breaking news
Long-term investment
-
30 ఏళ్ల నాటి షేర్లు.. ఇప్పుడు ఎన్ని కోట్లో తెలుసా?
అదృష్టం ఎవరి జీవితంలో ఎప్పుడు పలకరిస్తుందో చెప్పలేం. 1990వ దశకంలో తన తండ్రి కొన్న షేర్లు ఇప్పుడు కొడుక్కి జీవితం మారిపోయే అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. అప్పట్లో తన తండ్రి కేవలం లక్ష రూపాయలకు కొనుగోలు చేసిన పాత జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్ సర్టిఫికెట్లు అనుకోకుండా ఇటీవల కొడుక్కి దొరికాయి. వాటి విలువ ఇప్పుడు కొన్ని పదుల కోట్ల రూపాయలు.రెడిట్‌లో తన దృష్టికి వచ్చిన ఈ కథను ఇన్వెస్టర్ సౌరవ్ దత్తా ‘ఎక్స్’ పోస్ట్ లో వివరించారు. ‘ఓ రెడిట్ యూజర్ తన తండ్రి 1990లలో రూ.1లక్షకు కొన్న జేఎస్‌డబ్ల్యూ షేర్లను ఇటీవల కనుగొన్నాడు. ఇప్పుడు వాటి విలువ రూ.80 కోట్లు. సరైన సమయంలో కొనడం, అమ్మడానికి ఉన్న శక్తి ఇదే’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు సౌరవ్ దత్తా.ఎప్పుడో 30 ఏళ్ల క్రితం కొన్న షేర్ల విలువ ఇప్పుడు కోట్లలో ఉండటంతో ఇప్పుడు ఒక తరానికే సంపదను సృష్టించాయి. దీర్ఘకాలిక పెట్టుబడికి ఉన్న శక్తి ఏంటో తెలియజేస్తున్నాయి. కాగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలా మంది యూజర్లు ఆశ్చర్యపోతూ ఈ పోస్ట్‌కు ప్రతిస్పందించారు. ఇక రిటైర్ అయి ప్రశాంతంగా జీవితాన్ని గడపొచ్చని ఒకరు.. ఇది కేవలం పెట్టుబడి కాదు.. వారసత్వ సృష్టి.. అంటూ పలు విధాలుగా కామెంట్లు చేశారు.జేఎస్‌డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ దేశంలో ప్రముఖ ఉక్కు తయారీదారు. బలమైన మార్కెట్ ఉనికితో ప్రపంచ దేశాల్లోనూ విస్తరిస్తోంది. ప్రస్తుతానికి ఈ కంపెనీ షేరు ధర రూ.1004.90 వద్ద ఉండగా మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.37 లక్షల కోట్లుగా ఉంది. జేఎస్ డబ్ల్యూ స్టీల్ షేర్లు కొన్నేళ్లుగా గణనీయమైన వృద్ధిని కనబరిచాయి. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు మంచి రాబడులను అందించాయి.👉ఇది చదివారా? జాబ్ రావాలంటే క్రెడిట్ స్కోరే కీలకం.. కంపెనీల్లో కొత్త ధోరణి..ఈ సంఘటన దీర్ఘకాలిక పెట్టుబడుల ఆవశ్యకతను తెలియజేస్తోంది. ఇప్పుడిప్పుడే ఉద్యోగాల్లో చేరి కెరియర్ను ప్రారంభించిన యువత సేవింగ్స్‌పై ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులపై దృష్టి సారించాలి. సంపాదనలో కొంత మొత్తాన్ని సేవింగ్స్‌కు, ఇన్వెస్ట్‌మెంట్‌కు తప్పనిసరిగా కేటాయించాలని నిపుణులు సూచిస్తున్నారు. -
రూ.1,000 పెట్టుబడి రూ.1.36 కోట్లు అయింది!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం అంటే ఇప్పటికీ చాలా మంది జంకుతారు. ఎందుకంటే ఇందులో లాభాలతో పాటు నష్టాలు అదే స్థాయిలో ఉంటాయి. కానీ ఓ ఇంజినీరు ఈక్విటీ మార్కెట్లో తన అద్భుతమైన ప్రయాణంతో దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు ఎలా ఉంటాయో చూపించారు.పంజాబ్‌లోని లుధియానాకు చెందిన కుల్దీప్ సింగ్ 1986లో జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఐపీఓ సందర్భంగా రూ.1,000 ఇన్వెస్ట్ చేశారు. స్టాక్ విభజనలు, బోనస్ ఇష్యూల తర్వాత 2024 జూన్ 7న ఆయన పెట్టుబడి విలువ రూ.1.36 కోట్లు అయింది. అప్పట్లో రూ.10 చొప్పున 100 షేర్లు కొనుగోలు చేసినట్లు కుల్దీప్ సింగ్ తెలిపారు.కుల్దీప్ సింగ్ ప్రస్తుతం జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్‌కు చెందిన 7,580 షేర్లను కలిగి ఉండగా, 2024 జూన్ 7న ఒక్కో షేరు విలువ రూ.1,800 వద్ద ముగిసింది. 2017లో పంజాబ్ స్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి డిప్యూటీ చీఫ్ ఇంజినీర్‌గా పదవీ విరమణ చేసిన ఆయన పోర్ట్‌ఫోలియో విలువ ప్రస్తుతం రూ.4 కోట్లుగా ఉంది. -
ఈ ఏడాది కాస్త బాగుంటుంది..
