mla salaries
-
‘కోత’ల డ్రామాలతో సమస్య గట్టెక్కగలరా?
తెలంగాణలో మంత్రుల జీతాలు సగానికి కోశారు. రాజకీయ డ్రామానా? ఆదర్శంగా నిలిచే ప్రయత్నమా? ఎమ్మెల్యేల జీతాల్లోనూ కోతలు పెట్టి తద్వారా మిగిలిన డబ్బును రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు వాడతారని సమాచారం. మామూలుగానైతే ఈ చర్యలను అందరూ ప్రశంసించాల్సిందే కానీ... రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, ఎమ్మెల్యేల జీతాల్లో కోతతో మిగిలే డబ్బును పరిగణలోకి తీసుకుంటే దీన్ని డ్రామా అనే అనాల్సి వస్తుంది. బకాయేమో కొండంత.. మిగిలేది పిసరంత మాత్రమే మరి. దేశంలోని పలు రాష్ట్రాలు ఇప్పుడు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ వంటి చోట్ల అప్పు చేయకపోతే రోజు గడవని స్థితి. అదే సమయంలో అధికారం కోసం ఇచ్చిన అడ్డమైన హామీల అమలు బరువూ ఆయా ప్రభుత్వాలపై పడుతోంది. ప్రజలను ఏమార్చి అధికారం సాధించిన తర్వాత అనేక పిల్లిమొగ్గలు వేయాల్సి వస్తోంది. తెలంగాణలో రిటైర్డ్, సాధారణ ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయి సుమారు రూ.14 వేల కోట్లు మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు నెలకు రూ.పది కోట్లు కూడా కాకపోవచ్చు. ఇందులో సగం ఆపుకుని ఉద్యోగులకు చెల్లిస్తామని చెబితే హాస్యాస్పదం అనిపించదా? పోనీ వీరు పూర్తిగా తమ జీతాలు తగ్గించుకుంటే అది వేరే విషయం. అభినందించవచ్చు. కాని హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారుల జీతాలు ఆరు నెలలపాటు సగం తీసుకకోకుండా ఆగుతారట. అంటే ఆ తర్వాత మొత్తం బకాయిలతోసహా తీసుకుంటారనే కదా?. ఏపీలో తెలుగుదేశం తరపున భజన చేసే ఎల్లో మీడియాకు అక్కడి ప్రభుత్వం ఒక లీకు ఇచ్చింది. హిమాచల్‌లో మాదిరి సంక్షోభం రాకుండా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఆ మీడియా పేర్కొంది. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ స్కీములలో అనర్హుల ఏరివేత, దుబారా వ్యయం నియంత్రణ ఆవశ్యం అంటూ ఆ మీడియా ప్రచారం చేసింది. బహుశా ఆ మీడియా వారిని సంతోషపరచడానికో ఏమో కాని, ఏపీ కన్నా ముందుగా తెలంగాణలో దానిని పాటించడానికి రేవంత్ సర్కార్ సిద్దం అయిందన్న భావన కలుగుతోంది. అందులో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు కొంతకాలం సగం చొప్పునే తీసుకుంటారట. ఇతర ఆదాయ మార్గాలు కూడా అన్వేషించాలని తలపెట్టారు. అది తప్పు కాదు. కాని అసలు సమస్య తెలంగాణ లో కాంగ్రెస్, ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఇచ్చిన హామీల భారం అన్నది వాస్తవం కాదా? దానిని కప్పిపుచ్చుకోవడానికి తమకు మద్దతు ఇచ్చే మీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వాలు కొత్త డ్రామా నడపాలని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. తెలంగాణ తర్వాత ఏపీలో కూడా ఈ తరహా సీన్ ను చూస్తామేమో తెలియదు. ఏపీలో ప్రభుత్వం సుమారు రూ.40 వేల కోట్ల మేరకు ఉద్యోగులకు బకాయిపడినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో రిటైరైన వారికి రావల్సిన ఫైనల్ మొత్తాలు సకాలంలో చెల్లించకపోవడంపై హైకోర్టు కూడా పలుమార్లు ప్రభుత్వాన్ని ఆక్షేపించింది. అయినా ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలో తెలియని స్థితిలో ప్రభుత్వం ఉందనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఆర్టీసీ సిబ్బందికి, అలాగే అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఉదాహరణకు వృద్దాప్య ఫించన్‌ను రూ.రెండు వేల నుంచి రూ.నాలుగు వేలు చేస్తామని, ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2500 చొప్పున చెల్లిస్తామని.. ఇలా అనేక వాగ్దానాలు చేసింది.పైగా ఇవన్ని వంద రోజుల్లో నెరవేర్చుతామని కూడా ప్రజలను నమ్మించే యత్నం చేసింది. ప్రజలు విశ్వసించారా? లేక ఇతర కారణాల వల్లనా అన్నది చెప్పలేం కాని, కాంగ్రెస్ అధికారంలోకి అయితే రాగలిగింది. ఆ తర్వాత అసలు కథ ఆరంభమైంది. గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, మిగులు రాష్ట్రాన్ని లోటు రాష్ట్రంగా చేశారని, కాళేశ్వరంపై రూ.లక్ష కోట్లు వృథా చేశారని ఇలా పలు విధాలుగా సమస్యలను డైవర్ట్ చేయడానికి యత్నించారు. ఇవన్నీ తెలియకుండానే ఎన్నికల వాగ్దానాలు చేశారా? ఎల్ల కాలం అది సాగదు కదా? సడన్ గా ఆర్టీసీ సిబ్బంది రియాక్ట్ అయ్యారు. సమ్మెకు దిగారు. ఒక కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదంతా ప్రభుత్వానికి పెద్ద కళంకంగా మారింది.దాంతో రేవంత్ ప్రభుత్వం వేగంగా స్పందించాల్సి వచ్చింది. ప్రస్తుతానికి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ఒక పరిష్కారం కనుక్కున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కమిటీ వేస్తామని చెప్పారు. ఇది కొంత సమయం తీసుకునే కసరత్తు తప్ప ఇంకొకటి కాకపోవచ్చు. ఇలాగే ఆయా వర్గాల వారు తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఆందోళనలకు దిగితే ప్రభుత్వానికి మరింత ఇరకాట పరిస్థితి ఏర్పడుతుంది. రైతులలో ఏర్పడిన అసంతృప్తిని కొంతైనా పొగొట్టాలని రేవంత్ సర్కార్ దశల వారిగా రైతు బంధు స్కీమ్ ను అమలు చేస్తోంది.రుణమాఫీని కొంత మేర చేశారు. అయినా ఇతర సమస్యలు వెంటాడుతూనే ఉంాయి. ఫీజ్ రీయింబర్స్ మెంట్ గురించి ప్రైవేట కాలేజీల వారు కొన్ని నెలల క్రితం ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అక్కడికి హైదరాబాద్‌లో భూముల అమ్మకం వంటివాటి ద్వారా కొంత డబ్బు సంపాదిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు, వస్తున్న ఆదాయానికి సంబంధం ఉండడం లేదు. దానివల్లే ప్రభుత్వం వేల కోట్ల అప్పులు చేయవలసి వస్తోంది.ఈ ఏడాది కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రూ.18900 కోట్ల అప్పు చేయాలని ప్రబుత్వం నిర్ణయించుకుంది. ప్రతి నెల సగటున రూ.6300 కోట్ల అప్పు చేయాలన్నమాట. అంటే రోజుకు రూ.210 కోట్ల రుణం! రాష్ట్రం అప్పు ఇప్పటికే సుమారు రూ.