breaking news
Land price
-
రాయదుర్గం ‘రియల్’ సంచలనం.. సొంతింటి కల దూరమేనా?
సాక్షి, సిటీబ్యూరో: ఎకరం రూ.177 కోట్లు.. దుర్గం చెరువు పక్కనే ఉన్న కొండపై ఉన్న భూమి ధర ఇదీ. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూముల వేలం దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంచలనం సృష్టించింది. గత ప్రభుత్వం హయాంలో కోకాపేటలోని నియోపొలిస్ వేలంలో ఎకరా రూ.100.75 కోట్లు పలికిన ధరే అందర్నీ షాక్‌కు గురి చేయగా.. సోమవారం టీజీఐసీసీ నిర్వహించిన రాయదుర్గం భూముల వేలం సరికొత్త రికార్డులను సృష్టించింది. పశ్చిమ హైదరాబాద్‌లోని బహుళ అంతస్తుల భవనాలే కాదు.. అక్కడి భూముల ధరలూ ఆకాశాన్నంటుతున్నాయని రియల్టీ రంగ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర రాజధానిలో భూమి బంగారం కంటే ఖరీదైపోయింది. కొండలే కోట్లకు కోట్లు ధర పలుకుతున్నాయి. తాజాగా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనాసంస్థ (టీజీఐఐసీ) నాలెడ్జ్ సిటీలోని సర్వే నంబరు 83/1 ప్లాట్ నంబరు–19లో 11 ఎకరాలు, ఇదే సర్వే నంబరులో ప్లాట్ నంబరు–15ఏ/2లో 7.67 ఎకరాలు మొత్తం 18.67 ఎకరాలను వేలం వేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.3,135 కోట్ల ఆదాయం సమకూరింది. స్థానిక బిల్డర్లతో పాటు జాతీయ నిర్మాణ సంస్థలు పోటీపడి మరీ ధర రికార్డు స్థాయిని దాటేలా చేశారు. ఈ పరిణామాలు మార్కెట్లో సంచలనంగా మారాయి. హైదరాబాద్ మార్కెట్‌కు ఇంకా భవిష్యత్తు ఉందని, డిమాండ్ తగ్గలేదని మార్కెట్ పడిపోలేదు అనడానికి ఈ వేలమే నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.సొంతింటి కల దూరమేనా..? భూముల వేలంలో వేలంవెర్రిగా ధర పలకడం స్థానిక రియల్ ఎస్టేట్ రంగంపై ప్రభావం చూపుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ ధరల ప్రభావం చుట్టుపక్కల భూములు, అపార్ట్మెంట్లపై ఉంటుంది. దీంతో హైదరాబాద్‌కు ఉన్న అఫర్డబులిటీ దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. హైదరాబాద్ అనగానే సరసమైన ఇళ్లకు కేంద్రమని స్థిరాస్తి సంఘాలు ఎంతోకాలంగా చెబు తూ వస్తున్నాయి. వేలంలో రికార్డ్ ధరలు పలుకుతుండటంతో భూముల రేట్లు పెరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతంలోని అపార్ట్మెంట్ల ధరలు పెరగక తప్పని పరిస్థితి. సామాన్యుడికి ఇంటి కల దూరమవుతోందని ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో.. ఎకరం భూమి రూ.177 కోట్లు పలకడంతో సంపన్నులు కూడా కొనలేని పరిస్థితి ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎందుకింత ధర? రాయదుర్గం నాలెడ్జ్ సిటీ లేఅవుట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసింది. ఐటీ కారిడార్‌లో ఉండటంతో గృహ నిర్మాణం, కార్యాలయాలకు అనువుగా ఉంది. భవనం ఎత్తుపై ఆంక్షలు లేకుండా అపరిమిత ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)కు అవకాశం ఉండటంతో బిల్డర్లు ధరకు వెనకాడలేదు. వీటి దృష్ట్యా వేలంలో కొన్ని సంస్థలు పోటీపడ్డాయి. 470 ఎకరాల్లో విస్తరించి ఉన్న నాలెడ్జ్ సిటీలో వందకు పైగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలున్నాయి.బహుళ జాతి సంస్థల కార్యాలయాలు, ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు, వినోద కేంద్రాలు, బహుళ అంతస్తుల భవనాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రాయదుర్గం అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో ఇక్కడి భూములకు డిమాండ్ అధికంగా ఉంది. ఇక్కడి నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు, మెట్రో, విమానాశ్రయాలతో నగరం నలువైపులా సులువైన కనెక్టివిటీ ఉంది. రాయదుర్గం మెట్రో స్టేషన్‌కు 5 నిమిషాలు, ఔటర్ జంక్షన్‌కు 6 నిమిషాలు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్/విప్రో జంక్షన్‌కు, హెచ్ఐసీసీ/హైటెక్స్‌కు 15 నిమిషాలు, ఎయిర్‌పోర్ట్‌కు 40 నిమిషాలు ప్రయాణ వ్యవధి ఉంటుంది. దీంతో ఇక్కడి భూములకు డిమాండ్ అధికంగా ఉంది. -
ఎకరం.. రూ.140 కోట్లపైనే!
