breaking news
Playing cricket
-
సహజమిది.. స్వరం విప్పండి
ఇది నొప్పి కాదు. ఇది వేదన. తెలిసీ మాట్లాడని నిర్లక్ష్యం. గ్రౌండ్లో గోల్డ్ కోసం పరిగెత్తే మహిళ... ప్యాడ్ కోసం మాత్రం మౌనంగా ఉండిపోవాల్సి వస్తోంది. స్మృతి మంధాన టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఆపి చెప్పింది. అంతర్జాతీయ అథ్లెట్లు ఎన్నోసార్లు ఎలుగెత్తారు. కానీ మన ఊరి అకాడమీలో స్కూల్ గ్రౌండ్లో ఇంకా అదే భయం. ‘మరక పడుతుందేమో’ ‘కోచ్ ఏమనుకుంటారో’ ‘చాన్స్‌పోతుందేమో’ ఈ భయాలతో ఎంతోమంది చాంపియన్లు కలలకు నీళ్లు వదులుకుంటున్నారు. పీరియడ్స్ బలహీనత కాదు. దాచాల్సిన సిగ్గు కాదు. ఇది ఆరోగ్యం. ఇది హక్కు. అందుకే ఇది మాట్లాడాల్సిన సమయం. మౌనం వీడాలి. మహిళా క్రీడాకారిణి ఆరోగ్యం కోసం– ఇప్పుడే మాట్లాడు! # Period is Not a Pain‘‘ఒక టెస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తుండగా సడన్‌గా పీరియడ్స్ ప్రారంభమయ్యాయి. వైట్ జెర్సీ డ్రెస్.. అంపైర్ వద్దకు వెళ్లి ‘శానిటరీ ప్యాడ్ మార్చుకోవడానికి వెళ్లాలి’ అని చెప్పాను. భారత్‌కు ఆడుతున్నప్పుడు వ్యక్తిగత నొప్పి కంటే జట్టు బాధ్యతే మా ముందుంటుంది. అయినా ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం అవసరం. ఒక మహిళా క్రికెటర్ క్రీడలో ప్రత్యర్థుల ఆటతీరు, వాతావరణ పరిస్థితులు, క్రికెట్ గ్రౌండ్ గురించి మాత్రమే కాదు పీరియడ్స్ గురించి కూడా చాలా క్యాజువల్ గా మాట్లాడే పరిస్థితి ఉండాలి. ’’ – స్మృతి మంధాన, భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ఈ వ్యాఖ్యలు మహిళా క్రికెటర్లు ఎదుర్కొనే వాస్తవ పరిస్థితులపై చర్చకు దారితీశాయి. ఆమె తన అనుభవాన్ని ఓపెన్‌గా చెప్పడం ద్వారా పీరియడ్స్ గురించి మాట్లాడటం తప్పు కాదని స్పష్టం చేశారు. అలాగే చైనా స్విమ్మర్ ఫు యువాన్ హుయ్, బ్రిటన్ రన్నర్ ఈలిష్ మెక్‌కోల్గన్, హాకీప్లేయర్ ఒలింపిక్ స్వర్ణవిజేత సామ్ క్వెక్ వంటి అంతర్జాతీయ అథ్లెట్లు కూడా పీరియడ్స్ అనేవి దాచాల్సిన విషయం కాదని, మహిళల శారీరక వాస్తవాలను అర్థం చేసుకునేలా క్రీడావ్యవస్థ మారాలని కోరారు.మానసిక ఆరోగ్యంపై ప్రభావంపోటీ సమయంలో పీరియడ్స్ వస్తాయేమో అని మానసిక ఒత్తిడినే ఎదుర్కొంటారు.పోటీరోజు పీరియడ్స్ వస్తాయేమో అని, యూనిఫామ్ పై మరకలు పడతాయేమోననే భయం, ఇతరులు ఎలా స్పందిస్తారన్న ఆందోళన... ఇవన్నీ వారి ఆటతీరుపై ప్రభావం చూపవచ్చు. అందుకే స్పోర్ట్స్ సైకాలజీ కూడా మహిళా క్రీడాకారిణుల శిక్షణలో భాగం కావాలి. పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడగల వాతావరణం ఏర్పడితే ఈ ఒత్తిడి తగ్గుతుంది. పీరియడ్స్ ఆగిపోతే..