breaking news
Natyam Movie
-
ఈవారం ఓటీటీ, థియేటర్లలో అలరించబోయే చిత్రాలివే
కరోనా ప్రభావం తగ్గి ఆడియన్స్ ఇప్పుడిప్పుడే థియేటర్ల వైపు కదులుతున్నారు. దీంతో ఇప్పటికే కొన్ని సినిమాలు థియేటర్స్ విడుదలై మంచి విజయాన్ని సాధించగా, మరికొన్ని విడుదలైయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అలాగే మరి కొన్ని డెరెక్ట్ ఓటీటీ రిలీజ్‌కి, ఇంకొన్ని ఇటీవలే థియేటర్లలో విడుదలై ఇప్పుడు ఓటీటీల్లో ప్రేక్షకులని అలరించేందుకు రెడీగా ఉన్నాయి. ఈ తరుణంలో ఈ వారం ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమాలపై ఓ లుక్ వేయండి. ‘అసలేం జరిగింది’ యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అసలేం జరిగింది’. శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 22న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్వీఆర్ దర్శకత్వం వహించగా, ఎక్స్‌డోస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించారు. ఓ అదృశ్య శక్తితో చేసిన పోరాటమే ఈ చిత్రమని, 1970- 80ల్లో తెలంగాణలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చిత్ర బృందం పేర్కొంది. ‘నాట్యం’ ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి సంధ్యారాజు నటిగా పరిచయమవుతూ, సొంతంగా నిర్మిస్తున్న చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 22న థియేటర్లో విడుదల కానుంది. భరతనాట్యం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో కమల్కామరాజ్, రోహిత్ బెహల్, ఆదిత్య మేనన్‌లు తదితరులు నటించారు. మధుర వైన్స్.. కొత్త నటీనటులు సన్నీ నవీన్, సీమా చౌదరీ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మధురవైన్స్’. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి జయకిషోర్ దర్శకత్వం వహించారు. అక్టోబరు 22న ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్యానికి బానిసైన ఓ యువకుడిగా సన్నీ నవీన్, అసలు మద్యం అన్న, అది తాగే వాళ్లన్నా అసహ్య పడే ఓ యువతిగా సీమా చౌదరి నటించారు. అలాంటి వీళ్లద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది.. మద్యం కారణంగా వారిద్దరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయనేదే ఈ చిత్రం కథ. నాగచైతన్య-సాయి పల్లవిల ‘లవ్‌స్టోరీ’ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య-సాయి పల్లవి తెరకెక్కించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య నటన సాయిపల్లవి డ్యాన్స్ ప్రేక్షకుల తెగ ఆకట్టుకుంది. ఇక హీరోహీరోయిన్ల కెమిస్ట్రీకి వారి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. లాక్డౌన్ తర్వాత తెరుచుకున్న థియేటర్లోకి వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను తెచ్చుకుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా బుల్లితెరపై సందడి చేసేందుకు రాబోతుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. అక్టోబరు 22న సాయంత్రం 6గంటల నుంచి ‘లవ్‌స్టోరీ’ అందుబాటులో ఉంటుందని ‘ఆహా’ ఇటీవల వెల్లడించింది. ‘హెడ్స్ అండ్ టేల్స్’ సునీల్, సుహాస్ చాందిని రావు, దివ్య శ్రీపాద, శ్రీ విద్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిచిన చిత్రం ‘హెడ్స్ అండ్ టేల్స్’. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ కథ అందించారు. నటుడు సాయి కృష్ణ ఎన్రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునీల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’లో అక్టోబరు 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముగ్గురు మహిళలు తమ జీవితంలో ఎదుర్కొన్న సమస్యల్ని ఎలా పరిష్కరించుకున్నారనేదే ఈ చిత్రం కాథాంశం. -
నాట్యం ప్రిరిలీజ్ ఈవెంట్లో మెరిసిన రామ్ చరణ్..
-
ఆ సాంగ్ వింటుంటే స్వర్ణకమలం గుర్తొచ్చింది– వెంకటేశ్
డ్యాన్సర్ సంధ్యారాణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ ఈ చిత్రానికి దర్శకుడు. నిశ్రింకళ ఫిల్మ్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘పోనీ పోనీ..’ పాటను విడుదల చేసిన వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘డ్యాన్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమాలు వచ్చి చాలా రోజులైంది.‘పోనీ పోనీ...’ పాటను చూస్తుంటే విలక్షణ కథకు ఎమోషన్స్ కలగలిపినట్లుంది. నాకు నా ‘స్వర్ణకమలం’ సినిమా గుర్తొచ్చింది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు. (చదవండి: డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నటుడు) ‘‘స్వర్ణ కమలం’ సినిమాను చాలాసార్లు చూశాను. ఎమోషనల్‌గా సాగే ‘పోనీ పోనీ..’ పాటను వెంకటేశ్‌గారు లాంచ్ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు సంధ్యారాణి. ‘‘మా సినిమాకు ‘స్వర్ణకమలం’ ఓ స్ఫూర్తి’’ అన్నారు రేవంత్. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్.