సాక్షి, హైదరాబాద్: భూముల వేలంతో భారీగా నిధులు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కనిష్టంగా రూ.2 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.. ఈ మేరకు హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన రాయదుర్గంలో భూములను వేలం వేయనుంది. నాలెడ్జ్ సిటీలోని 18.67 ఎకరాలను ఈ–వేలానికి తెలంగాణ ఇండ్రస్టియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (టీజీఐఐసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. ఒక ఎకరానికి ప్రారంభ ధర రూ.101 కోట్లుగా నిర్ణయించింది. అయితే పలు నిర్మాణ సంస్థలు ఎకరాకు రూ.140 కోట్లకు పైగానే వెచ్చించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో కోకాపేట నియోపోలిస్ ఫేజ్–2లో హెచ్ఎండీఏ నిర్వహించిన వేలంలో రికార్డ్ స్థాయిలో ఎకరం రూ.100 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకు మించి ధర పలకడం ఖాయమని రియల్టీ నిపుణులు అంచనా వేస్తున్నారు.ఆంక్షలున్నా.. తగ్గేదేలే..: సర్వే నంబర్ 83/1 ప్లాట్ నంబర్ 19లో 11 ఎకరాలు, ఇదే సర్వే నంబర్లో ప్లాట్ నంబరు 15 ఏ/2లో 7.67 ఎకరాలను టీజీఐఐసీ వేలం వేయనుంది. అయితే ఈ సర్వే నంబర్ ఎయిర్పోర్ట్ జోన్ పరిధిలోకి వస్తోంది. 2022లో ఏఏఐ నిబంధనలను సవరించింది. ఈ మేరకు ఈ ప్రాంతంలో అపరిమిత భవన నిర్మాణ ఎత్తు (ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్–ఎఫ్ఎస్ఐ)కు అనుమతి లేదు.ప్లాట్ నంబరు 19లో ఎఫ్ఎస్ఐ 80 మీటర్లు, ప్లాట్ నంబరు 15లో ఎఫ్ఎస్ఐ 65 మీటర్ల వరకు మాత్రమే అనుమతి ఉంది. ఎఫ్ఎస్ఐపై ఆంక్షలున్నప్పటికీ అధిక ధర పెట్టేందుకు బిడ్డర్లు వెనుకాడటం లేదని తెలుస్తోంది. 470 ఎకరాలలో విస్తరించి ఉన్న నాలెడ్జ్ సిటీలో వందకు పైగా ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలున్నాయి. బిజినెస్ హబ్‌గా అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం బహుళ జాతి సంస్థలు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ)కు నిలయంగా మారడంతో ఎలాగైనా భూమిని దక్కించుకోవాలనే బిడ్డర్లు పోటీపడుతున్నారు.34 మంది బిడ్డర్లు దరఖాస్తు..వచ్చే నెల 6న జరగనున్న ఈ – వేలంలో పాల్గొనేందుకు దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే నాన్ రీఫండబుల్ డాక్యుమెంట్ ఫీజు కింద ప్లాట్‌కు రూ.10 లక్షల చొప్పున చెల్లించి సుమారు 34 మంది బిడ్డర్లు టీజీసీఐఐసీకి దరఖాస్తు చేసినట్లు తెలిసింది. వీరితో పాటు పలువురు స్థానిక పెట్టుబడిదారులు, డెవలపర్లు జాయింట్ వెంచర్‌గా ఏర్పడి వేలంలో పాల్గొనన్నారు. పలు నిర్మాణ సంస్థలు ఎకరానికి రూ.140 కోట్లకు పైగానే బిడ్డింగ్ చేయనున్నట్లు తెలిసింది. బహుళ జాతి సంస్థల కార్యాలయాలు, ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు, వినోద కేంద్రాలు, బహుళ అంతస్తుల భవనాలు, అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో రాయదుర్గం అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో ఇక్కడి స్థలాలకు డిమాండ్ అధికంగా ఉంది.