కొన్ని క్రీడల్లో బరువు తగ్గవలసి ఉంటుంది. అందుకోసం అధిక వ్యాయామం చేస్తూ, తక్కువ ఆహారం తీసుకుంటారు. దీనివల్ల కొందరు మహిళా అథ్లెట్లలో పీరియడ్స్ నెలల తరబడి ఆగిపోతాయి. ఇది మంచి సంకేతం కాదు. హార్మోన్ల అసమతుల్యతకు, ఎముకల శక్తి తగ్గడానికి, అలసట, గాయాల ప్రమాదం పెరగడానికి, భవిష్యత్తులో సంతానోత్పత్తి సమస్యలకు కారణమవుతుంది. అందుకే రుతుక్రమం ఆగిపోవడాన్ని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.ఇవి తప్పనిసరి.. ⇒ ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళా అథ్లెట్ల కోసం ప్రత్యేక ఆరోగ్య విధానాలు అమలవుతున్నాయి. రుతుచక్రాన్ని నమోదు చేసే యాప్‌లు, వ్యక్తిగత శిక్షణ ప్రణాళికలు, స్పోర్ట్స్ గైనకాలజిస్టులు, ప్రత్యేకపోషకాహార నిపుణులు, స్పోర్ట్స్ సైకాలజిస్టులు అందుబాటులో ఉంటున్నారు.⇒ మన దేశంలోనూ కొంత మార్పు వచ్చినప్పటికీ ఇంకా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే మహిళా క్రీడాకారిణులకు ఇప్పటికీ సరైన అవగాహన, శానిటరీ సదుపాయాలు, వైద్య సహాయం సరిగ్గా అందడం లేదు. ఈ అసమానతను తగ్గించడం అత్యవసరం.⇒ పీరియడ్స్ గురించి మాట్లాడితే అది సిగ్గు కాదు. శరీర ఆరోగ్యంపై మాట్లాడటం తప్పనిసరి అవసరం. స్పోర్ట్స్ అకాడమీలు, స్కూళ్లు, కాలేజీలు, స్పోర్ట్స్ అథారిటీలు ..ఈ అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కోచ్‌లకు కూడా మహిళల శారీరక ఆరోగ్యంపై శిక్షణ ఇవ్వాలి.ఏ దేశమైనా మహిళా అథ్లెట్లు ఎన్ని పతకాలు తెచ్చారన్నదే ముఖ్యం కాదు. వారి ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల తీసుకునే శ్రద్ధనే కీలకం. మహిళా అథ్లెట్ల ఆరోగ్యాన్ని కాపాడే వ్యవస్థను నిర్మించినప్పుడే క్రీడారంగం నిజమైన విజయం సాధించినట్టవుతుంది. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిసర్వేలు ఏం చెబుతున్నాయంటే...⇒ ప్రపంచ వ్యాప్తంగా 2.1 బిలియన్ల మంది మహిళలు, కౌమార బాలికలు పీరియడ్స్‌లో ఉంటారని అంచనా. కానీ, 500 మంది మిలియన్ స్త్రీలకు పీరియడ్‌కు సంబంధించిన సరైన సదుపాయాలు లేవని సర్వేలు చేబుతున్నాయి. ⇒ రుతుస్రావం అనేది ఒక సహజ శారీరక ప్రక్రియ, కానీ రుతుస్రావం అయ్యే వ్యక్తులు దానిని విభిన్నంగా అనుభవిస్తారు. ప్రతి ముగ్గురు స్త్రీలు, బాలికలలో ఇద్దరికంటే ఎక్కువ మందికి రుతుస్రావ సమయంలో నొప్పి ఉంటుంది. కొద్దిమందికి, రుతుస్రావ నొప్పి చాలా తీవ్రంగా ఉండవచ్చు. ⇒ రుతుస్రావం అయ్యే చాలా మంది స్త్రీలలో అధిక రక్తస్రావం సమస్య ఉంటుంది. దీనివల్ల రక్తహీనత వచ్చే అవకాశం ఉంది.మార్పులను గమనించి శిక్షణశరీర మార్పును మైండ్ అర్థం చేసుకొని స్పోర్ట్కి సన్నద్ధం కావాలి. మహిళ పీరియడ్స్ వివిధ దశల్లో హార్మోన్ల స్థాయులలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు కొందరిలో కండరాల పనితీరు, శక్తి, శరీర ఉష్ణోగ్రత, మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. పీరియడ్స్‌కు ఒక అథ్లెట్ శరీరం ఎలా స్పందిస్తుందో గమనించి, దానికి అనుగుణంగా శిక్షణ, విశ్రాంతి,పోషకాహారాన్ని ఇవ్వాలి. మన దేశంలో ఇప్పటికీ చాలామంది మహిళా అథ్లెట్లు కోచ్‌తో పీరియడ్స్ గురించి మాట్లాడటానికి సంకోచిస్తారు. చాలా మందికి ఈ అంశంపై తగిన అవగాహన ఉండదు.దీంతో నొప్పితో ఉన్నప్పటికీ, అదే తీవ్రతతో శిక్షణ కొనసాగిస్తుంటారు. ఇది మారాలి. ముందు తన శరీరాన్ని అర్థం చేసుకోవాలి. అవసరమైతే వ్యాయామ తీవ్రతను తగ్గించడం, రికవరీ సమయం పెంచడం,పోషకాహార నిపుణులతో సంప్రదించడం వంటి చర్యలు తీసుకోవాలి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పీరియడ్స్ సమయంలో శరీరంలో వచ్చే మార్పులు, మనస్తత్వం పైనా ఎలాంటి ప్రభావం చూపుతాయో అథ్టెట్ల్స్‌కు అవగాహన కల్పిస్తాం. – కె. హిందోళ, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ -
క్రికెట్ ఆడుతుండగా పిడుగుపాటు.. ఇద్దరి మృతి
సాక్షి, ప్రకాశం జిల్లా: బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతుండగా పిడుగుపడి గోషిపోతల ఆకాష్ (17), పులిగుజు తన్ని (18) అనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. కంభంలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.సీలేరు నదిలో పడి..అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం కల్లేరులో విషాదం జరిగింది. సీలేరు నదిలో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నదిలో కొట్టుకుపోయిన చింతూరుకు చెందిన శ్రీను, దిలీప్ అనే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ఒకరిని రక్షించే క్రమంలో మరో యువకుడు కూడా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. -
క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు
మేడ్చల్‌రూరల్: క్రికెట్ ఆడుతూ ఓ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కండ్లకోయలోని సీఎంఆర్‌ఈసీ కళాశాలలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సీఎంఆర్‌ఈసీ కళాశాలతో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి క్రికెట్ ఆడేందుకు కళాశాల ఆవరణలోని గ్రౌండ్‌కు వెళ్లాడు. ఆటలో భాగంగా ఫీల్డింగ్ చేస్తున్న వినయ్ గుండపోటు రావడంతో ఒక్కసారిగా గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. తోటి విద్యార్థులు అతడిని సమీపంలోని సీఎంఆర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతుడు వినయ్ ఖమ్మం జిల్లాకు చెందిన పేద విద్యార్థి .. తల్లిదండ్రులు రోజు కూలీ చేస్తూ తమ కుమారుడిని ఉన్నత చదువు చదివిస్తున్నట్లు తెలిసింది. -
సిక్స్ కొట్టబోయి..
-
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో మృతి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
బ్యాటింగ్‌తో అదరగొడుతున్న ‘యంగ్ విరాట్’.. వీడియో వైరల్
శ్రీనగర్: మహిళ క్రికెట్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. అయినప్పటికీ ఆ వైపుగా బాలికలను ప్రోత్సహించేవారు చాలా తక్కువ. అలాంటిది జమ్ముకశ్మీర్ వంటి ప్రాంతాల్లో అస్సలు ఊహించలేం. కానీ, ఎప్పుడూ తుపాకుల మోతలతో దద్దరిల్లే ప్రాంతంలో ఓ చిన్నారి క్రికెట్ బ్యాటు పట్టింది. తన బ్యాటింగ్ నైపుణ్యంతో అందరి చూపును తనవైపునకు తిప్పుకుంటోంది. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న ఆ విద్యార్థిని వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లద్దాఖ్‌లోని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(డీఎస్ఈ) ఆ వీడియోను ట్విటర్లో షేర్ చేసింది. తన క్రికెట్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆరో తరగతి విద్యార్థిని మాక్సూమాగా గుర్తించినట్లు పేర్కొంది. ‘ఇంటి వద్ద మా నాన్న, స్కూల్లో మా టీచర్ క్రికెట్ ఆడమని ప్రోత్సహించారు. విరాట్ కోహ్లీలా ఆడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నాను. హెలికాప్టర్ వంటి షాట్స్ ఎలా ఆడాలి అనేది నేర్చుకుంటున్నా. నాకు ఇష్టమైన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఆయనలాగే ఆడాలనుకుంటున్నా.’ అని విద్యార్థిని మాక్సూమా పేర్కొంది. వీడియోలో.. క్రికెట్ ఆడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఓ బంతిని ఏకంగా గ్రౌండ్ బయటకు పంపిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. శుక్రవారం వీడియో పోస్ట్ చేయగా 25వేల వ్యూస్, 1,200 లైక్స్ వచ్చాయి. My father at home and my teacher at school encourage me to play cricket. I'll put all my efforts to play like @imVkohli Maqsooma student class 6th #HSKaksar pic.twitter.com/2ULB4yAyBt — DSE, Ladakh (@dse_ladakh) October 14, 2022 ఇదీ చదవండి: రూ. 9 లక్షల లోన్ కట్టాలని బ్యాంక్ నోటీస్.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది -
చీకటిని జయించిన రాజు
సాధించాలన్న తపన ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చు. అందుకు వయస్సు, అంగ వైకల్యం అడ్డురాదు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. ఆ కళ్లే లేకుంటే ప్రపంచమే అంధకారం. కాని చూపు లేకున్నా తాను ఎవ్వరికీ ఎందులోనూ తీసిపోనని నిరూపించారు పుష్పరాజ్. చిన్నప్పుడే కంటి చూపుకోల్పోయినా ఉన్నత చదువులు చదివి ప్రధానోపాధ్యాయుడి స్థాయికి చేరుకున్నారు. మరో వైపు క్రికెట్లో రాణిస్తూ ఎన్నో పతకాలను కైవసం చేసుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచారు. సాక్షి, కర్నూలు : కర్నూలు నగరానికి చెందిన సిమ్మన్స్, రాజేశ్వరి దంపతులకు పుష్పరాజ్, అశోక్ సంతానం. ఇందులో పెద్ద కుమారుడు పుష్పరాజ్.. చిన్న వయస్సులోనే కంటి చూపును కోల్పోయారు. అతనికి ఏడవ ఏటవచ్చే సరికి తండ్రి చనిపోయారు. తల్లి రాజేశ్వరి అధైర్యపడకుండా కర్నూల్లోని ఓ ప్రవేయిటు పాఠశాల్లో ఆయాగా చేరారు. పేదరికంలో ఉన్నప్పటికీ కుమారుడు పుష్పరాజ్‌కు కంటి చూపును తెచ్చుకోపవడానికి ప్రయత్నించారు. అప్పుచేసి ఎనిమిది సార్లు శస్త్ర చికిత్సలు చేయించారు. అయానా ఫలితం దక్కలేదు. పుష్పరాజ్‌ను ఉన్నత చదువులను చదివించాలని భావించి హైదరాబాద్‌లో ఉన్న దేవనగర్ అంధుల పాఠశాల్లో చేర్పించారు. అక్కడ 10వ తరగతి పూర్తిచేశారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో 490 మార్కులను సాధించి అప్పటి రాష్ట్ర గవర్నర్‌గా పని చేసిన రంగరాజన్ చేతులమీదుగా ఉత్తమ విద్యార్థిగా పురస్కారాన్ని అందుకున్నారు. పాఠశాల స్థాయిలో క్రికెట్లో మెలకువలు నేర్చుకున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మంచి బ్యాట్స్‌మెన్‌గా రాణించారు. సంరక్షుడి నుంచి ఉపాధ్యాయుడిగా.. పదో తరగతి అనంతరం పుష్పరాజ్.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో హెచ్ఈసీ గ్రూపు తీసుకున్నారు. నిజాం కళాశాలలో బీఏ చదివారు. హైదరాబాద్‌లోనే వసతి గృహంలో ఉంటూ బీఈడీను పూర్తి చేశారు. క్రికెట్లోనూ రాణిస్తూ అందరి మన్ననలు అందుకున్నారు. భారత అంధుల క్రికెట్ జట్టుకు సేవలు అందించారు. వసతి గృహ సంరక్షుడి ఉద్యోగానికి ఎంపికై మద్దికెరలో రెండేళ్లు పనిచేశారు. విద్యార్థులకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను 2007లో ఉత్తమ వసతి గృహ సంరక్షుడి ఆవార్డు వరించింది. అదే ఏడాదిలో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సన్మానం అందుకున్నారు. క్రికెట్లో రాణించినందుకు 2012లో అప్పటి సీఎం కిరుణ్కుమార్రెడ్డి చేత సన్మానాన్ని పొందారు. స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం రావడంతో వసతి గృహ సంరక్షుడి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆలూరు బాలుర ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడి పనిచేస్తున్నారు. మారుతున్న కాలంతోపాటు సాంకేతికతను పుష్పరాజ్ అందిపుచ్చుకున్నారు. తన ల్యాప్‌టాప్ ద్వారా ఆన్లైన్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించడంలో పుష్పరాజ్ దిట్ట. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సైతం ఈయన కైవసం చేసుకున్నారు. ధైర్యమే నా ఆయుధం.. వైకల్యం ఉందని బాధపడితే నేను ఈ స్థాయిలో ఉండేవాన్ని కాదు. ధైర్యమే ఆయుధంగా ముందుకు సాగాను. ప్రస్తుతం ఆలూరు ప్రభుత్వ బాలుర పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా ఉన్నాను. నా విజయానికి కృషి, పట్టుదల, క్రమశిక్షణే కారనం. కంటిచూపు లేదని నేను ఎన్నడూ బాధపడలేదు. అమ్మ ప్రోత్సాహంతో ఈస్థితికి చేరుకున్నాను. ప్రతి ఒక్కరిలో ఏదో రకమైన ప్రతిభ దాగి ఉంటుంది, దానిని వెలికి తీసినప్పుడు విజయం తప్పక వరిస్తుంది. – పుష్పరాజ్ -
క్రికెట్ ఆడుతూ ప్రాణాలు పోగొట్టుకున్న బాలుడు
-
రోజులాగానే క్రికెట్ ఆడేందుకు వెళ్లి..!
న్యూఢిల్లీ: రోజులాగానే ఆడుకునేందుకు వెళ్లిన కొందరు టీనేజీ యువకులు ఓ నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్టేషన్ ఆఫీసర్ సూరజ్ ఖండ్ పంకజ్ కుమార్ కథనం ప్రకారం.. రవి అనే వ్యక్తి ఓ యువతితో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం వీరు ఆరావళీ పర్వత ప్రాంతానికి వచ్చారు. అదే సమయంలో అక్కడ కొందరు కుర్రాళ్లు క్రికెట్ ఆడుతున్నారు. ఎవరూ వెళ్లని ప్రదేశానికి(అటవీ ప్రాంతం లోనికి) వీరు వెళ్లడాన్ని గమనించిన యువకులు వాళ్లను వెంబడించారు. రవి తనతో వచ్చిన యువతిని గొంతు నులిమి హత్యచేసి, బండరాయితో ఆమె తలపై మోదాడు. యువకులు ఘటనా ప్రదేశానికి సమీపించగానే యువతి మృతదేహాన్ని కప్పిఉంచే యత్నం చేశాడు. వారు మృతదేహాన్ని గమనిస్తారని భావించిన రవి వెంటనే అక్కడినుంచి పరారయ్యేందుకు యత్నించాడు. మేము ఆ వ్యక్తిని చేతులు గట్టిగా పట్టుకుని జేబులు చెక్ చేయగా అతని వద్ద ఏటీఎం కార్డులు, కొంత నగదుతో పాటు రివాల్వర్ ఉన్నట్లు సమాచారం. రవి వద్ద ఉన్న వస్తువులు తీసుకుని పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పారు. అక్కడికి వచ్చిన పోలీసులు నిందితుడిని స్టేషన్ కు తరలించి విచారణ చేయగా.. తనకు ఇదివరకే పెళ్లయిందని, ప్రస్తుతం తాను హత్య చేసిన యువతితో గత ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్నట్లు వెల్లడించాడు. యువతి వద్ద ఉన్న నగదు, విలువైన వస్తువుల కోసమే ఆమెను హత్యచేశాడని స్టేషన్ ఆఫీసర్ సూరజ్ వివరించారు. -
ప్రాణం తీసిన క్రికెట్ గొడవ
న్యూఢిల్లీ: సరదాగా ఆడుతున్న క్రికెట్ ఆట కొట్లాటకు దారితీసింది. అప్పటివరకు స్నేహితులుగా ఉన్నవారు శత్రువులుగా మారారు. ఓ యువకుడు క్షణికావేశంలో క్రికెట్ బ్యాట్ తీసుకుని స్నేహితుడి తలపై బాదగా, అతను తీవ్రంగా గాయపడి మరణించాడు. ఢిల్లీలోని సాగర్పూర్ ప్రాంతంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. మృతుడిని శివం (16)గా, నిందితుడిని ఆకాశ్ (19)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆకాశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మినోరా కల్పి గ్రామంలో ఉంటున్న శివం 15 రోజుల క్రితం కుటుంబ సభ్యులు, తమ్ముడితో గడిపేందుకు ఢిల్లీకి వచ్చాడు. గత బుధవారం స్నేహితులతో కలసి క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. శివం స్నేహితుడు వెళ్లి జరిగిన విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చూడగా అప్పటికే శివం మరణించాడని అతని తండ్రి కన్నీటిపర్యంతమయ్యాడు. క్రికెట్ ఆడుతూ శివం, ఆకాశ్ గొడవపడ్డారని, ఆకాశ్ బ్యాట్‌తో కొట్టగా శివం కుప్పకూలిపోయాడని వారి స్నేహితుడు అమిత్ చెప్పాడు. కాగా శివం తల్లి మాట్లాడుతూ ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని, కుట్రపూరిత ఉద్దేశ్యముందని ఆరోపించింది. పోలీసులు మాత్రం క్రికెట్ గొడవే కారణమని చెప్పారు.


