breaking news
Lamborghini Gallardo
-
అమ్మకానికి విరాట్ కోహ్లి కారు ? ధర ఎంతంటే
Virat Kohli Lamborghini Gallardo Spyder: టీమిండియా స్కిప్పర్ పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ ముచ్చటపడి కొనుకున్న సూపర్‌కారు ఇప్పుడు అమ్మకానికి సిద్ధంగా ఉంది. లగ్జర్లీ కార్లంటే మోజున్న వారు, సెలబ్రిటీలు ఉపయోగించిన వస్తువులు సొంతం చేసుకోవాలనే ఇంట్రస్ట్ ఉన్న వారు రెడీగా ఉండాల్సిన సమయం వచ్చింది. 2015లో క్రికెట్లో తన బ్యాటుతో సెంచరీల మీద సెంచరీలు కొడుతున్న సమయంలో 2015లో లగ్జరీ సెగ్మెంట్‌కి చెందిన లంబోర్గిని గలార్డో స్పైడర్ మోడల్ కారుని కొనుగోలు చేశాడు. కొద్ది రోజులు ఈ కారుని వాడిన తర్వాత విరాట్ దాన్ని 2017లో అమ్మేశాడు. అలా ఆ కారు చాలా కాలం పాటు కొల్‌కతాకు చెందిన ఓ ప్రీమియం కార్ల డీలర్ దగ్గర ఉండిపోయింది,. రాయల్ డ్రైవ్ తాజాగా విరాట్ కాడిన కారు గురించి తెలిసిన రాయల్ డ్రైవ్ సంస్థ ఆ కారుని కోల్‌కతాకు చెందిన డీలర్ నుంచి 2021 జనవరిలో కొనుగోలు చేసింది, ప్రస్తుతం ఈ కారుని అమ్మాలని ఆ సంస్థ నిర్ణయించింది. కారుకి రూ.1.35 కోట్లు ధరగా నిర్ణయించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ మేరకు రాయల్డ్రైవ్ వెబ్సైట్లో ఈ కారు అమ్మకానికి సిద్ధంగా ఉంది. కండీషన్డ్ కారు విరాట్ ఉపయోగించినట్టుగా చెబుతున్న లంబోర్గిని కారు 2013 మోడల్‌కి చెందినది. ఈ కారు ఇప్పటి వరకు కేవలం 10,000 కిలోమీటర్ల మాత్రమే తిరిగింది. కేవలం నాలుగు సెకన్లలోనే వంద కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు. ఈ సూపర్ కారు పెట్రోల్ ఇంజన్లో ఆటోమేటిక్ వెర్షన్‌కి సంబంధించినది. లీటరు పెట్రోలుకి 5 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఈ ఏడాది చివరితో ఇన్సురెన్సు ముగిసిపోనుంది. గలార్డో స్పైడర్ లంబోర్గిని గలార్డో మోడల్ని 2005లో ప్రవేశ పెట్టగా చివరి మోడల్ని 2014లో రిలీజ్ చేసింది. ఆ తర్వాత ఈ మోడల్ని డిస్కంటిన్యూ చేసింది. చివరి సారి ఈ మోడల్ ధర రూ. 2.78 కోట్లుగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లంబోర్గిని ఊరూస్ మోడల్ రన్నింగ్‌లో ఉంది. ఈ సూపర్ లగ్జరీ కారు ధర రూ. 3.5 కోట్ల వరకు ఉంటుంది. వాస్తవమేనా? లంబోర్గిని కారుని విరాట్ కోహ్లీ 2015లో కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్, ఇన్స్టాలలో వాటి ఫోటోలను షేర్ చేశారు. అందులో కారు నలుపు రంగులో కనిపిస్తుంది. తాజాగా కోహ్లీ వాడినట్టుగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న కారు ఆరెంజ్ రంగులో ఉంది. రిజిస్ట్రేషన్ నంబరు సైతం పుదుచ్చేరి మీద ఉంది. విరాట్ ఈ కారుని అమ్మేసిన తర్వాత తాజాగా వార్తల్లో నిలిచే వరకు ఈ కారుకు సంబంధించిన వివరాలు పూర్తిగా అందుబాటులో లేవు. చదవండి : టి20లకు సారథ్యం వహించను: కోహ్లి -
కళ్లెదుటె రెండున్నర కోట్లు బూడిద పాలు
న్యూఢిల్లీ: ఆ కారులో కూర్చుంటే రాకెట్లో కూర్చున్నంత ఫీలింగ్. చూడగానే హత్తుకున్నామంత థ్రిల్లింగ్. వాయువేగంగా సాగే డ్రైవింగ్.. ఇది ఇటలీ కంపెనీకి చెందిన లాంబోర్గిని గల్లార్డో అనే కారును చూస్తే వచ్చి అనుభూతి. ఇంతకీ ఈ కారు ధరంతే తెలుసా అక్షరాల రెండున్నర కోట్లు. అలాంటి కారు దక్షిణ ఢిల్లీలో మంటల్లో చిక్కుకుని కాలిపోయింది. దీంతో రెండున్నర కోట్ల రూపాయలు బూడిదపాలు చేసినట్లయింది. దక్షిణ ఢిల్లీలో సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటలీ కంపెనీకి చెందిన లాంబోర్గిని గల్లార్డో అనే కారును దాని యజమాని రూ.2.5 కోట్లు పెట్టి కొనుగోలు చేశాడు. దీనికి 5.2 లీటర్ల ఇంధన పరిమాణంతో ఇంజిన్ ఉంటుంది. ఈ కారు డ్రైవర్ సోమవారం ఉదయం దక్షిణ ఢిల్లీ ప్రాంతంలోని బదర్పూర్ నుంచి వస్తుండగా అనూహ్యంగా అందులో మంటలు వ్యాపించాయి. దీంతో వెంటనే అతడు అందులో నుంచి ఎలాంటి గాయాలవకుండా సురక్షితంగా బయటపడ్డాడు. కారు వెనుక భాగం నుంచి మధ్యభాగం వరకు పూర్తిగా కాలిపోయింది. ఫైరింగ్ సిబ్బంది వచ్చి దాని మంటలు ఆర్పేయగా సగం కారు మాత్రమే మిగిలింది. ఈ కంపెనీ కారు వేగం దాదాపు గంటలకు 350 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. 2013లో బయటకు వచ్చిన ఈకార్లు పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అమ్ముడుపోయి రికార్డు సృష్టించాయి.