వేలంతో మార్కెట్లో బూమ్..ఈ భూముల వేలంతో మార్కెట్లో బూమ్ ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ భూములు వేలంలో ఎంతకైతే ధర పలుకుతాయో చుట్టుపక్కల స్థలాలు కూడా అంతే ధర పలుకుతాయి. అయితే ఈ పరిణామం స్థానిక పెట్టుబడిదారులు, డెవలపర్లకు కొంత వరకు ఇబ్బందే అని నిపుణులు అంటున్నారు. అంత ధర పెట్టి ప్రాజెక్ట్‌లను చేపట్టినా అంతిమంగా ఆ భారం కొనుగోలుదారుల మీదనే పడుతుందని చెపుతున్నారు.ఐటీ, ఐటీఈఎస్, కమర్షియల్, రిటైల్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, ఎంటర్టైన్మెంట్.. ఇలా మల్టీ జోన్ ప్రాంతమైన రాయదుర్గం నుంచి ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో, విమానాశ్రయంతో సులువైన కనెక్టివిటీ ఉంది. ఇక్కడినుంచి రాయదుర్గం మెట్రో స్టేషన్‌కు 5 నిమిషాలు, ఔటర్ జంక్షన్‌కు 6 నిమిషాలు, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్/విప్రో జంక్షన్‌కు, హెచ్ఐసీసీ/హైటెక్స్‌కు 15 నిమిషాలు, ఎయిర్‌పోర్ట్‌కు 40 నిమిషాల ప్రయాణ వ్యవధి ఉంటుంది. దీంతో ఇక్కడి భూములకు డిమాండ్ అధికంగా ఉంది. -
అంతా బాబు గుప్పెట్లోనే
-
ఆగస్టు ఒకటి నుంచి పెరగనున్న భూముల విలువ
తణుకు టౌన్ : జిల్లాలో పట్టణ, నగర ప్రాంతాలలో ఆగస్టు ఒకటి నుంచి భూములు ధరలకు రెక్కలు రానున్నాయి. భూముల ధరలను పెంచుతూ, తద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ కసరత్తు చేపట్టింది. జిల్లాలో భూముల ధరల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.40 కోట్ల అదనపు ఆదాయం అంచనా వేస్తున్నట్టు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డీఐజీ ఎం.సాయిప్రసాద్ చెప్పారు. తణుకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, నగర ప్రాంతాలలోని భూముల విలువ 20 నుంచి 25 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. దీనివలన రిజిస్ట్రేషన్‌లో 20 శాతం మాత్రమే ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుందన్నారు. త్వరలో స్టాంప్ డ్యూటీ కూడా 1 శాతం తగ్గే అవకాశం ఉందన్నారు. పట్టణాలలో మార్కెట్ విలువలలో ఎక్కడైనా హెచ్చుధరలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. దీనికోసం జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా ఒక కమిటీ ఏర్పాటైనట్లు పేర్కొన్నారు. ఈ క మిటీలో సభ్య కన్వీనర్‌గా స్థానిక సబ్‌రిజిస్ట్రార్, సభ్యులుగా జెడ్పీ సీఈవో, మునిసిపల్ కమిషనర్లు వ్యవహరిస్తారని వివరించారు. ఆయన వెంట తణుకు సబ్‌రిజిస్ట్రార్ నీలం మాల్యాద్రి, సజ్జాపురం సబ్‌రిజిస్ట్రార్ ఎ.వెంకటేశ్వరరావు, జాయింట్ సబ్‌రిజిస్ట్రార్ ఇ.వెంకటేశ్వరరావు ఉన్నారు.


