breaking news
natakotsavalu
-
నంది నాటకోత్సవాలు: సీఎం జగన్ 100 అడుగుల కటౌట్
సాక్షి, గుంటూరు: నాటక రంగానికి పూర్వవైభవం తీసుకురాడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శనివారం ఉదయం బీసీ వెల్ఫేర్, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి నాటకోత్సవాలను ప్రారంభించారు. నంది నాటకోత్సవాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీఎం జగన్ 100 అడుగుల భారీ కటౌట్ ఆకట్టుకుంటోంది. ప్రాథమిక దశలో మెప్పించి తుది పోటీలకు అర్హత పొందిన కళాకారులు ఈ ఉత్సవాల్లో సత్తా చాటి బహుమతులు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. మొత్తం ఐదు విభాగాలుగా పోటీలు జరగనున్నాయి. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, కళాశాల, యూనివర్సిటీ స్థాయి నాటికలు, బాలల నాటికల ప్రదర్శనలు ఆహూతులను అలరించనున్నాయి. ఈ పోటీల్లో 73 అవార్డులు గెలుచుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 38 నాటక సమాజాల నుంచి 1,200 మంది కళాకారులు పాల్గొంటున్నారు. కళాకారులకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా ఏర్పాట్లు చేశారు. నాటక ప్రదర్శనలను కళాకారులు, విద్యార్థులు, కళాభిమానులు ఉచితంగా తిలకించే అవకాశం కల్పించారు. ఈ వేడుకలు 29 వరకు జరగనున్నాయి. నేటి నాటక ప్రదర్శనలివే ● శనివారం ప్రారంభ సభానంతరం ఉదయం 11 గంటలకు రాజాంకు చెందిన కళా సాగర నాటక సంక్షేమ సంఘం వారి ’శ్రీకాళహస్తీశ్వర మహత్మ్యం’ పద్య నాటక ప్రదర్శనతో ఉత్సవాలు ఆరంభమవుతాయి. కళారత్న డాక్టర్ మీగడ రామలింగ స్వామి రచనలో రూపుదిద్దుకున్న ఈ నాటకానికి మీగడ మల్లికార్జున స్వామి దర్శకత్వం వహిస్తారు. ● మధ్యాహ్నం 2.30 గంటలకు శ్రీకళానికేతన్ హైదరాబాద్ వారి ’ఎర్ర కలువ’ సాంఘిక నాటకం ప్రదర్శితమవుతుంది. రచన: ఆకురాతి భాస్కర్ చంద్ర. దర్శకత్వం : డాక్టర్ వెంకట్ గోవాడ ● సాయంత్రం 5 గంటలకు గుంటూరు అమృతలహరి థియేటర్ ట్రస్ట్ వారి ‘నాన్నా.. నేనొచ్చేస్తా’ సాంఘిక నాటిక ప్రదర్శన ఉంటుంది. రచన: తాళాబత్తుల వెంకటేశ్వరరావు. దర్శకత్వం: అమృత లహరి. ● సాయంత్రం 6.30 గంటలకు తెనాలి శ్రీదుర్గా భవాని నాట్యమండలి వారి ‘శ్రీరామభక్త తులసీదాసు’ పద్య నాటకం ప్రదర్శితమవుతుంది. రచన: డాక్టర్ ఐ.మల్లేశ్వరరావు. దర్శకత్వం : ఆదినారాయణ వైఎస్సార్, ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాలు ఈ ఏడాది డాక్టర్ వైఎస్సార్ రంగస్థల అవార్డును కాకినాడకు చెందిన యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్‌కు ఇస్తున్నట్టు పోసాని కృష్ణమురళి తెలిపారు. రూ.5,00,000 నగదు ప్రోత్సాహం అందించనున్నట్టు వెల్లడించారు. ఎన్టీఆర్ రంగస్థల పురస్కారానికి విశాఖపట్నానికి చెందిన డాక్టర్ మీగడ రామలింగస్వామి ఎంపికై నట్లు చెప్పారు. ఈయనకు రూ.1,50,000 నగదు ప్రోత్సాహకం అందించనున్నారు. -
ఈ నెల18 నుంచి ఒంగోలులో నాటకోత్సవాలు
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఒంగోలులో జనవరి18వ తేదీ నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు జడ్పీ చైర్మన్, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు వెల్లడించారు. గురువారం ఒంగోలులో ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావుతో కలసి హరిబాబు విలేకరులతో మాట్లాడారు. అలాగే ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు బాలోత్సవం పేరుతో బాలల నాటికలు ప్రదర్శించనున్నట్లు ఈదర హరిబాబు వివరించారు. ఈ కార్యక్రమాలు స్థానిక పీవీఆర్ ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతాయని ఆయన తెలిపారు. -
నాటకంతో సమాజానికి చక్కటి సందేశం
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: మానవజీవన విధానం, విలువలతో కూడిన నాటకం సమాజానికి చక్కటి సందేశా న్ని అందిస్తుందని ప్రముఖ సాహితీవేత్త లు సర్వోత్తమరావు, ఆకెళ్ల విభీషణశర్మ, ప్రముఖ రచయిత కోటాపురుషోత్తం తెలిపారు. అభినయ నేషనల్ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మహతి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక నృత్య, నాటకోత్సవాలకు ముఖ్య అతి థులుగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆధ్యాత్మిక నృత్య, నాటకోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ కళలకు పుట్టినిల్లు భారతదేశమని, ఆ కళలను పరిరక్షించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. అభినయ నేషనల్ థియేటర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పదేళ్లుగా బహు భాషా నాటకోత్సవాలను నిర్వహిస్తూ కనుమరుగవుతున్న నాటకాలను పరిరక్షించిడం అభినందనీయమన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో ఆధ్యాత్మిక నృత్య, నాటకోత్సవాలను నిర్వహించడం సంతోషకరమన్నారు. మహతిలో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ ఆధ్యాత్మిక నృత్య, నాటకాలను ప్రజలందరూ తిలకించాలని వారు కోరారు. అనంతరం చిన్నారి శ్రీమేధ, సరయూ ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను అలరించింది. మహిషాసురమర్థిని నాటకరూపం ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎస్వీ సంగీత, నృత్య కళాశాలకు చెందిన శరత్చంద్ర బృందం శివప్రసాద్, సురేష్, హిందుమతి మూషిక వాహన, అష్టపది, శంభోశంకర, వేంకటాచల నిలయం వంటి భరతనాట్య రూపకాలు మైమరపించా యి. చివరిగా వాణి త్రిష ప్రదర్శించిన భరతనాట్యం అలరించింది. ఈ కార్యక్రమంలో అభినయ నేషనల్ థియేటర్ ట్రస్ట్ కన్వీనర్ అభినయ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.