breaking news
National Doctors Day
-
ఆ ప్రమాదం : వాళ్ల ప్రేమకు పునర్జన్మ!
సురేశ్, సమీర (పేర్లు మార్చాం) ప్రేమించుకున్నారు. అయితే అన్ని ప్రేమకథల్లోలాగే అమ్మాయి వాళ్ల పెద్దలు ఈ ప్రేమను ఒప్పుకోలేదు. కలిసే బతుకుదామని నిర్ణయించు కున్నారు. పారిపోయి పెళ్లి చేసుకుందామనుకున్నారు. అమ్మాయి నిర్ణీత స్థలానికి రాగానే అప్పటికే అక్కడ టూ వీలర్ మీద వెయిట్ చేస్తున్న సురేశ్... సమీరను పికప్ చేసుకున్నాడు. అసలే యాంగై్జటీ. తమను వెతికేవారికి దొరక్కూడదనే టెన్షన్. ఆ యాంగై్జటీ, టెన్షన్లతో బండి వేగంగా నడిపాడు. ఫలితం... బండి బోల్తా కొట్టి యాక్సిడెంట్ అయ్యింది. వెంబడిస్తున్న సమీర తరఫు బంధువులకు అమ్మాయి చిన్న చిన్న దెబ్బలతో సేఫ్‌గానే దక్కింది. కానీ... సురేశ్ తల బద్దలైంది. అచ్చం అతడి ప్రేమలా! సురేశ్ మెదడు బయటకు వచ్చింది. ఛాతీ ఎముకలూ విరిగాయి. పొట్టలోకి నీరు వచ్చింది. ఇలా మెడికల్‌కు సంబంధించిన మల్టీ డిసిప్లినరీ సమస్యలెన్నో వచ్చాయి. ఆ స్థితిలో తీసుకువచ్చిన సురేశ్‌కు చికిత్సలు చాలా జాగ్రత్తగా అందించాల్సి వచ్చింది. తల తాలూకు చిన్న చిన్న ముక్కలు కొన్ని (మరీ లోతుగా కాకపోయినా) మెదడులోనూ ఇరుక్కున్నాయి. మెదడులోకి లోతైన గాయాలు కాకుండా వాటిని చాలా జాగ్రత్తగా బయటకు తీయాల్సి వచ్చింది. వెంటిలేటర్‌పై పెట్టి చికిత్స ఇవ్వాల్సిన పరిస్థితి.అత్యంత సునిశితమైన చికిత్సలూ, గాజుబొమ్మలా చూసుకున్న జాగ్రత్తల తర్వాత ఎట్టకేలకు సురేశ్ కోలుకున్నాడు. ఈలోపు... వాళ్ల ప్రేమకథలో ఓ ట్విస్ట్. అతడి యాక్సిడెంట్ వృత్తాంతం వాళ్ల క్లోజ్ క్లోజ్ సర్కిల్స్‌లో వ్యాపించడంతో అతడికి సంబంధాలేమీ రాలేదు. అటువైపు ఆ అమ్మాయి పరిస్థితీ అంతే. బద్దలైన తల తాలూకు చిన్న చిన్న ముక్కల్నీ పేర్చి అతికిస్తే అవే మెల్లగా అమరాయి కదా... అచ్చం అలాగే పెద్దలు బద్దలు చేయాలనుకున్న వాళ్ల ప్రేమ కూడా చక్కగా కుదిరింది. వెరసి పెళ్లీ జరిగింది. తన కాళ్ల మీద నిలబడ్డ సురేశ్ ఇప్పుడు ఓ మంచి రెస్టారెంట్ నడుపుతున్నాడు. వాళ్లిద్దర్నీ చూసినప్పుడు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. డాక్టర్ ఎస్. రమేశ్ సీనియర్ న్యూరో సర్జన్, మినిమల్ యాక్సెస్ బ్రెయిన్ – స్పైన్ సర్జన్, కామినేని హాస్పిటల్స్, హైదరాబాద్యాసీన్ -
ఐఏఎస్ కల : మృత్యువు పెట్టిన ‘పరీక్ష’ పాసయ్యాడు!
ఎలాగైనా యూపీఎస్సీ పరీక్ష రాసి ఐఏఎస్ సాధించాలనే తపనతో చదువుతున్నాడు మిస్టర్ రంజిత్ (పేరు మార్చాం). అతడు నరాలు తెగే ఏకాగ్రతతో చదువుతుంటే గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్) అనే సమస్య అతడి నరాలను దెబ్బతీసింది. జీబీఎస్ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైన తర్వాత వస్తుందిది. ఇందులో నుంచి దేహంలోని ప్రతి భాగానికీ ఆదేశాలందించే నరాలపైన ఉండే ‘మైలీన్’ అనే పొర దెబ్బతింటుంది. సొంత వ్యాధి నిరోధక వ్యవస్థలోని యాంటీబాడీస్ వెలువడి... అవి తమ సొంత మైలీన్ పొరను దెబ్బతీసినప్పుడు మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్ అందక సొంత అవయవాలు అచేతనమవుతాయి. అందునా ఈసారి రంజిత్‌కు వచ్చిన వ్యాధి మామూలు జీబీఎస్ కాదు. జీబీఎస్ వచ్చేవాళ్లలోనూ ప్రతి 1000 మందిలో ఒకరికి మాత్రమే వచ్చే అరుదైన, అత్యంత తీవ్రమైన గులియన్ బ్యారీ సిండ్రోమ్ (Guillain-Barré syndrome (GBS) రకమిది. నరాల కూడలి (నోడల్) ప్రదేశాల్లో వస్తుంది కాబట్టి దీన్ని ‘నోడోపతి’ అంటారు. అది ఎంతటి తీవ్రమైనదంటే... సాధారణంగా కాళ్ల నుంచి పైకి చచ్చుబడిపోయేలా చేసే ఆ వ్యాధి... ఇతడిలో మాత్రం దేహమంతా అచేతనమయ్యేలా చేసింది. ఊపిరి తీసుకునేందుకు సహాయపడే కండరాలు అచేతనమైపోతే కొద్ది క్షణాల్లోనే ప్రాణం పోతుంది కదా. అలాంటిది అతడి కంటికి సంబంధించిన కండరాల్లో కొంత మినహాయించి మిగతా దేహమంతా కదలిక లేకుండా పోయింది. సొంత వ్యాధి నిరోధక వ్యవస్థ అతడిని దెబ్బతీసిందేమో కానీ పరిస్థితులు అతడి సంకల్ప బలాన్ని ఏమాత్రమూ దెబ్బతీయలేకపోయాయి. సొంత కుటుంబ సభ్యులు అండగా నిలబడ్డ తీరు అసామాన్యం, అనితరసాధ్యం, నిరుపమానం, నిరంతర స్ఫూర్తి. సొంత సోదరి కూడా ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతుండటంతో ఆమె అతడిలో మోటివేషన్ నింపుతూ ఉంది. అతడి పరిస్థితికి అతడిలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఐవీఐజీ అనే తరహా ఇమ్యునోథెరపీ ఇవ్వాల్సి ఉంది. ఇది బాగా ఖరీదైన చికిత్స. అతడిది కేవలం ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం. దాంతో అతడి మనోబలాన్ని పెంచేందుకూ, అతడిలో స్ఫూర్తి రగిలించేందుకూ మేం డాక్టర్లం కూడా అతడికి ఆర్థికంగా కొంత సహాయం (క్రౌడ్ ఫండింగ్) చేశాం. ఆసుపత్రి కూడా తనవంతు అండదండలందించింది. అన్నివైపుల నుంచి అందుతున్న సహకారాలతో అతడు రెండునెలల పాటు ఐసీయూలో వ్యాధితో పోరాడాడు. ఈలోపు మరో రెండుసార్లు ఇన్ఫెక్షన్ వచ్చి అతడిని మృత్యువు అంచులవరకూ తీసుకెళ్లింది. దాంతో అతడి పరిసరాలు అత్యంత శుభ్రంగా ఉండేలా చేశాం. అతడికి అందే ఆహారాలు బలవర్థకంగా ఉండేలా చూశాం. రిటుక్సిమాబ్ అనే ఇమ్యూన్ సపోర్ట్ మందులిచ్చాం. ఇలా అనేక ప్రయత్నాలు చేసి అతడిని కాపాడాం. రెండు నెలల పాటు అతడి నరాలకు ఏ ఆహారమూ అందకపోవడంతో, అవి రెండునెలల పాటూ ఏ పనీ చేయకపోవడంతో... ఆ తర్వాత ఎంతో బలహీనపడి శక్తిపుంజుకునేందుకు ఎంతో కష్టమైంది. అయినప్పటికీ ఫిజియోథెరపీ సహాయంతో అతడెంతో కష్టపడి బయటకొచ్చాడు. ఇప్పుడు హాయిగా హ్యాపీగా ఉన్నాడు. చదవండి: బరువైన బతుకులో చిరునవ్వు .. డాక్టర్నే ఇన్స్పైర్ చేసిన ఇంట్రస్టింగ్ కథనంఈ ఏడాది కాకుండా ఆ వచ్చే ఏడాది పరీక్ష రాద్దువుగానీ అంటే... ‘‘లేదు సర్... మీరిచ్చిన ప్రోత్సాహంతో ఈ ఏడాది కూడా పరీక్ష రాయాల్సిందే. అది కుదరకపోతే నేను చెబుతుంటే ఎవరైనా స్క్రైబ్‌ను పెట్టుకునైనా సరే’’ అన్నాడా అబ్బాయి. మేం ఒక టీమ్‌గా పనిచేసే డాక్టర్లమంతా కలిసి, మా శక్తియుక్తులన్నీ వెచ్చించి, సంయుక్తంగా అతడిని మృత్యుదేవత ఒడిలోంచి బలవంతంగా వెనక్కుతీసుకొచ్చామంటే అది అతిశయోక్తి కాదు. ఇదీ చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోక్రిటికల్ కేర్‌లో పనిచేసే మేము రోజులోని 24 గంటలూ క్రిటికల్ కేసుల్నే చూస్తాం. ఇటీవలే మేం ఒక డబుల్ ట్విన్స్ కడుపులో ఉన్న మహిళను రక్షించాం. అత్యంత సంక్లిష్టమైన టీబీ ఇన్ఫెక్షన్లూ, చాలా అరుదుగా కనిపించే మెనింజైటిస్ విత్ టీటీపీ అనే కేసులూ చూశాం. కానీ ఇలా చదువుకోసం తాపత్రయపడే ఓ చురుకైన కుర్రాణ్ణి మేమంతా ఓ టీమ్‌గా రక్షించిన ఉదంతం మాకు ఎంతో సంతృప్తినిచ్చింది.