breaking news
kuntluru
-
హయత్నగర్ కుంట్లూరులో ఉద్రిక్తత
-
హయత్నగర్ కుంట్లూరులో ఉద్రిక్తత
హయత్నగర్: ప్రభుత్వ భూమిలో చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చడానికి ప్రయత్నించిన అధికారులకు స్థానికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం కుంట్లూరు శివారులో గురువారం అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్న రెవెన్యూ, పంచాయతి సిబ్బందిని స్థానికులు అడ్డుకున్నారు. నిర్మాణాలను కూల్చకుండా అడ్డుపడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనాకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.