుర్ముఖ పోటీలు దౌబాలో చాలా స్థానాల్లో త్రిముఖ, చతుర్ముఖ పోటీ నెలకొంది. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చమ్‌కౌర్ సాహిబ్ నుంచి సీఎం చన్నీ నాలుగోసారి బరిలో దిగారు. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఆప్ అభ్యర్థి డాక్టర్ చరణ్‌జిత్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక జలంధర్ కాంట్‌లో పంజాబ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, విద్యా, క్రీడల మంత్రి పర్గత్ సింగ్ మూడోసారి బరిలో దిగారు. అకాలీదళ్ నుంచి జగ్బీర్ బ్రార్, బీజేపీ నుంచి సరబ్జిత్ సింగ్ మక్కర్, ఆప్ నుంచి సురీందర్ సింగ్ సోధి ఆయనకు గట్టి పోటీ ఇస్తున్నారు. హోషియార్పూర్, ఫగ్వారా, నవాన్షహర్ సహా పలు అసెంబ్లీ స్థానాల్లో హోరాహోరీ పోటీ ఖాయంగా కన్పిస్తోంది. దళితులను బాగా ప్రభావితం చేయగల డేరాలను ప్రసన్నం చేసుకునేందుకు కూడా పార్టీలు పోటాపోటీగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నారై బెల్ట్‌గా పేరున్న పంజాబ్‌లోని దౌబా ప్రాంతంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు నెగ్గేందుకు కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. దళిత ప్రాబల్య ప్రాంతం కావడంతో ఆ వర్గాన్ని ఆకట్టుకొనేందుకు జోరుగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే వారికి రకరకాల వాగ్దానాలు చేశాయి. అకాలీదళ్ తన కుల సమీకరణాలను సరిదిద్దుకొనేందుకు బీఎస్పీతో పొత్తు పెట్టుకుంది. దళితులకు డిప్యూటీ సీఎం పదవి ప్రకటించింది. బీజేపీ అయితే వారికి సీఎం పదవే హామీ ఇచ్చింది. ఇక కాంగ్రెస్ దళితుడైన చరణ్‌జిత్ సింగ్ చన్నీని మళ్లీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. జలంధర్, కపుర్తలా, హోషియార్పూర్, నవాన్షహర్ జిల్లాలతో కూడిన దౌబాలో 23 అసెంబ్లీ స్థానాలున్నాయి. 20న పోలింగ్ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బీఎస్పీ చీఫ్ మాయావతి తదితరులు ఇప్పటికే దోబాలో ప్రచారం చేశారు. దోబాలో దళితుల రాజకీయ ఆధిపత్యం కొనసాగుతోంది. ఇక్కడి జనాభాలో 45 శాతం దాకా దళితులున్నారని అంచనా. వీరు ప్రధానంగా రెండు వర్గాలు. గురు రవిదాస్ అనుయాయులైన రవిదాసియాలు ఒక వర్గం కాగా, వాల్మీకులు మరో వర్గం. ఇక్కడ రవిదాసియాలది ఆధిపత్యం. దౌబాలోని హోషియార్పూర్, జలంధర్ లోక్‌సభ సెగ్మెంట్లను ఎస్సీలకు రిజర్వ్ చేశారు. వీటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో వారి ఆధిపత్యం మరింతగా ఉంది. సన్యశ్యామల ప్రాంతం కావడంతో దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దౌబాలోని దళితులు ఆర్థికంగా బలంగా, ప్రభావశీలంగా ఉన్నారు. ఏ ఎన్నికల్లోనూ వీరు ఒకే పార్టీకి ఏకమొత్తంగా ఓట్లు వేసిన దాఖలాల్లేవు. గత ఎన్నికల్లో దౌబాలో 15 సీట్లు నెగ్గి ఆధిపత్యం ప్రదర్శించిన కాంగ్రెస్‌కు ఈసారి గట్టి పోటీ ఎదురవుతోంది. – సాక్షి, న్యూఢిల్లీ -
ఇరకాటంలో సిద్ధూ
న్యూఢిల్లీ: 'నేను రాజకీయాల్లోకి రానని చెప్పారు. కానీ ఆమ్ ఆద్మీ పేరుతో పార్టీ పెట్టారు. వ్యక్తిగత భద్రత తీసుకోనని ప్రకటించారు. తర్వాత జడ్ కేటగిరీ భద్రత పెట్టించుకున్నారు. నేను ప్రభుత్వ బంగ్లా తీసుకోనని అన్నారు. ఈ మాట కూడా నిలుపుకోకుండా ప్రభుత్వ బంగ్లా తీసుకున్నారు. అంతేకాదు స్వయంగా ఆయనే ఫ్లోరింగ్ శుభ్రం చేసుకుంటారు... నేను చెప్పిదంతా అబద్ధమా' ఇవి 'ఆప్' జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై గతంలో మాజీ క్రికెటర్, బీజేపీ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా సిద్ధూ.. 'ఆప్'లో చేరతారని ప్రచారం జరుగుతోంది. 'ఆప్' తరపున పంజాబ్ సీఎం అభ్యర్థిగా ఆయనను ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పై సిద్ధూ పలు సందర్భాల్లో గతంలో చేసిన విమర్శలను ఆయన ప్రత్యర్థులు వెలుగులోకి తెస్తున్నారు. ఆందోళనల పేరుతో కేజ్రీవాల్ డ్రామాలు చేస్తున్నారని సిద్ధూ చేసిన విమర్శల వీడియోను బయటపెట్టారు. మంచి వక్తగా పేరు పొందిన సిద్ధూ దీంతో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవేళ ఆయన ఆప్ చేరితే డ్రామాలు చేస్తున్నారని ఆరోపించిన కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఆయన ఆమోదించాల్సి ఉంటుంది. 'సామాన్య సీఎం'కు వ్యతిరేకంగా చేసిన విమర్శలను సిద్ధూ ఏవిధంగా సమర్థించుకుంటారో చూడాలి. కాగా తన భర్త అటు రాజ్యసభ సభ్యత్వంతో పాటు బీజేపీకి కూడా రాజీనామా చేశారని సిద్ధూ భార్య నవ్‌జోత్ కౌర్ సిద్ధూ వెల్లడించారు.