డాక్టర్ హర్ష్ ఖండేలియా సీనియర్ కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ ఫిజీషియన్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్-యాసీన్ -
బరువైన బతుకులో చిరునవ్వు .. డాక్టర్నే ఇన్స్పైర్ చేసిన ఇంట్రస్టింగ్ కథనం
కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే... ఇలా నిజజీవితంలో కూడా సాధ్యమవుతుందా అన్నట్టుగా ఉంటాయి. అవి 1990 ల నాటి తొలి రోజులు. ఓ చిన్నారి బాబును వాళ్ల అమ్మగారు నా దగ్గరికి తీసుకొచ్చారు. మహా అయితే ఆ బాబుకు అప్పటికి ఓ ఏడెనిమిదేళ్లు ఉంటాయేమో... అంతే! ఆ బాబుకు వాళ్ల నాన్నకు ఉండే మూత్రపిండాల (కిడ్నీ) జబ్బే వచ్చింది. అదేమిటంటే... కిడ్నీలో చాలా గడ్డలు రావడం. మూత్రపిండాల్లో మల్టిపుల్ ట్యూమర్స్ వస్తూ జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా వచ్చే జబ్బు అది. తండ్రికీ ఉండటంతో కొడుకుకూ వచ్చింది. ఆ బాబు తల్లిదండ్రులిద్దరూ చాలా సంస్కారవంతులూ, ఉన్నత విద్యావంతులూ, కాస్త ధనవంతులు కూడా. తండ్రికి ఆ జబ్బు ఉండటంతో అతడి తల్లి తన భర్తకు కిడ్నీ ఇచ్చి కాపాడేందుకు ప్రయత్నించింది. ఆ ట్రాన్స్‌ప్లాంట్ శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు నేనూ అక్కడ ఉన్నా. ఆ తర్వాత ఐదేళ్లలో ఆయన చనిపోయారు. ఆ తర్వాత రెండుమూడేళ్లకు అనుకుంటా... అతడి అమ్మగారు హార్ట్ అటాక్‌తో లోకం విడిచి వెళ్లారు. ఈ ప్రపంచంలో ఇప్పుడా బాబు పూర్తిగా అనాథ. అయితే అతడు చాలా చిన్నవయసు నుంచే సమర్థంగా బిజినెస్ చేస్తుండేవాడు. బిజినెస్‌లో ఎక్స్పర్ట్ కావడంతో తానో పెద్ద కంపెనీ పెట్టి విజయాన్ని చవిచూసిన ఓ సక్సెస్ఫుల్ బిజినెస్‌మేన్ అతడు. తన వ్యాపారంలో అతడెంత ఉన్నతిని సాధించాడంటే... తన కంపెనీ ద్వారా వందల సంఖ్యలో వ్యక్తులకు ఉపాధిని కల్పించాడు. కొన్నేళ్ల తర్వాత దాదాపు 2000 సంవత్సరం ప్రాంంతాల్లో అతడు మళ్లీ కిడ్నీ సమస్యతో మరోసారి నా దగ్గరికి వచ్చాడు. గుర్రపునాడా ఆకృతిలో (హార్స్ షూ షేప్‌లో) ఉన్న అతడి కిడ్నీలోంచి ఈసారి సగభాగాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆ సర్జరీ నేనే చేశా. కాలక్రమంలో ఈసారి పూర్తిస్థాయి కిడ్నీ ఫెయిల్యూర్‌తో అతడు మళ్లీ నా దగ్గరికి వచ్చాడు. ట్రాన్స్‌ప్లాంట్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. కిడ్నీ ఇవ్వడానికి అతడికి ఈలోకంలో రక్తసంబంధీకులెవ్వరూ లేరు. వాస్తవానికి వాళ్ల నాన్నగారు చాలా చిన్నప్పుడే ఓ చిన్నారి బాబును ఇంట్లో పెట్టుకున్నారు. ఒకరి ఆత్మబంధువుగా మరొకరు గత రెండు దశాబ్దాలుగా వాళ్లిద్దరూ ఆ ఇంట్లో నివసిస్తున్నారు. ఆ ఇంట్లో అతడి వ్యక్తిగత సహాయకుడూ, సెక్రటరీ అన్నీ అతడే. అతడు కిడ్నీ ఇస్తానన్నాడుగానీ... నిబంధనల ప్రకారం రక్తసంబంధీకులో... లేదా రక్తసంబంధం లేనివాళ్లైతే భార్యభర్తల్లో ఎవరో ఒకరు ఇవ్వాలి. తనకు ఈ లోకంలో అతడు తప్ప మరెవ్వరూ లేరనే కారణంతో వాళ్లు కోర్టుకు వెళ్లారు. అతడి ఇంట్లో గత 20 ఏళ్లుగా ఉంటున్న వ్యక్తి కిడ్నీ ఇవ్వవచ్చంటూ అతడి కేసులో మాత్రం కోర్టు ప్రత్యేక అనుమతి ఇవ్వడంతో అతడి ట్రాన్స్‌ప్లాంట్ చికిత్స కూడా నేనే చేశా.ఇదీ చదవండి: ముప్పు డప్పు కొట్టినా తప్పులు ఆగవా! ఇకనైనా మారండి! ఈ ట్రాన్స్‌ప్లాంట్ చేసి ఇప్పటికి దాదాపు ఎనిమిదేళ్లు అయ్యింది. అంటే... దాదాపు గత 30కి పైగా ఏళ్ల నుంచి అతడు నా పేషెంట్. వాళ్ల అమ్మగారు చనిపోయాక ప్రతి చికిత్సకూ అతడొక్కడే వచ్చేవాడు. ఇన్‌పేషెంట్‌గా చేరేప్పుడూ... డిశ్చార్జ్ అయి వెళ్లేటప్పడూ ఇలా ప్రతి ప్రతికూల పరిస్థితిలోనూ అతడొక్కడే. ఏ పరిస్థితుల్లోనూ అతడు తన చిరునవ్వును వీడలేదు. ఇక్కడ ఓ డాక్టర్‌గా నా గొప్పదనం ఏమీ లేదు. గొప్ప చికిత్స జరిగినప్పుడు పేషెంట్ అదృష్టాలూ, డాక్టర్ ప్రయత్నాలూ, పరిస్థితులు కలిసిరావడాలూ... ఇలా ఇవన్నీ అనుకూలించడంతో డాక్టర్ గొప్పగా, సమర్థంగా చికిత్స చేశాడనే పేరొస్తుంది. కానీ ఈ కేసులో పరిస్థితి వేరు. ఆ పేషెంట్ తాలూకు సంకల్పబలం, గొప్పదనంతో డాక్టర్‌కూ గొప్పదనాన్ని ఆపాదించినట్లయ్యింది. చదవండి: కూతురి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని తండ్రి సాహసం, వైరల్ వీడియోఇప్పుడతడి వయసు దాదాపు 40 ఉండవచ్చు. ఈ వయసుకే అతడో సక్కెస్ఫుల్ వాణిజ్యవేత్త. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ అదరక, బెదరక ఎంతోమందికి అన్నం పెడుతున్న బెస్ట్ బిజినెస్‌మేన్. సాధారణంగా డాక్టర్లంటే పేషెంట్లకు అడ్మిరేషన్ ఉండటం సహజం. కానీ... చిన్నప్పట్నుంచీ... ఓ చిన్నారిగా ఉన్నప్పట్నుంచీ అతడిని చూస్తూ ఉన్నప్పటికీ, గత 30 ఏళ్ల నుంచి అతడికి చికిత్స అందిస్తున్నప్పటికీ... అతడంటే నాకెంతో అడ్మిరేషన్. డాక్టర్ సి. మల్లికార్జున,చీఫ్ యూరాలజిస్ట్, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ – యూరాలజీ (AINU), హైదరాబాద్ -
National Doctors day ముప్పు డప్పు కొట్టినా తప్పులు ఆగవా!
