breaking news
nearly
-
ఏటా 198 గంటల నిద్ర కోల్పోతున్న నగర జీవులు
సాక్షి, హైదరాబాద్: కునుకుపడితే మనసు కాస్త కుదుటపడతది. కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది.. అన్నచందంగా మనిషి జీవితంలో నిద్రకు ఎంతో ప్రాముఖ్యముంది. వ్యక్తిగత సమస్యలు.. మానసిక రుగ్మతలు.. అనారోగ్యం.. సాధారణంగా ఇలాంటి వాటితో నిద్ర కోల్పోవడం చూస్తూనే ఉంటాం. కానీ.. ప్రస్తుతం మెట్రో నగరవాసుల్ని పట్టిపీడిస్తూ నిద్రను దూరం చేస్తున్న సమస్యలు మరో రెండు ఉన్నాయి. అవేమిటంటే.. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్, రాత్రి వేళల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు. హైదరాబాద్ విషయాన్నే తీసుకుంటే ఈ రెండు కారణాలతో ఏటా 198 గంటల నిద్రను నగరజీవులు కోల్పోతున్నారు. తాజాగా విడుదలైన టామ్‌టామ్ ట్రాఫిక్ ఇండెక్స్, అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థల సర్వేలు ఈ విషయాలను వెల్లడించాయి. నగరంలోని రహదారులపై మిగిలిన సమయాల్లో కంటే ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటిని పీక్ అవర్స్ అని పిలుస్తుంటారు. ఉదయం కంటే సాయంత్రం వేళ రద్దీ ఎక్కువగా ఉంటోందని టామ్‌టామ్ నివేదిక తేల్చింది. ఆ సమయంలో ఉండే ట్రాఫిక్ రద్దీ కారణంగా నగర వాసి ఏటా సుమారు 123 గంటలు కోల్పోతున్నాడు. అంటే.. దాదాపు ఐదు రోజులు అదనంగా ట్రాఫిక్‌లోనే గడిపేస్తున్నాడు. టామ్‌టామ్ నివేదిక ప్రకారం నగరంలో ట్రాఫిక్ రద్దీ స్థాయి 55.5 శాతంగా తేలింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ టెక్నాలజీ సంస్థ స్లో మూవింగ్ ట్రాఫిక్ ఇండెక్స్ పేరుతో ప్రతి ఏడాదీ నివేదిక విడుదల చేస్తోంది. ఆసియా, యూరప్, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, ఆ్రస్టేలియా ఖండాల్లోని 62 దేశాల్లో 500 నగరాల్లో టామ్ టామ్ సంస్థ సర్వే చేసింది.సాయంత్రం దయనీయం..సాధారణ సమయంలో 10 కి.మీ దూరం ప్రయాణించడానికి సగటున 32.37 నిమిషాలు పడుతోంది. అదే సాయంత్రం రద్దీ వేళల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఈ సమయంలో వాహనాల సగటు వేగం గణనీయంగా తగ్గిపోయి 10 కిమీ దూరం ప్రయాణించడానికి సగటున 39.5 నిమిషాలు పడుతోంది. హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య 80 లక్షలు దాటింది. అదే సమయంలో ప్రజా రవాణాకు ప్రాధాన్యం లభించట్లేదు. నగరంలో వాహనాల సగటు వేగం గంటకు 25–30 కిమీ ఉండాలి. కానీ.. సగటు వేగం కేవలం 15 కి.మీ పరిమితమవుతోంది. సాయంత్రం రద్దీ వేళల్లో ఇది గంటకు 10 కి.మీలకు పడిపోతోంది. ఇలా ప్రయాణ సమయం పెరిగి... సగటు జీవి రాత్రి వేళల్లో నిద్రపోయే సమయం తగ్గిపోతోంది.ఇంటికి చేరాకా నరకమే..ట్రాఫిక్ సుడిగుండాన్ని దాటుకుని ఇంటికి చేరిన నగరవాసికీ నిద్ర పట్టట్లేదు. వాతావరణ మార్పుల కారణంగా వేడెక్కుతున్న రాత్రులతో ఏటా 75 గంటల నిద్రకు దూరం అవ్వాల్సి వస్తోంది. అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1,338 నగరాల్లో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ముఖ్యంగా కాంక్రీట్ నిర్మాణాలు, తారు రోడ్లు పగటిపూట వేడిని నిల్వ చేసుకుని.. సూర్యాస్తమయం తర్వాత కూడా ఆ వేడి త్వరగా తగ్గకుండా చేస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ అంశంలో హైదరాబాద్ కంటే ఎక్కువగా వరంగల్‌లో 82 గంటల నిద్రను కోల్పోతుండటం గమనార్హం. -
ఆర్టీసీలో ఇష్టారాజ్యం
కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : ఆర్టీసీలో ఇష్టారాజ్యంగా పనులు సాగుతున్నాయి. ఓ అధికారి ఏకంగా లక్షన్నర రూపాయలు తప్పుడు బిల్లులతో పొందారు. వివరాలు ఇలా ఉన్నాయి....నిజామాబాద్ ఆర్ఎం కార్యాలయంలోని ఓ అధికారిణి ఇటీవలే గోవా టూర్‌కు వెళ్లింది. ఆర్టీసీలో సంవత్సరానికి ఒకసారి అధికారి టూర్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఆర్టీసీ నుంచి టూర్‌కు సంబంధించి బస్ రీయింబర్స్మెంట్ కింద అలవెన్సు మంజూరు చేస్తారు. టూర్‌కు వెళ్లే ముందు 80 శాతం మంజూరు చేస్తారు. ఆ తర్వాత బిల్లులు సమర్పిస్తే మిగతా 20 శాతం కూడా చెల్లిస్తారు. కాని ఇక్కడ అధికారులు ముందుగానే మొత్తం చెల్లింపులు చేసినట్లు తెలిసింది. ఎలాంటి పరిశీలన లేకుండానే డబ్బులు తీసుకున్నట్లు తేలింది. కండక్టర్ రూపాయి తక్కువగా ఇస్తే సస్పెన్షన్ చేసే అధికారులు ఇలా రూ.లక్షకు పైగా వదిలేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆడిట్లో బట్టబయలు.. బిల్లుల వ్వవహారం ఆడిట్లో తేలింది. కేవలం కంప్యూటర్ ద్వారా వచ్చిన టికెట్లను మాత్రమే సమర్పించారు. ఇది ఆర్టీసీలో నిబంధనల ప్రకారం చెల్లవు. అడిట్‌లో అధికారులు పరిశీలించడంతో వ్యవహారం బయటపడింది. దీంతో అధికారులు వెంటనే వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చారు. రీజినల్ అధికారులు రూ.లక్షన్నర రికవరీకి ఆదేశించారు. రికవరీ చేశాం.... అధికారి టూర్‌కు సంబంధించిన వ్యవహరంలో బిల్లుల చెల్లింపులో బోర్డింగ్ పాసులు లేవు. ముందస్తుగానే రూ.లక్షన్నర మంజూరు చేశాం. తరువాత ఆడిట్లో బోర్డింగ్ పాసులు లేవని తేలడంతో సంబంధిత అధికారి నుంచి రూ.లక్షన్నర రికవరీ చేశాం. రీజనల్ మేనేజర్ కృష్ణకాంత్


