breaking news
Midgle
-
కడుపునొప్పి భరించలేక మహిళ ఆత్మహత్య
మిడ్జిల్ : కడుపునొప్పి భరించలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. తలకొండపల్లి మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన అలివేల (30) కు సుమారు పదేళ్ల క్రితం మిడ్జిల్ మండలంలోని మున్ననూర్ వాసి లక్ష్మయ్యతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, కొన్నాళ్లుగా భార్య తరచూ కడుపునొప్పితో బాధపడుతుండగా వివిధ ఆస్పత్రుల్లో చూపించుకున్నా ఎంతకూ తగ్గలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె గురువారం సాయంత్రం ఇంట్లోనే పురుగుమందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మతి చెందింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రమేష్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం అనంతరం మతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా బుచ్చిరెడ్డి ఎంపిక
మిడ్జిల్: జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు మండలంలోని దోనూర్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరెడ్డి ఎంపికైనట్లు పీఆర్టీయూ మండల అధ్యక్షుడు ఎల్లయ్య తెలిపారు. మండలలోని గుడిగాన్‌పల్లి గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి గతేడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ ఏడాది జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక కావడంపై మండల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తంచేశారు. అవార్డును సెప్టెంబర్ 5వ తేదీన డిల్లీలో రాష్ట్రపతి చేతులమీదుగా అందుకోనున్నారని ఆయన తెలిపారు.