జీవితం ఒక సినిమా అయితే... దేవుడు రాసిన స్క్రిప్ట్‌ను కూడా మార్చి రాయగల రైటర్లు డాక్టర్లు. జీవితం ఒక మూవీ అయితే... పేషెంట్‌కు లైఫ్‌కో కొత్త డైరెక్షనిచ్చి హిట్ చేయగల టాప్ డైరెక్టర్లు డాక్టర్లు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే... జీవితం... సినిమా కంటే విచిత్రమైనది. దాంట్లో లవ్, మదర్ సెంటిమెంట్, స్టడీస్‌లో సక్సెస్‌తో కెమెరా టిల్ట్ చేసి తలెత్తి పైకి చూడాల్సినంత అడ్మిరేషన్, ఎదురుగా మృత్యువు నిలబడ్డా చిరునవ్వుతో ఎదుర్కొనేంత హీరోయిక్ కరేజ్, హెల్మెట్లు లేకపోవడంతో జరిగే అనర్థాల స్టంట్స్... ఇలా ఎన్నో... ఎన్నెన్నో!! ఇన్ని ఎమోషన్స్‌ను మనతో పంచుకున్నారు నిష్ణాతులూ, లబ్ధప్రతిష్ఠులైన కొందరు డాక్టర్లు... నేడు డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ అనిరుథ్ కె. పురోహిత్ మాటల్లోనే...అదో అందమైన చలికాలపు ఉదయపు వేళ. కానీ ఆ ఆహ్లాదకరమైన ప్రాంతఃకాలం... శేఖర్ పాలిట రాబోయే రాత్రికి కాబోయే కాళరాత్రికి నాందీ సమయం. కారణం... ఆరోజు శేఖర్ చేసిన రెండు తప్పులు. మొదటి తప్పు హెల్మెట్ ధరించకపోవడమైతే... రెండోది స్పీడ్ బ్రేకర్ దగ్గర కూడా ఏమాత్రం స్లో చేయకపోవడం. దాంతో బండి మీది నుంచి పడి తలకు గాయంతో ఐసీయూలో బెడ్‌పై అచేతనంగా పడి ఉన్నాడు. శేఖర్ గురించి అతడి అన్న శ్రీధర్ చాలా బాధపడుతూ ఉండేవాడు. బహుశా శ్రీధర్‌కు 35 ఏళ్లూ, అతడి తమ్ముడు శేఖర్‌కు 30 ఏళ్లు ఉంటాయేమో. ప్రతిరోజూ కళ్ల నిండా నీళ్లతో, జోడించిన చేతులతో నా దగ్గరికి వచ్చి తమ్ముడి పరిస్థితి వాకబు చేస్తూ ఉండేవాడు. ‘‘ఎంత ఖర్చైనా పర్లేదు డాక్టర్. నా తమ్ముడు బాగైతే చాలు’’ అనేవాడు. అంతటి దయ, గుండెనిండా ఆర్ద్రత ఉన్న ఆ అన్నను చూస్తే ఓ పక్క ఆనందం... మరో పక్క అతడి పరిస్థితికి బాధా ఉండేవి. ‘‘మీవాడుగానీ ఆ రోజు హెల్మెట్ పెట్టుకుని ఉంటే... ఇవ్వాళ ఈ పరిస్థితి వచ్చేదే కాదు’’ అంటూ ఉండేవాణ్ణి. ఒకరోజు పొద్దున్నే నేను నా కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నా. పక్క సందులోంచి ఒక వ్యక్తి తన బైక్‌ను చాలా రాష్‌గా డ్రైవ్ చేస్తూ ప్రధాన రోడ్డు మీదికి వస్తున్నాడు. ఎక్కడా స్లో చేయడమన్న మాటే లేదు. మెయిన్ రోడ్డులో వస్తున్న నేను వెంటనే నా కార్‌ను స్లో చేస్తూ... అతడు నన్ను గుద్దుకోకుండా నా కార్‌ను చాలా పక్కకు తీశా. ఒకవేళ నేనలా చేయకపోతే నన్నతడు తప్పక ఢీకొని ఉండేవాడు. తీరా చూస్తే అతడి బైక్ హ్యాండిల్ మీద హెల్మెట్ కూడా ఉంది. పరిశీలనగా చూస్తే అతడు మరెవరో కాదు... మా హాస్పిటల్ బెడ్ మీద యాక్సిడెంట్ అయి పడుకుని ఉన్న పేషెంట్ వాళ్ల అన్నే. కాస్తయితే ‘‘అదే బెడ్ పక్కన ఇతడూ తమ్ముడికి కంపెనీ ఇస్తూ పడుకునేవాడు కదా’’ అనిపించింది. మరో మాట అనిపించింది. తన సొంత తమ్ముడు చేసిన రెండు తప్పుల నుంచి ఏమీ గ్రహించకుండా శేఖర్ వాళ్ల అన్న శ్రీధర్ చేసింది మూడో తప్పు. అలాంటి యాక్సిడెంట్లో చనిపోయిన ఓ వ్యక్తి తాలూకు అంతిమ సంస్కారాల్లో పాల్గొన్న మర్నాడే ఈ ఘటన జరగడంతో నాకీ విషయం స్ఫురణకు వచ్చింది. నన్ను మనసులో తొలిచేస్తున్న విషయమేమిటో తెలుసా... ‘‘ఇన్ని సంఘటనలు జరిగాక... జరుగుతున్న సంఘటనలను చూశాక... తమ ఇంట్లో కూడా ఇలాంటి విషాదాలు చోటు చేసుకున్న తర్వాత కూడా వీళ్లు మారరా’’ అంటూ బాధేసింది. నా అనుభవంలో చూసిన ఘటనలూ, ఆ టైమ్‌లో వచ్చే ఆలోచనలే నన్ను ఈ నాలుగు మాటలు రాసేలా పురిగొల్పాయి. డాక్టర్ అనిరుథ్ కె. పురోహిత్ సీనియర్ కన్సల్టెంట్న్యూరో – స్పైన్ సర్జన్,ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్-యాసిన్ -
వైద్యుడా.. వందనం.. డాక్టర్స్ డే వెనుక చరిత్ర ఇదే
ఆరోగ్యమే మహాభాగ్యమంటారు. మనిషికి ఎంత సంపద ఉన్నా దాన్ని అనుభవించే ఆరోగ్యం లేకపోతే అదంతా వృథాయే. అనారోగ్యంతో బాధపడే వారిని ప్రమాద స్థితి నుంచి కాపాడే శక్తి కేవలం వైద్యునికే ఉంది. అందుకే ప్రజలు వైద్యుడిని సాక్షాత్తు దేవుడిగా భావిస్తారు. ప్రాణాలు నిలిపినందుకు అతడిని దేవుడే అంటూ ప్రజలు దండాలు పెడతారు. పవిత్రమైన ఈ వృత్తిలో రాణిస్తూ విశేష సేవలు అందించే వైద్యులు చరిత్రలో నిలిచిపోతారు. నేడు వైద్యుల దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. చదవండి: చింత చిగురు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా? కడప కల్చరల్(వైఎస్సార్ జిల్లా): బెంగాల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ బిదన్ చంద్రారాయ్ సంస్మరణగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దేశమంతటా నిర్వహిస్తున్నారు. ఆదర్శ వైద్యుడిగా ఆయనకుగల ఖ్యాతిని యేటా ఆయన జన్మదినం నాడు డాక్టర్స్ డేగా నిర్వహిస్తూ ఇతర వైద్యులు స్ఫూర్తి పొందేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బిదన్ చంద్రారాయ్ బెంగాల్ ముఖ్యమంత్రిగా కూడా సేవలు అందించారు. ఆయన 1882 జులై 1వ తేదిన జన్మించారు. 1962 జులై 1నే కన్నుమూశారు. 1991 నుంచి ఆయన సంస్మరణగా వైద్య లోకం డాక్టర్స్ డే నిర్వహిస్తోంది. పవిత్రమైన వృత్తి సమాజంలో అత్యంత పవిత్రమైన, కీలకమైన వృత్తి వైద్యం. ఆపద సమయంలో ప్రజలందరికీ ఆపద్బాం«ధవుడిలా కనిపించే వైద్యులను ప్రజలు ఎంతగానో గౌరవిస్తారు. సాక్షాత్తు దేవుడులాంటివాడివంటూ హృదయ పూర్వకంగా నమస్కారం చేస్తారు. అందుకే ఆయనను ‘వైద్యో నారాయణో హరి’ అంటూ గౌరవిస్తారు. అందుకే ఈ వృత్తికి సమాజంలో ప్రథమస్థానం ఉంది. తల్లిదండ్రుల్లో ఎక్కువ మంది తమ పిల్లలను డాక్టర్ కమ్మని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇతరుల ప్రాణాలు నిలిపే అవకాశం డాక్టర్ వృత్తికి మాత్రమే ఉండడంతోపాటు ప్రస్తుత సమాజంలో ఆశించే ధనం కూడా ఈ వృత్తిలో పుష్కలంగా లభిస్తుంది. గనుక వైద్య వృత్తికి అంతటి డిమాండ్ ఉంది. పెరుగుతున్న కాలానికి అనుగుణంగా వైద్యుల సంఖ్య, మెడికల్ కళాశాలల సంఖ్య కూడా పెరగాల్సిన అవసరం ఉంది. దీన్ని గుర్తించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కళాశాలను ప్రకటించింది. ఈ ప్రణాళిక సాకారమైతే రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ వైద్యుల కొరత ఉండదు. దేవ వైద్యుడు మానవులకే కాకుండా దేవతలకు కూడా వైద్యుడు ఉన్నాడు. ఆయనే ధన్వంతరి. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలోని శ్రీ వైద్యనాథస్వామి ఆలయంలో మూల విరాట్ ఎదురుగా గోడపై ధన్వంతరి కుడ్య శిల్పం ఉంది. పురాణాలు ఆయనను దేవతల వైద్యునిగా పేర్కొంటున్నాయి. అందుకే ఈ దేవాలయంలోని శివునికి వైద్య నాథుడు అని పేరొచ్చింది. ఒకప్పుడు దేవాలయాలే వైద్యాలయాలుగా కూడా సేవలు అందించేవి. చుట్టుపక్కలగల అడవుల్లో లభించే ఆకులు, గరుడు, వేర్లు తదితరాలను ఆలయాల అరుగులపై గుండ్రాళ్లతో మెత్తగా నూరేవారు. ఆ పసర్లతో స్థానికులకు వైద్యం చేసేవారని, అందుకు నిదర్శనంగా జిల్లాలోని పలు దేవాలయాల అరుగులపై నేటికీ మందులు నూరిన గుర్తుగా కల్వాలు (అరుగులపై మందును నూరిన గుర్తులు) కనిపిస్తాయి. పుష్పగిరిలోని వైద్య నాథస్వామి ఆలయానికి అప్పట్లో జిల్లా నలుమూలల నుంచి రోగులు వచ్చి వైద్య సేవలు పొందేవారని తెలుస్తోంది. చరిత్రలో జిల్లాను బ్రిటీషు వారు పాలించే రోజుల్లో కడప నగరంలో హకీం మంజుమియాకు మంచి వైద్యునిగా పేరుంది. యునాని వైద్యునిగా ఆయన ఎంతో విశిష్ఠత సాధించారు. దేశం నలుమూలల నుంచి ప్రజలు వైద్యం పొందేందుకు ఆయన వద్దకు వచ్చేవారు. ప్రస్తుతం కడప నగరంలోని సిండికేట్బ్యాంకు ఉన్నచోట ఆయన వైద్యశాల ఉండేదని, పేదల వద్ద ఎలాంటి రుసుము తీసుకోకుండా మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారని తెలుస్తోంది. ఎందరో నవాబులు, రాజులు తమ సంస్థానానికి వస్తే పెద్ద ఎత్తున ధనం, గౌరవం ఇస్తామని ఆశ పెట్టినా ఆయన కడపలోని పేదలకు వైద్య సేవలు అందించాలని ఇక్కడే ఉండిపోయారు. ఆయన ప్రతిభ గురించి ఎన్నో విశేషమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రోగి స్వయంగా రాలేకపోయినా వారి తల వెంట్రుకగానీ, గోరుగానీ చూపితే వ్యాధి నిర్ధారణ చేసి రోగాలు నయం చేసేవారని ప్రచారంలో ఉంది. ముఖం చూసిన వెంటనే వ్యాధి ఏమిటో చెప్పగలిగే వారని కూడా ఆయనకు పేరుంది. డాక్టర్ల వీధి కడప నగరం క్రిస్టియన్లేన్కు డాక్టర్ల వీధిగా పేరుంది. దాదాపు వంద మీటర్ల పొడవు గల ఆ వీధిలో ఒక్కటంటే ఒక్కటి కూడా నివాస గృహం లేదంటే అతిశయోక్తి కాదు. రోడ్డుకు ఇరువైపుల దాదాపు అన్ని వైద్యశాలలే. అవిగాక స్కానింగ్ సెంటర్లు, ల్యాబోరేటరీలు, అడుగడుగునా మందుల దుకాణాలు ఉన్నాయి. తెలుగునాట ఇలాంటి వీధి మరేది లేదంటారు. -
నేషనల్ డాక్టర్స్ డే; ఆయన పుట్టిన రోజూ, మరణించిన రోజూ ఒక్కటే
వైద్యునిగా, విద్యావేత్తగా, స్వాతంత్య్ర సమరయోధునిగా, వితరణ శీలిగా, ఆధునిక పశ్చిమ బెంగాల్ రూపకర్తగా విశేష సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బీసీ రాయ్. ఆయన పుట్టిన రోజూ, మరణించిన రోజూ ఒక్కటే (జూలై 1) కావడం విశేషం. ఈరోజును భారత ప్రభుత్వం ‘నేషనల్ డాక్టర్స్ డే’గా ప్రకటించి గౌరవించింది. డాక్టర్ బీసీ రాయ్‌గా సుపరిచితులైన డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ 1882లో అఘోర్ కామినీ దేవి, ప్రకాష్ చంద్రరాయ్ దంపతులకు, బిహార్ రాష్ట్రంలో జన్మించారు. వైద్య విద్య నిమిత్తం 1901లో కలకత్తా మెడికల్ కాలేజీలో చేరి వైద్య విద్యను అభ్యసిస్తూనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 1909లో లండన్ వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించి వచ్చి కలకత్తా మెడికల్ కాలేజీలో అధ్యాపకునిగా చేరారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)ల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ పార్టీ రాయ్‌కి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పదవి చేపట్టమని కోరింది. మొదట తిరస్కరించినా... 1948 జనవరి 23న రాయ్ ఆ బాధ్యతలు స్వీకరించారు. తన 80వ ఏట 1962 జులై 1వ తేదీ వరకు అంటే తుదిశ్వాస విడిచేవరకు 14 ఏళ్లపాటు అద్భుతపాలన అందించారు. అంతేకాక ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా వున్నా, ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోగులను చూడడం మాత్రం మానుకోలేదు. భారత ప్రభుత్వం డాక్టర్ బీసీ రాయ్ అత్యున్నత సేవలను గుర్తించి, 1961లో దేశ అత్యున్నత పురస్కారం ‘భారత రత్న’తో గౌరవించింది. – డాక్టర్ టి. సేవకుమార్, గుంటూరు (జూలై 1న జాతీయ వైద్యుల దినోత్సవం) -
National Doctors Day: వైద్యులకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, డాక్టర్లకు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్య విపత్తుల సమయంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్న వైద్యులు దైవంతో సమానమని, వారి సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. కోవిడ్‌పై పోరాటంలో వైద్యుల సేవలు త్యాగపూరితమైనవని, మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి రోగులకు సేవలందించిన ప్రతి డాక్టర్ సేవలు అసమానమని ప్రశంసించారు. కోవిడ్‌పై పోరాటంలో వైద్యుల కుటుంబ సభ్యుల సహకారం అభినందనీయమన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యులు పునర్జన్మను ఇస్తారని, బాధలనుంచి శరీరాన్ని, విపత్తుల నుంచి ప్రాణాన్ని కాపాడే ప్రత్యక్ష దైవాలే డాక్టర్లని కొనియాడారు. On this #DoctorsDay, Hon’ble CM @ysjagan has expressed his deepest gratitude to the medical fraternity for their dedicated and unparalleled service to the humanity, especially during the trying times of #covid19. — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 1, 2021 -
వైద్యులు దేవుని అవతారాలు : మోదీ
-
నేడు జాతీయ వైద్యుల దినోత్సవం
-
డాక్టర్స్ డే: బాలీవుడ్ జంట కొత్త నిర్ణయం
జన్మనిచ్చేది అమ్మ అయితే.. ప్రాణం పోసేది వైద్యుడు. కరోనా లాంటి ప్రాణాంతక రోగాలు వచ్చినప్పుడు వారి ప్రాణాలను సైతం పణంగా పెట్టి మన ప్రాణాలను కాపాడేందుకు శ్రమిస్తారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ జంట జెనీలియా, రితేశ్ దేశ్‌ముఖ్ ఓ ప్రతిజ్ఞ పూనారు. తమ అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు. "రితేశ్, నేను ఈ పని ఎప్పుడో చేయాలని భావించాం, కానీ కుదరలేదు. ఈ రోజు డాక్టర్స్ డే సందర్భంగా మేము మా అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ సంకల్పానికి పూనుకునేందుకు మమ్మల్ని ప్రోత్సహించిన డా.నోజర్ శెరీర్, FOGSIకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. (ఇది శాశ్వతం.. మీ ప్రేమకు ధన్యవాదాలు!) ఒకరికి జీవితాన్ని ఇవ్వడమే అసలైన బహుమతి. కాబట్టి మీరు కూడా ఇతరుల ప్రాణాలు కాపాడేందుకు ఈ పనిలో భాగస్వాములు అవండి. అవయవదానం చేస్తామని ప్రతిజ్ఞ పూనండి" అని జెనీలియా పిలుపునిచ్చింది. వీరి నిర్ణయంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ వైద్యులు బిధాన్ చంద్రరాయ్ గుర్తుగా ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటాం. ఆయన 1882 జూలై 1న జన్మించగా 1962 జూలై 1వ తేదీనే మరణించారు. ఆయన అందించిన విశేషమైన సేవలకు గానూ భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 4న బిధాన్ చంద్రరాయ్‌కు అత్యున్నత పురస్కారమైన భారత రత్నను బహుకరించింది. (విద్యుత్ జమాల్‌కు అండగా జెనీలియా!) View this post on Instagram @riteishd and me have been thinking about it for a long time but unfortunately didn’t get down to doing it. Today on Doctor’s Day we pledge to donate our organs. We want to thank Dr Nozer Sherier and FOGSI for inspiring us. The greatest gift you can give someone is ‘The gift of life’. .We urge you all to take a part in this initiate and pledge to save lives, pledge to donate your organs. A post shared by Genelia Deshmukh (@geneliad) on Jul 1, 2020 at 4:29am PDT -
వైద్యరంగానికి వన్నెతెచ్చిన రాయ్
డాక్టర్ బీసీ రాయ్‌గా ప్రసిద్ధిగాంచిన బిధాన్ చంద్రరాయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. వైద్యరంగానికి వన్నెతెచ్చిన బీసీ రాయ్ 1882 జులై 1వ తేదీన బిహార్ రాష్ట్రంలోని పాట్నాజిల్లా బంకింపూర్లో జన్మించారు. కలకత్తా మెడికల్ కళాశాలలో మెడిసిన్ పూర్తి చేశాడు. ఉన్నత చదువుల కోసం 1909లో ఇంగ్లాండ్ లోని బర్త్ హోమ్ హాస్పిటల్లో అతి కష్టంమీద సీటు సాధించిన రాయ్ కేవలం రెండేళ్ల మూడునెలల స్వల్పకాలంలోనే ఎం.ఆర్.సి.పి, ఎఫ్.ఆర్. సీ.ఎస్ డిగ్రీలు పూర్తిచేసి, ఇంత తక్కువకాలంలో ప్రతిష్టాత్మకమైన రెండు డిగ్రీలు పూర్తిచేసిన అరుదైన వ్యక్తిగా చరిత్రలో స్థానం సంపాదించాడు. 1911లో స్వదేశానికి తిరిగొచ్చి కలకత్తా వైద్య కళాశాలలో కొంతకాలం అధ్యాపకుడిగా పని చేశారు. పేదరోగులకు ఏదో చేయాలన్న తపనతో జాదవ్ పూర్ టీ.బీ హాస్పిటల్, ఆర్.జి.ఖార్ మెడికల్ కాలేజ్, కమలా నెహ్రూ హాస్పిటల్, విక్టోరియా ఇనిస్టిట్యూట్, చిత్తరంజన్ క్యాన్సర్ హాస్పిటల్ తదితర సంస్థల్ని నెలకొల్పాడు. 1922 నుంచి, 1928 వరకు ఆరేళ్లకు పైగా కలకత్తా మెడికల్ జర్నల్‌కు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. 1925లో రాజకీయ రంగప్రవేశం చేసి, బార క్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్‌గా పేరుగాంచిన సురేంద్రనాథ్ బెనర్జీపై గెలుపొందిన రాయ్ అనేక రాజకీయ, అకడమిక్ పదవులు చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా పేరుగాంచిన బీసీ రాయ్ 1948 జనవరి 13న పశ్చిమబెంగాల్ రెండో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. రోజులో కనీసం ఒక్క గంట యినా పేద రోగులకోసం కేటాయించాలనే భావనతో, ఎన్ని పని ఒత్తిడులున్నప్పటికీ ఖచ్చితంగా పేద రోగులకు వైద్యసేవలందించేవాడు. విద్య, వైద్యరంగాల్లో ఆయన చేసిన సేవలకు 1944 లో గౌరవ డాక్టరేట్ పట్టా అందుకున్నాడు. 1961లో ఫిబ్రవరి 4న డా‘‘ బీసీరాయ్‌ను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న వరించింది. ప్రజా నేతగా, ప్రజావైద్యుడిగా రాయ్ చేసిన కృషికి, త్యాగానికి గుర్తుగా, ఆయన స్మారకార్థం ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీని జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకోవాలని భారతప్రభుత్వం 1962లో ప్రకటించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వారికి 1976 నుండి డాక్టర్ బీసీ రాయ్ పేరుమీద అవార్డులు అందజేస్తున్నారు. ప్రజల రోజువారీ జీవితాల్లో కీలకపాత్ర పోషించే వైద్యుల సేవలను గుర్తించి, వారి గొప్పతనం పట్ల ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ వైద్యుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. కనుక బీసీ రాయ్ స్ఫూర్తితో వైద్యరంగంలో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి వైద్యులు కృషిచేయాలి. వైద్యుణ్ణి దైవసమానుడుగా గుర్తించే స్థాయి నుంచి, వైద్యుడంటే పేదల రక్తం పీల్చే పిశాచి అన్న స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య మహోదయులపై ఈ దురభిప్రాయాన్ని తొలగించాల్సిన బాధ్యత మరింత అధికంగా ఉంది. కార్పొరేట్ కల్చర్‌కు అలవాటు పడిన అధికశాతం మంది వైద్యులు మానవీయ కోణాన్ని విస్మరించి ఎన్నిరకాల అవకాశాలుంటే అన్నిరకాలుగా రోగుల్ని పిండుతున్నారు. కొంతమంది అత్యాశాపరుల వల్ల పూర్తి వ్యవస్థకే చెడ్డపేరు వస్తున్న పరిస్థితిని నివారించాల్సిన అవసరం ఉంది. స్వాభావికంగా సేవాభావం లేని వారు, వైద్యేతర రంగాల్లోని కార్పొరేట్ వ్యాపారులు వైద్యవృత్తిలోకి ప్రవేశించి వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారన్న బలమైన వాదనపైనా దృష్టి సారించాలి. వైద్యులు రోగులపట్ల తమ దృక్పథాన్ని మార్చుకొని, ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలి. ప్రజా వైద్యుడిగా విశేషఖ్యాతి గడించిన డా‘‘ బీసీ రాయ్‌ను ఆదర్శంగా తీసుకొని వైద్యవృత్తిపై పడిన కళంకాన్ని తొలగించడానికి ప్రతి ఒక్కవైద్యుడూ ఆచరణాత్మక కృషి చేయాలి. (జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం) యండి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్టు ‘ 99125 80645 -
డాక్టరుగారూ... బాగున్నారా?
డాక్టర్స్ డే: జూలై 1 జాతీయ వైద్యుల దినోత్సవం అందరి ప్రాణాలూ కాపాడటానికి అహరహం అలుపెరుగకుండా శ్రమిస్తారు వాళ్లు. అయినా వాళ్ల ప్రాణాలకు మాత్రం సుఖశాంతులు తక్కువే సమాజంలో గౌరవం సరే, దానికి వారు చెల్లించే మూల్యం... చిన్ని చిన్ని సరదాలు, కుటుంబంతో గడిపే కాలం. చిన్న పొరపాటు జరిగినా వైద్యులను నిందించే జనం... వైద్యుల సమస్యలను ఎన్నడైనా పట్టించుకుంటున్నారా..? అక్కడ వరద ఎగజిమ్ముతోంది... ఎక్కడ చూసినా నీరే... సుడులు తిరిగే ఆ నీళ్లలోకి లైఫ్‌బోట్ వేసుకొని వెళ్తున్నారు గజ ఈతగాళ్లు. చెట్టు కొమ్మలాంటి చిన్న ఆధారం కనిపిస్తే బయటకు వచ్చేయాలనుకునే చోటికి తమంతట తామే పూనుకొని వెళ్తున్నారు ఈ స్విమ్మర్స్. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్లను రక్షించడమే వాళ్ల ధ్యేయం. భయంకరమైన అగ్నిప్రమాదం... చుట్టూ ఎగసిపడే జ్వాలలు... అందరూ తప్పించు కోవడానికి వీలుంది. సెగ సోకితేనే ఒళ్లు కాలిపోయే ఉష్ణోగ్రత. అందరూ తప్పించుకోవడానికి చూస్తున్నారు. కానీ ఫైర్‌ఫైటర్స్ అలా చేయరు... చేయలేరు. ఈతగాళ్లు నీళ్ల ప్రవాహంలోకి వెళ్లినట్లే... అగ్నిజ్వాలలకు ఎదురెళ్తారు ఫైర్‌ఫైటర్స్. నీళ్లలోకి ఓ ఈతగాడు వెళ్లినట్లే... ఒళ్లు కాల్చేసే మంటల్లోకి ఫైర్‌ఫైటర్ దూకినట్లే... డాక్టర్లూ ఇన్ఫెక్షన్స్ ఉన్నచోటికి అనునిత్యం వెళ్తుంటారు. స్వైన్‌ఫ్లూ అనో, మరో వ్యాధి అనో ముట్టుకుంటేనే వ్యాధి అంటుకునే పరిస్థితి ఉన్నా రోగగ్రస్తులను చేతులు సాచి రక్షించుకుంటారు. ఒక్కపూట హాస్పిటల్‌కు వెళ్తేనే... ‘అమ్మో భరించలేం’ అనుకునే వారు ఆశ్చర్యపోయేలా ప్రతినిత్యం హాస్పిటల్స్‌లో రోగాలతో చెలగాటాలాడుతుంటారు. అక్కడ నీళ్లు మింగేసినవారూ, కరెంట్ తగిలి అగ్నిప్రమాదాలకు లోనైన వాళ్లూ, వ్యాధులకు గురైనవాళ్లూ ఉంటారు. కంటికి కనిపించనంత సూక్ష్మమైన వ్యాధికారక క్రిమికీటకాలను ఆశ్రయించి ఉన్నవారూ ఉంటారు. వరద నీటికో, అగ్నిజ్వాలలకో భయపడి మిగతా వాళ్లంతా వారి నుంచి దూరంగా వచ్చేస్తుంటారు. మరీ పలకరించాల్సి వచ్చే దగ్గరి బంధువులు సైతం దూరంగా వెళ్లిపోతూ, మరీ మాట్లాడాల్సి వస్తే కర్చీఫ్ అడ్డుపెట్టుకుంటారు. ధనమిచ్చినా దగ్గరిగా వెళ్లడానికి మనం ఇష్టపడని వాళ్ల దగ్గరికి తనంతట తనే వెళ్తుంటాడు ధన్వంతరి. మరేదైనా వృత్తిలో ఉన్నవారు సెలవులు తీసుకోవచ్చేమోగానీ డాక్టర్‌కు సెలవులు లేవు. సామాజిక గౌరవాలు ఎక్కువే అయినా ఒక్కోసారి వాటిని మించి అవమానాలనే పొందాల్సి రావచ్చు. ఇక కుటుంబ సమస్యలు అందరికీ ఉండేవాటి కంటే కాస్తంత ఎక్కువే. పిల్లాపాపలతో గడిపేందుకూ, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చించేందుకు అవకాశాలూ ఒకింత తక్కువే. అందుకే... ‘మా అందరినీ కాపాడే మీ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్..?’ అని ఒక్కసారైనా మనం అడిగి తీరాలి. తమ వ్యక్తిగత జీవితాన్ని విస్మరించుకొని సేవ చేసే వారందరినీ డాక్టర్స్ డే నాడు ప్రత్యేకంగా స్మరించుకోవాలి. అక్కడికి వెళ్లాలంటేనే చాలా మందికి బెరుకు. ఆ ప్రదేశం చూసొచ్చాక చాలా సేపు బెంగ. అదే ఆసుపత్రి. ఇప్పుడు చాలా ఆసుపత్రుల్లో మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారుగానీ... ఒకప్పుడు అక్కడ మరీ భయవిహ్వలతలు రాజ్యమేలేవి. వేదనలూ రోదనలూ కనిపించేవి. రుగ్మతలు రాజ్యం చేసే చోట హానికారక సూక్ష్మజీవులూ తప్పదు. డాక్టర్లు వాటితోనే సహజీవనం చేస్తూ అవి తమకు అంటుకోకుండా చూసుకుంటూ... వ్యాధిగ్రస్తు లనూ వాటి బారి నుంచి కాపాడుతుంటారు. ప్రమాద అవకాశాలు ఎందుకుంటాయంటే... ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త చికిత్స ప్రక్రియల్లో భాగంగా డాక్టర్లు రోజూ ఇంజెక్షన్లతో రోగుల శరీరంలోకి సూదులు పంపాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు వాడే సర్జికల్ కత్తుల(స్కాల్పెల్స్) వంటి పరికరాలతో చిన్నవీ, పెద్దవీ గాట్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతో రోగికి అటు కలుషితమైన సూదులు, కత్తుల కారణంగానూ, ఇటు వారి శరీరంపై పెట్టిన గాట్ల కారణంగానూ ఇన్ఫెక్షన్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా రోగులు కోలుకోవడానికి డాక్టర్లు చేసే పనులే ఒక్కోసారి రోగులతో పాటు డాక్టర్లకూ ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఉదాహరణకు ఒక ఎయిడ్స్ రోగికి చేసిన ఇంజెక్షన్ డాక్టరుకు గానీ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్కుగానీ గుచ్చుకునే ప్రమాదాలు ఉండవచ్చు. ఇలాంటివి జరిగిన సందర్భాల్లో డాక్టర్లు ఆ జబ్బు తమకు వ్యాపించకుండా తామే ముందస్తు చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. అలాగే రోగిని పరీక్షించి, మరో రోగిని పరీక్షించే మధ్య సమయంలోనే ఆల్కహాల్ బే్‌స్డ్ హ్యాండ్‌వాష్‌లతో చేతులు శుభ్రం చేసుకోవడం, మంచి నాణ్యమైన గ్లౌవ్స్ వాడటం చేస్తుంటారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ప్రత్యేకమైన గౌన్స్ ధరిస్తుంటారు. అక్కడ ఉపయోగించే పాదరక్షలనూ స్టెరిలైజ్ చేసి ఉంచుతారు. ఆ ఉపకరణాలతో అపకారమే ఎక్కువ... రోగికి ఉపకారం చేసే ఉపకరణాల వల్ల కూడా ఒక్కోసారి డాక్టర్లకు ప్రమాదం కలుగుతుంది. రోగుల పరిస్థితిని మెరుగుపరచేందుకు డాక్టర్లు ఒక్కోసారి రోగి శరీరంలో లోపలి నుంచి కొన్ని ఉపకరణాలను అమర్చుతుంటారు. గుండెలోకి వేసే ఇంట్రా వ్యాస్కులర్, ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపేందుకు ఉపయోగించే వెంటిలేటర్లు, మూత్రాశయంలోంచి మూత్రాన్ని పైప్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఉపయోగించే యూరినరీ క్యాథెటర్ల వంటివి డాక్టర్లు వాడుతుంటారు. అవి కూడా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కుటుంబ సమస్యలు వృత్తిలోని సాధక బాధకాలను అవగాహన చేసుకోగలరనే ఉద్దేశంతో డాక్టర్లలో చాలామంది అదే వృత్తిలోని వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. అయితే అదే వాళ్లకు సమస్యగా మారవచ్చు. ఇద్దరూ వృత్తిపరంగా బాగా బిజీ అయిపోయినప్పుడు వ్యక్తిగతంగా తమకు కేటాయించుకునే ‘నాణ్యమైన’ సమయం తగ్గుతుంది. జీవిత భాగస్వామి కంటే వృత్తి జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంటుంది. దీనివల్ల ఇతరత్రా సమస్యలూ ఎదురుకావచ్చు. సాధారణంగా పిల్లల విషయంలో ఈ తరహా సమస్యలు ఎక్కువ. ఉదయం పదింటికి మొదలై, సాయంత్రం ఐదింటికి ముగిసే సాధారణ జీవనశైలి డాక్టర్ల దంపతులకు ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం చేసుకోవాలనుకున్నా రోగులకు వచ్చే అత్యవసర పరిస్థితులు తమ కోసం, పిల్లల కోసం తగిన సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులను వారికి కల్పిస్తుంటాయి. ఇవన్నీ వారికి ప్రతిబంధకంగా పరిణమించేవే. - యాసీన్ భారత్‌లో మెడికల్ కాలేజీలు 420 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 200 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు 220 వీటిలో మొత్తం సీట్లు 52,765 రిజిస్టర్డ్ అల్లోపతిక్ వైద్యులు 9,38,861 డెంటల్ వైద్యులు 1,54,000 ఆయుష్ వైద్యులు 7,37,000 ‘హాయ్’ చెప్పే ఇన్ఫెక్షన్లు డాక్టర్లను ఇన్ఫెక్షన్లు నిత్యం పలకరిస్తుంటాయి. వారికి రోజూ ‘హాయ్’ చెబుతాయి. ఇది అతిశయోక్తి అనుకుంటే పొరబాటు. హాస్పిటల్స్‌లో రోగులు ఎప్పుడూ ఉంటారు. కాబట్టి వారిని ఆశ్రయించుకుని రోగకారక సూక్ష్మజీవులు ఉంటాయి. వాటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఇలా హాస్పిటల్స్‌లోనూ, ఐసీయూలలోనూ వచ్చే ఇన్ఫెక్షన్స్ను ఆసుపత్రుల సాంకేతిక పరిభాషలో ‘హెల్త్ కేర్ అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్’ (హాయ్) అంటారు. ఇక మరో రకమైన ‘హాయ్’ కూడా డాక్టర్లను పలకరిస్తుంది. ‘హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్సే ఆ మరో ‘హాయ్’. ఇలా తాము చికిత్స కోసం వచ్చిన జబ్బు వల్ల కాకుండా, హాస్పిటల్‌ను సందర్శించాక వచ్చే జబ్బును ‘హాయ్’ అంటారు. సాధారణంగా ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే ప్రతి 20 మంది రోగుల్లో ఒకరు ఆసుపత్రిలో మరో జబ్బుకు గురవుతారని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అధ్యయనంలో వెల్లడైంది. అంటే కాసేపు సందర్శన వల్లనో లేదా ఒక గంట కన్సల్టేషన్‌కు వచ్చినందువల్లనో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఇంతగా ఉందంటే మరి డాక్టర్లుకు ఉండదా? ఎందుకు ఉండదూ... వారూ మానవమాత్రులే కదా. అందుకే వాళ్లకూ ఈ ప్రమాదం ఉంటుంది. కాకపోతే వాళ్లే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కాబట్టి వృత్తిరీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. తమ నుంచి భాగస్వామికీ... పిల్లలకూ ఇన్ఫెక్షన్ల ప్రమాదం రోగి నుంచి డాక్టర్లకే కాదు... వాళ్ల జీవిత భాగస్వామికీ, తాము ప్రేమగా చూసుకొనే తమ పిల్లలకూ వచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ ఇన్ఫెక్షన్ల ప్రమాదాల నుంచి అందరినీ రక్షించడానికి వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెడతారు గనుకనే డాక్టర్లు అంటే అందరికీ గౌరవం. సామాజికపరమైన ఇక్కట్లు డాక్టర్లు ఉత్సవాలు, ఫంక్షన్లు వంటి వేడుకలకు హాజరు కాలేకపోవడం చాలా సాధారణంగా కనిపించే అంశమే. ఒక్కోసారి తమ సొంత బిడ్డల పుట్టిన రోజు వేడుకలకు సైతం హాజరు కాలేని పరిస్థితులు వాళ్లలో చాలామందికి అనుభవమయ్యే విషయమే. దాంతో బంధువర్గాల్లో నిష్ఠురాలు మామూలే. స్నేహితులతో కులాసాగా గడపడం వైద్యవృత్తిలో గగనకుసుమమే. రోగులను నిత్యం విజిట్ చేసే వీరు ఏదైనా వేడుకల్లో విజిట్ చేయడం చాలా అరుదుగానే కనిపిస్తుంది. ఇక వృత్తిపరంగా కొనసాగే కాన్ఫరెన్స్‌లు మినహా వ్యక్తిగతంగా పర్యటనలూ తక్కువే. విదేశాలలో తిరిగినా అది తమ కాన్ఫరెన్సుల్లో భాగంగా కొనసాగే అవకాశాలే ఎక్కువ. అంతే తప్ప ఎప్పుడో గాని విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు దొరకవు. వృత్తిపరంగా అందరికంటే ఎక్కువ సామాజిక గౌరవం పొందే వీళ్లు... రోగులు మృతి చెందిన సమయంలో ఒక్కోసారి చేదు అనుభవాలను కూడా చవిచూడాల్సిన పరిస్థితి. అప్పటికే ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న రోగులను రక్షించడానికి వీళ్లు శక్తివంచన లేకుండా పూనుకుంటారు. అలాంటి సమయాల్లో తమ వల్ల కాకపోయినా... రోగి మృతి చెందినప్పుడు చాలా సందర్భాల్లో వీరు నిందలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సమయాలలో చాలా అరుదుగానైనా భౌతిక దాడులను ఎదుర్కొన్న సందర్భాలూ ఉంటాయి. డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల ప్రకారం వైద్యులు,రోగుల నిష్పత్తి 1 : 1000 భారత్‌లో వైద్యులు,రోగుల నిష్పత్తి 1 : 1700 డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను అందుకోవాలంటే... 