జెన్‌మనీ జేఎండీ సతీష్ కంతేటి స్వల్పకాలానికి బలహీనంగానే మార్కెట్లు * మూడేళ్ల దృష్టితో ఇన్వెస్ట్మెంట్ చేయాలి... * సంస్కరిస్తున్న రంగాల కంపెనీలు * పెట్టుబడులకు అనుకూలం... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లలో స్థిరత్వం కష్టమైపోతోంది. ఒకరోజు పెరిగితే మరో రెండ్రోజులు తగ్గుతున్నాయి. రెండ్రోజులు పెరిగితే మళ్లీ ఆ వెంటనే తగ్గుతున్నాయి. మరి మున్ముందు ఎలా ఉంటాయి? ఇన్వెస్టర్లు ఎలా వ్యవహరించాలి? ఈ విషయమై జెన్ మనీ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ సతీష్ కంతేటిని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో కొన్ని ప్రశ్నలడిగింది. ఆ ఇంటర్వ్యూ సంక్షిప్తంగా... కొన్నాళ్లుగా దేశీయ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణాలేంటి? గడిచిన ఏడాది కాలంలో దేశీయ సూచీలు సుమారు 5 శాతం నష్టపోయాయి. దీనికి అనేక కారణాలు చెప్పొచ్చు. ప్రధానంగా దేశీయ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంత వేగంగా వృద్ధి చెందలేదు. అంతర్జాతీయ వృద్ధిరేటు నెమ్మదించడం, ఆర్థిక సంస్కరణలు వేగం పుజుకోకపోవడం, కరువు, బ్యాంకుల వద్ద పేరుకుపోయిన మొండి బకాయిలు, ప్రైవేటు కంపెనీల బ్యాలెన్స్ షీట్లు ఒత్తిడి ఎదుర్కోవడం వంటివన్నీ కలసి స్టాక్ సూచీలను ప్రభావితం చేశాయి. దీనికి తోడు అమెరికా వడ్డీరేట్లు పెంచుతుందన్న భయాలు ఇండియాతో సహా అన్ని వర్థమాన దేశాలనూ వెంటాడుతున్నాయి. దీంతో కొద్ది నెలలుగా విదేశీ సంస్థాగత మదుపుదారులు (ఎఫ్ఐఐలు) అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మరోపక్క దిగువ స్థాయిలో దేశీయ ఇన్వెస్టర్లు స్టాక్స్‌ను కొనుగోళ్లు చేస్తూ మార్కెట్‌కు మద్దతునిస్తున్నారు. వచ్చే ఏడాది కాలంలో స్టాక్ సూచీల కదలికలు ఎలా ఉండొ చ్చని భావిస్తున్నారు.? స్వల్పకాలానికి మార్కెట్లు చాలా బలహీనంగా కనిపిస్తున్నాయి. రానున్న నెలల్లో అమెరికా వడ్డీరేట్లను పెంచడం మొదలుపెడితే ఈ బలహీనత మరింత పెరగొచ్చు. కాకపోతే ఇదే సమయంలో దేశీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్థిక వృద్ధిరేటును ప్రోత్సహించేలా ఉన్నాయి. ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గించడం, ఇన్ఫ్రాకు పెట్టుబడులు పెంచడం, ఎఫ్‌డీఐ పాలసీల్లో సంస్కరణలు, విద్యుత్ డిస్కంలు, హైవే ప్రాజెక్టుల్లో చేపడుతున్న చర్యలు బ్యాంకుల ఎన్పీఏలను తగ్గించేవిగా ఉన్నాయి. ఇవన్నీ ఆర్థిక వృద్ధిరేటును పెంచుతాయి. కానీ.. వరుసగా వస్తున్న కరువు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే అవకాశముంది. మొత్తమ్మీద చూస్తే గతేడాది కంటే ఈ ఏడాది మార్కెట్ల పని తీరు బాగుంటుందని ఆశిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఎటువంటి ఒత్తిడి లేకుండా స్థిరంగా ఉంటేనే దేశీయ సూచీలు లాభాలను అందించగలవు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏయే రంగాలు అనుకూలంగా కనబడుతున్నాయి? కేంద్రం సంస్కరణలు చేపడుతున్న రంగాలు ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, రక్షణ, విద్యుత్, విద్యుత్ పంపిణీ - సరఫరా, ఫుడ్ ప్రోసెసింగ్, ఐటీ రంగాలకు చెందిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా దేశ ఆర్థిక వ్యవస్థతో నేరుగా ముడిపడి ఉన్న రంగాలే. స్వల్పకాలానికి ఇన్వెస్ట్ చేయొచ్చా? ప్రస్తుత మార్కెట్లు స్వల్ప కాలానికి అనుకూలంగా లేవు. కనీసం మూడేళ్ల దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయడమే ఇపుడు ఉత్తమం. అలా కాకుండా నేరుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం రుణ భారం తక్కువగా ఉండి, అధిక డివిడెండ్లు ఇచ్చే కంపెనీలు, అందులో షేర్ల ధరలు ఆకర్షణీయంగా ఉన్న వాటిని మాత్రమే ఎంచుకోవాలి. దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు ఏమైనా షేర్లను సూచిస్తారా? మూడేళ్ల కాలపరిమితితో ఎం అండ్ ఎం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు.