breaking news
Pidaka
-
పిడకల ధూపం.. ఆరోగ్య ధూమం
ఆవుపేడకు ఉన్న ప్రశస్తి తెలిసినదే! ఆవుపేడతో తయారు చేసిన పిడకలను ఇదివరకటి కాలంలో పొయ్యి రాజేసుకోవడానికి వంటచెరకుగా వినియోగించేవారు. ఇప్పటికీ ఆవుపేడతో సేంద్రియ ఎరువులు, బయోగ్యాస్, అగరొత్తులు, జపమాలలు, కుండీలు, దేవుళ్ల ప్రతిమలు, ప్రమిదలు, బొమ్మలు, విభూది, పళ్లపొడి వంటి వాటి తయారీకి ఉపయోగిస్తున్నారు. అయితే, రైతు సుబ్బరాజు ఆవుపేడకు వనమూలికలను జతచేసి, అగ్నిహోత్ర పిడకలను తయారుచేస్తున్నారు.పర్యావరణ పరిరక్షణే లక్ష్యంచిత్తూరు జిల్లా నగరి మండలం, రాజులకండ్రిగకు చెందిన రైతు సుబ్బరాజు విలక్షణమైన పద్ధతిలో అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పంటలను సాగుచేసిన రైతుగా, పాడి రైతుగా తనకు గల అనుభవంతో పర్యావరణ రక్షణ కోసం ఏదైనా చేయాలనే తపనతో ఆయుర్వేద గ్రంథాలను అధ్యయనం చేయడమే కాకుండా, ఆయుర్వేద నిపుణులను కలుసుకొని, వారి సూచనలతో అగ్నిహోత్ర పిడకల తయారీకి పూనుకున్నారు. ఇంటి వద్దనే ఒక పాక వేసుకుని, ఈ అగ్నిహోత్ర పిడకలను తయారు చేస్తున్నారు.ఆయుర్వేద మూలికలతో... దేశవాళీ గిర్ ఆవుల పేడలో నెయ్యి, పాలు, పెరుగు, పంచితం, రావి, మోదుగ, జమ్మి, అర్క, గరిక, దర్భ, మేడి, చండ్ర, సరస్వతి, తామర మొదలైన సమిధలతో పాటు సాంబ్రాణి, సర్జారసం, తెల్ల గుగ్గులు, వస, జటామాంసి, ఆవాలు, కస్తూరి పసుపు, అపరాజిత, సుగంధిపాల, గ్రంథి, చెంగల్వకోష్టు, పచ్చకర్పూరం వంటి మూలికలు, ఆయుర్వేద ద్రవ్యాలను కలిపి ముద్దలు చేసి, కావలసిన ఆకారంలో పిడకలను తయారు చేసి ఎండబెడతారు. వీటి తయారీకి కావలసిన సామగ్రిని సమకూర్చుకోవడానికే ఎక్కువ సమయం పడుతుంది. అన్ని వస్తువులూ అందుబాటులో ఉంటే ఒక మనిషి రోజుకు మూడువందల వరకు పిడకలను తయారుచేసి, ఎండబెట్టవచ్చు. ఈ పిడకలను హోమద్రవ్యంగా అగ్నిహోత్రంలో వినియోగించవచ్చు. అలాగే, వీటి పొగను ఇంట్లో ధూపంగా కూడా వేయవచ్చు. ఈ పిడకల నుంచి వెలువడే పొగ సుగంధభరితంగా ఉండి, ఇంట్లోని వాతావరణాన్ని ఆధ్యాత్మికతతో నింపుతుంది. పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చి పలువురు ఈ అగ్నిహోత్ర పిడకలను ప్రత్యేకంగా కొనుగోలు చేస్తున్నారు. ఒకసారి ఈ పిడకలను వాడి, వాటి నాణ్యతను తెలుసుకున్నవారు మళ్లీ మళ్లీ వాటిని వినియోగిస్తున్నారు.ఆరోగ్యం కోసం చేస్తున్నా...ఆరోగ్యకరమైన పంటలను అందించడానికి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. అలాగే గాలిని కూడా వీలైనంత మేరకు ఆరోగ్యకరంగా మార్చాలనే ఆలోచనతోనే ఈ పిడకల తయారీని ప్రారంభించాను. పూర్వీకులు ఉదయాన సూర్యుడి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల నుంచి వెలువడే రేడియేషన్‌ను నిర్మూలించేందుకు ఆవు పేడను నీళ్లలో కలిపి కళ్లాపి చల్లేవారని ఇటీవలి ప్రయోగాల్లో కనుగొన్నారు. ఒక పిడక మీద సెల్‌ఫోన్ ఉంచినపుడు దాని నుంచి వెలువడే రేడియేషపరిమాణం తగ్గినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపినట్లు పత్రికల్లో చదివాను. ఆయుర్వేద గ్రంథాల్లో వాయు కాలుష్య నివారణకు సూచించిన మార్గాలను తెలుసుకుని, కొందరు ఆయుర్వేద నిపుణుల సలహాలతో అగ్నిహోత్ర పిడకలను తయారుచేస్తున్నాను. వీటి తయారీకి కావలసిన వస్తువులను సేకరించడం చాలా కష్టతరంగా మారింది. పది కిలోల పేడతో పిడకలు తయారు చేయాలంటే, మూడు కిలోల నెయ్యి అవసరం. వీటి తయారీకి వాడే పాలు, పెరుగు, పంచితంతో పాటు వీటిలో వేసే మూలికలు ఇక్కడ లభించవు. కొన్ని వస్తువులు చెన్నైలోని ఆయుర్వేద షాపులకు వెళ్లి తీసుకువచ్చా. ఇలా తయారుచేయాలంటే ఒక్కో పిడకకు రూ.25 ఖర్చు అవుతోంది. నేను రూ. 30కే విక్రయిస్తున్నా. లాభాల కన్నా ఆరోగ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే చేస్తున్నా.– సుబ్బరాజు, పాడిరైతు, రాజులకండ్రిగ, నగరి మండలం. కోనేరి చంద్రమోహన్, నగరి(చదవండి: మట్టి నుంచి విద్యుత్తు!) -
అమెజాన్‌లో పిడకల అమ్మకం
ఆన్లైన్ పోర్టల్స్ అపార్ట్మెంట్ల నుంచి గుండు సూది దాకా దేన్నైనా అమ్మేస్తుంటాయి. ఈ కోవలోకి కొత్తగా వచ్చి చేరిందో వస్తువు. అదేమిటో కాదండోయ్.. ఆవు పేడ. నిజమే.. ఆవుపేడతో చేసిన పిడకలకు ఇప్పు డు ఆన్లైన్లో యమ డిమాండ్. అమెజాన్, షాప్‌క్లూస్ వంటి పోర్టల్స్‌లో ఇప్పుడీ పిడక లు అందుబాటులో ఉన్నాయి. హైందవ ఆచారాల్లో శుభ కార్యానికైనా, కర్మలకైనా ఆవుపేడ తప్పనిసరి. విదేశాల్లో స్థిరపడిన వారు సైతం ఈ మధ్య ఖర్చుకు వెనుకాడకుండా అన్ని పనులు సంప్రదాయ పద్ధతుల్లో చేస్తున్నారు. తమ ఆచార వ్యవహారాలు కాపాడుకుంటున్నారు. ఏదో కార్యం పడింది.. మహానగరాల్లో అదెక్కడ దొరుకుతుందో తెలి యదు, పూజాద్రవ్యాలను అమ్మే షాపులకు వెళ్తే దొరుకుతుందనే గ్యారంటీ లేదు. అలాం టి షాపులు కూడా ఎక్కడున్నాయో వెతికి పట్టుకోవాలి. అంత ఓపిక లేని నెటిజన్లు ఇప్పుడు ఎంచక్కా మొబైల్లో ఆర్డరిచ్చే స్తున్నారు. 99 రూపాయలు మొదలు కొని 400 పైచిలుకు (ప్యాక్‌లో పిడకల సంఖ్యను బట్టి) ధరలకు ఆవుపేడ పిడకలు అమెజాన్‌లో లభిస్తున్నాయి. ఇదేదో ఆషా మాషీ వ్యవహారం కాదండోయ్. ఢిల్లీకి చెంది న ఆసియా క్రాఫ్ట్స్ యజమాని ప్రీతి కర్లాకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. ఆసియా క్రాఫ్ట్స్ మతపరమైన సామగ్రిని అమ్ముతుం ది. కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన ప్రీతి పూజాదికాల్లో ఇప్పుడేవి వాడు తున్నారో తెలుసుకోవడానికి భక్తి చానళ్లను చూస్తుంది. ఒకరోజు ఓ స్వామివారు ఆవుపేడ పిడకలను కాల్చాలని, పేడతో వాకిలి అలకాలని చెప్పడంతో... ప్రీతికి చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. ఢిల్లీ శివార్లలోని గ్రామాల నుంచి ఆవుపేడతో చేసిన పిడకలను సేకరించి ఆన్లైన్లో అమ్మడం మొదలు పెట్టింది. అయితే ఒక్కొక్కరు ఒక్కో సైజులో, మం దంతో చేస్తుండటంతో ప్యాకింగ్ కష్టమై పో యేది. దీంతో ఓ ఊరిలో సొంతంగా పిడకల తయారీని చేపట్టింది. 8 పిడకల ప్యాక్‌ను ఆసియా క్రాఫ్ట్స్ రూ.419కు అమ్ముతోంది. నెలకు 3,000 పైచిలుకు ప్యాకెట్ల ఆవుపేడ పిడకలను ఈ సంస్థ అమ్ముతోంది. విదేశాల్లో ని హిందూ ఆలయాల నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తున్నాయి. - సెంట్రల్ డెస్క్