4,00,000 2022 నాటికి భారత్‌కు అదనంగా కావలసిన వైద్యుల సంఖ్య దురభిప్రాయాలు వద్దు... చికిత్సకు దూరం కావద్దు... ఆయన వయసు 86 ఏళ్లు. నాందేడ్ నుంచి వచ్చారు. అన్నవాహిక క్యాన్సరు. ఆహారనాళం పూర్తిగా మూసుకుపోయింది. మేజర్ ఆపరేషన్ చేసి క్యాన్సర్ గడ్డ తొలగించాలంటే ప్రాణాలకు ముప్పు కూడా ఉండవచ్చు. కారణం ఆయన క్రానిక్ స్మోకర్. పైగా ఊపిరితిత్తులు బాగాలేవు. ఇలాంటి వాళ్లకు ఆపరేషన్ టైమ్‌లో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువే. అది రిస్క్‌తో కూడిన వ్యవహారం కాబట్టి సర్జరీ కాకుండా అన్నవాహికలోకి పైప్ వేసి, ఆహారం పంపించి రేడియేషన్ కూడా ఇద్దామని సూచించాం. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన మాటలు చాలా అసెర్టివ్‌గా ఉన్నాయి. ‘‘ఎనభై ఆరేళ్ల జీవితాన్ని చూశా. అన్ని బాధ్యతలూ తీర్చుకున్నా. ఈ వయసులో కేవలం బతకడం కోసం పైప్ వేసి, దాని ద్వారా ఆహారం పంపడం ఎందుకు. బతికినన్నాళ్లూ తింటూ, తాగుతూ సంతోషంగా బతకాలి. ఒకవేళ క్యాన్సర్ సర్జరీ చేస్తుండగానే చనిపోయాననుకోండి. ఈ వయసులో హాయిగా చనిపోవడం కంటే ఏం కావాలి. ఒకవేళ బతికాననుకోండి. నాకు ఇష్టమైనట్లుగా తింటూ, తాగుతూ సుఖంగా ఉంటా. అందుకే పైప్ వేసి, దాని ద్వారా ఆహారం తీసుకోవడం వద్దు. రిస్క్ అయినా ఆపరేషన్ చేయండి’’ అన్నారు. దాంతో మేం చాలా జాగ్రత్తగా కీహోల్ సర్జరీ చేసి క్యాన్సర్ ఉన్న భాగాన్ని తొలగించాం. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. తనకు ఇష్టమైనవి తింటూ తాగుతూ హ్యాపీగా జీవిస్తున్నాడు. మొన్ననే ఫాలో అప్‌కు వచ్చి వెళ్లారు. వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. క్యాన్సర్ చికిత్సలు సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ మీద ఉన్న అనేక అపోహలతో చాలా మంది పెద్దవయసులో ఇలాంటి చికిత్సలు... తీసుకోవడానికి భయపడుతుంటారు. క్యాన్సర్ చికిత్సల్లో ఈ మధ్య వచ్చిన మార్పులతో పెద్దవయసులో కూడా చికిత్సలు తట్టుకునే అవకాశం ఉంది. అపోహలతో ప్రాణాలు పోగొట్టుకోవడం కంటే చికిత్సలతో ప్రాణాలు కాపాడుకోవడం మేలు. - డాక్టర్ మోహన వంశీ, చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమెగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ ఒక సర్జరీ... ఇద్దరి ప్రాణాలు కాపాడింది... సాధారణంగా బిడ్డను కనడం అంటేనే పునర్జన్మ. అలాంటిది 36 వారాల గర్భిణి ఉమాదేవి (25)కి గుండెలో సమస్య ఎదురైంది. గుండెలోని అతిపెద్ద రక్తనాళం (మహాధమని) బలహీనమైంది. ఒకరోజు ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దగ్గర్లోని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అప్పుడు గుండె పరీక్షలు చేశారు. ఉమాదేవికి మార్ఫన్స్ సిండ్రోమ్ ఉందని తేలింది. వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లమని చెప్పారు. పుట్టుకతోనే కొందరిలో ఈ వ్యాధి మొదలవుతుంది. గుండె నుంచి శరీర భాగాలకు మంచి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళం బలహీనమవుతుంది. రక్తనాళంలో ఇంటిమా, మీడియా, అడ్వెంటీషియా అనే పొరలుంటాయి. రక్తప్రసరణ సరిగా చూసేందుకు ఇంటిమా తోడ్పడు తుంది. మీడియా, అడ్వెంటీషియా పొరలతో పాటు రక్తనాళం గోడల్లో ఉండే కొలాజెన్, ఎలాస్టిక్ ఫైబర్లు రక్తనాళానికి సపోర్ట్ చేస్తుంటాయి. రక్తం ఎక్కువ ఒత్తిడితో వెళ్తున్నప్పుడు అది బలంగా ఉండేందుకు దోహదపడతాయి. కొందరికి పుట్టుకతోనే కొలాజెన్ తక్కువగా ఉండి, అది క్రమంగా తగ్గుతూ పోవడం వల్ల రక్తనాళం బలహీనపడి, వాచిపోతుంది. దీన్నే అయోర్టికర్ డెసైక్షన్ లేదా మార్ఫన్స్ సిండ్రోమ్ అంటారు. ఈ సమస్యను అశ్రద్ధ చేస్తే రక్తనాళం చిట్లి రక్తం మొత్తం లీక్ అవుతుంది. అదే జరిగితే కొన్ని సెకండ్లలోనే రోగి మృతిచెందే అవకాశం ఉంది. దీనివల్ల అన్ని అవయవాలూ దెబ్బతిని మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి దారితీసే ప్రమాదం ఉంది. దీన్ని బెంటాల్స్ ప్రొసీజర్ అనే శస్త్రచికిత్స ద్వారా చక్కదిద్దాలి. కాబట్టి ఉమాదేవికి ఆ సర్జరీ అత్యవసరంగా చేయాలి. అదే ఆమె ప్రాణాలను కాపాడింది. ఒక ప్రాణాన్ని కాదు... ఇద్దరివి. ఆమె ప్రాణాన్ని, కడుపులోని ఆమె బిడ్డ ప్రాణాన్ని. ఆపరేషన్ సక్సెస్. తల్లీ బిడ్డా సేఫ్. - డాక్టర్ జి. రామసుబ్రమణ్యం, చీఫ్ కన్సల్టెంట్ కార్డియోథొరాసిస్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ ఛాన్స్ 1% - రిజల్ట్ 100% ఆరోజు జనవరి 21... ఆదివారం. మా కుటుంబం అంతా వైజాగ్‌కు బయల్దేరింది. కుటుంబ సభ్యులంతా హ్యాపీ. సరిగ్గా బోర్డింగ్ పాస్‌లు తీసుకొని ఫ్లైట్ ఎక్కడానికి ముందుగా నాకు ఫోన్. అదీ హాస్పిటల్ నుంచి. పేషెంట్ హార్ట్ ఫెయిల్యూర్ స్థితిలో ఎమర్జెన్సీకి వచ్చారనీ, అర్జెంటుగా రమ్మని ఆ కాల్ సారాంశం. అంతే! ప్రయాణం కట్టిపెట్టి... బాబు, పాపలను సముదాయించి, నా భార్యకు విషయం చెప్పి హాస్పిటల్‌కు ప్రయాణం కట్టాను. నేను బయల్దేరే సమయంలోనే నా కొలీగ్ డాక్టర్ ఆర్ముగంకూ ఫోన్ చేశా. అతడూ భార్యాపిల్లలతో నగరం శివార్లలోని ఏదో రిసార్ట్‌లో హాలీడే ప్లాన్ చేసుకున్నాడు. నాలాగే అతడూ తన హాలీడేకు ఫుల్స్టాప్ పెట్టి బయల్దేరాడు. మేమిద్దరమూ ఇలా ఆగమేఘాల మీద ఆసుపత్రికి రావడానికి కారణం... 59 ఏళ్ల పేషెంట్. జనవరిలోనే ఒకసారి గుండెపోటు వచ్చింది. పదిరోజుల్లోనే మళ్లీ హార్ట్ ఎటాక్. హాస్పిటల్‌కు వచ్చే సమయానికి గుండె దాదాపు ఆగిపోయింది. ఎమర్జెన్సీ టీమ్ పేషెంట్‌కు ముందుగా ‘డీసీ షాక్స్’ ఇచ్చారు. గుండె స్పందనలు మొదలయ్యాయి. వెంటనే లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్‌తో వెంటిలేటర్‌పై ఉంచారు. పేషెంట్ బతికేందుకు ఒక్క శాతమే ఛాన్స్ ఉంది. ఆలస్యం చేయకుండా ‘ఎండార్ట్ ఇరెక్టొమీ విత్ లెఫ్ట్ వెంట్రిక్యులార్ రిపేర్’ అనే సంక్లిష్టమైన సర్జరీకి పూనుకున్నాం. ఏడెనిమిది గంటలు సాగిన ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. వారం రోజుల తర్వాత పేషెంట్ కోలుకున్నాడు. మరో రెండు రోజుల తర్వాత లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్, వెంటిలేటర్ తొలగించాం. పేషెంట్ పూర్తిగా కోలుకొని మమ్మల్ని కళ్లతోనే ఆత్మీయంగా పలకరించాడు. కుటుంబాలతో హాలీడేని ఎంత ఎంజాయ్ చేసేవాళ్లమో తెలియదుగానీ... పేషెంట్‌కు మా బృందం ఇచ్చిన పునర్జన్మ మాకు అంతకంటే ఎక్కువ ఆనందాన్నిచ్చిందని నమ్మకంగా చెప్పగలం. - డాక్టర్ పి.వి.నరేష్ కుమార్, కార్డియో థొరాసిక్, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్ మానసికమైన ఒత్తిళ్లూ ఎక్కువే... డాక్టర్ల వృత్తిగతమైన జీవితాల్లో మానసిక ఒత్తిళ్లూ చాలా ఎక్కువ. అవతలి వారి ప్రాణాలతో వ్యవహరించాల్సి రావడం వల్ల మిగతా వృత్తుల్లో కంటే వైద్యవృత్తిలో ఈ మానసిక ఒత్తిడి మరింత ఎక్కువగా ఉంటుంది. ‘ఆ... ఈ జీవితం ఇలా తగలడిపోయింది’ అనడం సాధారణంగా వింటుంటాం. కానీ డాక్టర్ల జీవితాల్లో ఇలాంటి అభివ్యక్తికి నిజంగానే ‘బర్నవుట్’ అని పేరు పెట్టి అనేక అధ్యయనాలు నిర్వహించారు. కొన్ని దేశాల్లో డాక్టర్లపై ఈ అంశమై అనేక అధ్యయనాలు జరిగాయి. 