breaking news
live concerts
-
సెక్యూరిటీ గార్డుపై ఇళయ రాజా ఫైర్
-
యుఎస్‌లో కీరవాణి లైవ్ షోస్
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్ధాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగీత దర్శకుడు కీరవాణి. ఎన్నో అద్భుత చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కీరవాణి, త్వరలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నారు. జనవరి నెలలో కీరవాణి సారధ్యంలో అమెరికాలోని పలు నగరాల్లో లైవ్ మ్యూజికల్ కన్సర్ట్స్ జరగనున్నాయి. కీరవాణి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాల్లో ఆయనతో పాటు గీత రచయిత అనంత శ్రీరామ్, గాయకులు గీతామాధురి, రేవంత్ లతో పాటు మరికొంత మంది యువ గాయకులు పాల్గొననున్నారు. జనవరి 13నుంచి భారీగా జగరనున్న ఈ కార్యక్రమానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు ప్రారంభించారు ఈవెంట్ నిర్వాహకులు. ఇప్పటి వరకు కీరవాణి పాటలు మాత్రమే వింటున్న అమెరికాలోని తెలుగు సినీ అభిమానులు, నేరుగా ఆయన పాటలు వినే అవకాశం రావటంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్న నమ్మకంతో ఉన్నారు నిర్వాహకులు.