ఎనిమిది లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది ఇది ఇంకా పెరుగుతుంది.అయినా ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చడం అసాధ్యం అని చెప్పక తప్పదు. ఒకప్పుడు ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి పాకిస్తాన్‌తో యుద్దం నేపథ్యంలో ‘‘జై జవాన్, జై కిసాన్’’ అన్న నినాదం ఇచ్చి ప్రజలు ఒక పూట ఉపవాసం ఉండి ,ఆ డబ్బును సైనికుల నిధి ఇవ్వాలని కోరారు. దానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. కోట్లాది మంది దానిని ఆచరించారు. ఆ రోజుల్లో ఆయన పాటించిన నిరాడంబరత, చిత్తశుద్ధి, దేశ భక్తి మొదలైనవి కారణాలుగా ఉన్నాయి. కాని ప్రస్తుతం ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వాలు విలాసవంతమైన రీతిలో ఖర్చులు చేస్తున్నాయి. అవినీతికి కొదవే లేదు. ప్రజలను మభ్య పెట్టడానికి ఇష్టారీతిన ఎన్నికల ప్రణాళికలను ప్రకటించడం వంటివి చేస్తున్నాయి. అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేస్తున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చాలా ఏళ్ల క్రితం అమెరికాలో చేసిన ఒక వ్యాఖ్య అర్థవంతమైందే అనుకోవాలి. మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నప్పుడు రాజకీయ నేతలుగా మేము చేయకుండా ఉంటామా? అని అన్నారు. చమత్కారం కోసం ఆ మాట చెప్పినా,అది అక్షరసత్యం!కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఒక్కసారి గెలిస్తే బిందాస్
ఖమ్మం, మయూరి సెంటర్: పేరుకు పేరు, హోదా, గౌరవం, ఎమ్మెల్యేగా గెలిస్తే ఆ కిక్కే వేరు. అందుకే ఎన్నికల్లో పోటీచేయాలని, అసెంబ్లీలో ఒక్కసారైనా అధ్యక్షా అంటే చాలనుకునే వారు కొందరు. ఇందుకు ఎన్ని తలనొప్పులు ఎదురైనా,ఎంతో డబ్బు ఖర్చయినా వెనుకడుగు వేయరు. అయితే ఎమ్మెల్యేగా గెలిస్తే పదవిలో ఉన్నప్పడే కాదు, మాజీలుగా మారిన తర్వాత కూడా ఎన్నో సౌకర్యాలు, సదుపాయాలు పొందవచ్చు. జీవితంలో ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిస్తే వారు జీవితాంతం బిందాస్ బతికేయవచ్చు. దీనికి కారణం వివిధ రాష్ట్రాలలో ఎమ్మెల్యేలకు ఇచ్చే గౌరవ వేతనాలు ఇందుకు నిదర్శనం. వాటి వివరాలు తెలుసుకుందాం. 4,120 అసెంబ్లీ సెగ్మెంట్లు.. దేశంలో 29 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. వాటన్నింటి పరిధిలో 4,120 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఎన్నికలు జరిగిన ప్రతిసారి వేలమంది పోటీపడుతూ ఉన్నారు. కొందరు ఒకటి,రెండు సార్లు గెలిస్తే, మరికొం దరు చాలా సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేస్తుంటారు. కానీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన, కొంతకాలం పదవిలో ఉన్నా సరే వారు ఇక జీవితాంతం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.