కొత్త చానల్ ఆలోచన లేదు: నాగార్జున
కొత్తగా 'మనం టీవీ' అనే పేరుతో ఎంటర్టైన్మెంట్ చానల్ ప్రారంభిస్తున్నారంటూ వచ్చిన వార్తలను హీరో నాగార్జున కొట్టిపారేశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. తాను టీవీ ఛానల్ ప్రారంభిస్తున్నానంటూ వచ్చిన వార్తలన్నీ అవాస్తవాలని ఆయన పోస్ట్ చేశారు.
గతంలో నాగార్జున సహ యజమానిగా ఉన్న మా టీవీ నెట్వర్క్ను ఇటీవలే స్టార్ ఇండియా కొనుగోలు చేసింది. అప్పట్లో మాటీవీలో నాగార్జునతో పాటు చిరంజీవి, నిమ్మగడ్డ ప్రసాద్ భాగస్వాములుగా ఉండేవారు. కాగా నాగార్జున ప్రస్తుతం 'సోగ్గాడే చిన్ని నాయనా'తో పాటు.. తమిళ హీరో కార్తీతో మరో సినిమా చేస్తున్నారు. దీనికి ఇంకా పేరు పెట్టలేదు.
There are rumours that Iam starting a TV entertainment channel called Manam/ ABSOLUTELY NOT TRUE!! Fyi:)
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 15, 2015