2012లో యూఎస్‌లో నిర్వహించిన ఒక అధ్యయనంలో ప్రతి ఇద్దరు ఫిజీషియన్లలో ఒకరిపై వృత్తిగతమైన ఒత్తిడి ఎక్కువ అని తేలింది. ఇది ‘ఆర్కైవ్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్’ అనే జర్నల్‌లో నమోదైంది. ఇలాంటిదే మళ్లీ 2013లో నిర్వహించారు. దాదాపు 36 శాతం మంది ఫిజీషియన్లు బాధ్యతను భారంగా భావిస్తున్నారని 2,556 మంది డాక్టర్లపై నిర్వహించిన ఆ అధ్యయనంలో తేలింది. ఈ ఒత్తిడి 40 శాతం డాక్టర్లలో ఉంటుందని తాజా అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి చేరాక ఒకింత స్వేచ్ఛాజీవితం దొరికినట్లు భావిస్తుండటం మామూలే. అయితే వైద్యవిద్య అభ్యసించే వారికి మిగతా పిల్లలతో పోలిస్తే ఇలా స్వేచ్ఛాజీవితం లభించినట్లు భావించడం తక్కువేనని తేలింది. డాక్టర్స్ డే విషెస్ when there are tears, you are a shoulder when there is pain, you are a medicine when there is a tragedy, you are a hope happy doctor's day i want to say a big thanks for making me healthy and fit you are the best doctor i have ever known happy doctor's day may your days be wonderful and healthy like you make it for others. i want to thank you this doctor's day dawn of relief - obliging caring - tolerant omniscient -reasonable happy doctor's day అక్కడ వరద ఎగజిమ్ముతోంది... ఎక్కడ చూసినా నీరే... సుడులు తిరిగే ఆ నీళ్లలోకి లైఫ్‌బోట్ వేసుకొని వెళ్తున్నారు గజ ఈతగాళ్లు. చెట్టు కొమ్మలాంటి చిన్న ఆధారం కనిపిస్తే బయటకు వచ్చేయాలనుకునే చోటికి తమంతట తామే పూనుకొని వెళ్తున్నారు ఈ స్విమ్మర్స్. ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్లను రక్షించడమే వాళ్ల ధ్యేయం. భయంకరమైన అగ్నిప్రమాదం... చుట్టూ ఎగసిపడే జ్వాలలు... అందరూ తప్పించు కోవడానికి వీలుంది. సెగ సోకితేనే ఒళ్లు కాలిపోయే ఉష్ణోగ్రత. అందరూ తప్పించుకోవడానికి చూస్తున్నారు. కానీ ఫైర్‌ఫైటర్స్ అలా చేయరు... చేయలేరు. ఈతగాళ్లు నీళ్ల ప్రవాహంలోకి వెళ్లినట్లే... అగ్నిజ్వాలలకు ఎదురెళ్తారు ఫైర్‌ఫైటర్స్. నీళ్లలోకి ఓ ఈతగాడు వెళ్లినట్లే... ఒళ్లు కాల్చేసే మంటల్లోకి ఫైర్‌ఫైటర్ దూకినట్లే... డాక్టర్లూ ఇన్ఫెక్షన్స్ ఉన్నచోటికి అనునిత్యం వెళ్తుంటారు. స్వైన్‌ఫ్లూ అనో, మరో వ్యాధి అనో ముట్టుకుంటేనే వ్యాధి అంటుకునే పరిస్థితి ఉన్నా రోగగ్రస్తులను చేతులు సాచి రక్షించుకుంటారు. ఒక్కపూట హాస్పిటల్‌కు వెళ్తేనే... ‘అమ్మో భరించలేం’ అనుకునే వారు ఆశ్చర్యపోయేలా ప్రతినిత్యం హాస్పిటల్స్‌లో రోగాలతో చెలగాటాలాడుతుంటారు. అక్కడ నీళ్లు మింగేసినవారూ, కరెంట్ తగిలి అగ్నిప్రమాదాలకు లోనైన వాళ్లూ, వ్యాధులకు గురైనవాళ్లూ ఉంటారు. కంటికి కనిపించనంత సూక్ష్మమైన వ్యాధికారక క్రిమికీటకాలను ఆశ్రయించి ఉన్నవారూ ఉంటారు. వరద నీటికో, అగ్నిజ్వాలలకో భయపడి మిగతా వాళ్లంతా వారి నుంచి దూరంగా వచ్చేస్తుంటారు. మరీ పలకరించాల్సి వచ్చే దగ్గరి బంధువులు సైతం దూరంగా వెళ్లిపోతూ, మరీ మాట్లాడాల్సి వస్తే కర్చీఫ్ అడ్డుపెట్టుకుంటారు. ధనమిచ్చినా దగ్గరిగా వెళ్లడానికి మనం ఇష్టపడని వాళ్ల దగ్గరికి తనంతట తనే వెళ్తుంటాడు ధన్వంతరి. మరేదైనా వృత్తిలో ఉన్నవారు సెలవులు తీసుకోవచ్చేమోగానీ డాక్టర్‌కు సెలవులు లేవు. సామాజిక గౌరవాలు ఎక్కువే అయినా ఒక్కోసారి వాటిని మించి అవమానాలనే పొందాల్సి రావచ్చు. ఇక కుటుంబ సమస్యలు అందరికీ ఉండేవాటి కంటే కాస్తంత ఎక్కువే. పిల్లాపాపలతో గడిపేందుకూ, కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని వెచ్చించేందుకు అవకాశాలూ ఒకింత తక్కువే. అందుకే... ‘మా అందరినీ కాపాడే మీ ఆరోగ్యం ఎలా ఉంది డాక్టర్..?’ అని ఒక్కసారైనా మనం అడిగి తీరాలి. తమ వ్యక్తిగత జీవితాన్ని విస్మరించుకొని సేవ చేసే వారందరినీ డాక్టర్స్ డే నాడు ప్రత్యేకంగా స్మరించుకోవాలి. అక్కడికి వెళ్లాలంటేనే చాలా మందికి బెరుకు. ఆ ప్రదేశం చూసొచ్చాక చాలా సేపు బెంగ. అదే ఆసుపత్రి. ఇప్పుడు చాలా ఆసుపత్రుల్లో మంచి పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా చూస్తున్నారుగానీ... ఒకప్పుడు అక్కడ మరీ భయవిహ్వలతలు రాజ్యమేలేవి. వేదనలూ రోదనలూ కనిపించేవి. రుగ్మతలు రాజ్యం చేసే చోట హానికారక సూక్ష్మజీవులూ తప్పదు. డాక్టర్లు వాటితోనే సహజీవనం చేస్తూ అవి తమకు అంటుకోకుండా చూసుకుంటూ... వ్యాధిగ్రస్తు లనూ వాటి బారి నుంచి కాపాడుతుంటారు. ప్రమాద అవకాశాలు ఎందుకుంటాయంటే... ఇటీవల అందుబాటులోకి వచ్చిన కొత్త కొత్త చికిత్స ప్రక్రియల్లో భాగంగా డాక్టర్లు రోజూ ఇంజెక్షన్లతో రోగుల శరీరంలోకి సూదులు పంపాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో డాక్టర్లు వాడే సర్జికల్ కత్తుల(స్కాల్పెల్స్) వంటి పరికరాలతో చిన్నవీ, పెద్దవీ గాట్లు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతో రోగికి అటు కలుషితమైన సూదులు, కత్తుల కారణంగానూ, ఇటు వారి శరీరంపై పెట్టిన గాట్ల కారణంగానూ ఇన్ఫెక్షన్లు వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా రోగులు కోలుకోవడానికి డాక్టర్లు చేసే పనులే ఒక్కోసారి రోగులతో పాటు డాక్టర్లకూ ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఉదాహరణకు ఒక ఎయిడ్స్ రోగికి చేసిన ఇంజెక్షన్ డాక్టరుకు గానీ లేదా హెల్త్ కేర్ ప్రొవైడర్కుగానీ గుచ్చుకునే ప్రమాదాలు ఉండవచ్చు. ఇలాంటివి జరిగిన సందర్భాల్లో డాక్టర్లు ఆ జబ్బు తమకు వ్యాపించకుండా తామే ముందస్తు చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. అలాగే రోగిని పరీక్షించి, మరో రోగిని పరీక్షించే మధ్య సమయంలోనే ఆల్కహాల్ బే్‌స్డ్ హ్యాండ్‌వాష్‌లతో చేతులు శుభ్రం చేసుకోవడం, మంచి నాణ్యమైన గ్లౌవ్స్ వాడటం చేస్తుంటారు. శస్త్రచికిత్స చేసే సమయంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ప్రత్యేకమైన గౌన్స్ ధరిస్తుంటారు. అక్కడ ఉపయోగించే పాదరక్షలనూ స్టెరిలైజ్ చేసి ఉంచుతారు. ఆ ఉపకరణాలతో అపకారమే ఎక్కువ... రోగికి ఉపకారం చేసే ఉపకరణాల వల్ల కూడా ఒక్కోసారి డాక్టర్లకు ప్రమాదం కలుగుతుంది. రోగుల పరిస్థితిని మెరుగుపరచేందుకు డాక్టర్లు ఒక్కోసారి రోగి శరీరంలో లోపలి నుంచి కొన్ని ఉపకరణాలను అమర్చుతుంటారు. గుండెలోకి వేసే ఇంట్రా వ్యాస్కులర్, ఊపిరితిత్తుల్లోకి గాలిని పంపేందుకు ఉపయోగించే వెంటిలేటర్లు, మూత్రాశయంలోంచి మూత్రాన్ని పైప్ ద్వారా బయటకు తెచ్చేందుకు ఉపయోగించే యూరినరీ క్యాథెటర్ల వంటివి డాక్టర్లు వాడుతుంటారు. అవి కూడా ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. కుటుంబ సమస్యలు వృత్తిలోని సాధక బాధకాలను అవగాహన చేసుకోగలరనే ఉద్దేశంతో డాక్టర్లలో చాలామంది అదే వృత్తిలోని వారిని జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. అయితే అదే వాళ్లకు సమస్యగా మారవచ్చు. ఇద్దరూ వృత్తిపరంగా బాగా బిజీ అయిపోయినప్పుడు వ్యక్తిగతంగా తమకు కేటాయించుకునే ‘నాణ్యమైన’ సమయం తగ్గుతుంది. జీవిత భాగస్వామి కంటే వృత్తి జీవితానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంటుంది. దీనివల్ల ఇతరత్రా సమస్యలూ ఎదురుకావచ్చు. సాధారణంగా పిల్లల విషయంలో ఈ తరహా సమస్యలు ఎక్కువ. ఉదయం పదింటికి మొదలై, సాయంత్రం ఐదింటికి ముగిసే సాధారణ జీవనశైలి డాక్టర్ల దంపతులకు ఎప్పుడూ సాధ్యం కాదు. ఒకవేళ సాధ్యం చేసుకోవాలనుకున్నా రోగులకు వచ్చే అత్యవసర పరిస్థితులు తమ కోసం, పిల్లల కోసం తగిన సమయాన్ని వెచ్చించలేని పరిస్థితులను వారికి కల్పిస్తుంటాయి. ఇవన్నీ వారికి ప్రతిబంధకంగా పరిణమించేవే. - యాసీన్