ç ³దవిలో ఉన్నంత కాలం భారీగా వేతనాలు, అలవెన్సులు ఉంటాయి. ఎక్కyì కి వెళ్లినా, ఏ ఖర్చు అయినా దాదాపు ప్రభుత్వ ఖాతాలోనే పడుతుంది. వారు పదవిలోంచి దిగిపోతే మాజీ ఎమ్మెల్యే హోదాలో జీవితాంతం పెస్షన్, ప్రభుత్వ సౌకర్యాలెన్నో అందుతాయి. మాజీగా మారినా.. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి నెలకు 30,000 రూపాయలు పెన్షన్ అందుతుంది. వాహన ఖర్చులకు 8,000 రూపాయలు, జీవితాంతం ఉచిత వైద్య సౌకర్యాలు అందుతాయి. ఐదేళ్ల గడువుతో సంబంధం లేకుండా కనీసం ఒకరోజు పదవిలో ఉన్నా, ఇవన్నీ అందుతాయి. దేశవ్యాప్తంగా కూడా ఈ అలవెన్సులు దాదాపు ఒకేలా ఉన్నాయి. రెండోసారి అంతకంటే ఎక్కువ గెలిచిన వారికి పెన్షన్‌కు అదనంగా ఏడాదికి మరో 1,000 రూపాయల చొప్పున గరిష్టంగా 50,000 రూపాయల వరకు చెల్లిస్తారు. ఒకవేల మాజీ ఎమ్మెల్యే గనుక చనిపోతే వచ్చే పెన్షన్‌ను అతడి భార్యకు కూడా సమానంగా ఇస్తారు. వేతనాల్లో తెలంగాణే టాప్ ప్రతి ఎమ్మెల్యేకు నెలకు ఇంతని వేతనంతో పాటుగా అలవెన్సుల కింద కొంత సొమ్ము అందజేస్తారు. ఇది అన్ని రాష్ట్రాల్లో ఒకే విధం గా ఉండదు. అయితే ఎమ్మెల్యే జీతభత్యాలలో మన తెలంగాణ రాష్ట్రం టాప్‌లో ఉంది. మన రాష్ట్రంలో ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు 2,50,000 రూపాయలు జీతంగా ఇస్తారు. దేశంలో అత్యల్పంగా త్రిపుర ఎమ్మె ల్యేకు 34,000 రూపాయలు అందుతాయి. ఎమ్మెల్యేలకు అదే మొత్తం లో వేతనంతో పాటుగా అలవెన్సులు కలిపి ఉంటాయి. తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు 2,50,000 చెల్లిస్తుండగా, అందులో 20,000 జీతం కాగా.. 2,30,000 నియోజకవర్గ అలవెన్సుల కింద ఇస్తారు. అధేవిధంగా వారి వాహనాల కొను గోలుకు 30,00,000 వరకు లోన్ రూపంలో ఇవ్వటం జరగు తుంది. 2016 మార్చి 29వ తేదీన దీనికి సంబంధించిన బిల్లు తెలంగాణ శాసనసభలో ఆమోదం పొందింది. యూపీలో ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు 1,87,000 చెల్లిస్తుంటే, అందులో 75,000 జీతం, 24,000 డీజీల్ ఖర్చులకు, 6,000 పర్సనల్ అసిస్టెంట్, 6,000 మొబైల్ ఖర్చులకు, మిగతా మొత్తాన్ని ఇతర ఖర్చులకు ఇస్తారు. ఇవే కాకుండా ప్రభుత్వ అతిధి గృహాల్లో ఉచిత భోజన వసతి సౌకర్యాలు, నియోజకవర్గంలో పర్యటనలకు వెళ్లిన ఖర్చుల బిల్లుల మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైళ్లలో ఎమ్మెల్యేతో పాటుగా మరొకరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. గత ఏడేళ్లలో ఎమ్మెల్యేల జీతభత్యాలు సగటున యూపీలో 125 శాతం, ఢిల్లీలో 450 శాతం, తెలంగాణలో 170 శాతం పెరగటం విశేషం. -
మీ ఎమ్మెల్యే జీతం ఎంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్ : మీ నియోజకవర్గ ఎమ్మెల్యే నెలకు ఎంత జీతం అందుకుంటారో తెలుసా? ఏ అలవెన్సుల కింద ఎంత వస్తాయో తెలుసా? వివరాల్లోకి వెళ్తే.. దేశంలో ప్రజాపతినిధుల భారీ మొత్తంలోనే జీతభత్యాలను అందుకుంటున్నారు. అన్ని అలవెన్సులు, భత్యాలు కలుపుకొని ఒక్కొ ఎమ్మెల్యే సగటు జీతం రూ.1.10 లక్షలు తీసుకుంటున్నారు. ఇటీవల సంత్సరాలలో ఎమ్మెల్యేల జీతం సగటున 120 శాతం పెరగిగింది. దేశంలోని ఎమ్మెల్యేలతో పోలిస్తే తెలంగాణ శాసనసభ్యులు అత్యధిక జీతం రూ.2.50 లక్షలు అందుకుంటున్నారు. తర్వాతి స్థానంలో ఢిల్లీ ఎమ్మెల్యేలు రూ.2.10 లక్షలు వేతనంగా పొందుతున్నారు. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు నెలవారీ జీతం రూ.1.30 లక్షలతో ఐదో స్థానంలో ఉన్నారు. దేశంలోనే అత్యంత తక్కువగా త్రిపుర ఎమ్మెల్యేలు నెలకు రూ. 17,500 తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎమ్మెల్యేల జీతానికి ఆదాయపన్ను మినహాయింపు ఉంటుంది. ఎమ్మెల్యే జీతంలో ఏమేమి ఉంటాయో తెలుసా? ఎమ్మెల్యే తీసుకొనే నెలవారి జీతంలో పలు అలవెన్సులు పొందుపరచి ఉంటాయి. బేసిక్ శాలరీ, ట్రావెలింగ్ అలవెన్స్, నియోజకవర్గ అలవెన్స్లతో పాటు ఇతర అలెవన్సులు కూడా ఉంటాయి. విదేశాలతో పోలిస్తే భారత్‌లో గత పదేళ్లలో ఎమ్మెల్యేల జీతం 1200 శాతం పెరిగింది. తెలంగాణ: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ఎమ్మెల్యేల జీతం ఏకంగా 170 శాతం పెరిగింది. నెలకు రూ. 2.50 లక్షలు అందుకుంటున్నారు. వీటిలో బేసిక్ శాలరీ రూ.20 వేలు కాగా రూ.2.30 లక్షలు నియోజక వర్గ అలవెన్సులు. ఒక ముఖ్యమంత్రి జీతం కూడా 72 శాతం పెరిగింది. గతంలో రూ.2.44 లక్షలు ఉండగా ఇప్పుడు రూ 4.21 లక్షలకు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ : తెలంగాణ ప్రభుత్వం జీతభత్యాలు పెరిగిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎమ్మెల్యేల జీతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వంపై రూ. 30.63 కోట్ల అదనపు భారం పడుతుంది. ముఖ్యమంత్రి విషయానికొస్తే.. నెలకు రూ. 1.40 లక్షలు తీసుకుంటారు. వీటి నుంచి సీఎం ట్రావెలింగ్ అలవెన్సులను మినహాయించారు. అంటే ఇతర ఎమ్మెల్యేల మాదిరి కాకుండా అదనంగా ట్రావెలింగ్ అలవెన్సులు చెల్లిస్తారు. -
ప్రధాని కూడా జీతం పెంచుకోవాలి
-
ప్రధాని కూడా జీతం పెంచుకోవాలి
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా జీతం సరిపోదని.. ఆయన కూడా తన జీతం పెంచుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాల పెంపుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్య చేశారు. ఈ జీతాలు పెంచిన తర్వాత కూడా ప్రముఖ మీడియాకు చెందిన ఎడిటర్లు, టాప్ టీవీ యాంకర్లు పొందేవాటిలో 120వ వంతు కూడా ఎమ్మెల్యేలకు రాదని కేజ్రీవాల్ అన్నారు. నెలకు లక్ష రూపాయల జీతం ఎందుకు సరికాదని, ఒకవేళ ప్రధాని జీతం దానికంటే తక్కువైతే ఆయన జీతం కూడా పెంచాల్సిందేనని చెప్పారు. ప్రధానమంత్రి జీతం పెంచాలని తామంతా డిమాండ్ చేస్తున్నామని కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. రేపు ఒబామాను కలిస్తే తన జీతం ఎంతని చెప్పుకొంటారని, అందుకే ప్రధాని జీతం నెలకు కనీసం రూ. 8-10 లక్షలు చేయాలని తెలిపారు. ఎమ్మెల్యేలకు తగినంత జీతం, ఇతర సౌకర్యాలు ఇవ్వాల్సిందేనని, అయినా వాళ్లు అవినీతికి పాల్పడితే మాత్రం వాళ్లను వదలకూడదని చెప్పారు.


