breaking news
Matthias Mueller
-
ఫోక్స్ వాగన్ పై చర్యలు రెట్టింపు
కర్బన ఉద్గారాల మోసపూరిత కేసులో ఫోక్స్ వాగన్ పై చర్యలు తీవ్రం అవుతున్నాయి. కంపెనీ చెల్లించాల్సిన జరిమానా నిబంధనల ప్రకారం రెట్టింపు అయింది. మోసపూరిత కేసులో 6.7 బిలియన్ యూరోలుగా ఉన్న జరిమానా, రెండు రెట్లు అధికంగా ప్రస్తుతం 16.2 బిలియన్ యూరోలు ( 18.2 బిలియన్ డాలర్లు) అయిందని యూరప్ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ఫోక్స్ వాగన్ తెలిపింది. ఈ రెట్టింపు చెల్లింపులతో కంపెనీ ఆర్థిక పరిస్థితి పడిపోతోంది. కంపెనీ ఇస్తున్న వార్షిక డివిడెంట్ ను 97 శాతం తగ్గించి, ప్రాధాన్య షేర్లకు 0.17 యూరోలు చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఫోక్స్ వాగన్ షేర్లు కూడా 1.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఈ ఉద్గారాల మోసపూరిత కేసు బయటికి పొక్కక ముందు అక్టోబర్ లో ఫోక్స్ వాగన్ షేర్లు 45 శాతం రైజింగ్ లో నడిచాయి. 2016లో ఫోక్స్ వాగన్ అమ్మకాలు సాధారణంగా ఉంటాయని, రెవెన్యూలు 5 శాతానికి పడిపోయే అవకాశాలున్నట్టు కంపెనీ పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని గణాంకాల రూపంలో విడుదల చేసింది. ఇవి ఫోక్స్ వాగన్ ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మాథ్యూస్ ముల్లెర్ తెలిపారు. అయితే ప్రస్తుతం కంపెనీ తయారుచేస్తున్న కార్లలో వాడే ఉద్గారాలు నాణ్యమైనవిగా పేర్కొన్నారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి ఫోక్స్ వాగన్ అంత ఎక్కువ శ్రద్ధ వహించడం లేదని వెల్లడించారు. ఈ మోసపూరిత కేసు సెప్టెంబరులో బయపడింది. అక్రమ ఇంజన్ నియంత్ర సాప్ట్ వేర్ ను ఉద్గారాల టెస్టులకు వాడుతుందని యూఎస్ పర్యావరణ రక్షిత ఏజెన్సీ వెల్లడించింది. ఈ మోసాల గురించి నివేదికల రూపంలో బహిర్గతమైనప్పటికీ ప్రజల్లోకి రావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. అనంతరం రెండు నెలల వ్యవధిలో యూఎస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి, మార్కెట్లో ఉన్న కార్లను కంపెనీ వెనక్కి రప్పించుకుంది. ఇప్పటికీ ఆ కంపెనీ జరిమానాలు, క్రిమినల్ ఇన్ వెస్టిగేషన్లు ఎదుర్కొంటోంది. ఈ కుంభకోణం బయటపడిన కొన్ని రోజులకే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్టిన్ వింటర్ కార్న్ రాజీనామా చేశారు. అప్పటినుంచి ఈ కేసులో ఫోక్స్ వాగన్ తలమునకలవుతోంది. -
ఫోక్స్ వాగన్ సీఈఓగా ముల్లర్
బెర్లిన్ : జర్మనీ కార్ల దిగ్గజం ఫోక్స్ వాగన్ సీఈఓగా మత్తియాస్ ముల్లర్ నియామకమయ్యారు. సంస్థపై కుంభకోణం నేపథ్యంలో ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో బుధవారం నాడు సీఈఓ పదవికి మార్టిన్ వింటర్ కార్న్ చేసిన విషయం విదితమే. అయితే, శుక్రవారం నాడు జరిగిన బోర్డు సమావేశంలో ముల్లర్‌ను సీఈఓగా ప్రకటించారు. కొత్త సీఈఓ ముల్లర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కంపెనీ ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉంది. ప్రజల్లో పోయిన పేరును, నమ్మకాన్ని తిరిగి తీసుకురావడానికి కృషిచేస్తాను. సంస్థ నియమాలను మరింత కఠినతరం చేయనున్నట్లు చెప్పాడు. సంస్థకు చెందిన పోర్చె యూనిట్‌కు అధిపతిగా ముల్లర్ పనిచేస్తున్నారు. 1.1 కోట్ల కార్లలో పొల్యూషన్ చెక్ కనిపెట్టకుండా చేసేందుకు ఓ రకమైన ఇంజిన్లను అమర్చి ఫోక్స్ వాగన్ భారీ కుంభకోణానికి తెరతీసిన విషయం అందరికి విదితమే. అమెరికాలో చేసిన పొల్యూషన్ పరీక్షలలో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఒక్కో విషయం బయడపడ్డాయి. అమెరికాలోనే సుమారు 5 లక్షల డీజిల్ కార్లలో ఇటువంటి పరికరాలను ఆ సంస్థ అమర్చినట్లు కనుగొన్నారు.