breaking news
Naturally Purify
-
బెల్లీ ఫ్యాట్ తగ్గించే నౌకాసనం
ఈ ఆసనంలో శరీర భంగిమ పడవ మాదిరి ఉంటుంది కాబట్టి దీనికి పడవ లేదా నౌకాసనం అని పేరు.చేసే విధానం: యోగా మ్యాట్‌పై వెల్లకిలా పడుకోవాలి. ∙చేతులను శరీరానికి ఇరువైపులా ఉంచి, పాదాలను కలిపి ఉంచాలి. గాలిని పీల్చుకుంటూ, నెమ్మదిగా మీ తల, ఛాతి, పాదాలను నేల నుంచి పైకి లేపాలి. శరీరం ఆంగ్ల అక్షరం ’V’ ఆకారంలో ఉండాలి. చేతులు కాళ్లకు సమాంతరంగా చాచి ఉంచాలి. బరువు అంతా హిప్స్ మీద ఉండాలి. ఈ స్థితిలో 20 సెకన్ల పాటు శ్వాస తీసుకుంటూ ఉండాలి. గాలిని వదులుతూ నెమ్మదిగా య«థాస్థితికి రావాలి. ఇలా 3నుంచి 5 సార్లు రిపీట్ చేయాలి. అమృతాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.ప్రయోజనాలు :1. పొట్ట దగ్గర ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది.2. అబ్డామినల్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.4. మెటబాలిజం పెరుగుతుంది.5. ఫోకస్ పెరుగుతుంది.జాగ్రత్తలు: గర్భిణీలు ఈ ఆసనం చేయకూడదు.∙బ్యాక్ పెయిన్, హార్ట్ ్రపాబ్లమ్స్ ఉన్నవారు చెయ్యొద్దు.అనిత పాతర్ల, యోగా ట్రైనర్ -
ఇంట్లోని గాలిని సహజంగా శుద్ధి చేసే ఈ మొక్కలు చూశారా? (ఫొటోలు)


